ఐపీఎల్ మెగా వేలం- 2022 తొలి రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అత్యధికంగా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. అదే విధంగా టీమిండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను సొంతం చేసుకుంది. అతడి కోసం రూ. 8 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది.
ఇంకా పర్సులో 20.15 కోట్లు మిగిలి ఉన్నాయి. 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో 6 స్థానాలు మిగిలి ఉన్నాయి. కాగా సన్‌రైజర్స్ రిటెన్షన్‌లో భాగంగా కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (అన్‌క్యాప్డ్ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మలిక్ (అన్‌క్యాప్డ్ – రూ. 4 కోట్లు)ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
తొలి రోజు వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ కొన్న ఆటగాళ్లు ఎవరంటే...
►నికోలస్ పూరన్- రూ. 10 కోట్ల 75 లక్షలు
►వాషింగ్టన్ సుందర్- రూ. 8 కోట్ల 75 లక్షలు
►రాహుల్ త్రిపాఠి- రూ. 8 కోట్ల 50 లక్షలు
►అభిషేక్ శర్మ - రూ. 6 కోట్ల 50 లక్షలు
►భువనేశ్వర్ కుమార్ - రూ. 4 కోట్ల 20 లక్షలు
►టి. నటరాజన్ - రూ. 4 కోట్లు
►కార్తీక్ త్యాగి - రూ. 4 కోట్లు
►శ్రేయస్ గోపాల్- రూ. 75 లక్షలు
►ప్రియమ్ గార్గ్ - రూ. 20 లక్షలు
►జగదీశ్ సుచిత్- రూ. 20 లక్షలు
చదవండి: IPL 2022 Auction: సురేశ్ రైనా, స్మిత్, షకీబ్‌కు భారీ షాక్.. ఎందుకిలా?
Here's looking forward to more Garg-eous shots from @priyamg03149099 #OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/1lr8YZVuAd
— SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022
And we are glad to see you back in orange, @Suchithj27 🧡#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/43XV5musHA
— SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022
#OrangeArmy, new #Riser @ShreyasGopal19 has a special message for you 🧡#ReadyToRise #IPLAuction pic.twitter.com/Nqsdki8HHL
— SunRisers Hyderabad (@SunRisers) February 12, 2022
Comments
Please login to add a commentAdd a comment