వెస్టిండీస్.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటుంది. అయితే మరోసారి వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కరేబియన్ బ్యాటర్లు ఘెరంగా విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఓపెనర్ ఆథ్‌నాజ్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి చవిచూసిన విండీస్ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. అంతకుముందు గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో విండీస్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ అద్బుత ప్రదర్శనతో 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment