
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. నమీబియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కరుణరత్నే వేసిన ఓ ఆఫ్ సైడ్ బంతిని బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ వైపుకు వెళ్లింది.
ఈ క్రమంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో నమీబియా బ్యాటర్ కూడా ఒక్క సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు.
చదవండి: T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం