టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.
ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
మూడు జట్లకు
క్యాష్ రిచ్ లీగ్‌లో 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.
ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు.
సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment