గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. తమ తొలి ఇన్నింగ్స్‌ను 704/3 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 212 పరుగుల అదధిక్యంలో నిలిచింది. కుశాల్ మెండిస్, నిషాన్ మదుష్కా డబుల్ సెంచరీలతో చెలరేగారు. 339 బంతుల్లో మదుష్కా 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 205 పరుగులు చేయగా.. మెండిస్ 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో కేవలం 291 బంతుల్లోనే 245 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం విశేషం.
వీరిద్దరితో పాటు మాథ్యూస్(101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ అరుదైన రికార్డు సాధించాడు.సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే(374) తొలి స్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య(340),కుమార సంగక్కర(287) వరుసగా రెండు మాడు స్ధానాల్లో నిలిచారు.
చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్
అదే విధంగా మరో రికార్డును కూడా మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుశాల్ 11 సిక్స్‌లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు.
చదవండి: IPL 2023: మద్యం మత్తులో మహిళతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అనుచిత ప్రవర్తన..!
Comments
Please login to add a commentAdd a comment