కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్‌ అతడే! | Kohli Picks Best T20 Opener Snubs Sachin Tendulkar-Rohit Sharma | Sakshi
Sakshi News home page

కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్‌ అతడే!

Mar 15 2026 8:13 PM | Updated on Mar 15 2026 8:22 PM

Kohli Picks Best T20 Opener Snubs Sachin Tendulkar-Rohit Sharma

విరాట్‌ కోహ్లీ (Courtesy: IPL 2025)

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్‌లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్‌ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు. 

తాజాగా కోహ్లీ తన బెస్ట్‌ టీ20 ఓపెనర్‌గా విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్‌ టీ20 ఓపెనర్‌గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్‌ కోహ్లీని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రశ్న వేసింది. 

అయితే మొదట సచిన్‌, సెహ్వాగ్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్‌ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్‌’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్‌ చాయిస్‌లో రోహిత్‌ శర్మ, క్రిస్‌ గేల్‌ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్‌ను కాదని ఆర్‌సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్‌కే ఓటేశాడు. 

రోహిత్‌, సెహ్వాగ్‌ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్‌గా గేల్‌ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలవాలన్న కోరిక గేల్‌లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్‌ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్‌ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. 

ఇక గతేడాది ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌ల్లో 132 స్ట్రైక్‌రేట్‌ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్‌ సెంచరీలున్నాయి. 2025 సీజన్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్‌ కింగ్స్‌పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది.

చదవండి: ‘అభిషేక్‌ను అందుకే వెనుకేసుకొచ్చా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement