మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రీడం టీమ్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా (ఈ సీజన్‌లో) నిలిచింది.
హెడ్, గౌస్, రచిన్ మెరుపులు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (48 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (8), మ్యాక్స్‌వెల్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, కీరన్ పోలార్డ్ తలో 2 వికెట్లు.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడగొట్టారు.
88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్
183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. వాషింగ్టన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 13.3 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. జస్‌దీప్ సింగ్ 3.. మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్ తలో 2.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో రొమారియో షెపర్డ్ (25), ట్రెంట్ బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment