
న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.
బ్రాస్‌వెల్ (27), జాకరీ ఫోల్క్స్ (27 నాటౌట్) మినహా తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. టిమ్ రాబిన్‌సన్ (3), గ్లెన్ ఫిలిప్స్ (1), మిషెల్ హై (0), జోష్ క్లార్క్‌సన్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 3, పతిరన, హసరంగ, నువాన్ తుషారా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చరిత్ అసలంక (28 బంతుల్లో 35; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... కుశాల్ పెరీరా (23), కమిందు మెండిస్ (23), వనిందు హసరంగ (22) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకరీ ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య నేడు దంబుల్లాలోనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు