దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ణాపకారక్ధం టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్‌విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కాగా సైమండ్స్ టౌన్స్‌విల్లేలోనే జన్మించాడు. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.
ఇక ఈ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు హాంకాంగ్, పాపువా న్యూ గినియా మధ్య రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ స్టేడియం వేదికగానే ఆగస్టు అఖరిలో ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
కాగా ఈ ఏడాది మే లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment