నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయ్యర్.. తన మెరుపు హాఫ్ సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్(15), రోహిత్ శర్మ(2) వికెట్లను కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 36 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.
అయ్యర్ అరుదైన ఫీట్..
కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు.
ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్‌లో నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ వేరే పొజిషేన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా, శుబ్‌మన్ గిల్(రెండో స్ధానం), ఏబీ డివిలియర్స్(ఐదో స్ధానం) ఈ ఘనతను సాధించారు.
ఇంగ్లండ్ చిత్తు..
ఇక ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్(59), అక్షర్ పటేల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహుమూద్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్(32) దాటిగా ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment