న్యూఢిల్లీ: భారత్‌కు 8 చీతాలను(చిరుతలు) తీసుకొచ్చేందుకు ప్రత్యేక జంబో జెట్ నమీబియా రాజధాని విండ్‌హోక్‌కు వెళ్లింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ కస్టమైజ్డ్ విమానం ముందు భాగాన్ని పులి ఫోటోతో తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ విమానం ఫోటోలను నమీబియాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. చిరుతలను భారత్‌కు తీసుకొచ్చేందు 'టైగర్ విమానం' విండ్‌హోక్‌లో ల్యాండ్ అయిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO
— India In Namibia (@IndiainNamibia) September 14, 2022
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ 8 చిరుతలు సెప్టెంబర్ 17న భారత్‌కు రానున్నాయి. మొదట రాజస్థాన్‌లో ల్యాండ్ అయి, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వీటిని విడుదల చేస్తారు. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 8 చిరుతల్లో ఐదు మగవి కాగా.. మూడు ఆడవి.
అంతరించిపోయిన జాతి..
ఈ అరుదైన చిరుతలు దేశంలో అంతరించిపోయినట్లు 1952లోనే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర‍్వాత వీటిని పునరుత్పత్తి చేసేందుకు ఇతర దేశాల నుంచి చిరుతలను భారత్‌కు తీసుకురావడానికి 1970 నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ప్రభుత్వం. ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టులో భాగంగా 8 చిరుతలను నమీబియా నుంచి తీసుకొస్తోంది.
ఈ ప్రాజెక్టు కోసమే పులి విమానాన్ని తయారు చేశారు. ఇందులో చిరుతల కోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. అంతేకాదు 16 గంటల పాటు ఈ విమానం నిర్విరామంగా ప్రయాణించి భారత్‌కు చేరుకోనుంది. మధ్యలో ఎక్కడా ఇంధనం కోసం కూడా ఆగాల్సిన అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. ఈ 16 గంటలు చిరుతలకు ఎలాంటి ఆహారం అందించరు. గాల్లోనే ప్రయాణిస్తున్నందున వాటికి న్యూయేసియా వంటి సమస్యలు రాకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment