
అంతర్జాతీయ టి20లకు సంగక్కర గుడ్‌బై
ప్రపంచకప్ తర్వాత
కొలంబో: ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర తెలిపాడు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీయే ఈ ఫార్మాట్‌లో తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అని సంగక్కర ప్రకటించాడు.
అయితే ఐపీఎల్ వంటి లీగ్‌లలో మాత్రం టి20ల్లో ఆడతానని, వన్డేల్లో కనీసం వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ దాకా కొనసాగుతానని 36 ఏళ్ల సంగక్కర వెల్లడించాడు. ఇప్పటిదాకా 50 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన సంగక్కర.. 32.77 సగటు, 120 స్ట్రైక్ రేట్‌తో 1311 పరుగులు సాధించాడు. వరుసగా ఐదు టి20 ప్రపంచకప్‌లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన ఈ మాజీ కెప్టెన్.. తమ జట్టు గత పొరపాట్లను ఈసారి పునరావృతం చేయబోదన్నాడు. 2009, 2012 ప్రపంచకప్‌లలో లంక ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే.