Sean Abbott
-
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్తో మూడు టీ20లు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ గాయం కారణంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. దిహాండ్రల్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న జాన్సన్ ప్రక్కెటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూకే టూర్‌కు ఈ యువ ఫాస్ట్ బౌలర్ దూరమయ్యాడు. ఇక అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ సీన్ అబాట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అబాట్‌కు తొలుత కేవలం ఇంగ్లండ్‌తో వన్డే జట్టులో మాత్రం చోటు దక్కింది. ఇప్పుడు అనూహ్యంగా జాన్సన్ తప్పుకోవడంతో అబాట్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా -
సీన్ అబాట్ ఆల్‌రౌండ్ షో.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ఆటగాడు సీన్ అబాట్ ఆల్‌రౌండ్ షోతో (69 పరుగులు, 3 వికెట్లు) విండీస్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన అబాట్ 63 బంతుల్లో 4 సిక్సర్లు, బౌండరీ సాయంతో 69 పరుగులు చేసి ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ (33), షార్ట్ (41), లబూషేన్ (26), ఆరోన్ హార్డీ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలరల్లో గుడకేశ్ మోటీ 3 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాశించగా.. అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, మాథ్యూ ఫోర్డ్, ఒషేన్ థామస్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. సీన్ అబాట్ (3/40), జోష్ హాజిల్‌వుడ్ (3/43) విజృంభించడంతో 43.3 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. సదర్‌ల్యాండ్ 2, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కీసీ కార్టీ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అలిక్ అథనాజ్ (11), షాయ్ హోప్ (29), రోస్టన్ చేజ్ (25), అల్జరీ జోసఫ్ (19) రెండంకెల స్కోర్ చేశారు. ఈ సిరీస్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఫిబ్రవరి 6న జరుగనుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
T20 BLAST లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బౌలర్..
-
బౌలర్ బ్యాటర్‌గా మారిన వేళ.. ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ను, ఓవరాల్‌గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్‌తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్‌లో సర్రే బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. #ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4— CricTracker (@Cricketracker) May 27, 2023 ఈ మ్యాచ్‌లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ -
ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ క్రికెటర్! వేడుకలో తమ చిన్నారి కూడా!
ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ తన చిరకాల ప్రేయసి బ్రియర్ నీల్‌ను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ బుధవారం(జూన్ 29) జరిగిన వేడుకలో ఆమెను వివాహమాడాడు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో వీరి వివాహం జరుగడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్ అబాట్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. ‘‘నా ‘ప్రేమ’ను నేను పెళ్లాడాను. నా బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ అబాట్! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022లో సీన్ అబాట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో అబాట్ దంపతులకు రైజర్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. కాగా అబాట్ 2014లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 5 వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడాడు.ఇక ఐపీఎల్- 2022లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన సీన్ అబాట ఒక వికెట్ తీశాడు. చదవండి: IND VS ENG 5th Test: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ View this post on Instagram A post shared by Sean Abbott (@sean_abbott) View this post on Instagram A post shared by Sean Abbott (@sean_abbott) -
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..!
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్ దశలోనే ఎస్ఆర్హెచ్ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్‌ను ఓటములతో ఆరంభించిన ఎస్ఆర్హెచ్.. సీజన్ మధ్యలో వరుసగా ఐదు విజయాలు సాధించి హైదరాబాద్ తిరిగి గాడిలో పడింది. అయితే తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక డేవిడ్ వార్నర్ తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేన్ విలియమ్సన్.. జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా విలియమ్సన్ నిరాశపరిచాడు.13 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 216 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ విఫలమైనప్పటికీ కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ అత్యుత్తమంగా రాణించారు. ఇక మరి కొంత మంది ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఓ ముగ్గురి ఆటగాళ్లని ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల పేసర్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. సీన్ అబాట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడిన అనుభవం ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు అబాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ ఏడాది సీజన్లో అతడికి చాలా తక్కువ అవకాశాలు లభించాయి. కేవలం ఒకే మ్యాచ్ ఆడిన అబాట్.. తన నాలుగు ఓవర్ల కోటాలో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడికి తర్వాత మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్క లేదు. ఇప్పటికే నటరాజన్, భవనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండటంతో రాబోయే సీజన్‌కు ముందు అబాట్‌ను ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. ఫజల్హక్ ఫారూఖీ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గత కొద్ది కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో ఫారూఖీని రూ. 50 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కాగా ఫారూఖీ మాత్రం ఐపీఎల్లో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని విడిచి పెట్టి మరో కొత్త పేసర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేయచ్చు. శ్రేయస్ గోపాల్ ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్ గోపాల్‌ను మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే జట్టులో వాషింగ్టన్ సుందర్, జగదీషా సుచిత్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో గోపాల్ పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన గోపాల్.. 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఇక వికెట్ సాధించాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో గోపాల్ స్థానంలో ఓ యువ ఆటగాడిని భర్తీ చేసే అవకాశం ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..! -
సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న స్టార్ ఆల్‌రౌండర్
ఐపీఎల్ 2022 సీజన్లో రెండు వరుస విజయాలతో గాడిలో పడిన సన్‌రైజర్స్‌కు వాషింగ్టన్ సుందర్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన సుందర్ ఎస్ఆర్హెచ్ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ యాజమాన్యం పరోక్షంగా ప్రకటించింది. Bowling ✅ Batting ✅ Catching ✅ Sean us how it's done on the 1️⃣st day of training itself. 💪🏾@seanabbott77#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/fIaf4W3yEZ — SunRisers Hyderabad (@SunRisers) April 13, 2022 ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీకి ఓ బిగ్ రిలీఫ్ లభించింది. సుందర్ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సీన్ అబాట్‌తో భర్తీ చేయనున్నట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఆసీస్ పరిమిత ఓవర్ల జట్టుతో పాటు పాక్‌లో పర్యటించిన అబాట్.. క్వారంటైన్ ముగించుకుని ఇటీవలే జట్టుతో చేరాడు. నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తూ కనిపించాడు. దీనికి సంబందించిన వీడియోను సన్‌రైజర్స్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సీన్ అబాట్‌ను ఎస్ఆర్హెచ్ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్ శుక్రవారం (ఏప్రిల్ 15) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడాల్సి ఉంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సుందర్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో చివరి 2 మ్యాచ్‌ల్లో (సీఎస్కే, గుజరాత్) ప్రత్యర్ధులను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్‌తో సమరం.. రెండు భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్‌సైడ్ దిశగా కవర్‌డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్‌కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది. Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11 This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0 — Fox Cricket (@FoxCricket) December 29, 2021 -
సిడ్నీ టెస్టుకు డేవిడ్ వార్నర్ రెడీ
పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బందులు పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కాస్త ఊరట! గజ్జల్లో గాయంతో ఆటకు దూరమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం ప్రకటించిన జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. అతనితో పాటు విల్ పకోవ్‌స్కీ, సీన్ అబాట్లను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరంతా గురువారం సాయంత్రం ఆసీస్ జట్టుతో చేరి సిడ్నీ టెస్టు కోసం ప్రాక్టీస్ మొదలు పెడతారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన ఓపెనర్ జో బర్న్స్‌పై వేటు పడింది. మూడో టెస్టు వేదికగా సిడ్నీ ఖరారు అయినా... సిడ్నీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షల కారణంగా భారత్, ఆసీస్ జట్లు వెంటనే అక్కడికి వెళ్లడం లేదు. జనవరి 4 వరకు ఆటగాళ్లంతా మెల్బోర్న్లో ఉండి ప్రాక్టీస్ కొనసాగిస్తారని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ వెల్లడించారు. -
ఆసీస్‌కు షాక్ : ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం
మెల్బోర్న్ : ఆ్రస్టేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ అబాట్ రెండో టెస్టుకూ దూరమయ్యారు. గజ్జల్లో గాయంతో వార్నర్, కండరాల గాయంతో అబాట్ తొలి టెస్టు ఆడలేకపోయారు. దీంతోపాటే వీళ్లిద్దరు బయో బబుల్ దాటి బయటికి రావడంతో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టు కూడా ఆడే వీలు లేకుండా పోయింది. పైగా వార్నర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు! ‘సిడ్నీలోని నార్తర్న్ బీచ్ వద్ద కరోనా హాట్‌స్పాట్ న్యూసౌత్‌వేల్స్ ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇద్దరు ఆటగాళ్లు కూడా అక్కడి నుంచే మెల్బోర్న్కు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వాళ్లిద్దరిని జట్టుతో కలిసేందుకు అనుమతించడం లేదు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి : ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..) శుబ్‌మన్‌కు అవకాశం! మెల్బోర్న్: తొలి టెస్టులో ఎదురైన పరాభవం దృష్ట్యా రెండో టెస్టు కోసం భారత జట్టు పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ కోహ్లి స్వదేశం చేరడంతో తాత్కాలిక కెప్టెన్ రహానే నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓపెనర్ పృథీ్వషా పేలవ ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు ఖాయమనుకుంటున్న శుబ్‌మన్ గిల్ నెట్స్‌లో అదేపనిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 43, 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇతని కంటే పృథ్వీ షా అనుభవజ్ఞుడు కావడంతో అతన్నే ఆడించారు. కానీ షా 0, 4 పరుగులతో జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో రంజీల్లో పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే 21 ఏళ్ల శుబ్‌మన్‌వైపే జట్టు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు కూడా నెట్స్‌లో శ్రమించారు. పేసర్లు సిరాజ్, నవ్‌దీప్ సైనీలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!
సిడ్నీ : బోర్డర్ గవాస్కర్ ట్రోపీ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలి చీలమండ గాయంతో అబాట్ బాధపడుతున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా మొదటి సెషన్లో బౌలింగ్‌కు వచ్చిన అబాట్ 7 ఓవర్లు వేశాడు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అబాట్‌కు కండరాలు పట్టేయడంతో బౌలింగ్ చేయలేదు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఫిజియో సూచన మేరకు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడైతే అబాట్ బౌలింగ్‌కు వచ్చే అవకాశాలు లేవని.. ఒకవేళ ఆసీస్ బ్యాటింగ్ సమయంలో అవసరం అనుకుంటేనే వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఒకవేళ అబాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. టెస్టు సిరీస్‌లో సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు కీలక బౌలర్.. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన అబాట్ ప్రత్యర్థి బ్యాట్స్మన్లను కట్టడి చేస్తాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అబాట్ మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇప్పటికే గాయంతో డేవిడ్ వార్నర్, త్యాగి బౌన్సర్‌తో విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యారు.. తాజగా అబాట్ కూడా గాయంతో బాధపడుతుండడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ కామెరాన్ గ్రీన్ ముఖంపై బలంగా తగిలిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రీన్ గాయం నుంచి కోలుకున్నాడని.. అతను ఆసీస్ ఎతో మ్యాచ్‌లో కొనసాగనున్నాడని తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు టీమిండియా లంచ్ విరామం తర్వాత 70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.(చదవండి : నెటిజన్ కామెంట్‌కు గబ్బర్ ధీటైన కౌంటర్) ఓపెనర్ పృథ్వీ షా మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 61, శుబ్‌మన్ గిల్ 61 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ రహానే 38 పరుగులు చేశాడు. ప్రస్తుతం విహారి 63, రిషబ్ పంత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 108 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. బుమ్రా హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 194 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని 334 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
మరోసారి సీన్ అబాట్ వేసిన బౌన్సర్ మరో క్రికెటర్‌ను
-
హ్యూస్ మరణానికి కారణమైన బౌలరే..!
మెల్బోర్న్: దాదాపు మూడేళ్లనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. 2014 నవంబర్ లో మైదానంలో బంతి అతనికి బలంగా తాకడంతో క్రీజ్‌లో కూలిన హ్యూస్.. ఆ తరువాత రెండు రోజులకు తుదిశ్వాస విడిచాడు. 2014 నవంబర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ బౌన్సర్ సంధించగా అది హ్యూస్ తలకు బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన హ్యూస్ క్రీజ్‌లో కుప్పకూలిపోయాడు. ఆపై చికిత్స చేయించినా హ్యూస్ మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయితే తాజాగా మరోసారి సీన్ అబాట్ వేసిన బౌన్సర్ మరో క్రికెటర్‌ను తీవ్రంగా గాయపరచడం ఆసీస్ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆసీస్ దేశవాళీ క్రికెట్లో భాగంగా ఆదివారం షెఫల్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్ తరపున ఆడుతున్న సీన్ అబాట్ వేసిన షార్ట్ బాల్.. విక్టోరియా ఆటగాడు విల్ పీవుకోవ్‌స్కీ తలకు బలంగా తాకింది. బంతి తగిలిన మరుక్షణమే పీవుకోవ్‌స్కీ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడ ఉన్న ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ క్రమంలోనే ఫిజియో బృందం, మెడికల్ స్టాఫ్ గ్రౌండ్లోకి ఉన్నపళంగా పరుగులు తీశారు. కాసేపు పీవుకోవ్స్కీకి చికిత్స చేసిన తర్వాత అతను తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వైద్యుల సాయంతో పీవుకోవ్‌స్కీ గ్రౌండ్‌ను విడిచివెళ్లిపోయాడు. అతని తలకు స్కానింగ్ చేసిన తర్వాత పెద్ద గాయం కాలేదని తేలడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆనాటి హ్యూస్ మరణానికి కారణమైన బౌలరే మరొకసారి బౌన్సర్ వేసి బ్యాట్స్‌మన్‌ను గాయపరచడం చర్చనీయాంశమైంది. -
అబాట్‌కు ‘సోదరి' సాంత్వన!
సిడ్నీ: ఫిల్ హ్యూస్ మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఇలాంటి స్థితిలోనూ వారు మరొకరికి ధైర్యం నూరిపోసేందుకు సిద్ధమయ్యారు. అతనెవరో కాదు... హ్యూస్కు బంతి విసిరిన పేసర్ సీన్ అబాట్. తన ప్రమేయం లేకపోయినా హ్యూస్ చావుకు కారణమయ్యానంటూ అబాట్ అపరాధ భావంతోనే ఉన్నాడు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అతను ఆ షాక్‌లోంచి బయటికి రాలేకపోతున్నాడు. దాంతో అతడిని ఓదార్చే బాధ్యత హ్యూస్ సోదరి మెగాన్ తీసుకుంది. ఆస్పత్రి ఆవరణలో వేదనాభరితంగా కనిపిస్తున్న అబాట్ వద్దకు మెగాన్ వెళ్లి కలిసింది. నీ తప్పేమీ లేదంటూ స్వాంతన పలికింది. చాలా సేపు అతనితో మాట్లాడిన మెగాన్... ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న చాలా మందికి కంటతడి పెట్టించింది!