అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ బరిలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు నిలిచాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రవిస్ హెడ్ వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఇదివరకే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆసీస్ లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మోసస్ హెన్రిక్స్ ఈ జట్టుకు సారధ్యం వహిస్తుండగా.. స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ప్లేయర్స్ ఆటగాళ్లుగా బరిలోకి దిగనున్నారు.
వాషింగ్టన్ ఫ్రీడంతో ఇటీవలే ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాంటింగ్ ఎంఎల్‌సీ తదుపరి సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఆసీస్ ఆటగాళ్లంతా కలిసి జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్‌సీ సెకెండ్ ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు ఎంఎల్‌సీలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడనున్నారు.
ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. మేజర్ లీగ్ టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ లీగ్‌లో ఆసీస్ ఆటగాళ్లే కాక చాలామంది విదేశీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కూడా కొత్తగా వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికా మార్కో జన్సెన్, వెస్టిండీస్ అకీల్ హొసేన్‌ను వాషింగ్టన్ ఫ్రీడం తిరిగి రీటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.
Comments
Please login to add a commentAdd a comment