పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్.. ఇవాళ (నవంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.
SPENSER JOHNSON FIVE WICKET HAUL.
- A terrific spell against Pakistan! 👌pic.twitter.com/W8J1lMp4Xl— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. జాన్సన్‌కు టీ20 కెరీర్‌లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత.
మరో ఎండ్‌లో ఆడమ్ జంపా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశాడు. బార్ట్‌లెట్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.
పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్), మొహమ్మద్ రిజ్వాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బాబర్ ఆజమ్ 3, ఫర్హాన్ 5, అఘా సల్మాన్ 0, అబ్బాస్ అఫ్రిది 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 0, సూఫియాన్ ముఖీమ్ 0, హరీస్ రౌఫ్ 2 పరుగులకు ఔటయ్యారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 హోబర్ట్ వేదికగా నవంబర్ 18న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment