పాక్‌తో టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన | Nathan Ellis, Xavier Bartlett And Johnson Return For T20I Series Against Pakistan, See Details | Sakshi
Sakshi News home page

పాక్‌తో టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Published Mon, Oct 28 2024 9:39 AM | Last Updated on Mon, Oct 28 2024 10:30 AM

Ellis, Bartlett And Johnson Return For Pakistan T20Is

స్వదేశంలో పాకిస్తాన్‌ జరిగే మూడు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ కోస​ం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (అక్టోబర్‌ 28) ప్రకటించారు. 13 మంది సభ్యుల ఈ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో కెప్టెన్‌ పేరును ‍ప్రకటించే అవకాశం ఉంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఇల్లిస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ దృష్ట్యా టెస్ట్‌ జట్టు సభ్యులను పాక్‌తో సిరీస్‌ ఎంపిక చేయలేదు. రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

పాక్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..
సీన్‌ అబాట్‌, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

పాక్‌, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..
తొలి టీ20- నవంబర్‌ 14 (బ్రిస్బేన్‌)
రెండో టీ20-నవంబర్‌ 16 (సిడ్నీ)
మూడో టీ20- నవంబర్‌ 18 (హోబర్ట్‌)

కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టును నిన్ననే ప్రకటించారు. పాక్‌ జట్టుకు మహ్మద్‌ రిజ్వాన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు..
అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్‌, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్‌ అఫ్రిది, సుఫ్యాన్‌ మొకిమ్, ఉస్మాన్ ఖాన్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement