టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(29 బంతుల్లో 5 ఫోర్లు, 46), అసలంక(21 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లు, 46) టాప్ స్కోరర్లగా నిలిచారు. వీరిద్దరితో పాటు దనుంజయ డిసిల్వా(30),మాథ్యూస్(30) పరుగులతో రాణించారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్‌బీక్ రెండు వికెట్లు పడగొట్టగా.. కింగ్‌మా, దత్, వాన్‌మీకరన్, ప్రింగిల్ తలా వికెట్ సాధించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 118 పరుగులకే కుప్పకలింది. ఫలితంగా శ్రీలంక 83 పరుగులతో జయభేరి మోగించింది.
చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా శ్రీలంక ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్
Comments
Please login to add a commentAdd a comment