ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్‌తో మూడు టీ20లు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ గాయం కారణంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. దిహాండ్రల్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న జాన్సన్ ప్రక్కెటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.
అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూకే టూర్‌కు ఈ యువ ఫాస్ట్ బౌలర్ దూరమయ్యాడు. ఇక అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ సీన్ అబాట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది.
అబాట్‌కు తొలుత కేవలం ఇంగ్లండ్‌తో వన్డే జట్టులో మాత్రం చోటు దక్కింది. ఇప్పుడు అనూహ్యంగా జాన్సన్ తప్పుకోవడంతో అబాట్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్‌తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.
స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
Comments
Please login to add a commentAdd a comment