
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్ 2, ట్రవిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టారు.
లంక ఇన్నింగ్స్‌లో దినేశ్ చండీమల్ (74), కుసాల్ మెండిస్ (59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్ నిస్సంక 11, దిముత్ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్ 1, కమిందు మెండిస్ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్ మెండిస్ 28, ప్రభాత్ జయసూర్య 0, నిషాన్ పెయిరిస్ డకౌట్ అయ్యారు. కుసాల్ మెండిస్‌కు జతగా లహీరు కుమార (0) క్రీజ్‌లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు.
— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 6, 2025
హెడ్ వినూత్న సంబురాలు
ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌ను ఔట్ చేసిన అనంతరం ట్రవిస్ హెడ్ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.
కాగా, రెండు టెస్ట్‌లు, రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.
టెస్ట్ సిరీస్ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment