న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఆయన వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు.
భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు దక్షిణాఫ్రికాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‍కు వచ్చాయి. జనవరిలో మరో 12 రానున్నాయి.
చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..
Comments
Please login to add a commentAdd a comment