Nathan Ellis
-
పాక్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్ జరిగే మూడు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (అక్టోబర్ 28) ప్రకటించారు. 13 మంది సభ్యుల ఈ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దృష్ట్యా టెస్ట్ జట్టు సభ్యులను పాక్‌తో సిరీస్ ఎంపిక చేయలేదు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.పాక్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాపాక్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 14 (బ్రిస్బేన్)రెండో టీ20-నవంబర్ 16 (సిడ్నీ)మూడో టీ20- నవంబర్ 18 (హోబర్ట్)కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును నిన్ననే ప్రకటించారు. పాక్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్ -
విండీస్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ ‘సంచలన’ బౌలర్ రీఎంట్రీ
Australia vs West Indies T20 Series 2024: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య హోబర్ట్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానాన్ని సెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ భాగం కానున్నాడని బుధవారం వెల్లడించింది. నాథన్ ఎల్లిస్‌ను తప్పించారు కాగా బిగ్ బాష్ లీగ్ 2023-24లో హోబర్ట్ హారికేన్స్కు ప్రాతినిథ్యం వహించిన నాథన్ ఎల్లిస్ మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా గత కొంతకాలంగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నాటికి ఎల్లిస్ కోలుకుంటాడని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి ప్రధాన జట్టులో చోటిచ్చింది. కానీ.. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని భావించి తాజాగా జట్టు నుంచి తప్పించింది. ఈ క్రమంలో స్పెన్సర్ జాన్సన్.. సొంతగడ్డపై విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. బీబీఎల్-2024లో సంచలన ప్రదర్శనతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన స్పెన్సర్ పొట్టి ఫార్మాట్లో కేవలం రెండు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇంకా ఖాతా తెరవనేలేదు. అయితే, బీబీఎల్ తాజా సీజన్లో మాత్రం దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ హీట్‌కు ఆడిన స్పెన్సర్ జాన్సన్.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ తరఫున 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్లో 4-0-26-4 గణాంకాలతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంచలన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే టీ20 వరల్డ్‌కప్-2024 రేసులో స్పెన్సర్ ముందుకు దూసుకురావడం ఖాయం. ఆస్ట్రేలియా టీ20 జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. వెస్టిండీస్ టీ20 జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో వైరల్ -
పంజాబ్‌ను గెలిపించినోడి వెనుక ఇంత కథ ఉందా!
బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలవడంలో నాథన్ ఎల్లిస్ పాత్ర కీలకం. చివరి ఓవర్లో సామ్ కరన్ అద్బుతంగా బౌలింగ్ చేసినప్పటికి నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లతో మెరిశాడు. రాజస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నుముక అయిన సంజూ శాంసన్, బట్లర్, రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్‌ల వికెట్లు తీసింది ఎల్లిస్ కావడం విశేషం. అందుకే బ్యాటింగ్‌లో ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి నాథన్ ఎల్లిస్నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. Photo: IPL Twitter అయితే మొదట నాథన్ ఎల్లిస్ రాజస్తాన్‌తో మ్యాచ్ ఆడకపోయేవాడు. ఆఖరి నిమిషంలో ప్రధాన బౌలర్ రబాడ అందుబాటులోకి రాకపోవడంతో ఎల్లిస్‌కు అవకాశం వచ్చింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని అతను చక్కగా వినియోగించుకున్నాడు. మరి పంజాబ్‌ను గెలిపించినోడి వెనుక పెద్ద కథ దాగుంది. Photo: IPL Twitter ఎల్లిస్ క్రికెటర్ కాకముందు చాలా పనులు చేశాడు. సేల్స్‌మెన్ నుంచి కన్స్ట్రక్షన్ వర్కర్ దాకా.. డోర్ డెలివరీ బాయ్ నుంచి ఫర్నీచర్‌ను తరలించే వర్కర్‌గా పనిచేశాడు. వారంలో ఐదు రోజులు కష్టపడి పనిచేసే ఎల్లిస్ శని, ఆదివారాలు మాత్రం క్రికెట్‌పై ఫోకస్ పెట్టేవాడు. ముఖ్యంగా డోర్ డెలివరీ బాయ్‌గా పనిచేసినప్పుడు ఎల్లిస్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. కస్టమర్ల దగ్గరికి వెళ్లి ఇంటి డోర్ తడితే.. ఎన్నోసార్లు ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం.. మొహం డోర్లు వేయడం లాంటివి చేసేవాళ్లంట. అయితే క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న దగ్గర నెలకు ఇంత చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎంత కష్టమైన అన్ని భరించేవాడు. ఒక దశలో పని ఒత్తిడి పెరిగిపోవడంతో క్రికెట్‌ను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆటపై తనకున్న ప్రేమ పని నుంచి దూరం చేయగలిగిందే తప్ప క్రికెట్ నుంచి కాదు. Photo: IPL Twitter అలా వర్కర్ నుంచి క్రికెటర్‌గా మారిన నాథన్ ఎల్లిస్‌కు అవకాశాలు తొందరగా రాలేదు. ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ ఎల్లిస్ అక్కడి బౌలర్లలాగా పొడగరి కాకపోవచ్చు.. కానీ అతని బౌలింగ్‌లో మంచి పేస్ ఉందని నిన్నటి మ్యాచ్‌తో అర్థమైంది. అతని బౌలింగ్‌లో వైవిధ్యమైన పేస్ ఉండడంతో రాజస్తాన్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. 28 ఏళ్ల నాథన్ ఎల్లిస్ ఆస్ట్రేలియా తరపున నాలుగు వన్డేలు, ఐదు టి20ల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్లు రెస్ట్ లేదా గాయాలతో దూరమైనప్పుడు మాత్రమే ఎల్లిస్‌కు అవకాశాలు వచ్చినప్పటికి చక్కగా వినియోగించుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఎల్లిస్ రెండు మ్యాచ్‌లు టీమిండియాపై కూడా ఆడాడు. ఈ రెండుసార్లు తనకు దక్కిన వికెట్ విరాట్ కోహ్లిదే కావడం విశేషం. ఇది అతన్ని ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసేలా చేసింది.