
శ్రీలంక పర్యటనలో వెస్టిండీస్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పల్లెకెలె వేదికగా నిన్న (అక్టోబర్ 20) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. వర్షం అంతరాయల నడము సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకుంది.
నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లంక లక్ష్యాన్ని 37 ఓవర్లలో 232 పరుగులుగా నిర్దారించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 74 (నాటౌట్), రోస్టన్ ఛేజ్ 33 (నాటౌట్), కీసీ కార్తీ 37 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ 2, వాండర్సే, అసలంక తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో శ్రీలంక 31.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బ్యాటర్లు నిషన్ మధుష్క (69), చరిత్ అసలంక (77) రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో కమిందు మెండిస్ (30 నాటౌట్) ధాటిగా ఆడాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ 3, అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక ఘనంగా బోణీ కొట్టింది. రెండో వన్డే అక్టోబర్ 23 పల్లెకెలె వేదికగానే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment