
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విధిలిచ్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్(England) నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
ఆసీస్ బౌలర్లను డకెట్ ఊతికారేశాడు. వెటరన్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 95 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు జో రూట్(78 బంతుల్లో 4 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ జోస్ బట్లర్(23), జోఫ్రా ఆర్చర్(21) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. లబుషేన్, జంపా తలా రెండు వికెట్లు సాధించారు.
డకెట్ సరికొత్త చరిత్ర..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డకెట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా డకెట్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం నాథన్ ఆస్టిల్(145) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆస్టిల్ ఆల్‌టైమ్ రికార్డును డకెట్ బ్రేక్ చేశాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: Champions Trophy IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment