స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌తో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్.. శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి డిప్యూటీగా మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు.
ఈ జట్టులో అతడికి చోటు దక్కింది. కాగా ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 మధ్యలోనే తప్పుకున్న మాజీ కెప్టెన్ దసున్ షనక కూడి జింబాబ్వే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
కాగా తొలుత ఈ సిరీస్‌కు 21 మంది సభ్యుల ప్రిలిమనరీ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇప్పుడు 17 మంది పేర్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలెక్షన్ కమిటీ ఖారారు చేసింది. జనవరి 6న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో, దసున్ షనక, జనిత్ లియానాగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, ప్రమోద్ చమీర, వాండర్సే, అకిల దనంజయ, వనిందు హసరంగా (ఫిట్‌నెస్‌కు లోబడి).
చదవండి: #Saim Ayub: బ్యాటింగ్‌లో విఫలం.. ఈజీ క్యాచ్ వదిలేశాడు.. బాబర్ రియాక్షన్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment