
మెల్‌బోర్న్: ప్రధాన ఆటగాళ్ల గాయాలకు తోడు... ఆల్‌రౌండర్ స్టొయినిస్ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ టోర్నీ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది.
కాగా... ఇందులో రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో పేసర్ జోష్ హాజల్‌వుడ్ గాయాల కారణంగా అధికారికంగా టోర్నీ దూరం కాగా... పేస్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక మరో పేస్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ అనూహ్యంగా వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ నెల 12 వరకు జట్లలో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ గడువు ఇవ్వగా... ఆ్రస్టేలియా జట్టు దాదాపు కొత్త జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లో ఒకరు ఆసీస్ జట్టుకు సారథ్యం వహిస్తారని సీఏ వెల్లడించింది.
‘కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, అనుకోకుండా.. టోర్నీకి దూరమయ్యారు. ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆ్రస్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని ఆ్రస్టేలియా జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ అన్నాడు.
జట్టులోకి యువ ఆటగాళ్లు..
ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతుండడంతో టోర్నీకి దూరమైన ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేసే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ పడింది. కమ్మిన్స్, హాజిల్‌వుడ్ స్ధానాల్లో యువ పేసర్లు జేవియర్ బార్ట్‌లెట్, స్పెన్సర్ జాన్సన్ పేర్లను జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్నారు.
ఆసీస్ తరపున కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బార్టలెట్ 8 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జాన్సన్ కూడా ఆసీస్ తరపున రెండు వన్డేలు ఆడి వికెట్ ఏమీ సాధించలేదు. కానీ టీ20ల్లో మాత్రం అతడి పేరిట 14 వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా మిచెల్ మార్ష్, స్టోయినిష్ స్ధానాల్లో కాపర్ కొన్నోలీ, బ్యూ వెబ్‌స్టర్‌లను ఎంపిక చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాపర్ కొన్నోలీకి అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేనప్పటికి దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. ఇటీవలే ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లోనూ కొన్నోలీకి చోటు దక్కింది. అతడికి బ్యాట్, బంతితో రాణించే సత్తాఉంది.
మరోవైపు తన టెస్టు అరంగేట్రంలోనే ఆకట్టుకున్న బ్యూ వెబ్‌స్టెర్‌ను కూడా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మీడియం పేస్ ఆల్‌రౌండర్ భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో సత్తాచాటాడు. ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లోనూ దుమ్ములేపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా అప్‌డెటెడ్ జట్టు(అంచనా)
అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా, కాపర్ కొన్నోలీ, బ్యూ వెబ్‌స్టర్
చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment