ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌తో బేరసారాలన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుత హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఎంపికకు వేగంగా పావులు కదులుతున్నట్లు తెలుస్తుంది.
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాట్ పాట్స్ గత నెలలో తన పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంగక్కరతో భర్తీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈసీబీ నుంచి కానీ సంగక్కర నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తెర వెనుక పావులు వేగంగా కదులుతున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ సంగక్కరతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్లకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోధిక్‌ను నియమించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది.
ఈ సిరీస్‌లు ముగిసిన అనంతరం పర్మెనెంట్ కోచ్‌గా సంగక్కర నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈసీబీతో లైన్ క్లియెర్ కాగానే సంగక్కర రాయల్స్‌తో తెగదెంపులు చేసుకోవచ్చు. సంగక్కర రాయల్స్‌తో నాలుగేళ్ల పాటు కొనసాగాడు. మరోవైపు ద్రవిడ్‌కు సైతం రాయల్స్ పాత బంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో అతను రాయల్స్ కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుబంధం కారణంగా రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment