IPL 20222: SRH Players Delivers Mirchi Movie Telugu Dialogue Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2022- SRH: ‘కతౌట్‌ చూసి కొన్ని కొన్ని నమేయాలి దూడ్‌’.. ఇదే రా మావా అరాచకం అంటే! వీడియో వైరల్‌

Published Thu, Mar 24 2022 2:15 PM | Last Updated on Thu, Mar 24 2022 4:41 PM

IPL 20222: SRH Players Delivers Mirchi Telugu Dialogue Video Viral - Sakshi

డైలాగ్‌ చెబుతున్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు(PC: SRH)

SRH Players Delivers Mirchi Telugu Dialogue Video: ఐపీఎల్‌-2022 సమరానికి సమయం ఆసన్నమైంది. మార్చి 26 నుంచి క్యాష్‌ రిచ్‌లీగ్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 10 జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు​ మొదలుపెట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఫ్రాంఛైజీలు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాయి. అంతేగాక.. ఆటగాళ్ల మధ్య ఫన్నీ చాలెంజ్‌లు నిర్వహిస్తూ పోటీలు పెడుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆరెంజ్‌ ఆర్మీని ఆకట్టుకునేందుకు తెలుగు సినిమాల డైలాగ్స్‌తో ముందుకు వచ్చింది.

కాగా జట్టులో హైదరాబాదీ ఆటగాళ్లు లేకపోవడంతో ఇప్పటికే సన్‌రైజర్స్‌ విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. రెండో చెన్నై జట్టు కొంతమంది ఘాటు కామెంట్లు చేశారూ కూడా! ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాల్లోని పాటలకు తమ ఆటగాళ్లతో స్టెప్పులు వేయిస్తూ.. డైలాగ్స్‌ చెప్పిస్తూ వరుస పోస్టులు చేయడం గమనార్హం.

ఇప్పటికే అభిషేక్‌ శర్మ సూపర్‌ స్టార్‌  మహేశ్‌ బాబు ‘కళావతి’ పాటకు కాలుకదపగా.. కెప్టెన్‌ కేన్‌ మామ(కేన్‌ విలియమ్సన్‌) సహా పలువురు ఆటగాళ్లు ‘పుష్ప’ తగ్గేదేలే డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు యంగ్‌ రెబల్‌ స్టార్‌​ ప్రభాస్‌ మూవీ మిర్చీ సినిమా డైలాగ్‌తో ముందుకు వచ్చారు మరికొంత మంది సన్‌రైజర్స్‌ ప్లేయర్లు.

పంచ్‌ ఫలక్‌నామా చాలెంజ్‌లో భాగంగా ఈ మూవీలోని ఫేమస్‌ డైలాగ్‌ ‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అంటూ  అదరగొట్టారు. ఉమ్రాన్‌మాలిక్‌ , శ్రేయస్‌ గోపాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ దూబే, రొమారియో షెఫర్డ్‌, నికోలస్‌ పూరన్‌ ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇక ఆఖర్లో పూరన్‌.. ‘‘కతౌట్‌ చూసి కొన్ని కొన్ని నమేయాలి దూడ్‌..’’ అంటూ తనదైన శైలిలో డైలాగ్‌ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఇదే రా మావా అరాచకం అంటే’ అంటూ సరదాగా మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. 

చదవండి: IPL 2022: మంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఎవరో చెప్పేసిన రోహిత్‌ శర్మ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement