
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆసీస్ ఆడుతోంది.
ఈ మెగా టోర్నీకి ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా స్మిత్‌నే బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఆసీస్‌దే పైచేయి..
వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 161 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఆస్ట్రేలియా 91 విజయాలు, ఇంగ్లండ్ 65 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. డు మ్యాచ్‌లు టై కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధవన్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment