
పెవిలియన్‌కు వెళుతున్న కుశాల్ మెండిస్‌ను అభినందిస్తున్న రోషన్ సిల్వా
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్(196; 327 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీని తృటిలో మిస్సయ్యాడు. 83 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన మెండిస్ అత్యంత నిలకడను ప్రదర్శించాడు. కాగా, ద్విశతకానికి నాలుగు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. మరో ఓవర్ నైట్ ఆటగాడు దనంజయ డిసిల్లా 173 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 308 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.
ఆపై రోహన్ సిల్వా జోడి 107 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మెండిస్ మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మెండిస్ కోల్పోయాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో రెండు భారీ సెంచరీలు రావడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌కు లంక దీటుగా బదులిస్తోంది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంక 132 ఓవర్లలో మూడు వికెట్లకు 488 పరుగులు చేసింది.
,