Spencer Johnson
-
ఐదేసిన స్పెన్సర్ జాన్సన్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. ఇవాళ (నవంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.SPENSER JOHNSON FIVE WICKET HAUL.- A terrific spell against Pakistan! 👌pic.twitter.com/W8J1lMp4Xl— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. జాన్సన్‌కు టీ20 కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. మరో ఎండ్‌లో ఆడమ్ జంపా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో పేసర్ జేవియర్ బార్ట్లెట్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశాడు. బార్ట్లెట్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బాబర్ ఆజమ్ 3, ఫర్హాన్ 5, అఘా సల్మాన్ 0, అబ్బాస్ అఫ్రిది 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 0, సూఫియాన్ ముఖీమ్ 0, హరీస్ రౌఫ్ 2 పరుగులకు ఔటయ్యారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 హోబర్ట్ వేదికగా నవంబర్ 18న జరుగుతుంది. -
మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్రిస్బేన్ వేదికగా పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాబా స్టేడియంలో ఆసీస్- పాక్ మధ్య గురువారం తొలి టీ20 జరిగింది.వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ టీ20 మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగాఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్(19 బంతుల్లో 43) రాకతో సీన్ మారింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగా.. నాలుగో నంబర్ బ్యాటర్ టిమ్ డేవిడ్(10) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో మాక్సీకి తోడైన మార్కస్ స్టొయినిస్(7 బంతుల్లో 21 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.మాక్సీ, స్టొయినిస్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’కు గురైంది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో 64 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(8)ను అవుట్ చేసి స్పెన్సర్ జాన్సన్ వికెట్ల వేట మొదలుపెట్టగా.. జేవియర్ బార్ట్లెట్ మహ్మద్ రిజ్వాన్(0)ను డకౌట్ చేశాడు. అనంతరం ఉస్మాన్ ఖాన్(4)ను కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు.ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ బాబర్ ఆజం(3)తో పాటు.. ఇర్ఫాన్ ఖాన్(0) వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగిన బార్ట్లెట్ ఆఘా సల్మాన్(4)ను వెనక్కి పంపగా.. నాథన్ ఎల్లిస్ హసీబుల్లా ఖాన్(12) పనిపట్టాడు. అయితే, అబ్బాస్ ఆఫ్రిది(20 నాటౌట్)తో కలిసి టెయిలెండర్ షాహిన్ ఆఫ్రిది(6 బంతుల్లో 11) బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేయగా.. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా అతడిని బౌల్డ్ చేశాడు. అనంతరం.. పాక్ ఇన్నింగ్స్ ఆఖరి వికెట్‌గా నసీం షాను బౌల్డ్ చేసి వెనక్కి పంపించాడు. 64 పరుగులకేఈ క్రమంలో పాకిస్తాన్ ఏడు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 64 రన్స్ చేసింది. ఫలితంగా ఆసీస్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించి ఆసీస్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా రెండో టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
పాక్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్ జరిగే మూడు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (అక్టోబర్ 28) ప్రకటించారు. 13 మంది సభ్యుల ఈ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దృష్ట్యా టెస్ట్ జట్టు సభ్యులను పాక్‌తో సిరీస్ ఎంపిక చేయలేదు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.పాక్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాపాక్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 14 (బ్రిస్బేన్)రెండో టీ20-నవంబర్ 16 (సిడ్నీ)మూడో టీ20- నవంబర్ 18 (హోబర్ట్)కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును నిన్ననే ప్రకటించారు. పాక్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్ -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్తో మూడు టీ20లు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ గాయం కారణంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. దిహాండ్రల్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న జాన్సన్ ప్రక్కెటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూకే టూర్‌కు ఈ యువ ఫాస్ట్ బౌలర్ దూరమయ్యాడు. ఇక అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ సీన్ అబాట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అబాట్‌కు తొలుత కేవలం ఇంగ్లండ్‌తో వన్డే జట్టులో మాత్రం చోటు దక్కింది. ఇప్పుడు అనూహ్యంగా జాన్సన్ తప్పుకోవడంతో అబాట్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా -
విండీస్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ ‘సంచలన’ బౌలర్ రీఎంట్రీ
Australia vs West Indies T20 Series 2024: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య హోబర్ట్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానాన్ని సెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ భాగం కానున్నాడని బుధవారం వెల్లడించింది. నాథన్ ఎల్లిస్‌ను తప్పించారు కాగా బిగ్ బాష్ లీగ్ 2023-24లో హోబర్ట్ హారికేన్స్కు ప్రాతినిథ్యం వహించిన నాథన్ ఎల్లిస్ మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా గత కొంతకాలంగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నాటికి ఎల్లిస్ కోలుకుంటాడని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి ప్రధాన జట్టులో చోటిచ్చింది. కానీ.. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని భావించి తాజాగా జట్టు నుంచి తప్పించింది. ఈ క్రమంలో స్పెన్సర్ జాన్సన్.. సొంతగడ్డపై విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. బీబీఎల్-2024లో సంచలన ప్రదర్శనతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన స్పెన్సర్ పొట్టి ఫార్మాట్లో కేవలం రెండు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇంకా ఖాతా తెరవనేలేదు. అయితే, బీబీఎల్ తాజా సీజన్లో మాత్రం దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ హీట్‌కు ఆడిన స్పెన్సర్ జాన్సన్.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ తరఫున 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్లో 4-0-26-4 గణాంకాలతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంచలన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే టీ20 వరల్డ్‌కప్-2024 రేసులో స్పెన్సర్ ముందుకు దూసుకురావడం ఖాయం. ఆస్ట్రేలియా టీ20 జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. వెస్టిండీస్ టీ20 జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో వైరల్ -
నిప్పులు చేరిన గుజరాత్ బౌలర్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్
బిగ్ బాష్ లీగ్ 2023-24 సీజన్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్ నిలిచింది. సిడ్నీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ సిక్సర్స్‌ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రిస్బేన్ హీట్.. రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. బ్రిస్బేన్ బౌలర్ల దాటికి కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. బ్రిస్బేన్ బౌలర్లలో ఎక్స్‌ప్రెస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన 4 ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్-2024 వేలంలో జాన్సన్‌ను రూ. 10 కోట్లకు గుజరాత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌తో పాటు బ్రాట్‌లెట్,స్వీప్సన్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. సిడ్నీ బ్యాటర్లలో హెన్రిక్స్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ బాదిన జోష్ బ్రౌన్.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రౌన్‌తో పాటు రెన్షా(40) పరుగులతో రాణించాడు. సిడ్నీ బౌలర్లలో అబాట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. స్టార్ క్రికెటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ Spencer 👑 Your Player of The Final. #BBL13 pic.twitter.com/saEDxVXG0q — KFC Big Bash League (@BBL) January 24, 2024 -
ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో
Oval Invincibles won by 94 runs- Jason Roy- Heinrich Klaasen: ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ది హండ్రెడ్ లీగ్‌లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ హండ్రెడ్ లీగ్‌లో జాన్సన్ ఓవల్ ఇన్విసిబుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20 డెలివరీల్లో 19 డాట్ బాల్స్ వేసి సంచలనం సృష్టించాడు. మాంచెస్టర్ బ్యాటర్ జోస్ బట్లర్.. జాన్సన్ వేసిన షార్ట్ బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా ఆడి అతడి బౌలింగ్‌లో ఆ ఒక్క సింగిల్‌కు కారణమయ్యాడు. వేసిన పదకొండో బంతికి ఉసామా మిర్‌ను అవుట్ చేసితొలి వికెట్ తీసిన జాన్సన్.. ఆ తర్వాత టామ్ హార్ట్లీ, జాషువా లిటిల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఓవల్ ఇన్విసిబుల్ బౌలర్లు గస్ అట్కిన్సన్ రెండు, నాథన్ సోవటెర్ రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సర్తో పాటు సునిల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో ఓవల్ బౌలర్ల విజృంభణతో పర్యాటక మాంచెస్టర్ జట్టు 89 బంతులాడి 92 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. జేసన్ రాయ్(59), హెన్రిచ్ క్లాసెన్(60) అర్ధ శతకాలతో మెరవడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ఓవల్ జట్టు భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో మాంచెస్టర్‌పై 94 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: శ్రేయస్ అయ్యర్ దూరం.. తిలక్ వర్మకు అవకాశం.. అలా అయితే..! Spencer Johnson's 3️⃣ wickets 🔥#TheHundred pic.twitter.com/kyQwS35BOC — The Hundred (@thehundred) August 9, 2023