
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
కెప్టెన్ చరిత్ అసలంక (21 బంతుల్లో 44 నాటౌట్; 6 సిక్సర్లు) అర డజను సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా.. కుశాల్ మెండిస్ (36 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (48 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (4), కమిందు మెండిస్ (19) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.
రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్, ఆతర్వాత వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment