దంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2–1తో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
కెప్టెన్ రావ్‌మన్ పావెల్(27 బంతుల్లో 37; ఒక ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుడకేశ్ మోతీ (15 బంతుల్లో 32; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అదరగొట్టిన మెండీస్, పెరీరా..
అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపడేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో చెలరేగారు. వీరిద్దరితో నిసాంక (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి:IND Vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment