Charith Asalanka
-
SL vs NZ: న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది శ్రీలంక. డంబుల్లా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో పర్యాటక కివీస్ జట్టును ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.సెంచరీలతో చెలరేగిన అవిష్క, కుశాల్తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(12) నిరాశపరిచినా.. అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 100) అద్భుత శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(128 బంతుల్లో 143) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఇక చరిత్ అసలంక సైతం కెప్టెన్ ఇన్నింగ్స్(28 బంతుల్లో 40) అలరించాడు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా శ్రీలంక 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 324 పరుగులు స్కోరు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.కివీస్ లక్ష్యం 221అనంతరం.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 221 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 27 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులే చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(48), టిమ రాబిన్సన్(35), మిడిలార్డర్ మిచెల్ బ్రాస్‌వెల్(34 నాటౌట్) ఫర్యాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిహెన్రీ నికోల్స్(6), మార్క్ చాప్మన్(2), గ్లెన్ ఫిలిప్స్(9) పూర్తిగా నిరాశపరచగా.. మిచ్ హే(10), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(9), నాథన్ స్మిత్(9), ఇష్ సోధి(0), జాకోబ్ డఫీ(4 నాటౌట్).. లంక బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. దీంతో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఇక.. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక మూడు, మహీశ్ తీక్షణ, చరిత్ అసలంక చెరో రెండు, జాఫ్రీ వాండర్సే ఒక వికెట్ కూల్చారు. భారీ శతకంతో మెరిసిర కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!కాగా 2015 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా గత 12 వన్డేల్లోనూ లంక కివీస్‌పై వన్డేలో గెలవడం ఇదే తొలిసారి. కాగా 2015, డిసెంబరులో న్యూజిలాండ్ గడ్డపైనే కివీస్‌ను లంక వన్డే మ్యాచ్‌లో చివరగా ఓడించింది. ఇక 2024లో ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 వన్డేలు ఆడిన శ్రీలంకకు ఇది పదో విజయం.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం
న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.బ్రాస్‌వెల్ (27), జాకరీ ఫోల్క్స్ (27 నాటౌట్) మినహా తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. టిమ్ రాబిన్సన్ (3), గ్లెన్ ఫిలిప్స్ (1), మిషెల్ హై (0), జోష్ క్లార్క్సన్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 3, పతిరన, హసరంగ, నువాన్ తుషారా తలా రెండు వికెట్లు పడగొట్టారు.అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చరిత్ అసలంక (28 బంతుల్లో 35; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... కుశాల్ పెరీరా (23), కమిందు మెండిస్ (23), వనిందు హసరంగ (22) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకరీ ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య నేడు దంబుల్లాలోనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
కివీస్‌తో సిరీస్‌లకు లంక జట్ల ప్రకటన.. వాళ్లకు మరోసారి మొండిచేయి
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.వారికి మొండిచేయిఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.టీమిండియా, విండీస్లపై వరుస సిరీస్ విజయాలుకాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్. న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం
శ్రీలంక పర్యటనలో వెస్టిండీస్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పల్లెకెలె వేదికగా నిన్న (అక్టోబర్ 20) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. వర్షం అంతరాయల నడము సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకుంది.నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లంక లక్ష్యాన్ని 37 ఓవర్లలో 232 పరుగులుగా నిర్దారించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 74 (నాటౌట్), రోస్టన్ ఛేజ్ 33 (నాటౌట్), కీసీ కార్తీ 37 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ 2, వాండర్సే, అసలంక తలో వికెట్ పడగొట్టారు.ఛేదనలో శ్రీలంక 31.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బ్యాటర్లు నిషన్ మధుష్క (69), చరిత్ అసలంక (77) రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో కమిందు మెండిస్ (30 నాటౌట్) ధాటిగా ఆడాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ 3, అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక ఘనంగా బోణీ కొట్టింది. రెండో వన్డే అక్టోబర్ 23 పల్లెకెలె వేదికగానే జరుగనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్లు ఇవే
కొలంబో వేదికగా శ్రీలంక-భారత్ జట్లు రెండో వన్డేలో తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా దూరం కాగా.. పేసర్ షిరాజ్‌ను శ్రీలంక మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. వీరిద్దరి స్ధానాల్లో జెఫ్రీ వాండర్సే, కమిందు మెండీస్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. కాగా ఇదే వేదికలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టై గా ముగిసింది.తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
టీమిండియాతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి తమ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది. టీమిండియాతో టీ20 సిరీస్‌కు దూరమైన సదీర సమరవిక్రమ, కరుణరత్నే వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా కప్ 2023లో భారత్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరిరిచిన స్పిన్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగేకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.అయితే వన్డే సిరీస్‌కు సీనియర్ ఆల్‌రౌండర్లు దసున్ షనక, మథ్యూస్కు మాత్రం సెలక్టర్లు చోటివ్వలేదు. అదేవిధంగా టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ల దుష్మాంత చమీరా, నువాన్ తుషారా ఇప్పుడు వన్డేలకు కూడా దూరమయ్యారు. ఇక ఆగస్టు 2న కొలంబో వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, అసిత ఫెర్నాండో -
Ind vs SL: టీ20 సిరీస్ నుంచి లంక పేసర్ అవుట్!
టీమిండియాతో సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయపడ్డాడు. ఈ క్రమంలో భారత్‌తో టీ20 సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. శ్రీలంక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్ టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది.సిరీస్ మొత్తానికీమరోవైపు.. మంగళవారం తమ జట్టును ప్రకటించిన శ్రీలంక క్రికెట్‌కు చమీర గాయం రూపంలో షాక్ తగిలింది. చరిత్ అసలంక కెప్టెన్సీలోని జట్టులో భాగమైన దుష్మంత చమీర టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే, అనుభవజ్ఞుడైన ఈ రైటార్మ్ పేసర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్నది శ్రీలంక బోర్డు ఇంతవరకు ప్రకటించలేదు.గాయాల బెడదగత రెండేళ్లుగా దుష్మంత చమీర తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా చివరగా శ్రీలంక జట్టుకు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి స్థానం ఇచ్చినప్పటికీ.. తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు.అయితే, లంక ప్రీమియర్ లీగ్‌తో రీఎంట్రీ ఇచ్చిన చమీర క్యాండీ ఫాల్కన్స్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడాడు. తన చివరి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక 32 ఏళ్ల దుష్మంత చమీర ఇప్పటి వరకు 55 అంతర్జాతీయ టీ20లు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక ప్రకటించిన జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార, బినురా ఫెర్నాండో. -
భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన.. కొత్త కెప్టెన్ ఎంపిక
త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జులై 23) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో ఘోర ప్రదర్శన (తొలి రౌండ్లోనే నిష్క్రమణ) అనంతరం వనిందు హసరంగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.సీనియర్లు ధనంజయ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. మరో ఇద్దరు సీనియర్లు దినేశ్ చండీమల్, కుశాల్ జనిత్ పెరీరా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన అవిష్క ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. సదీర సమరవిక్రమ, దిల్షన్ మధుషంకలను పక్కకు పెట్టారు సెలెక్టర్లు.కాగా, శ్రీలంకతో టీ20 సిరీస్ ఈనెల 27 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక గడ్డపై అడుగుపెట్టింది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే మొదటి పరీక్ష. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్‌తో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో -
చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ చిత్తు
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(29 బంతుల్లో 5 ఫోర్లు, 46), అసలంక(21 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లు, 46) టాప్ స్కోరర్లగా నిలిచారు. వీరిద్దరితో పాటు దనుంజయ డిసిల్వా(30),మాథ్యూస్(30) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్‌బీక్ రెండు వికెట్లు పడగొట్టగా.. కింగ్మా, దత్, వాన్‌మీకరన్, ప్రింగిల్ తలా వికెట్ సాధించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 118 పరుగులకే కుప్పకలింది. ఫలితంగా శ్రీలంక 83 పరుగులతో జయభేరి మోగించింది. చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా శ్రీలంక ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్ -
నరాలు తెగే ఉత్కంఠ.. 3 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. సెల్హాట్ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టీ20లో 3 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. 207 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆఖరి వరకు పోరాడింది. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 12 పరుగుల అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మదుల్లా(54) పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో మాథ్యూస్, శనక, ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో సమరవిక్రమ(61), కుశాల్ మెండిస్(59) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖరిలో కెప్టెన్ అసలంక(21 బంతుల్లో 44 పరుగులు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, టాస్కిన్ ఆహ్మద్, రిషాద్ హుస్సేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 6న జరగనుంది. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెగా కమిన్స్ -
విధ్వంసం సృష్టించిన అసలంక.. రెచ్చిపోయిన కుశాల్, సమరవిక్రమ
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ చరిత్ అసలంక (21 బంతుల్లో 44 నాటౌట్; 6 సిక్సర్లు) అర డజను సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా.. కుశాల్ మెండిస్ (36 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (48 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (4), కమిందు మెండిస్ (19) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్, ఆతర్వాత వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
BAN vs SL: హసరంగాపై వేటు.. శ్రీలంక కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు లంక స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక మోకాలి గాయంతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో అవిష్క ఫెర్నాండోను సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా ఈ సిరీస్‌లో శ్రీలంక కెప్టెన్‌గా వనిందు హసరంగా ఎంపికైనప్పటికీ తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఐసీసీ స్పెన్షన్ కారణంగా అతడు తొలి రెండు మ్యాచ్‌లకు దూరం ఉండనున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఆఖరి టీ20లో అంపైర్‌పై బహిరంగంగా విమర్శించి నందున అతడు రెండు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంగ్లా సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు లంక కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ దృవీకరించింది. మార్చి 4న సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతం బంగ్లా పర్యటనలో లంక మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. శ్రీలంక జట్టు: వనిందు హసరంగా , చరిత్ అసలంక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, మహేశ్ తీక్షణ, అకిలా దనంజయ, మథీషా పతిరానా, నువాన్ తుషారా, బినారో ఫెర్నాండో, వాండర్సే, దిల్షాన్ మధుశంక చదవండి: BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల క్రికెటర్లు నలుగురు.. రింకూ, తిలక్ ఇంకా.. -
ఏంజెలో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకకు ఊహించని పరాభవం
కొలొంబో: పసికూన జింబాబ్వే.. తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 16) జరిగిన రెండో మ్యాచ్‌లో లంకేయులు ఓ మోస్తరు స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ (1.5-0-35-0) చివరి ఓవర్లో 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. లూక్ జాంగ్వే.. మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, బౌండరీ బాది జింబాబ్వేకు అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే 1-1తో సిరీస్‌ను సమం చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలువగా.. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక, మాథ్యూస్ మినహా అంతా విఫలమయ్యారు. నిస్సంక 1, కుశాల్ మెండిస్ 4, కుశాల్ పెరీరా 0, సమరవిక్రమ 16, షనక 9 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నగరవ, మసకద్జ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆఖరి ఓవర్లో జాంగ్వే మెరుపులు (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అంతకుముందు క్రెయిగ్ ఎర్విన్ (70) జింబాబ్వే ఇన్నింగ్స్‌కు పునాది వేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సికందర్ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఆఖర్లో జాంగ్వే.. క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హసరంగ భారీ పరుగులు (4 ఓవర్లలో 41) సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. -
చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్!? వైరల్
Asia Cup 2023- Sri Lanka Eliminate Pakistan: వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్ చేరాలన్న పాకిస్తాన్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో పాక్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక సేన.. ఈసారి ఆ జట్టును కనీసం ఫైనల్ కూడా చేరవనివ్వలేదు. సొంతగడ్డపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి.. కొలంబోలో బాబర్ ఆజం బృందంపై పైచేయి సాధించింది. టీమిండియాతో పాటు తుదిపోరుకు అర్హత సాధించింది. అఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో మొత్తంగా 12 సార్లు(11 వన్డే, ఒక టీ20) ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. కాగా ఈ వన్డే టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంక వేదికగా పాకిస్తాన్ అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో అఫ్గన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది పాకిస్తాన్. నేపాల్‌పై ఘన విజయం.. భారత్ చేతిలో ఘోర పరాభవం ఇక ముల్తాన్ వేదికగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 238 పరుగులతో గెలుపొంది అన్ని శుభసూచకాలే అని మురిసిపోయింది. అయితే, లీగ్ దశలో టీమిండియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. సూపర్-4లో బంగ్లాదేశ్‌పై గెలిచినా.. భారత జట్టులో చేతిలో భారీ ఓటమి పాక్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. కీలక ఆటగాళ్లు దూరమైనా ఆఖరి వరకు ఈ క్రమంలో ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శక్తిమేర ప్రయత్నించింది. కీలక పేసర్లు హ్యారిస్ రవూఫ్, నసీం షా జట్టుకు దూరమైనా.. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగింది. ప్చ్.. ఎంతగా పోరాడినా ఫలితం లేదు అయితే, వరణుడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. లంక ఆల్‌రౌండర్ చరిత్ అసలంక ఏమాత్రం తడ‘బ్యా’టుకు లోనుకాలేదు. గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో సరిగ్గా 2 రన్స్ తీసి లంకను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. ఐసీసీ వన్డే నంబర్ 1 బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాబర్‌కు ఇది అలవాటే! బాబర్ ఆజం సారథ్యంలో పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2021లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. గతేడాది ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి సూపర్-4 దశలోనే ఆసియా కప్ ప్రయాణాన్ని ముగించింది. దీంతో కీలక టోర్నీల్లో బాబర్ జట్టును గెలిపించలేడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం I have seen Babar Azam cry for the first time.💔😢 Don't be sad, @babarazam258. You're the No 1 team and No 1 Batsman in the world...... Always #BehindYouSkipper#PAKvsSL #captaincy #PakistanCricket pic.twitter.com/a91w5oQgj9 — King 👑Babar Azam 56❤️ (@fizza258) September 14, 2023 Look at the reaction of babar azam after last ball 😭💔#AsiaCup2023 pic.twitter.com/cate2stPgp — Shehzad Ahmad (@CEShehzad123) September 14, 2023 Babar Azam in Asia cup 2023 without Nepal inning. Matches: 3 Runs : 56 Average : 18.6 Strike rate : 35 And believe me guys he is no.1 ranked ICC ODI batter. Even Akash Chopra is better than him.#PakistanCricket #BabarAzam pic.twitter.com/Y9ge2bb6D2 — Kohlified. (@123perthclassic) September 14, 2023 You can see how hard Babar Azam is trying to hold back his tears 💔#PAKvSL | #PAKvsSL #SLvsPak #SLvPAK #PakvsSri #AsiaCup2023 #AsiaCup23 #AsiaCup #PakistanCricket #colomboweather #Cricket #CricketTwitter #Pakistan #PakistanCricket #PakistanZindabad pic.twitter.com/Vkvpvx5jnh — Babar Adeel Hussain (@AdeelHuss1) September 14, 2023 -
మేము పాకిస్తాన్‌కు ఛాన్స్ ఇచ్చాం.. కానీ మా వాడు అదరగొట్టాడు: షనక
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్‌కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు. టీమిండియాతో మ్యాచ్‌లో తప్పిదాలు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్‌లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అదరగొట్టిన కుశాల్, సదీర ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్‌తో లంక గెలుపునకు బాటలు వేశారు. అసలంక ఆదుకున్నాడు అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్‌లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్‌కు చేరింది. గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో ఇక ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది. చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్ మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
నిన్న అద్భుత శతకం.. ఇప్పుడు మరీ ఘోరంగా! 71- 77 దాకా ఇదే తీరు!
Asia Cup, 2023 - India vs Sri Lanka- Virat Kohli: శ్రీలంకలో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. ఆసియా కప్-2023 సూపర్-4 దశలో భాగంగా కొలంబోలో జరుగుతున్న మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. దసున్ షనకు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. అదే బలహీనత.. కాగా 2021 నుంచి ఇప్పటి వరకు లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌లో కోహ్లి 159 బంతులు ఎదుర్కొని సగటు 13తో 104 పరుగులు సాధించాడు. ఎనిమిదిసార్లు పెవిలియన్ చేరాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా లెఫ్టార్మ్ స్సిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లికి ఉన్న ఈ బలహీనత మరోసారి బయటపడింది. నిన్న సెంచరీ.. ఈరోజు ఇలా దారుణంగా ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు రుచించడం లేదు. ‘‘నిన్న సెంచరీ.. ఈరోజు ఇలా! ఏంటిది కోహ్లి! ఇలాగేనా ఆడేది? 20 ఏళ్ల యువ బౌలర్ చేతిలో నువ్వు అవుటైన తీరు నీ స్థాయికి ఏమాత్రం తగదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే బ్యాట్ ఝులిపిస్తావా ఏంటి?’’ అని ట్రోల్ చేస్తున్నారు. 71- 77వ సెంచరీ దాకా.. శతకం బాదిన తదుపరి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ మాత్రమే స్కోరు చేయడం కోహ్లికి అలవాటని ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ కాగా సూపర్-4లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా వింటేజ్ కోహ్లిని గుర్తు చేస్తూ కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో వీర విహారం చేసిన కింగ్.. 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో 77వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, 15 గంటలు తిరిగే లోపే శ్రీలంకతో ఆరంభమైన మ్యాచ్‌లో మాత్రం కోహ్లి విఫలమయ్యాడు. అదే సమయంలో పాకిస్తాన్ మీద కోహ్లితో పాటు అజేయ సెంచరీ(111)తో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు తిప్పేసిన వెల్లలగే, అసలంక ఇక వర్షం మొదలయ్యే సమయానికి టీమిండియా 47 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 53 పరుగులు సాధించాడు. ఇక లంక స్పిన్నర్ దునిత్ వెల్లలగేకు అత్యధికంగా 5 వికెట్లు దక్కగా.. ఆఫ్‌బ్రేక్ స్పిన్ బౌలర్ చరిత్ అసలంక 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ప్రచండులైన పాక్ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు! Virat Kohli's score after 71st century - 2(7) 72th century - 1(5) 73rd century - 4(9) 74th century - 4(9) 75th century - 4(9) 76th century - 4(7) 77th century - 3(12) — Rajkumar (@khannachinna) September 12, 2023 Kohli got over cautious.. !! Every time he gets out when he does that. — Satyam (@Puchuu17) September 12, 2023 Kohli vs left arm spin..never ending story 🤦🏻♂️#INDvsSL — igneel🀄️ (@Rakesh_1327) September 12, 2023 Rohit Sharma Wicket.... The ball Kept Very Low👀👀... Was Looking In Good Form Today... #INDvsSL #SLvIND #AsiaCup2023 #CricketTwitter #INDvPAK #ViratKohli𓃵 #KLRahul #RohitSharma𓃵 #Kuldeep #IshanKishan #IndianCricketTeam#ShubmanGill #Hitman #ODIs pic.twitter.com/3SEOFrhZMq — Anshu Sharma (@Ash10cric) September 12, 2023 FIFTY UP! 👏🏻😍 Back to back half centuries for #TeaIndia skipper, @ImRo45! Will he notch up his 31st 💯 today? 👀 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/N9eImshbuf — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc — ICC (@ICC) September 12, 2023 -
ప్రచండులైన పాక్ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు..!
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. ఈ అనామక బౌలర్ టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేసి, జట్టు భారీ స్కోర్ సాధించకుండా నియంత్రించాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. స్లో ట్రాక్‌పై లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన వెల్లలగే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇతను సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్కి వికెట్లు సమర్పించుకున్నారు. వీరిలో రోహిత్, గిల్ క్లీన్‌బౌల్డ్‌లు కాగా.. కోహ్లి షనకకు, హార్దిక్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు. కేఎల్ రాహుల్‌ను అయితే వెల్లలగేనే క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. లంక క్రికెట్‌కు మరో మిస్టరీ స్పిన్నర్ దొరికాడని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దుర్భేద్యమైన భారత టాపార్డర్‌ను నియంత్రించడం ప్రచండులైన పాక్ బౌలర్ల వల్లనే కాలేదు, 20 ఏళ్ల కుర్రాడు భారత టాపార్డర్‌కు ముచ్చెమటలు పట్టించాడని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానిని వెల్లలగే మాయలో పడి టీమిండియా నామమాత్రపు స్కోర్ చేసేందుకు కూడా అష్టకష్టాలు పడుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. దునిత్ వెల్లలగే (10-1-40-5) మాయాజాలం ధాటికి 41 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెల్లలగేకు తోడుగా చరిత్ అసలంక (6-0-14-2) కూడా రాణించడంతో భారత్ 200 పరుగుల మార్కును చేరేందుకు కూడా చమటోడుస్తుంది. రోహిత్ శర్మ (53) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4) నిరాశపరిచారు. Dunith Wellalage 3wkts#Kohli #RohitSharma #shubmangill #INDvsSL pic.twitter.com/Oh1z6VzlYt — Jokes Master (@JokesMasterpk) September 12, 2023 -
ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోరులో శ్రీలంక జట్టుకు ఎదురులేకుండా పోయింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. నాలుగింటికి నాలుగ విజయాలు సాధించిన లంక 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను దాదాపు ఖరారు చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 85 బంతుల్లో 75 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. వీరిద్దరు మినహా మిగతావారిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వాట్ మూడు, క్రిస్ సోల్ రెండు, ఎవన్స్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి స్కాట్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రిస్ గ్రీవ్స్ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో స్కాట్లాండ్ 29 ఓవర్లలోనే 163 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో రాణించగా.. హసరంగా రెండు, కాసున్ రజిత, లాహిరు కుమారా, దాసున్ షనకలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే గ్రూప్-బి నుంచి లంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే లీగ్స్టేజీ సహా సూపర్ సిక్స్‌లో సాధించే పాయింట్ల ఆధారంగా ఒక జట్టు మాత్రమే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ విషయంలో లంక గ్రూప్-బి నుంచి ముందు వరుసలో ఉంది. Sri Lanka bag two crucial points against Scotland going into the Super Six stage of the #CWC23 Qualifier 👏#SLvSCO: https://t.co/FCKWkeNT75 pic.twitter.com/RUq8S7nR7l — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 Spinning a web 🕸️ For his figures of 3/41, Maheesh Theekshana is the @aramco #POTM from #SLvSCO 🙌 #CWC23 pic.twitter.com/tjbIXmvjsS — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 చదవండి: ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
పసికూనపై లంక బ్యాటర్ల ప్రతాపం.. భారీ స్కోర్, టాప్-4 బ్యాటర్లు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఇవాళ గ్రూప్-బి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బులవాయో వేదికగా జరిగిన ఇవాల్టి తొలి మ్యాచ్‌లో యూఏఈ జట్టు శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి యూఏఈ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్లంతా (నిస్సంక (57), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (73)) హాఫ్ సెంచరీలు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు చరిత్ అసలంక (23 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆఖర్లో హసరంగ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) కూడా ఓ చేయి వేయడంతో శ్రీలంక ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షనక (1), ధనంజయ డిసిల్వ (5) మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో అలీ నసీర్ 2 వికెట్లు పడగొట్టగా.. రోహన్ ముస్తఫా, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో 2 బెర్తుల కోసం విండీస్, శ్రీలంక, జింబాబ్వే సహా మొత్తం 10 జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విన్నర్, రన్నరప్‌లు భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్లతో వన్డే వరల్డ్‌కప్-2023లో పోటీపడతాయి. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్, వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం
SL VS AFG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటలో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, తమ కంటే పటిష్టమైన లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆది నుంచే అద్భుతంగా ఆడి, మరో 19 బంతులుండగానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించి, ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని ఖరారు చేశారు. ఆఖర్లో కెప్టెన్ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్ నబీ (27 నాటౌట్) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున ఇరగదీసిన పేసర్ మతీష పతిరణ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టిన పతిరణ.. 8.5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహీరు కుమార ఓ వికెట్ దక్కించుకున్నారు. పతిరణతో పాటు అరంగేట్రం చేసిన స్పిన్నర్ దుషన్ హేమంత (9-0-50-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 46.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..! -
SL VS AFG 1st ODI: రాణించిన అసలంక, డిసిల్వ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 2) తొలి వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున సత్తా చాటిన మతీష పతిరణ.. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పతిరణతో పాటు లెగ్ బ్రేక్ బౌలర్ దుషన్ హేమంత కూడా ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్, ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను సమస్య కారణంగా లంకతో సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉండగా.. ఐపీఎల్ సహచర ఆటగాడు (గుజరాత్ టైటాన్స్) నూర్ అహ్మద్ నేటి మ్యాచ్ బరిలో నిలిచాడు. ఐపీఎల్ సెంటర్ పాయింట్ అయిన మరో ఆఫ్ఘన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో పాల్గొంటున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. -
పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్లో
ఆక్లాండ్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 థ్రిల్లర్ సినిమాను తలపించింది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా విజయం శ్రీలంకనే వరించింది. 197 విజయ లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌ను వేసే బాధ్యత లంక కెప్టెన్ స్పిన్నర్ తీక్షణకు అప్పజెప్పాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక 9 పరుగుల లక్క్ష్యంతో దిగిన శ్రీలంక.. మూడు బంతుల్లోనే ఛేదించింది. లంక బ్యాటర్ అసలంక సిక్స్, ఫోర్‌తో మ్యాచ్ ఫినిస్ చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అసలంక, పెరీరా సూపర్ ఇన్నింగ్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(45 బంతుల్లో 53), అసలంక(41 బంతుల్లో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 197 పరుగుల లక్క్ష్య చేధనలో కివీస్ కూడా ధీటుగా బదులిచ్చింది. డారిల్ మిచెల్(66), ఆఖరిలో సోధి(4 బంతుల్లో 10 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ మ్యాచ్‌ను టైగా ముగించింది. అయితే సూపర్ ఓవర్లో మాత్రం విజయం లంకవైపే నిలిచింది. ఇక ఈ ఏడాది కివీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి లంక బదులు తీర్చుకున్నట్లైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డునెడిన్ వేదికగా ఏప్రిల్ 5న జరగనుంది. చదవండి: భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మృతి -
ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు స్టార్ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే..
