IPL 2022: Good News for SRH Fans, Sean Abbott Joins SRH Training After Quarantine - Sakshi
Sakshi News home page

Sean Abbott: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ఆరెంజ్‌ ఆర్మీతో చేరిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

Published Wed, Apr 13 2022 5:36 PM | Last Updated on Wed, Apr 13 2022 5:59 PM

IPL 2022: Big Relief For SRH, Sean Abbott Joins Orange Army - Sakshi

Photo Courtesy: BBL

 ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు వరుస విజయాలతో గాడిలో పడిన సన్‌రైజర్స్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో ఊహించని షాక్‌ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన సుందర్ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ యాజమాన్యం పరోక్షంగా ప్రకటించింది. 


ఈ నేపథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీకి ఓ బిగ్‌ రిలీఫ్‌ లభించింది. సుందర్‌ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ సీన్‌ అబాట్‌తో భర్తీ చేయనున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వెల్లడించింది. ఆసీస్‌ పరిమిత ఓవర్ల జట్టుతో పాటు పాక్‌లో పర్యటించిన అబాట్‌.. క్వారంటైన్‌ ముగించుకుని ఇటీవలే జట్టుతో చేరాడు. నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తూ కనిపించాడు. దీనికి సంబందించిన వీడియోను సన్‌రైజర్స్‌ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో సీన్‌ అబాట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 15) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడాల్సి ఉంది. ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సుందర్‌ స్థానంలో సీన్‌ అబాట్‌ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో చివరి 2 మ్యాచ్‌ల్లో (సీఎస్‌కే, గుజరాత్‌) ప్రత్యర్ధులను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  
చదవండి: పంజాబ్‌తో సమరం.. రెండు భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement