Kusal Mendis
-
SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్‌పై శ్రీలంక విజయం
పల్లెకలె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.మార్క్ చాప్మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్‌వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్ -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. కుసాల్, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (115 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (128 బంతుల్లో 143; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. శ్రీలంక స్కోర్ 324/5 (49.2 ఓవర్లు) వద్ద నుండగా వర్షం అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.శ్రీలంక వన్డేల్లో న్యూజిలాండ్‌పై 300 ప్లస్ స్కోర్ సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2019లో ఆ జట్టు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. న్యూజిలాండ్‌తో ఒకే వన్డేలో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2001లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో సనత్ జయసూర్య (107), మహేళ జయవర్దనే (116) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 17 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక (12) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తైన వెంటనే అవిష్క ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన సదీర సమరవిక్రమ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక వేగంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జనిత్ లియనాగే క్రీజ్‌లో ఉన్నాడు.కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ బ్రేస్‌వెల్, ఐష్ సోధి తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించగా.. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంది. -
SL Vs WI: మెండిస్, పెరీరా విధ్వంసం.. మూడో టీ20లో విండీస్ చిత్తు
దంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2–1తో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రావ్మన్ పావెల్(27 బంతుల్లో 37; ఒక ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుడకేశ్ మోతీ (15 బంతుల్లో 32; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన మెండీస్, పెరీరా..అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపడేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో చెలరేగారు. వీరిద్దరితో నిసాంక (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి:IND Vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన -
చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ చిత్తు
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(29 బంతుల్లో 5 ఫోర్లు, 46), అసలంక(21 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లు, 46) టాప్ స్కోరర్లగా నిలిచారు. వీరిద్దరితో పాటు దనుంజయ డిసిల్వా(30),మాథ్యూస్(30) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్‌బీక్ రెండు వికెట్లు పడగొట్టగా.. కింగ్మా, దత్, వాన్‌మీకరన్, ప్రింగిల్ తలా వికెట్ సాధించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 118 పరుగులకే కుప్పకలింది. ఫలితంగా శ్రీలంక 83 పరుగులతో జయభేరి మోగించింది. చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా శ్రీలంక ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్ -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీలంక కెప్టెన్..!?
ఐపీఎల్-2024 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే దూరమైన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్కే పడింది. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్‌తో కాన్వే స్ధానాన్ని సీఎస్కే భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సీఎస్కే ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.50లక్షల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్దమైంది. మెండీస్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో మెండీస్ దుమ్ములేపుతున్నాడు. మెండిస్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఛటోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సైతం మెండిస్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ మెండిస్ అదరగొట్టాడు. అదేవిధంగా మెండిస్ వికెట్ కీపర్ బ్యాటర్ అయినందున తమ జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. -
విధ్వంసం సృష్టించిన అసలంక.. రెచ్చిపోయిన కుశాల్, సమరవిక్రమ
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ చరిత్ అసలంక (21 బంతుల్లో 44 నాటౌట్; 6 సిక్సర్లు) అర డజను సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా.. కుశాల్ మెండిస్ (36 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (48 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (4), కమిందు మెండిస్ (19) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్, ఆతర్వాత వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్‌గా మెండిస్
స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌తో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్.. శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి డిప్యూటీగా మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో అతడికి చోటు దక్కింది. కాగా ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 మధ్యలోనే తప్పుకున్న మాజీ కెప్టెన్ దసున్ షనక కూడి జింబాబ్వే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా తొలుత ఈ సిరీస్‌కు 21 మంది సభ్యుల ప్రిలిమనరీ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇప్పుడు 17 మంది పేర్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలెక్షన్ కమిటీ ఖారారు చేసింది. జనవరి 6న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో, దసున్ షనక, జనిత్ లియానాగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, ప్రమోద్ చమీర, వాండర్సే, అకిల దనంజయ, వనిందు హసరంగా (ఫిట్‌నెస్‌కు లోబడి). చదవండి: #Saim Ayub: బ్యాటింగ్‌లో విఫలం.. ఈజీ క్యాచ్ వదిలేశాడు.. బాబర్ రియాక్షన్ వైరల్ -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు లంక విలవిల.. నామమాత్రపు స్కోరు
CWC 2023- NZ vs SL Updates: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 171 పరగులకు ఆలౌట్ అయింది. కివీస్‌తో మ్యాచ్.. కష్టాల్లో శ్రీలంక జట్టు 32.1: రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి చమీర అవుట్(1). 33 ఓవర్లలో లంక స్కోరు: 132-9 ► 25 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు: 114-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 23.3: ఫెర్గూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నె అవుట్(6). లంక స్కోరు: 113/8 (23.3) 19 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 105-7 ►18.3: సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ధనంజయ(19) ►16.4: సాంట్నర్ బౌలింగ్‌లో మథ్యూస్(16) అవుట్.. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక పవర్ ప్లేలో అతడొక్కడే న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక రెండు పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 6 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధ శతకం(51) సాధించగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన సమర విక్రమ 1, చరిత్ అసలంక 8, పరుగులు మాత్రమే చేశారు. దీంతో పవర్‌ప్లే(10 ఓవర్లు) ముగిసే సరికి లంక కేవలం 74 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ ఒక్కో వికెట్ పడగొట్టారు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (నవంబర్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ కివీస్ తుది జట్టులోకి రాగా.. కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే లంక ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు.. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక -
విరాట్ 49వ వన్డే శతకం.. అయితే ఎవరికి గొప్ప అన్నట్లు ప్రవర్తించిన శ్రీలంక కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 49వ వన్డే శతకాన్ని సాధించి, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49 సెంచరీలు) సమం చేసిన విషయం తెలిసిందే. విరాట్ సాధించిన ఈ ఘనతను యావత్ క్రీడా ప్రపంచం కీర్తిస్తుంది. రికార్డుల రారాజుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ నామస్మరణతో సోషల్‌మీడియా మార్మోగిపోతుంది. అయితే ఓ అంతర్జాతీయ ఆటగాడు విరాట్ సాధించిన ఘనతను అభినందించేందుకు నిరాకరించి, నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. వివరాల్లోకి వెళితే.. వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇవాళ శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి విరాట్ రికార్డు శతకంపై కుశాల్‌ను ఇలా ప్రశ్నించాడు. Journalist " Virat Just scored his 49th ODI ton. Do you like to congratulate him?" Kusak Mendis" Why I would congratulate him"😭😭😭#INDvSA #INDvsSA #SAvIND #ViratKohli #CWC2023 pic.twitter.com/DAqh2oeO5e — Out Of Context Cricket PK (@GemsOfCrickett) November 5, 2023 విరాట్ 49వ వన్డే సెంచరీ సాధించి, సచిన్ రికార్డు సమం చేసినందుకు మీరు అభినందనలు తెలిపాలని అనుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కుశాల్ నేనెందుకు అతన్ని అభినందిస్తానంటూ షాకింగ్ సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి పంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి క్రికెట్ అభిమానులు కుశాల్‌ను ఏకి పారేస్తున్నారు. కుశాల్‌ను సంస్కారహీనుడని దుమ్మెత్తిపోస్తున్నారు. కనీస మర్యాద కూడా లేని వ్యక్తిని శ్రీలంక క్రికెట్ బోర్డు కెప్టెన్‌గా ఎలా నియమించిందని మండిపడుతున్నారు. మైదానంలో ఎంతటి వైరం ఉన్నా, సహచర ఆటగాడు సాధించిన ఇంతటి ఘనతను ఎవరైనా అభినందిస్తారని అంటున్నారు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ దసున్ షనక గాయపడటంతో కుశాల్ మెండిస్‌ను అనూహ్యంగా కెప్టెన్ పదవి వరించింది. -
చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! వారు మాత్రం: శ్రీలంక కెప్టెన్
WC 2023- Ind Vs SL- Kushal Mendis Comments: వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత పేసర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ ఆరంభంలోనే 3వికెట్లు పడగొట్టి లంకను చావు దెబ్బతీశాడు. వీరిద్దరితో పాటు బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. అంతర్జాతీయ వన్డేల్లో శ్రీలంకకు ఇది మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక ఓటమితో సెమీస్ రేసు నుంచి లంక దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో గిల్ (92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇక దారుణ ఓటమిపై మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ స్పందించాడు. ఈ ఓటమి తనను ఎంతో బాధించిందని మెండిస్ తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. నేను కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాను. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి అంత స్వింగ్ అవుతుందని అస్సలు నేను ఊహించలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని బౌలింగ్ ఎంచుకున్నాను. అదే విధంగా ఫస్ట్‌హాఫ్‌లో వికెట్ స్లోగా ఉండి బౌలర్లకు మంచిగా ఉంటుందని తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాను. అందుకు తగ్గట్టే మధుశంక మంచి ఆరంభం అందించాడు. అతడు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఫీల్డింగ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆరంభంలో కోహ్లి, గిల్‌కు అవకాశాలు ఇచ్చేశాం. అదే మా కొంపముంచింది. వారిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మా బౌలర్ల కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎదైమనప్పటికీ క్రెడిట్ మాత్రం టీమిండియాకే ఇవ్వాలనకుంటున్నారు. వారు మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించారు. మాకు ఇంకా ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మెండిస్ పేర్కొన్నాడు. కాగా లంకపై విజయంతో భారత్‌కు సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది. చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్‌కప్‌లోనే తొలి బౌలర్‌గా View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్‌పై సెంచరీతో చెలరేగాడు.. కాసేపటికే ఆసుపత్రిలో కుశాల్ మెండిస్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ మెరుపు శతకంతో చెలరేగాడు. 77 బంతులు ఎదుర్కొన్న కుశాల్ మెండిస్ 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. అయితే తన సెంచరీ మార్క్‌ను మెండిస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన శ్రీలంక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరు మీద ఉండేది. 2015 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంగక్కర 70 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆసుపత్రికి కుశాల్ మెండిస్.. కాగా శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కుశాల్ మెండీస్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అతడు చేతి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్కానింగ్ కోసం అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది. "పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 77 బంతుల్లో 122 పరుగులతో అద్భుతంగా రాణించి డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన కుశాల్ మెండిస్ క్రాంప్స్‌తో బాధపడ్డాడు. దీంతో అతడిని మా సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెండిస్ తరుపున దుషన్ హేమంత సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. అదేవిధంగా మెండిస్ స్ధానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను సదీర సమరవిక్రమ స్వీకరించాడని" ఎక్స్(ట్విటర్)లో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. చదవండి: ODI WC 2023: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్స్ -
WC 2023: మెండిస్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీమిండియా రికార్డు బద్దలు
WC 2023 Pak Vs SL- Hyderabad: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ దుమ్ములేపారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగి శతకాల మోత మోగించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఫాస్టెస్ట్ సెంచరీతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాక్ పేసర్ హసన్ అలీ లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్ పాతుమ్ నిసాంక(51)కు తోడైన కుశాల్ మెండిస్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు. మెండిస్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సమరవిక్రమ సైతం సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. సమరవిక్రమ సైతం.. సెంచరీతో చెలరేగి 89 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. సమరవిక్రమ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో ధనంజయ డి సిల్వ ఒక్కడే 20 పరుగులు మార్కు(25) దాటాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా రికార్డు బ్రేక్ కాగా పటిష్ట పేస్‌దళం గల పాకిస్తాన్ మీద వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ప్రపంచకప్ చరిత్రలో పాక్ మీద హయ్యస్ట్ స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. ఇక లంకతో మ్యాచ్‌లో హసన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. హ్యారిస్ రవూఫ్ రెండు, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ మీద అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్లు: ►2023: శ్రీలంక- 344/9- హైదరాబాద్‌లో ►2019: టీమిండియా- 336/5 - మాంచెస్టర్‌లో ►2019: ఇంగ్లండ్- 334/9- నాటింగ్‌హాంలో ►2003: ఆస్ట్రేలియా 310/8- జొహన్నస్‌బర్గ్‌లో.. శ్రీలంక- పాకిస్తాన్లో నమోదైన మరో రికార్డు వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మీద ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి కుశాల్ మెండిస్, సమరవిక్రమ. 2019లో జో రూట్ 107, జోస్ బట్లర్ 103 పరుగులు సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
సెంచరీలతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. పాకిస్తాన్ టార్గెట్ 345 పరుగులు
వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక అందుకు తగ్గట్టు ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లంక 344 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు), సదీర సమరవిక్రమ(89 బంతుల్లో 108) అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ఓపెనర్ నిస్సాంక(51) హాఫ్ సెంచరీతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు పడగొట్టగా.. హ్యారిస్ రవూఫ్ రెండు, అఫ్రిది, నవాజ్, షాదాబ్ తలా వికెట్ సాధించారు. చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! -
చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ!
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ కుశాల్ మెండిస్.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెండిస్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 70 బంతుల్లో సంగర్కర సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగర్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: ODI WC 2023: అందరూ కోహ్లిని మాత్రమే ప్రశంసిస్తున్నారు.. అతడి సంగతి ఏంటి మరి? The fastest century by a Sri Lankan at a Men's #CWC 💯🇱🇰@mastercardindia Milestones 🏏 #CWC23 #PAKvSL pic.twitter.com/4Afiq6ss0e — ICC (@ICC) October 10, 2023 -
శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం
గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన వామప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 158 పరుగులు మెండిస్ చేశాడు. అతడితో పాటు సమరవిక్రమ(39), నిసాంక(30) పరుగులతో పర్వాలేదనపించారు. ఆఫ్గాన్ బౌలర్లలో నబీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్, నవీన్ ఉల్-హక్, రషీద్ ఖాన్, ఫరూఖీ తలా వికెట్ సాధించారు. అనంతరం వర్షం కారణంగా అఫ్గానిస్తాన్ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అఫ్గాన్ 38.1 ఓవర్లలో 4 వికెట్లకు 261 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్(119), రెహామత్ షా(93) పరుగులతో అదరగొట్టారు. చదవండి: ODI WC 2023: ఆసీస్‌దే విజయం.. వరుసగా రెండో మ్యాచ్‌లో పాక్ ఓటమి -
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన శ్రీలంక ప్లేయర్
వరల్డ్‌కప్ వార్మప్ గేమ్స్ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందిస్తున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఖంగుతిన్న శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇరగదీస్తుంది. ఈ మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తున్న కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ ఏమాత్రం తగ్గకుండా చెలరేగిపోతుండటంతో శ్రీలంక భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 25 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 197/2గా ఉంది. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (76 బంతుల్లో 135; 18 ఫోర్లు, 7 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (23 బంతుల్లో 12; ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ఇవాళ ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. తిరువనంతపురంలో జరగాల్సిన భారత్-నెదార్లండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్ (20), గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఆసియాకప్-2023 ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ ఘోర పరాభావం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసున్ షనకను జట్టు కెప్టెన్సీ నుంచి తొలిగించాలని శ్రీలంక క్రికెట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందే లంక బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని శ్రీలంక క్రికెట్ ప్రణాళికలలు సిద్దం చేస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించనున్నట్లు వినికిడి. కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు శ్రీలంక జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షనక జట్టును విజయ పథంలోనే నడిపించాడని చేప్పుకోవాలి. ఇప్పటివరకు దసున్ షనక కెప్టెన్సీలో 37 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. 23 విజయాలు సాధించింది. కేవలం 14 మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 60.5గా ఉంది. అదే విధంగా షనక సారథ్యంలోనే 8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. గతేడాది ఆసియాకప్‌ను కూడా షనక నాయకత్వంలోని శ్రీలంకనే సొంతం చేసుకుంది. చదవండి: IND vs AUS: అశ్విన్.. ఆసీస్‌తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?: ఇర్ఫాన్ పఠాన్ -
Asia Cup 2023: సెంచరీ చేజార్చుకున్న మెండిస్.. శ్రీలంక భారీ స్కోర్
ఆసియా కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. పథుమ్ నిస్సంక (40 బంతుల్లో 41; 6 ఫోర్లు), అసలంక (43 బంతుల్లో 36; 2 ఫోర్లు, సిక్స్), దునిత్ వెల్లెలెగె (39 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కరుణరత్నే (35 బంతుల్లో 32; 6 ఫోర్లు), తీక్షణ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. లంక ఇన్నింగ్స్‌లో సమరవిక్రమ (3), కెప్టెన్ షనక (5) మాత్రమే విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 2.2 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోయి 10 పరుగులు చేసింది. కసున్ రజిత బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి రహానుల్లా గుర్భాజ్ (4) ఔటయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ (6), గుల్బదిన్ నైబ్ క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి సూపర్-4కు చేరుకుంటుంది. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, భారత్‌లు సూపర్-4కు చేరుకున్నాయి. -
లంక ప్రీమియర్ లీగ్ 2023 విజేత బి లవ్ క్యాండీ.. ఫైనల్లో డంబుల్లా చిత్తు
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ విజేతగా బి లవ్ క్యాండీ అవతరించింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో క్యాండీ టీమ్.. డంబుల్లా ఔరాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలిసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కెప్టెన్ హసరంగ లేకుండానే ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన క్యాండీ.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విజేతగా నిలిచింది. తాత్కాలిక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (21 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టెయిలెండర్ల సాయంతో ఎంతో ఓర్పుగా బ్యాటింగ్ చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు మాథ్యూస్ బంతితోనూ (2-0-11-0) పర్వాలేదనిపించాడు. గాయం కారణంగా చాలాకాలంగా బంతి పట్టని మాథ్యూస్ రెగ్యులర్ కెప్టెన్ హసరంగ గైర్హాజరీలో తప్పనిసరి పరిస్థితుల్లో బౌలింగ్ చేసి మెప్పించాడు. ఫలితంగా అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (10 బంతుల్లో 5), విఫలం కాగా, కుశాల్ మెండిస్ (22), సమరవిక్రమ (36), కుశాల్ పెరీరా (31 నాటౌట్), ధనంజయ డిసిల్వ (40) రాణించారు. క్యాండీ బౌలర్లలో చతురంగ డిసిల్వ 2, నువాన్ ప్రదీప్, మహ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బి లవ్ క్యాండీ మరో బంతి మిగిలుండగా (19.5 ఓవర్లలో) 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (26), కమిందు మెండిస్ (44), దినేశ్ చండీమల్ (24), ఏంజెలో మాథ్యూస్ (25 నాటౌట్), ఆసిఫ్ అలీ (19) రాణించగా.. చతురంగ డిసిల్వ డకౌటయ్యారు. డంబుల్లా బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. బినుర ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నాడు. సిరీస్ ఆధ్యాంతరం అద్భుతంగా రాణించిన క్యాండీ కెప్టెన్ హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో హసరంగ లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్‌గా (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా (10 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండీస్.. 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో
గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. తమ తొలి ఇన్నింగ్స్‌ను 704/3 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 212 పరుగుల అదధిక్యంలో నిలిచింది. కుశాల్ మెండిస్, నిషాన్ మదుష్కా డబుల్ సెంచరీలతో చెలరేగారు. 339 బంతుల్లో మదుష్కా 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 205 పరుగులు చేయగా.. మెండిస్ 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో కేవలం 291 బంతుల్లోనే 245 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరితో పాటు మాథ్యూస్(101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ అరుదైన రికార్డు సాధించాడు.సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే(374) తొలి స్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య(340),కుమార సంగక్కర(287) వరుసగా రెండు మాడు స్ధానాల్లో నిలిచారు. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ అదే విధంగా మరో రికార్డును కూడా మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుశాల్ 11 సిక్స్‌లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. చదవండి: IPL 2023: మద్యం మత్తులో మహిళతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అనుచిత ప్రవర్తన..! -
5 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వచ్చీ రావడంతోనే సెంచరీ, మొత్తం నలుగురు..!
2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 386/4 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించి, 591/6 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (140) భారీ శతకాలు బాదగా.. రెండో రోజు దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) శతక్కొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించగా.. టెస్ట్‌ల్లో శ్రీలంక ఈ ఫీట్‌ను సాధించడం ఇది నాలుగోసారి. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సదీరా సమరవిక్రమ ఓ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత లంక టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సమరవిక్రమ.. వచ్చీరాగానే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌కు ముందు 4 టెస్ట్‌లు ఆడి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో జట్టులో చోటు కోల్పోయిన సమర.. ఐర్లాండ్‌తో తొలి టెస్ట్‌లో 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తొలి సెంచరీ నమోదు చేశాడు. సనత్ జయసూర్య, ఏంజెలో మాథ్యూస్ సరసన చండీమాల్.. రెండో రోజు ఆటలో సెంచరీ చేసిన దినేశ్ చండీమాల్, కెరీర్లో 14వ శతకాన్ని నమోదు చేసి లంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సరసన చేరాడు. టెస్ట్‌ల్లో లంక తరఫున జయసూర్యతో పాటు ఏంజెలో మాథ్యూస్ కూడా 14 సెంచరీలు బాదారు. తొలి రోజే కెప్టెన్ దిముత్ కరుణరత్నే కెరీర్లో 15వ సెంచరీ నమోదు చేసి, జయసూర్య, మాథ్యూస్‌ల రికార్డును అధిగమించాడు. శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16), కరుణరత్నే (15) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత జయసూర్య, మాథ్యూస్‌లతో కలిసి చండీమాల్ ఏడో ప్లేస్‌లో ఉన్నాడు. 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. రెండో రోజు లంచ్ తర్వాత లంక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్నోయింది. అనంతరం అదే ఓవర్లో రెండో వికెట్ కూడా కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. విశ్వ ఫెర్నాండో బౌలింగ్ ముర్రే కొమిన్స్ (0), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (4) ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 35/2గా ఉంది. -
వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్
గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్‌ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని మెండిస్ కవర్ ఆడే ప్రమత్నం చేయగా.. బంతి ఇన్‌స్వింగ్ అయ్యి వికెట్లను వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా మెండిస్ కూడా బిత్తరి పోయాడు. సిరాజ్ దెబ్బకు మెండిస్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు అదిలోనే సిరాజ్ గట్టి షాకిచ్చాడు. లంక ఓపెనర్ల ఇద్దరని సిరాజ్ తొలి ఐదు ఓవర్లలోనే పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఉమ్రాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసే సరికి లంక 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. Mohammed Siraj is breathing fire 🔥 pic.twitter.com/ykjPbSSINE — Emon Mukherjee (@EmonMukherjee21) January 10, 2023 చదవండి: IND vs SL: సచిన్‌తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు -
సూపర్-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్ ఇంటికి
టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సూపర్-12కు అర్హత సాధించింది. గ్రూఫ్-ఏలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్ పోరులో లంక జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన మాక్స్ ఓడౌడ్ (53 బంతుల్లో 71 పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)చివరి వరకు నాటౌట్‌గా నిలిచినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ ఆఖర్లో దాటిగా ఆడినప్పటికి లాభం లేకపోయింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. మహీష్ తీక్షణ 2, లాహిరు కుమారా, బిహురా ఫెర్నాండోలు చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(44 బంతుల్లో 79, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరవగా.. చరిత్ అసలంక 31 పరుగులు, బానుక రాజపక్స 19 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే , పాల్ వాన్ మీక్రెన్లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్‌డర్ గగ్టెన్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో లంక జట్టు సూపర్-12కు అర్హత సాధించగా.. నెదర్లాండ్స్ ఇంటిబాట పట్టింది. అయితే ఇవాళ యూఏఈతో జరిగే మ్యాచ్‌లో నమీబియా ఓడితే అప్పుడు నెదర్లాండ్స్‌కు సూపర్-12 వెళ్లే అవకాశముంది. కానీ నమీబియా ఉన్న ఫామ్ దృశ్యా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప నెదర్లాండ్స్ దాదాపు ఇంటికి వెళ్లినట్లే. ఇక 79 పరుగులతో లంక విజయంలో కీలకపాత్ర పోషించిన కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన Ind Vs Pak: పాక్‌తో తొలి మ్యాచ్.. పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాణించిన కుశాల్ మెండిస్.. భవితవ్యం ఇక బౌలర్ల చేతిలో
టి20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, శ్రీలంకల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-12లో అడుగుపెడితే.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(44 బంతుల్లో 79, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరవగా.. చరిత్ అసలంక 31 పరుగులు, బానుక రాజపక్స 19 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే , పాల్ వాన్ మీక్రెన్లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్‌డర్ గగ్టెన్లు తలా ఒక వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్‌ను పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్‌లు ఆరంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించాకా 14 పరుగులు చేసిన నిస్సాంక వాన్ మీక్రెన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత దనుంజయ డిసిల్వా తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక కుశాల్‌కు చరిత్ అసలంక(31 పరుగులు) తోడవ్వడంతో లంక స్కోరు ముందుకు కదిలింది. నాలుగో వికెట్‌కు కుశాల్, అసలంకలు కలిసి 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత బానుక రాజపక్స వచ్చి స్కోరును పెంచే వేగంలో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే కుషాల్ మెండిస్ కూడా వెనుదిరిగాడు. చివర్లో షనక, హసరంగాలు తలా ఇన్ని పరుగులు చేయడంతో లంక 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. చదవండి: కిందా మీదా పడి చివరకు ఎలాగోలా! 'టైటిల్ గెలవాలంటే చేయాల్సింది చాలా ఉంది'