Xavier Bartlett
-
పాక్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్ జరిగే మూడు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (అక్టోబర్ 28) ప్రకటించారు. 13 మంది సభ్యుల ఈ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దృష్ట్యా టెస్ట్ జట్టు సభ్యులను పాక్‌తో సిరీస్ ఎంపిక చేయలేదు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.పాక్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాపాక్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 14 (బ్రిస్బేన్)రెండో టీ20-నవంబర్ 16 (సిడ్నీ)మూడో టీ20- నవంబర్ 18 (హోబర్ట్)కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును నిన్ననే ప్రకటించారు. పాక్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్ -
మొన్ననేమో సంచలనం.. ఇప్పుడు 86 పరుగులకే ఆలౌట్!
వెస్టిండీస్.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటుంది. అయితే మరోసారి వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కరేబియన్ బ్యాటర్లు ఘెరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ ఆథ్నాజ్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి చవిచూసిన విండీస్ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. అంతకుముందు గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో విండీస్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ అద్బుత ప్రదర్శనతో 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్‌గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది.