kumara sangakara
-
రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లండ్‌కు సంగక్కర..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌తో బేరసారాలన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుత హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఎంపికకు వేగంగా పావులు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాట్ పాట్స్ గత నెలలో తన పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంగక్కరతో భర్తీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈసీబీ నుంచి కానీ సంగక్కర నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తెర వెనుక పావులు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ సంగక్కరతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్లకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోధిక్ను నియమించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లు ముగిసిన అనంతరం పర్మెనెంట్ కోచ్‌గా సంగక్కర నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈసీబీతో లైన్ క్లియెర్ కాగానే సంగక్కర రాయల్స్‌తో తెగదెంపులు చేసుకోవచ్చు. సంగక్కర రాయల్స్‌తో నాలుగేళ్ల పాటు కొనసాగాడు. మరోవైపు ద్రవిడ్‌కు సైతం రాయల్స్ పాత బంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో అతను రాయల్స్ కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుబంధం కారణంగా రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
డబుల్ సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండీస్.. 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో
గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. తమ తొలి ఇన్నింగ్స్‌ను 704/3 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 212 పరుగుల అదధిక్యంలో నిలిచింది. కుశాల్ మెండిస్, నిషాన్ మదుష్కా డబుల్ సెంచరీలతో చెలరేగారు. 339 బంతుల్లో మదుష్కా 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 205 పరుగులు చేయగా.. మెండిస్ 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో కేవలం 291 బంతుల్లోనే 245 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరితో పాటు మాథ్యూస్(101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ అరుదైన రికార్డు సాధించాడు.సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే(374) తొలి స్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య(340),కుమార సంగక్కర(287) వరుసగా రెండు మాడు స్ధానాల్లో నిలిచారు. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ అదే విధంగా మరో రికార్డును కూడా మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుశాల్ 11 సిక్స్‌లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. చదవండి: IPL 2023: మద్యం మత్తులో మహిళతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అనుచిత ప్రవర్తన..! -
నో బాల్ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఎమన్నాడంటే..?
ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో నెలకొన్న నోబాల్ వివాదం ప్రస్తుత చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహరించిన తీరుపై కొంత మంది మాజీ ఆటగాళ్లు విమర్శలు కురిపిస్తుండగా.. మరి కొంత మంది పంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఈ వివాదంపై తాజాగా రాజస్తాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార సంగక్కర స్పందించాడు. ఏదైన మ్యాచ్‌లో తుది నిర్ణయం తీసుకునే హక్కు కేవలం అంపైర్లకు మాత్రమే ఉంటుందని సంగక్కర తెలిపాడు. "ఏ మ్యాచ్‌లోనైనా అంపైర్లే ఆటను కంట్రోల్ చేస్తారని నా అభిప్రాయం. ఐపీఎల్లో తీవ్ర ఒత్తిడి, ఉత్కంఠ ఎప్పడూ ఉంటుంది. ఆట సజావుగా జరిగేలా చూసే పూర్తి బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కాబట్టి అంపైర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్న మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఫీల్ఢ్లో అంపైర్ల పని చాలా కఠినంగా ఉంటుంది. సహాయక సిబ్బందిగా మా పని.. ఆటగాళ్లకు ముందే నియమ నిభంధనలు గురించి సృష్టంగా తెలియజేయాలి" అని సంగక్కర పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'ముంబై జట్టులో విభేదాలు.. అందుకే ఈ ఓటములు' -
రాజస్తాన్ స్టార్ ఆటగాడిపై ఆ జట్టు కోచ్ కీలక వాఖ్యలు..
Kumar Sangakkara Comments On Chris Morris: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపై రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార సంగర్కర స్పందించాడు. బౌలర్ల వైఫల్యంపై అతడు ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ బౌలింగ్ పేలవ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా ఆర్సీబీతో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(58), యశస్వి జైస్వాల్(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరును కట్టడి చేయలేక పేలవ బౌలింగ్ ప్రదర్శనతో రాజస్తాన్ చతికిలపడింది. ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. మ్యాచ్ అనంతరం విలేఖరల సమావేశంలో అతడు మాట్లాడుతూ.. " ఐపీఎల్ 2021 మెదటి దశలో క్రిస్ మోరిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ సెకండ్ ఫేజ్‌లో మేము ఆశించింనంతగా బౌలింగ్ చేయలేదు. అది అతడికి కూడా తెలుసు. ఎందుకంటే తన 4 ఓవర్ల కోటాలో 50 పరుగుల ఇచ్చాడు. అతడు చాలా సమయాల్లో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. తదుపరి మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో తిరిగి ఫామ్ కనబరుస్తాడని భావిస్తున్నాను''అని సంగర్కర పేర్కొన్నాడు. చదవండి: Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి -
కోహ్లిలా మ్యాచ్‌లు ముగించాలనుంది
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు ఆటగాళ్లతో ఏ రకమైన పోలికలు కూడా తనకు ఇష్టం లేదని మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడతానని ఆమె చెప్పింది. అయితే జట్టుకు విజయాలు అందించే విషయంలో మాత్రం స్ఫూర్తి పొందడంలో తప్పు లేదని స్మృతి అభిప్రాయ పడింది. అందుకే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తరహాలో మ్యాచ్‌లు గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పింది. ‘మహిళల టీమ్ కోహ్లి అనిపించుకోవడంకంటే భారత మహిళల జట్టు సభ్యురాలు స్మృతి మంధాన అనిపించుకోవడమే నాకు ఇష్టం. అతను జట్టును గెలిపించేందుకు ఎలా ఆడతాడనేది మాత్రం నేను చూస్తాను. దానినుంచి స్ఫూర్తి పొందుతాను. అదే తరహాలో మ్యాచ్ గెలిచే వరకు పట్టుదలగా నిలబడాలని కోరుకుంటా. కోహ్లి నిలకడైన బ్యాటింగ్ నాకే కాదు అందరికీ ఆదర్శం’ అని మంధాన వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సాంగ్లీవంటి చిన్న ప్రాంతంనుంచి వచ్చి భారత క్రికెటర్‌గా ఎదగడాన్ని తాను గర్వంగా భావిస్తానని ఆమె చెప్పింది. తాను క్రికెటర్ కావాలని తల్లిదండ్రులు ఎంతో కోరుకొని అండగా నిలిచారని... సోదరుడు శ్రవణ్ సహకారంతో బ్యాట్ పట్టి ఆటలోకి ప్రవేశించినట్లు స్మృతి గుర్తు చేసుకుంది. సంగక్కర అంటే ఇష్టం... ఆరేళ్ల కెరీర్లో తాను ఎంతో నేర్చుకున్నానని ఈ భారత ఎడమ చేతి వాటం ఓపెనర్ వెల్లడించింది. సీనియర్ స్థాయిలో మహారాష్ట్ర తరఫున ఆడి సెంచరీ సాధించిన రోజున తన భవిష్యత్‌పై నమ్మకం కుదిరిందన్న స్మృతి... సుదీర్ఘ కాలం భారత జట్టు తరఫున ఆడాలనేదే కోరికని స్పష్టం చేసింది. ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర శైలిని అనుసరించానని చెప్పింది. ‘ఆయన బ్యాటింగ్ నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ కవర్ డ్రైవ్‌లు అద్భుతంగా ఉంటాయి. పైగా ఎడమ చేతివాటం కూడా కాబట్టి సంగక్కరను అనుకరించే ప్రయత్నం కూడా చేశాను’ అంటూ తన అభిమానాన్ని ప్రదర్శించింది. ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి రాక ముందు ‘ నా చెల్లెలి కోసం’ అంటూ రాహుల్ ద్రవిడ్ వద్ద తన సోదరుడు ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ప్రయత్నించాడని... ఆయన తన సంతకం చేసి మరీ ఒక బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారని స్మృతి మధుర స్మృతులు పంచుకుంది. దానిని ముందుగా జ్ఞాపికగా ఉంచుకోవాలని భావించినా... ఆ తర్వాత పలు మ్యాచ్‌లలో దాంతోనే బ్యాటింగ్‌కు దిగినట్లు మంధాన వెల్లడించింది. మైదానంలో దిగేందుకు సిద్ధం... కరోనా కారణంగా సుదీర్ఘ కాలం ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని, అయితే దాని గురించి ఎప్పుడూ చింతించలేదని స్మృతి చెప్పింది. గతంలో రెండు వారాలకు మించి ఇంట్లో లేనని, ఇప్పుడు కుటుంబసభ్యులతో గడిపే అవకాశం రావడం మంచిదేనంది. అయితే సాధ్యమైనంత త్వరగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఉమెన్ టి20 చాలెంజర్ కోసం ఎదురు చూస్తున్నానంది. తాను సినిమాలు ఎక్కువగా చూడనన్న స్మృతి... కొన్ని మూఢ నమ్మకాలు మాత్రం ఉన్నాయని చెప్పింది. పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను పోల్చడాన్ని తప్పుపట్టింది. ఫెడరర్ ఆటను ఇష్టపడేవాళ్లు, సెరెనా విలియమ్స్ ఆటను ఇష్టపడేవాళ్లు వేర్వేరుగా ఉంటారని, అందరికీ అన్ని నచ్చాలని ఏమీ లేదని మంధాన అభిప్రాయ పడింది. -
అంతర్జాతీయ టి20లకు సంగక్కర గుడ్‌బై
ప్రపంచకప్ తర్వాత కొలంబో: ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర తెలిపాడు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీయే ఈ ఫార్మాట్లో తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అని సంగక్కర ప్రకటించాడు. అయితే ఐపీఎల్ వంటి లీగ్‌లలో మాత్రం టి20ల్లో ఆడతానని, వన్డేల్లో కనీసం వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ దాకా కొనసాగుతానని 36 ఏళ్ల సంగక్కర వెల్లడించాడు. ఇప్పటిదాకా 50 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన సంగక్కర.. 32.77 సగటు, 120 స్ట్రైక్ రేట్‌తో 1311 పరుగులు సాధించాడు. వరుసగా ఐదు టి20 ప్రపంచకప్‌లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన ఈ మాజీ కెప్టెన్.. తమ జట్టు గత పొరపాట్లను ఈసారి పునరావృతం చేయబోదన్నాడు. 2009, 2012 ప్రపంచకప్‌లలో లంక ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే. -
లంక చేతిలో ఓడిన భారత్
-
వదిలేశారు...
లంక చేతిలో ఓడిన భారత్ సంగక్కర సూపర్ సెంచరీ ధావన్ శ్రమ వృథా ఆసియాకప్ ఆసియాకప్‌లో నేడు బంగ్లాదేశ్ x అఫ్ఘానిస్థాన్ మ. గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం చూడటానికి ఓ మాదిరి స్కోరే అయినా... భారత్‌కు మ్యాచ్ గెలిచే అవకాశాలు వచ్చాయి. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించినా.. మైదానంలో ఫీల్డింగ్ వైఫల్యం కొంప ముంచింది. క్యాచ్‌లు వదిలేయడంతో పాటు సంగక్కరను స్టంపౌట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కార్తీక్ వృథా చేయడంతో భారత్ మ్యాచ్‌ను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న లంక ఆసియాకప్ ఫైనల్‌కు చేరువైంది. ఫతుల్లా: భారత్, లంక మ్యాచ్ అంటే అందరూ కోహ్లి,మలింగల మధ్య పోరుగానే భావించారు. కానీ సీనియర్ ఆటగాడు సంగక్కరను, లంక జట్టులోని స్పిన్నర్లును మరచిపోయారు. ఈ ఏడాది తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సంగక్కర (84 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ సెంచరీతో ఆసియాకప్‌లో లంకను ఫైనల్‌కు చేరువ చేశాడు. అన్ని రంగాల్లో విఫలమై ఓటమిపాలైన భారత్... పాక్, అఫ్ఘానిస్థాన్‌లతో జరగబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన సంకట స్థితిలో పడింది. ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక రెండు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ధావన్ (114 బంతుల్లో 94; 7 ఫోర్లు, 1 సిక్సర్) కొద్దిలో సెంచరీ కోల్పోగా... కోహ్లి (51 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. లంక స్పిన్ ద్వయం మెండిస్, సేనానాయకే కలిసి ఏడు వికెట్లు తీసి భారత్ భారీ స్కోరు చేయకుండా నియంత్రించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (81 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం పాక్‌తో తలపడుతుంది. శ్రీలంకతో మ్యాచ్‌ను భారత్ ‘చేజేతులా’ పోగొట్టుకుంది. సాధారణ లక్ష్యాన్ని ఛేదిస్తూ కొన్ని సార్లు లంక తడబాటుకు లోనైనా...చివరకు విజయం వారి పక్షానే నిలిచింది. భారత ఫీల్డింగ్ వైఫల్యాలే అందుకు కారణం. చెత్త ఫీల్డింగ్, సునాయాస క్యాచ్‌లు జారవిడిచి లంక బ్యాట్స్‌మెన్‌కు మన ఆటగాళ్లు అవకాశం ఇచ్చారు. ఒత్తిడి మధ్య ఆడుతున్న ఆ జట్టును కోలుకునేలా చేశారు. నెమ్మదైన ఈ వికెట్‌పై శ్రీలంక బ్యాట్స్‌మన్ పరుగుల కోసం శ్రమిస్తున్న స్థితిలో ఐదు అవకాశాలు వదిలేయడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా భారీ షాట్ ఆడాడు. బాగా ఎత్తున పైకి లేచిన బంతి చాలా సేపు గాల్లోనే ఉంది. పాయింట్ స్థానానికి పరుగెత్తుతూ వచ్చిన ధావన్, రహానే బంతిపైనే దృష్టి ఉంచారు. సమన్వయ లోపంతో ఒకరినొకరు పట్టించుకోకపోవడంతో ఇద్దరూ ఢీ కొన్నారు. బంతి ఎవరికీ అందకుండా సునాయాస క్యాచ్ చేజారింది. 17 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో తిరిమన్నె కవర్స్‌లో ఇచ్చిన కష్ట సాధ్యమైన క్యాచ్‌ను జడేజా వదిలేశాడు. 86 వద్ద బిన్నీ బౌలింగ్‌లో పెరీరా మిడ్ వికెట్ వైపు ఆడాడు. డీప్నుంచి పరుగెత్తుతూ వచ్చిన జడేజా ప్రయత్నించినా.. లిప్త పాటు కాలంలో బంతి చేజారింది. 140 వద్ద జడేజా బౌలింగ్‌లో సంగక్కరను స్టంప్ చేసే సునాయాస అవకాశాన్ని కార్తీక్ వృథా చేశాడు. బంతిని చక్కగా అందుకొని చేతిని ముందుకు తెచ్చినా కార్తీక్ చేయి స్టంప్స్‌ను తాకలేదు. రెండో ప్రయత్నంలో చేసే సరికి సంగ క్రీజ్‌లో ఉన్నాడు. అప్పుడు అతని స్కోరు 30. లంక విజయానికి మరో పరుగు కావాల్సిన దశలో తిసార పెరీరా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. అది పడితే 11వ స్థానం ఆటగాడు క్రీజ్‌లోకి వస్తే ‘టై’ అవకాశం ఉండేదేమో! ధావన్ సెంచరీ మిస్ ఆరంభంలో లంక బౌలర్లు రాణించడంతో ఓపెనర్ రోహిత్ (28 బంతుల్లో 13; 1 ఫోర్) ఇబ్బందిపడ్డాడు. అయితే ధావన్, కోహ్లితో కలిసి నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్... విరాట్‌తో కలిసి రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. ఈ దశలో మెండిస్...అద్భుతమైన క్యారమ్ బంతితో కోహ్లిని అవుట్ చేశాడు. తర్వాత రహానే (27 బంతుల్లో 22; 1 ఫోర్) కాసేపు పోరాడాడు. 40వ ఓవర్లో మెండిస్ నాలుగు బంతుల వ్యవధిలో... సెంచరీ దిశగా సాగుతున్న ధావన్‌తో పాటు, కార్తీక్ (4)ను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే వరుస ఓవర్లలో రాయుడు (18), బిన్నీ (0) వెనుదిరిగారు. దీంతో 26 బంతుల వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 175/2 ఉన్న స్కోరు 215/7 వద్ద నిలిచింది. రెండో ఎండ్‌లో జడేజా (27 బంతుల్లో 22 నాటౌట్; 1 సిక్సర్) భారీ షాట్లకు ప్రయత్నించినా.. అశ్విన్ (16 బంతుల్లో 18; 2 ఫోర్లు), భువనేశ్వర్ (0) నాలుగు బంతుల వ్యవధిలో అవుటయ్యారు. మెండిస్ 4, సేననాయకే 3 వికెట్లు తీశారు. కష్టపడిన బౌలర్లు లంక ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు కుశాల్ పెరీరా, తిరిమన్నే (55 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్సర్) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించాక తిరిమన్నేను అశ్విన్ అవుట్ చేశాడు. ఓ ఎండ్‌లో సంగక్కర పాతుకుపోయినా... భారత బౌలర్లు రెండో ఎండ్‌లో టపటపా వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో నిలకడగా ఆడుతున్న కుశాల్ పెరీరా.. అశ్విన్ (27వ ఓవర్) బౌలింగ్‌లో అవుట్ కాగా, 32వ ఓవర్లో జడేజా వరుస బంతుల్లో జయవర్ధనే (9), చండిమల్ (0)లను వెనక్కిపంపాడు. తర్వాత విజృంభించిన షమీ... వరుస ఓవర్లలో మాథ్యూస్ (6), సేననాయకే (12)లకు పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే డిసిల్వా (9) అవుటైనా... సంగక్కర 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. చివరకు లంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో షమీ వేసిన 49వ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించిన సంగ కెరీర్లో 18వ సెంచరీ పూర్తి చేశాడు. కానీ తర్వాతి బంతికే అవుటయ్యాడు. మెండిస్ (5 నాటౌట్), పెరీరా కలిసి లాంఛనం పూర్తి చేశారు. షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. మంచు వల్ల దెబ్బతిన్నాం: కోహ్లి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో తీవ్రమైన మంచు కారణంగానే దెబ్బతిన్నామని భారత కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘గురువారం ఈ స్థాయిలో మంచు కురవలేదు. శుక్రవారం రాత్రి ముఖ్యంగా మ్యాచ్ ఆఖరి దశలో విపరీతంగా మంచు కురిసింది. ఇది ఫీల్డింగ్‌పై ప్రభావం చూపింది’ అని కోహ్లి చెప్పాడు. బౌలర్లు రాణించారని ప్రశంసించాడు. ‘మేం మరో 25-30 పరుగులు చేసి ఉంటే బాగుండేది. అయినా బౌలర్లు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించారు. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ తీసుకొచ్చారు. ముఖ్యంగా జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు’ అని కెప్టెన్ చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తమ లోపాలను సరిదిద్దుకుని బరిలోకి దిగుతామని చెప్పాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) సేననాయకే 13; ధావన్ (బి) మెండిస్ 94; కోహ్లి (బి) మెండిస్ 48; రహానే (సి) తిరిమన్నే (బి) సేననాయకే 22; రాయుడు (సి) కుశాల్ పెరీరా (బి) డిసిల్వా 18; కార్తీక్ (సి) డిసిల్వా (బి) మెండిస్ 4; జడేజా నాటౌట్ 22; బిన్నీ ఎల్బీడబ్ల్యు (బి) సేననాయకే 0; అశ్విన్ (బి) మలింగ 18; భువనేశ్వర్ (స్టంప్డ్) సంగక్కర (బి) మెండిస్ 0; షమీ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1-33; 2-130; 3-175; 4-196; 5-200; 6-214; 7-215; 8-245; 9-247 బౌలింగ్: మలింగ 10-0-58-1; మాథ్యూస్ 3.2-1-9-0; సేననాయకే 10-0-41-3; తిసారా పెరీరా 6.4-0-40-0; మెండిస్ 10-0-60-4; డిసిల్వా 10-0-51-1 శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) కార్తీక్ (బి) అశ్విన్ 64; తిరిమన్నే ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 38; సంగక్కర (సి) అశ్విన్ (బి) షమీ 103; జయవర్ధనే (సి) రోహిత్ (బి) జడేజా 9; చండిమల్ (బి) జడేజా 0; మాథ్యూస్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 6; సేననాయకే (సి) రోహిత్ (బి) షమీ 12; డిసిల్వా ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 9; పెరీరా నాటౌట్ 11; మెండిస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (49.2 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1-80; 2-134; 3-148; 4-148; 5-165; 6-183; 7-216; 8-258 బౌలింగ్: భువనేశ్వర్ 9.2-1-45-0; షమీ 10-0-81-3; అశ్విన్ 10-0-42-2; బిన్నీ 4-0-22-0; జడేజా 10-1-30-3; రాయుడు 1-0-9-0; రోహిత్ 5-0-29-0 సంగక్కర కెరీర్లో ఇది 18వ వన్డే సెంచరీ వన్డేల్లో భారత్‌పైనే 4 వేలకు పైగా పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడు సంగక్కర (పాంటింగ్, జయవర్ధనే తర్వాత)అశ్విన్ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతను ఈ ఘనత సాధించిన 17వ భారత బౌలర్. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే స్టంపౌట్ (డైమండ్ డక్) అయిన రెండో ఆటగాడు భువనేశ్వర్. గతంలో ఒసిండే (కెనడా) ఇలా అవుటయ్యాడు. (ఒక్క బంతి కూడా ఆడకుండా అవుటైతే డైమండ్ డక్ అంటారు. వైడ్ బంతికి భువనేశ్వర్ అవుటయ్యాడు). -
సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు
కొలంబో: ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌లో లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం లేదు. తమ దేశవాళీ జట్టు కుందురత తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో సూపర్ 4 లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కుందురత జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. దీంతో తమ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని సంగక్కర స్పష్టం చేశాడు. లంక బోర్డు కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నాడు. ఐపీఎల్-6లో సన్‌రైజర్స్‌కు ఆడిన ఈ లంక మాజీ కెప్టెన్‌ను చాలా మ్యాచ్‌ల్లో పక్కనబెట్టారు. అయితే విండీస్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌తో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను గాడిలో పడ్డాడు.