ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ తన చిరకాల ప్రేయసి బ్రియర్ నీల్‌ను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ బుధవారం(జూన్ 29) జరిగిన వేడుకలో ఆమెను వివాహమాడాడు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో వీరి వివాహం జరుగడం విశేషం.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్ అబాట్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. ‘‘నా ‘ప్రేమ’ను నేను పెళ్లాడాను. నా బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ అబాట్! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2022లో సీన్ అబాట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో అబాట్ దంపతులకు రైజర్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. కాగా అబాట్ 2014లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్ తరఫున 5 వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడాడు.ఇక ఐపీఎల్- 2022లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన సీన్ అబాట ఒక వికెట్ తీశాడు.
చదవండి: IND VS ENG 5th Test: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ
Comments
Please login to add a commentAdd a comment