PC: IPL.com
ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో నెలకొన్న నోబాల్ వివాదం ప్రస్తుత చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహరించిన తీరుపై కొంత మంది మాజీ ఆటగాళ్లు విమర్శలు కురిపిస్తుండగా.. మరి కొంత మంది పంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఈ వివాదంపై తాజాగా రాజస్తాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార సంగక్కర స్పందించాడు. ఏదైన మ్యాచ్‌లో తుది నిర్ణయం తీసుకునే హక్కు కేవలం అంపైర్లకు మాత్రమే ఉంటుందని సంగక్కర తెలిపాడు.
"ఏ మ్యాచ్‌లోనైనా అంపైర్లే ఆటను కంట్రోల్ చేస్తారని నా అభిప్రాయం. ఐపీఎల్‌లో తీవ్ర ఒత్తిడి, ఉత్కంఠ ఎప్పడూ ఉంటుంది. ఆట సజావుగా జరిగేలా చూసే పూర్తి బాధ్యత అంపైర్‌లపై ఉంటుంది. కాబట్టి అంపైర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్న మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఫీల్ఢ్‌లో అంపైర్‌ల పని చాలా కఠినంగా ఉంటుంది. సహాయక సిబ్బందిగా మా పని.. ఆటగాళ్లకు ముందే నియమ నిభంధనలు గురించి సృష్టంగా తెలియజేయాలి" అని సంగక్కర పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'ముంబై జట్టులో విభేదాలు.. అందుకే ఈ ఓటములు'
Comments
Please login to add a commentAdd a comment