Photo: IPL Twitter
బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలవడంలో నాథన్ ఎల్లిస్ పాత్ర కీలకం. చివరి ఓవర్‌లో సామ్ కరన్ అద్బుతంగా బౌలింగ్ చేసినప్పటికి నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లతో మెరిశాడు. రాజస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నుముక అయిన సంజూ శాంసన్, బట్లర్, రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్‌ల వికెట్లు తీసింది ఎల్లిస్ కావడం విశేషం. అందుకే బ్యాటింగ్‌లో ధావన్ కెప‍్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి నాథన్ ఎల్లిస్‌నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
Photo: IPL Twitter
అయితే మొదట నాథన్ ఎల్లిస్ రాజస్తాన్‌తో మ్యాచ్ ఆడకపోయేవాడు. ఆఖరి నిమిషంలో ప్రధాన బౌలర్ రబాడ అందుబాటులోకి రాకపోవడంతో ఎల్లిస్‌కు అవకాశం వచ్చింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని అతను చక్కగా వినియోగించుకున్నాడు. మరి పంజాబ్‌ను గెలిపించినోడి వెనుక పెద్ద కథ దాగుంది.
Photo: IPL Twitter
ఎల్లిస్ క్రికెటర్ కాకముందు చాలా పనులు చేశాడు. సేల్స్‌మెన్ నుంచి కన్‌స్ట్రక‌్షన్ వర్కర్ దాకా.. డోర్ డెలివరీ బాయ్ నుంచి ఫర్నీచర్‌ను తరలించే వర్కర్‌గా పనిచేశాడు. వారంలో ఐదు రోజులు కష్టపడి పనిచేసే ఎల్లిస్ శని, ఆదివారాలు మాత్రం క్రికెట్‌పై ఫోకస్ పెట్టేవాడు. ముఖ్యంగా డోర్ డెలివరీ బాయ్‌గా పనిచేసినప్పుడు ఎల్లిస్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు.
కస్టమర్‌ల దగ్గరికి వెళ్లి ఇంటి డోర్ తడితే.. ఎన్నోసార్లు ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం.. మొహం డోర్లు వేయడం లాంటివి చేసేవాళ్లంట. అయితే క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న దగ్గర నెలకు ఇంత చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎంత కష్టమైన అన్ని భరించేవాడు. ఒక దశలో పని ఒత్తిడి పెరిగిపోవడంతో క్రికెట్‌ను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆటపై తనకున్న ప్రేమ పని నుంచి దూరం చేయగలిగిందే తప్ప క్రికెట్ నుంచి కాదు.
Photo: IPL Twitter
అలా వర్కర్ నుంచి క్రికెటర్‌గా మారిన నాథన్ ఎల్లిస్‌కు అవకాశాలు తొందరగా రాలేదు. ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ ఎల్లిస్ అక్కడి బౌలర్లలాగా పొడగరి కాకపోవచ్చు.. కానీ అతని బౌలింగ్‌లో మంచి పేస్ ఉందని నిన్నటి మ్యాచ్‌తో అర్థమైంది. అతని బౌలింగ్‌లో వైవిధ్యమైన పేస్ ఉండడంతో రాజస్తాన్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు.
28 ఏళ్ల నాథన్ ఎల్లిస్ ఆస్ట్రేలియా తరపున నాలుగు వన్డేలు, ఐదు టి20ల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్లు రెస్ట్ లేదా గాయాలతో దూరమైనప్పుడు మాత్రమే ఎల్లిస్‌కు అవకాశాలు వచ్చినప్పటికి చక్కగా వినియోగించుకున్నాడు.
అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఎల్లిస్ రెండు మ్యాచ్‌లు టీమిండియాపై కూడా ఆడాడు. ఈ రెండుసార్లు తనకు దక్కిన వికెట్ విరాట్ కోహ్లిదే కావడం విశేషం. ఇది అతన్ని ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment