Namibia
-
నమీబియాకు తొలి అధ్యక్షురాలు
నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది. 72 ఎండైట్వా 57 శాతం ఓట్లు సాధించారు. శాంతి, సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, ఫలితాలను కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. నిష్కళంక నేత ఎన్ఎన్ఎన్ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. బలమైన గ్రామీణ మూలాలతో 30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయసు్కల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీస్ మెరుపు బ్యాటింగ్.. లూసియా కింగ్స్ ఘన విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. డేవిడ్ వీస్ మెరుపు ఇన్నింగ్స్‌తో (26 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించగా.. అకీమ్ అగస్ట్ (35), జాన్సన్ చార్లెస్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డుప్లెసిస్ (14), రోస్టన్ ఛేజ్ (0), టిమ్ సీఫర్ట్ (13), భానుక రాజపక్స (1) తక్కువ స్కోర్లకే ఓటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో క్రిస్ గ్రీన్ 4, షమార్ స్ప్రింగర్ 3, కోఫి జేమ్స్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్‌ను కింగ్స్ స్పిన్నర్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఖారీ పియెర్ (4-1-24-3), రోస్టన్ ఛేజ్ (3-1-15-1), నూర్ అహ్మద్ (4-0-13-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఫాల్కన్స్ పతనాన్ని శాశించారు. వీరి ధాటికి ఫాల్కన్స్ 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆఖర్లో క్రిస్ గ్రీన్ (48).. షమార్ స్ప్రింగర్ (24), రోషన్ ప్రైమస్ (17 నాటౌట్) సహకారంతో ఫాల్కన్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చదవండి: ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం -
Namibia's drought crisis: నాడు ఆహ్లాదం..నేడు ఆహారం
సాక్షి, అమరావతి: నమీబియాలో కరువు విజృంభిస్తోంది. గడిచిన శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్షం తాండవిస్తోంది. ఇది మనుషుల నుంచి వన్య ప్రాణులకు వరకు కబళిస్తోంది. నైరుతి ఆఫ్రికాలోని నమీబియా..వన్యప్రాణులతో కూడిన ఉద్యానవనాలు, సఫారీలకు పెట్టింది పేరు. ఒకప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచిన వన్యప్రాణులు ఇప్పుడు కరువు కారణంగా మనుషులకు ఆహారంగా మారుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మేత, నీళ్లు లభించక వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు అధిక వన్యప్రాణి జనాభా కలిగిన ఉద్యానవనాల్లోని జీవులను అక్కడి ప్రభుత్వం వధిస్తోంది. వాటిని చంపడం ద్వారా ఉద్యానవనాల్లో మేత, నీళ్ల సమస్యలను తగ్గించి పేద ప్రజలకు ఆహారంగా వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. సంఖ్యను తగ్గిస్తూ..జంతువులను వధిస్తూ నమీబియాలో ఏటా వచ్చే కరువు ఈసారి మరింత తీవ్రంగా మారింది. గతంలో కరువు ముప్పు నుంచి ఉద్యానవనాలను తప్పించేందుకు జంతువులను ప్రభుత్వం వేలం వేసేది. వచి్చన సొమ్ముతో ఉద్యానవనాలను నిర్వహించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోవడంతో ఏనుగులు, హిప్పోలు, జీబ్రాలతో సహా అనేక జంతువులను వధించేలా నమీబియా లైవ్లీహుడ్ వల్నెరబిలిటీ అసెస్మెంట్ అండ్ ఎనాలిసిస్ రిపోర్ట్‌ను అక్కడి ప్రభుత్వం తీసుకువచి్చంది. దీంతో 83 ఏనుగులు, 30 హిప్పోలు, 100 ఎలాండ్స్, 300 జీబ్రాలతో సహా సుమారు 700కు పైగా జంతువులను వధించడానికి చర్యలు తీసుకుంది. జంతువుల సంఖ్య అధికంగా ఉన్న నేషనల్ పార్కులలో మేత, నీరు సరిపోవడం లేదు. మేత కరువును, నీటి లభ్యతను నివారించడంలో ఈ వన్యప్రాణుల సంఖ్యను తగ్గించే విధానం తమకు సహాయపడుతుందని నమీబియా ప్రభుత్వం భావిస్తోంది. హెచ్చరికలు..ఆంక్షలు నమీబియాలో దుర్భిక్షంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. దేశంలో మే నెలలో అత్యవసర పరిస్థితిని విధించారు. 30 లక్షల మంది జనాభాలో దాదాపు సగం మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహారం దొరక్క ఏనుగులు, ఇతర వన్యప్రాణులు మనుషులపై దాడులు చేసే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే వన్య ప్రాణులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. రాత్రిపూట ఆయా ప్రదేశాల్లో తిరగడం, నదుల్లో ఈత కొట్టడం, స్నానాలు చేయడం, పశువులను విచ్చలవిడిగా వదిలిపెట్టడం చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. నమీబ్ నౌక్లఫ్ట్ పార్క్, మంగెట్టి నేషనల్ పార్క్, బ్వాబ్వాటా నేషనల్ పార్క్, ముడుమో నేషనల్ పార్క్, న్కాసా రూపారా నేషనల్ పార్కుల్లోని వన్యప్రాణులను తీసుకువచ్చి వధించి..పేదలకు ఆహారంగా అందిస్తోంది. -
నమీబియా ఓపెనర్ అరుదైన ఫీట్.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే
నమీబియా ఓపెనర్ నికోలాస్ డేవిన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా డేవిన్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన డేవిన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యచేధనలో నమీబియా ఓపెనర్‌గా వచ్చిన డేవిన్ తడబడ్డాడు. ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొనేందుకు డేవిన్ తీవ్రంగా శ్రమించాడు. తన ఆడిన 16 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్.. డెవిన్ వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డెవిన్ రిటైర్ట్ ఔట్‌గా డగౌట్‌కు చేరాడు. అతడి తన స్ధానంలో డేవిడ్ వైస్ క్రీజులోకి వచ్చాడు. అయితే 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగలేదు. ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నమీబియాపై 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. -
T20 World Cup 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
నమీబియా స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇంగ్లండ్ చేతిలో తన జట్టు ఓటమి అనంతరం వీస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 39 ఏళ్ల వీస్.. 2013లో సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసి 2016 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. అనంతరం వీస్ తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు (2021 ఆగస్ట్ నుంచి). 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన వీస్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. వీస్ నమీబియా తరఫున ఆడుతూ ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియా సాధించిన మొట్టమొదటి విజయంలో (2021 టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై) వీస్ కీలకపాత్ర పోషించాడు.రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన వీస్ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 51 టీ20లు ఆడి 73 వికెట్లు పడొట్టాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన వీస్ తన అంతర్జాతీయ కెరీర్లో దాదాపు 1000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి.అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ కెరీర్లో ఘనమైన రికార్డు కలిగిన వీస్.. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 162 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి దాదాపు 10000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో వీస్ ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో కలిపి 490 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన వీస్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు. -
T20 World Cup 2024: చెలరేగిన బ్రూక్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపు
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 అవకాశాలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్.. నమీబియాను ఓడించింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు), మొయిన్ అలీ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జోస్ బట్లర్ డకౌటయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మన్ 2, డేవిడ్ వీస్, బెర్నాల్డ్ స్కోల్జ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 123 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. ఇంగ్లండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.నమీబియా ఇన్నింగ్స్‌లో వాన్ లింగెన్ 33, నికోలాస్ 18 (రిటైర్డ్ హర్ట్), డేవిడ్ వీస్ 27 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సూపర్-8కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ భారీ తేడాతో ఓడాల్సి ఉంది. -
చరిత్ర సృష్టించిన ఆడమ్ జంపా.. తొలి ఆసీస్ ప్లేయర్‌గా రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం పసికూన నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్లను జంపా తన మయాజాలంతో ముప్పుతిప్పులు పెట్టాడు. జంపా తన 4 ఓవర్ల కోటాలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జంపా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఆస్ట్రేలియా బౌలర్‌గా జంపా రికార్డులకెక్కాడు. నమీబియా బ్యాటర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ను అవుట్ చేయడంతో జంపా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 83 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 100 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జంపా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నమీబియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 5.4 ఓవర్లలో ఛేదించింది. -
నమీబియాను చిత్తు చేసిన ఆసీస్.. సూపర్-8కు అర్హత
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బిలో ఉన్న కంగారూ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించిన మార్ష్ బృందం.. మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తాజాగా బుధవారం(భారత కాలమానం ప్రకారం) నాటి మ్యాచ్‌లో నమీబియాను మట్టికరిపించింది. తద్వారా గ్రూప్-బి టాపర్‌గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా.వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కంగారూ జట్టు బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ 10, నికో డెవిన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఈ క్రమంలో గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 43 బంతుల్లో 36 పరుగులతో ఉన్న అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేయడంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం తారస్థాయికి చేరింది.తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు వరుసగా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది నమీబియా.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నెట్ రన్‌రేటును భారీగా మెరుగుపరుచుకుంది. వరల్డ్‌కప్-2024 ఎడిషన్ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా తర్వాత.. సూపర్-8కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
స్కాట్లాండ్ బోణీ
బార్బడోస్: టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో స్కాట్లాండ్ తొలి విజయం నమోదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఐదు వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. ఇంగ్లండ్–స్కాట్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఈ గెలుపుతో స్కాట్లాండ్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలోకి వెళ్లింది.స్కాట్లాండ్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెపె్టన్ ఎరాస్మస్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. బ్రాడ్ వీల్ 3, బ్రాడ్ కరీ 2 వికెట్లు తీశారు. అనంతరం స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ బెరింగ్టన్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మైకేల్ లీస్క్ (17 బంతుల్లో 35; 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి స్కా ట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్‌లో నేడున్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్వేదిక: గయానా; ఉదయం గం. 5 నుంచిబంగ్లాదేశ్ X శ్రీలంక వేదిక: డాలస్; ఉదయం గం. 6 నుంచిదక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిఆ్రస్టేలియా X ఇంగ్లండ్ వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్..
టీ20 వరల్డ్‌కప్-2024లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్రీన్(28), డావిన్(20) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో వీల్ 3 వికెట్లు పడగొట్టగా.. కుర్రీ రెండు, సోలే, గ్రీవ్స్, లీస్క్ తలా వికెట్ సాధించారు.రాణించిన కెప్టెన్, లీస్క్..అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్కాటీష్ కెప్టెన్ బెర్రింగ్టన్(47) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మైఖేల్ లీస్క్(35) పరుగులతో రాణించాడు. ఇక నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్కోల్జ్, రుబీన్, లుంగమినీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన మైఖేల్ లీస్క్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దగ్గింది. -
ప్రపంచకప్ 2024లో నేటి (జూన్ 6) మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్ ఆడనున్న పాక్
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 6) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. డల్లాస్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ, పాకిస్తాన్.. బార్బడోస్‌లో జరుగునున్న రెండో మ్యాచ్‌లో నమీబియా, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు.. నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ మధ్య రాత్రి 12:30 గంటలకు మొదలవుతాయి. ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ఇవాళ ఆడబోయే మ్యాచ్ తొలి మ్యాచ్ కాగా.. యూఎస్ఏ ఇదివరకే ఓ మ్యాచ్ ఆడింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-బిలో పోటీపడుతున్న ఈ ఇరు జట్లు ఇదివరకే తలో మ్యాచ్ ఆడాయి. నమీబియా తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై సూపర్ ఓవర్లో విజయం సాధించగా.. స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం నమీబియా గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. -
T20 World Cup 2024: ఉత్కం‘టై’న పోరులో నమీబియా ‘సూపర్’ గెలుపు
సూపర్ ఓవర్‌కు ముందు... నమీబియా గెలిచేందుకు 6 బంతుల్లో 5 పరుగులు కావాలి. క్రీజులో పాతుకుపోయిన ఫ్రయ్‌లింక్ (48 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఉండటంతో నమీబియా గెలుపు లాంఛనం. కానీ మెహ్రాన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ఆఖరి బంతి బౌల్ అయ్యేసరికి ఒమన్ గెలవాలి! ఫ్రయ్‌లింక్, గ్రీన్ వికెట్లు తీసిన మెహ్రాన్ 4 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 2 పరుగులపుడు మెహ్రాన్ చక్కని బంతి వేయగా... వికెట్ కీపర్ మిస్ ఫీల్డింగ్, మిస్ త్రో వల్ల ఒక పరుగు వచ్చి స్కోరు ‘టై’ అయింది. తుది ఫలితం కోసం మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో... ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నమీబియా బ్యాటర్లు డేవిడ్ వీస్ తొలి నాలుగు బంతుల్లో 4, 6, 2, 1 కొట్టగా... చివరి రెండు బంతులు ఆడిన ఎరాస్మస్ 4, 4 బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు 22 పరుగులు చేయాల్సిన ఒమన్ జట్టు నసీమ్ (2) వికెట్ కోల్పోయి 10 పరుగులే చేయడంతో నమీబియా ‘సూపర్’ విక్టరీ నమోదు చేసింది. బ్రిడ్జ్‌టౌన్: లాంఛనమైన (ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 5 పరుగులు) విజయానికి దూరమైన నమీబియా ‘సూపర్ ఓవర్’తో చేజారిన విజయాన్ని చేజిక్కించుకుంది. ఒమన్ పేసర్ మెహ్రాన్ (3–1–7–3) అసాధారణ బౌలింగ్‌ను... డేవిడ్ వీస్ ‘షో’ సూపర్ ఓవర్లో మాయం చేసింది. ‘సూపర్ ఓవర్’లో 13 పరుగులు చేసిన వీస్ వెంటనే బౌలింగ్‌కు దిగి వికెట్ కూడా తీసి 10 పరుగులిచ్చాడు. 20 జట్లు బరిలో ఉన్న ఈ టి20 ప్రపంచకప్‌లో ‘బోర్’ మ్యాచ్‌లే బోలెడనుకున్న క్రికెట్ ప్రేక్షకులు, విశ్లేషకుల అంచనాల్ని గ్రూప్ ‘బి’లోని ఈ మ్యాచ్ తారుమారు చేసింది. ఔరా అనిపించేలా ఈ కూనల తక్కువ స్కోర్ల మ్యాచ్ వరల్డ్‌కప్‌కే వన్నె తెచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా గెలిచినా... మ్యాచ్ చూసిన ప్రతి మదిని ఒమన్ పోరాటం తాకింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖాలిద్ కైల్ (39 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్), జీషాన్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్ (4/21), వీస్ (3/28), కెపె్టన్ గెరార్డ్ ఎరాస్మస్ (2/20) అదరగొట్టారు. తర్వాత నమీబియా కూడా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జాన్ ఫ్రయ్లింక్తో పాటు నికోలస్ డేవిన్ (31 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 3: టి20 ప్రపంచకప్ చరిత్రలో ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలిన మ్యాచ్‌లు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్‌లో సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు.. అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించాయి. -
T20 World Cup 2024: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న వీస్
నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (39) లేటు వయసులో అదిరిపోయే ప్రదర్శనలతో ఇరదీస్తున్నాడు. గత కొంతకాలంగా నమీబియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీస్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లోనూ చెలరేగిపోతున్నాడు. వరల్డ్‌కప్ గ్రూప్-బి పోటీల్లో భాగంగా ఒమన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి నమీబియాను గెలిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాట్‌తో బంతితో సత్తా చాటిన వీస్.. సూపర్ ఓవర్లోనూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.రెగ్యులర్ మ్యాచ్‌లో తొలుత బంతితో (3.4-0-28-3) రాణించిన వీస్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ (8 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్లోనూ వీస్ ఇరగదీశాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాట్‌తో (4 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) చెలరేగిన వీస్.. ఆతర్వాత బంతితోనూ (1-0-10-1) రాణించి నమీబియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు గాను వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో వీస్‌తో పాటు ట్రంపెల్మన్ (4-0-21-4), ఎరాస్మస్ (4-0-20-2), స్కోల్జ్ (4-0-20-1) సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఒమన్ చేసినన్ని పరుగులే (109) చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ (3-1-7-3), కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ (4-1-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బిలాల్ ఖాన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. నమీబియాను విజయతీరాలకు చేర్చేందుకు ఫ్రైలింక్ (45) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.సూపర్ ఓవర్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వీస్, ఎరాస్మస్ (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. వీస్ ధాటికి 10 పరుగలకే పరిమితమై ఓటమిపాలైంది. -
12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్.. నమీబియా వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.ఇక రెండు మ్యాచ్‌లు ఒక ఎత్తు. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమన్-నమీబియా మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇరు జట్లు సమాన స్ధాయిలో పోరాడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఒమన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్లో ఫలితం తేల్చాల్సి వచ్చింది.దంచి కొట్టిన డేవిడ్ వీస్, ఎరాస్మస్..ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగుల చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 13 పరుగులు చేయగా.. ఎరాస్మస్ 8 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వీస్.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటాడు.తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికి ఒమన్‌కు చేయాల్సిన నష్టం వీస్ చేసేశాడు.12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్..కాగా టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరగడం ఇది మూడో సారి. చివరగా 2012 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరిగింది. 2012 పొట్టి ప్రపంచకప్‌లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, కివీస్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టై అయినప్పటికి సూపర్ ఓవర్ ద్వారా కాకుండా బాల్ అవుట్ ద్వారా ఫలితం తేల్చారు.నమీబియా అరుదైన రికార్డు..ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌పై సూపర్ ఓవర్లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది. -
ప్రపంచకప్‌లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
టీ20 వరల్డ్‌కప్-2024ను నమీబియా విజయంతో ఆరంభించింది. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది.దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది.దీంతో నమీబియా విజయభేరి మ్రోగించింది. నమీబియా విజయంలో ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ కీలక పాత్ర పోషించాడు.టీ20 క్రికెట్ చరిత్రలో..ఇక ఈ మ్యాచ్‌లో నమీబియా పేసర్ ట్రంపెల్మన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒమన్ బ్యాటర్లకు ట్రంపెల్మన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆది నుంచే ఒమన్ బ్యాటర్లకు ఈ నమీబియన్ ముప్పుతిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ట్రంపెల్మన్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.ఈ క్రమంలో ట్రంపెల్మన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ట్రంపెల్మన్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు జరిగిన 2633 అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్ వేసిన ట్రంపెల్మన్.. వరుసగా ప్రజాపతి, ఇలియాస్‌ను ఔట్ చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్లో ఫలితం! నమీబియా విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో బార్బడోస్ వేదికగా ఒమాన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. ఒమాన్‌పై సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం1 0 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.చెలరేగిన నమీబియా బౌలర్లు..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమాన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.వారెవ్వా మెహ్రాన్ ఖాన్..110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడంలో ఒమన్ ఆల్‌రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.ఆఖరి ఓవర్లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. -
చెలరేగిన నమీబియా బౌలర్లు.. 109 పరుగులకే ఒమన్ ఆలౌట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. మరి 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒమన్ బౌలర్లు కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. -
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్‌లో సెసె బౌ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. -
T20 World Cup 2024: ఫీల్డర్‌గా మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్‌లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్‌వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్, వార్నర్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్‌వుడ్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్
స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో నేపాల్ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో ఇవాళ (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (55 నాటౌట్) మెరుపు అర్దసెంచరీతో రాణించాడు. ఆరిఫ్ షేక్ (31), అనిల్ షా (23), గుల్షన్ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్ షికోంగొ 3, జాక్ బ్రస్సెల్ 2, ట్రంపల్మెన్, లాఫ్టీ ఈటన్, బెర్నాల్డ్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్మిట్ (50) అర్దసెంచరీతో చెలరేగినా నమీబియాను గెలిపించలేకపోయాడు. ఆఖర్లో జేన్ గ్రీన్ (23), బెర్నాల్డ్ (4 నాటౌట్) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్ బౌలర్లలో కరణ్, సోమ్‌పాల్, దీపేంద్ర సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్ బొహారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
T20I: స్ట్రైక్‌రేటు ఏకంగా 600..? అంతలోనే..
నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్, తెలుగు మూలాలున్న తేజ నిడమనూరు చేసిన పరుగులు కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేదు. అయినా.. అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే...?! నేపాల్- నమీబియా- నెదర్లాండ్స్ మధ్య నేపాల్ వేదికగా టీ20 ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నమీబియా- నెదర్లాండ్స్ కీర్తిపూర్ వేదికగా గురువారం తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ మెరుపు శతకం(62 బంతుల్లో 135 రన్స్) బాదగా.. వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ సూపర్ హాఫ్ సెంచరీ(40 బంతుల్లో 75 పరుగులు) చేశాడు. LEVITT! Maiden T20I century for Michael Levitt! He's only 20 years old and he's just the 2nd Dutcman to acheive the milestone!#NAMvNED | #TheNetherlandsCricket | #KNCB pic.twitter.com/AetJhyZzyo — Netherlands Cricket Insider (@KNCBInsider) February 29, 2024 చిచ్చరపిడుగు పరుగుల విధ్వంసం ఈ క్రమంలో లెవిట్ స్ట్రైక్‌రేటు 217.74గా నమోదు కాగా.. సైబ్రండ్ స్ట్రైక్‌రేటు 187.50. మరి తేజ నిడమనూరు స్ట్రైక్‌రేటు ఎంతో తెలుసా?!.. సరిగ్గా 600. నిజమే.. నమీబియాతో మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న అతడు మూడు సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. నెట్టింట చర్చ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20లలో 600 స్ట్రైక్‌రేటు వద్ద ఉండగా అవుటైన మొదటి బ్యాటర్ తేజ నిడమనూరేనా అంటూ ఓ నెటిజన్ చర్చకు దారితీశారు. ఇందుకు స్పందనగా మిగతా యూజర్లు తమకు తోచిన సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా వన్డేల్లో ఆండీ మెక్‌బ్రైన్ అనే క్రికెటర్ ఒక బంతి ఎదుర్కొని సిక్సర్ కొట్టాడని ఓ నెటిజన్ ప్రస్తావించారు. మొత్తానికి అలా తేజ స్ట్రైక్‌రేటు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సాధారణంగా ఓ బ్యాటర్ మ్యాచ్‌లో మొత్తంగా చేసిన పరుగులను వందతో గుణించి, అతడు ఎదుర్కొన్న బంతులతో భాగించి స్ట్రైక్‌రేటును నిర్ణయిస్తారు. అలా తేజ స్ట్రైక్‌రేటు 600 అయింది. అదీ సంగతి!! భారీ స్కోరుతో సత్తా చాటి ఇదిలా ఉంటే నమీబియాతో మ్యాచ్‌లో లెవిట్, సైబ్రండ్ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించడం విశేషం. నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది. మరోవైపు.. తేజ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా 1994లో విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు 2022లో నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 30 వన్డేలు, 8 టీ20లు ఆడి వరుసగా 679, 79 పరుగులు చేశాడు. Is Teja Nidamanuru the first batter to be out with a strike rate of 600 in T20 International cricket? @ZaltzCricket — DB Kate (@DutchBKate) February 29, 2024 -
సిక్సర్ల వర్షం.. యువ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ యువ క్రికెటర్ మైకేల్ లెవిట్ దుమ్ములేపాడు. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిది సిక్సర్లు, ఏడు బౌండరీల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు లెవిట్. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి శతకం. కాగా నేపాల్ వేదికగా నమీబియా- నెదర్లాండ్స్- నేపాల్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20లో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆతిథ్య నేపాల్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఓపెనింగ్ బ్యాటర్ మైకేల్ లెవిట్.. నేపాల్‌పై అర్ధ శతకం(54) బాదాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లోనూ బ్యాట్ ఝులిపించిన లెవిట్.. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లెవిట్కు తోడు వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ అద్భుత అర్థ శతకం(40 బంతుల్లో 75)తో రాణించాడు. ఇద్దరూ కలిసి ఏకంగా రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లెవిట్, సైబ్రండ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. కాగా కీర్తిపూర్లో నమీబియాతో జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఈ మేరకు భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ తరఫున టీ20లలో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా మైకేల్ లెవిట్ చరిత్రకెక్కాడు. మాక్స్ ఒడౌడ్ లెవిట్ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించాడు. -
Namibia: చిన్న జట్టే అయినా ఇరగదీసింది.. ఆస్ట్రేలియాకు సైతం సాధ్యం కాలేదు..!
అంతర్జాతీయ టీ20ల్లో పసికూన నమీబియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. పొట్టి ఫార్మాట్లో ఈ జట్టు వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సైతం సాధ్యంకాని తొమ్మిది వరస విజయాల రికార్డును సాధించింది. తద్వారా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 18వ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాల రికార్డు మలేసియా పేరిట ఉంది. ఈ జట్టు జూన్ 2022-డిసెంబర్ 2022 మధ్యలో వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు.. మలేసియా (13 వరుస విజయాలు) బెర్ముడా (13) ఆఫ్ఘనిస్తాన్ (12) రొమేనియా (12) ఇండియా (12) ఆఫ్ఘనిస్తాన్ (11) ఉగాండ (11) పపువా న్యూ గినియా (11) నైజీరియా (11) జెర్సీ (10) టాంజానియా (10) ఉగాండ (10) ఉగాండ (10) పాకిస్తాన్ (10) న్యూజిలాండ్ (10) పోర్చుగల్ (9) సౌదీ అరేబియా (9) నమీబియా (9*) కాగా, ట్రై సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో నమీబియా 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. లాఫ్టీ ఈటన్ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో (33 బంతుల్లో) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో ఈటన్‌తో పాటు మలాన్ క్రుగెర్ (59 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే పరిమితమై 20 పరగుల తేడాతో ఓటమిపాలైంది. రూబెన్ ట్రంపల్మెన్ (4/29) నేపాల్‌ను దెబ్బకొట్టాడు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో మ్యాచ్ రేపు నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరుగనుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మస్కట్‌లో నమీబియాతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 7–2తో గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.