Sri Lanka vs Afghanistan ODI Series: శ్రీలంక యువ ఆటగాళ్లు చరిత్ అసలంక, కసున్ రజిత, పాతుమ్ నిసాంక అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. ఈ ముగ్గురూ ఒకేరోజు వివాహ బంధంలో అడుగుపెట్టారు. కొలంబోలోని వేర్వేరు వేదికల్లో సోమవారం తమ పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు. కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా అఫ్గనిస్తాన్‌తో శ్రీలంక ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య లంక ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ఈ క్రమంలో బుధవారం నాటి ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని దసున్ షనక సేన భావిస్తోంది. కాగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో అసలంక, నిసాంక, రజిత ఆడటం విశేషం. ఆ మరుసటి రోజే ఇలా ఈ ముగ్గురూ తమ ప్రియురాళ్ల వేలికి ఉంగరం తొడిగి వైవాహిక బంధాన్ని మొదలుపెట్టడం గమనార్హం. ఇక జట్టులో కీలక సభ్యులైన అసలంక, నిసాంక, రజిత.. పల్లెకెలోలో జరుగనున్న మూడో వన్డేలోనూ జట్టులో ఆడే అవకాశం ఉంది. బ్యాటర్, ఆల్‌రౌండర్, బౌలర్! 24 ఏళ్ల పాతుమ్ నిసాంక లంక ఓపెనర్‌గా రాణిస్తుండగా.. 25 ఏళ్ల చరిత్ అసలంక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇక 29 ఏళ్ల కసున్ రజిత పేస్ దళంలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు పెళ్లి బంధంలో అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఈ మూడు జంటల పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్ Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022 -
శతక్కొట్టిన అసలంక.. అయినా తక్కువ స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 3 వన్డేల్లో వరుసగా రెండు వన్డేల్లో గెలుపొంది ఆధిక్యంలో కొనసాగుతున్న (2-1) ఆ జట్టు తాజాగా జరుగుతున్న నాలుగో వన్డేలోనూ మెరుగైన ప్రదర్శన చేసి మరో విజయం దిశగా అడుగులు వేస్తుంది. కొలొంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకంతో రాణించినప్పటికీ 258 పరుగులకే పరిమితమైంది. 𝑾𝑯𝑨𝑻. 𝑨. 𝑲𝑵𝑶𝑪𝑲 🔥 A maiden international century for Charith Asalanka! Well played 👏 Watch the #SLvAUS series on https://t.co/WngPr0Ns1J (in select regions) 📺 📝 Scorecard: https://t.co/KsvSxzgG3U pic.twitter.com/a36jglPTSB — ICC (@ICC) June 21, 2022 Sri Lanka post a total of 258 on the board. Will the bowlers defend this total?#SLvAUS pic.twitter.com/dJDhSlsIjx — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2022 అసలంకకు ధనంజయ డిసిల్వ (60) మినహా ఎవరూ సహకరించకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో కున్హేమన్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో 2 వికెట్లు, మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టగా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు రనౌటయ్యారు. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (70) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక శ్రీలంక విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుని సంచలనం సృష్టిస్తుంది. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. చదవండి: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సిరీస్ ఆస్ట్రేలియాదే!
Australia tour of Sri Lanka, 2022- కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అసలంక (39), కుశాల్ మెండిస్ (36) రాణించారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 26 బంతులు ఎదుర్కొని 26 పరుగులు సాధించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక.. టాపార్డర్ విఫలం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని బౌలర్లను కొనియాడాడు. శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారన్న ఫించ్.. మాథ్యూ వేడ్ అనుభవం జట్టును విజయాలకు చేర్చడంలో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ చేజార్చుకున్న లంక రాత స్వదేశంలోనైనా మారుతుందనుకుంటే అలా జరుగలేదు. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే పర్యాటక ఆసీస్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ జూన్ 11న పల్లెకెలెలో జరుగుతుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు!