National Park
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా కేంద్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నెలరోజుల్లో 100 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, నారాయణ్‌పూర్, బస్తర్ సహా పలు మావోయిస్టులు హవా ఉన్న జిల్లాల్లో భద్రతా బలగాలు, పోలీసుల ఆపరేషన్లు వేగవంతం చేశాయి. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఎదురుపడగానే కాల్పులు జరుపుతున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు.ఈ ఎన్కౌంటర్లలో భారీగా నక్సల్స్ మృతి చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు, నక్సల్స్‌కు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో మరో మావోయిస్టు అగ్రనేత కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. -
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
US: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు
మనుష్యుల ఆయుర్దాయం వంద సంవత్సరాలకు అటు ఇటు. అంతకు మించి వందలు, వేల సంవత్సరాలు బతికున్న మనుషులే కాదు ఏ ఇతర ప్రాణులు కూడా పురాణ కథల్లో తప్ప ఎక్కడా ఉండవు. కానీ, అలాంటి సజీవ సాక్ష్యాలు, ఇప్పటికీ బతికున్న చెట్లను మాత్రం మనం అమెరికాలో చూడవచ్చు. నా బాల్యంలో మా ఊళ్లో అతి పెద్దవృక్షం ఒక వేపచెట్టు. అది మా ఇంటికి సమీపంలోని ఓ అంగడి బజారులో మా గ్రామానికి నడిబొడ్డులా, బొడ్రాయిలా ఉండేది. పిల్లలు ఆడుకోవాలనుకున్నా.. పెద్దవాళ్లు పంచాయతీకి కూర్చోవాలన్నా.. నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకోవాలనుకున్నా.. కేరాఫ్ వేపచెట్టే. మా ఊళ్లో బస్టాండ్ నిర్మించే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తొలగించడంతో ఆ చెట్టు, మా జ్ఞాపకాలు రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పైడిమడుగు గ్రామంలో 5 ఎకరాల్లో విస్తరించి వున్న 800 సంవత్సరాల నాటి మర్రిచెట్టు కూడా చాలా కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఓ అగ్ని ప్రమాదంలో ఆ మహావృక్షం దెబ్బ తిని 2 ఎకరాలకే పరిమితం కావడం చేదుగా అనిపించే విషయం. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని 700 సంవత్సరాల నాటి మర్రిచెట్టు, అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోనున్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ .. ఇవి పేరుకు చెట్లే అయినా.. మనిషి జీవితంలో, జ్ఞాపకాల్లో ఎంతో విస్తరించాయి. రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. చెట్టును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవచ్చు. నేను కుటుంబంతో కలిసి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజెల్స్‌లో మా అబ్బాయి మమ్మల్ని ‘ సెకోయా నేషనల్ పార్క్ ’ తీసుకెళ్లాడు. అక్కడ వేల సంవత్సరాల వయసున్న సెకోయా, షర్మాన్ మహావృక్షాలను చూసే భాగ్యం మాకు కలిగింది. వాటి దగ్గర నిలబడ్డప్పుడు మనమింత అల్పజీవులమా! అనిపించింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో, సముద్ర మట్టానికి 14 వేలకు పైగా అడుగుల ఎత్తులోనున్న సెకోయా అడవిని, పక్కకే వున్న కింగ్స్ కాన్యన్లను యునెస్కో 1976 లో నే బయోస్పియర్ ( జీవావరణం ) రిజర్వులుగా గుర్తించిందట. లాస్ ఎంజెల్స్ నుంచి రాత్రి ఏడున్నరకు బయలుదేరితే, నాలుగున్నర గంటల కారు డ్రైవ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు సెకోయా అడవికి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ దగ్గర అప్పుడు ఆ కీకారణ్యంలో మమ్మల్ని పలకరించే నరమానవుడు కనబడలేదు, జంతువుల అరుపులు మాత్రం వినబడ్డాయి. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే అక్కడున్న మెయిల్ బాక్స్‌లో మీ పేరుతో తాళం చెవి పెట్టాము, తీసుకొని హాయిగా ఆ చెక్క ఇంటిలో విశ్రమించమన్నారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అక్కడున్న ‘ ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త ! ’ అన్న హెచ్చరిక బోర్డులను చూసి తుపాకి రాముళ్లలా చేతి కర్రలు పట్టుకొని లంచ్ టైం వరకు ఆ అడవి అంతా కలియ దిరిగాము. ఈపాటి అడవులు మనకూ వున్నాయి కాని అమెరికన్లలా మనం వాటిని కాపాడుకోలేకపోయాం, మన అడవుల్లోని మహా వృక్షాలు అడవి దొంగల పాలు ఆయిపోయాయి కదా! అన్న బాధ కలిగింది. అంతేకాదు అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, తమ అడవులను సురక్షితంగా ఉంచుకుంటూనే, తమకు కావలసిన కలపను బయటి దేశాల నుండి తెప్పించుకుంటున్నారు. సాయంత్రం వరకు అడవిలో తిరిగి, అందులోని వాగులు వంకలు చూసి అక్కడి స్వచ్ఛమైన నీటిలో జలకాలాడి, అలసి సొలసి వచ్చి ఆ నిర్జనారణ్య అతిథి గృహంలో కూర్చుని తిన్న మామూలు రాత్రి భోజనం కూడా మృష్టాన్నంలా అనిపించింది. తాగిన ద్రాక్షరసం కూడా అమృతంలా తోచింది. అదే నెలాఖరులో మేమంతా ‘ యోసేమైట్ నేషనల్ పార్క్ ’ కూడా వెళ్ళాము , ఆనాటి అనుభవాలు కూడా దాదాపు ఇలాంటివే. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లోనున్న ఈ నిర్జన అడవి మధ్యలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు చాలా బాగున్నాయి. ఇందులోని గ్రానైట్ కొండలు , హిమనీ నదాలు, ఇరుకు లోయలు, పచ్చిక బయళ్లు విశేషమైనవనే చెప్పాలి. 1984 లో ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం విశేషం. యోసేమైట్ లోని పర్వతాన్ని తొలిచి ఏర్పరచిన మార్గం, జలపాతం అద్భుతం. ఈ అడవిలో మూడు రాత్రులు ఉన్నాం. వేముల ప్రభాకర్ (చదవండి: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్‌బాబు పాల్గొన్నారు. -
గజరాజు ప్రతాపం : అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్
సరదాగా సఫారీకి వెళ్లిన టూరిస్టులు చేదులో అనుభవం ఎదురైంది. తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఏనుగును దగ్గరినుంచి చూడాలనుకుని ముచ్చపట్టారు. అంతటితో ఆగకుండా ఫోటో తీయాలని ప్రయత్నించారు. అంతే క్షణాల్లో ఊహంచని పరిణామం ఎదురైంది. ఏనుగు సఫారీ ట్రక్కును అమాంతం దొర్లించేసింది. దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq — Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024 అసలు ఏమైందంటే... ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో 22 సీటర్ ట్రక్కులో పర్యాటకులు సఫారీకి వెళ్లారు. ఇంతలో భారీ ఏనుగు కనిపించింది. పర్యాటకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించినపుడు ఏనుగు మరింత దగ్గరగా వచ్చింది. ఉన్నట్టుండి ట్రక్పైదాడి చేసింది. ఏనుగును ట్రక్కును అమాతం ఎత్తేసింది. ఇలా చాలా సార్లు పడేసింది. దీంతో ట్రక్ లోపల ఉన్నవాళ్లంతా భయంతో వణికి పోయారు. సీట్ల కింద దాక్కున్నారు. ఇంతలో డ్రైవర్ పో...ఫో గట్టిగా అదిలించాడు. ట్రక్‌పై కొడుతు పెద్దగా శబ్దం చేశాడు. దీంతో ఏనుగు భయపడిందో.. శాంతించిందో తెలియదు గానీ పక్కకు తొలగిపోయింది. దీంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. హెండ్రీ బ్లోమ్ ఈ సంఘటనను కెమెరాలో బంధించాడురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయాలనుకున్నందున అది దూకుడుగా ప్రవర్తించిందని పార్క్ అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే బాగా బెంబేలెత్తిపోయిన ఒక కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. మరోవైపు టూర్ గైడ్ సమయానుకూలంగా వ్యవహరించిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసించారు. -
ప్రకృతి గొప్పతనం తెలిపే కథ! నక్కలు చేసిన మేలు!
మానవుడు తాను మనుగడ సాగించడానికి ఇష్టారీతిలో అడవులు నరికి అభివృద్ధి ముసుగులో తానేం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. అక్కడకి ప్రకృతి ప్రకోపిస్తూ ఏదో విధంగా మానవుడికి తెలియజేప్పే యత్నం చేసిన మూర్ఖుల్లా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఇలాంటి ప్రకృతి కథ వింటే కనువిప్పు కలుగుతుందేమో. అన్ని జీవులు మనుగడ సాగిస్తే ప్రకృతి అని తెలిపే కథ. ఏదో ఒక్క సంతతే మనుగడ సాగిస్తే ఒక్కసారిగా పరిసరాలపై ఎలా ప్రభావం చూపుతోంది తెలియజేసే గమ్మత్తైన సంఘటన. చిన్నప్పుడూ చదివిన ఆహారపు గొలుసు కథ స్ఫూరింపజేస్తుంది. ఇంతకీ ఏంటా కథ అంటే.. 1995లో యూఎస్‌లోని ఎల్లో స్టోన్ నేషనల్పార్క్ ఒక్కసారిగా జీవకళ తప్పి నిర్జీవంగా కనిపించింది. ఎందువల్లనో గానీ కొలనులు, సెలయేళ్లు, ఎండిపోతూ, చెట్టన్నీ ఆక్కుపచ్చదనాన్ని కోల్పోయినట్లుగా ఉన్నాయి. దీంతో పక్షుల కిలకిలరావాలు, ఇతర సరీసృపాలు సందడి తదితరాలన్నీ కనుమరుగయ్యి నిర్మానుష్యంగా ఉంది. అయితే ఇదే సమయంలో పార్క్ అధికారులు 14 తొడేళ్లను విడుదల చేశారు. వేటాడే జంతువుల లేకపోవడంతో చెట్లను తినే లేళ్లు, తదితర జంతువుల జనాభా పెరిగిపోయింది. అవి మొక్కలు, పచ్చిక బయళ్లును నెమ్మదిగా తినేయడంతోనే ఒక్కసారిగా ఆ అడవి అంత నిర్జీవంగా అయిపోయింది. ఎప్పుడైతే విడుదలయ్యాయో ఈ తోడేళ్లు ఆ లేళ్లనే వేటాడటం ప్రారంభించాయి. నక్కల వేట ఎప్పుడైతే మొదలైందో ...క్రమంగా ఆ అడవి స్వరూపం మారి ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. చెట్లన్ని చిగురించడం ప్రారంభించాయి. దీంతో కాకులు, గ్రద్దలు, ఇతర పక్కుల రావడం ప్రారంబించాయి. దీంతో పాటు సుంచులు, ఎలుకలు, కుందేళ్లు శబ్దాలతో మళ్లీ అడవి ఇదివరకటి పక్కుకిలకిల రావాలు, శబ్దాలతో కళకళలాడింది. ఎప్పుడూ కనిపించని కొన్ని రకాల జాతులు కూడా దర్శనమిచ్చాయి. కూడా. ఒక్కసారిగా పార్క్ నిర్వాహణధికారులు కూడా ఏదో మిరాకిల్ జరిగినట్లుగా జరిగిందంటూ ఆశ్చర్యపోయారు. తాము నిర్జీవంగా ఉన్న అడవిని మునిపటిలా పుష్పించే మొక్కలు చెట్లతో పచ్చగా అందంగా ఉండాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ తోడేళ్లు ఇలా అద్భుతం చేసి చూపుతాయని ఊహించలేదన్నారు. ఆఖరికి అడవిలో ఉండే వేటకుక్కలను కూడా చంపేశాయి. గ్రద్దలు, కాకిల జనాభా పెరిగింది. వేటాడే జంతువు..భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే జంతువుల మధ్య సమతుల్యత ఏర్పడింది. మరోవైపు నదులు, కొలనులు, సెలయేర్లు కూడా ఇదవరకటిలో నీళ్లుతో నిండుగా కళకళలాడుతూ ఉన్నాయి. పరిసరాల సమతుల్యతకు అన్ని జంతువుల మనుగడ అత్యవసరం అనే విషయాన్ని చాటిచెప్పింది. ఈ ఘటన ప్రకృతి ఎంత అపురూపమైందో తెలియజేసింది. In 1995, 14 wolves were released in Yellowstone National Park. No one expected the miracle that the wolves would bring [📹 Protect All Wildlife]pic.twitter.com/DMlMDx40TY — Massimo (@Rainmaker1973) August 25, 2023 (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఏంటీ?.. మరుగు నీటి సరోవరమా!
ప్రపంచంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలు ఉంటాయి. వేడినీటి బుగ్గల్లోని నీళ్లు సాధారణంగా స్నానానికి అనువుగా ఉంటాయి. డోమనికా రాజధాని రోసోకు చేరువలోని మోర్నె ట్రాయిస్ పిటోన్స్ నేషనల్ పార్కులో ఏకంగా మరుగునీటి సరోవరం ఉంది. దీనిని తొలిసారిగా 1870లో ఇద్దరు బ్రిటిష్ వ్యక్తులు గుర్తించారు. ఈ సరోవరంలోని నీటి ఉష్ణోగ్రత 82 డిగ్రీల నుంచి 92 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇందులోని నీరు నిత్యం సలసల మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటుంది. డోమనికా వచ్చే విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సరోవరం చూడటానికి వస్తుంటారు. దీని ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుంటారు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది!
కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ డేల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్సే క్రేగ్’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు. దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!) -
నగరానికి మణిహారం ఆ పార్కు..అక్కడ అవే ప్రధాన ఆకర్షణ!
హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి. ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్‌గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం.. ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్‌లో 512 నెమళ్లు, పీహాన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్‌లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్‌లో తోపాటు.. అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా. ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్‌లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలాగే క్యాప్చర్ చేయడం చూశా.. ఈ క్రమంలో ఆ పార్క్‌కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్‌లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను. రచయిత : కవిత యార్లగడ్డ ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా (చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!) -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..
చండీగడ్: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషల్ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్ పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా.. కలెసర్ నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు -
బాబోయ్.. టూరిస్ట్‌లపై పులి ఎటాక్! వీడియో వైరల్
-
Kuno: మరో చీతా కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా కన్నుమూసింది. ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైన చీతా.. సాయంత్రం కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. నెల వ్యవధిలో ఇది రెండో చీతా మరణం. సౌతాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరేళ్ల వయసున్న ఉదయ్ అనే చీతా ఆదివారం కన్నుమూసింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా అది అస్వస్థతతో కనిపించిందని, మత్తు మందు ఇచ్చి బంధించి చికిత్స అందిస్తుండగా అది సాయంత్రం మరణించింది అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే అది ఎందుకు మరణించిందో తెలుస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఐదేళ్ల వయసున్న నమీబియన్ చీతా షాషా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ చీతా కోసం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను కేంద్ర ప్రభుత్వం రప్పించింది. ఇందులో రెండు మరణించగా.. 18 మిగిలాయి ఇప్పుడు. -
పులులు గర్జిస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: మన జాతీయ జంతువు పులిని సంరక్షించేందుకు ‘ప్రాజెక్టు టైగర్’ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. అంతరించిపోతున్న పులులను సంరక్షించేందుకు 1973 ఏప్రిల్ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. 9 వేల చదరపు కిలోమీటర్లలో ఉన్న 9 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లతో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు 18 రాష్ట్రాల పరిధిలోని 75 వేల చదరపు కిలోమీటర్లలో 53 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లకు విస్తరించింది. 1973లో జరిగిన మొదటి పులుల గణనలో 1,827 పులులు ఉండగా.. 2018 గణన ప్రకారం ఆ సంఖ్య 2,967కి పెరిగింది. ప్రపంచంలోని ఉన్న మొత్తం పులుల సంఖ్యలో ఇప్పుడు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. టైగర్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. పూర్వం 2 లక్షల పైనే ఉండేవి జీవ వైవిధ్యంలో ఎంతో కీలకమైన పులుల జీవనానికి మన దేశం అత్యంత అనుకూలంగా ఉండేది. చాలా ఏళ్ల క్రితం దేశంలో 2 లక్షలకు పైగా పులులు ఉండేవి. కానీ.. చక్రవర్తులు, రాజులు పులుల్ని వేటాడటాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట అత్యంత క్రూరంగా సాగింది. ఒక్కో రాజు పదులు, వందల సంఖ్యలో పులుల్ని చంపి.. తాము గొప్ప వీరులమని ప్రచారం చేసుకునేవారు. బ్రిటిష్ హయాంలోనూ వాటి వేట ఇష్టారాజ్యంగా కొనసాగింది. బ్రిటీషర్ల కాలంలోనే సాగు భూమి కోసం అడవుల్ని ఆక్రమించడంతో పులుల సంఖ్య తగ్గిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 40 వేల పులులు మాత్రమే మిగిలినట్టు అంచనా. పులి అవయవాలన్నింటికీ డిమాండ్ ఉండటంతో ఆ తర్వాత కూడా వేట కొనసాగింది. ఫలితంగా క్రమేపీ అవి అంతరించే దశకు చేరుకున్నాయి. వన్యప్రాణుల చట్టం రక్షించింది 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం రావడం.. పర్యావరణంలో పులుల పాత్ర చాలా ముఖ్యమని భావించడంతో వాటి సంరక్షణకు బీజం పడింది. ఆ నేపథ్యంలోనే 1973లో ప్రాజెక్టు టైగర్ ఏర్పాటైంది. 1990వ దశకంలో పులుల ఆవాసాల సంరక్షణ ఇబ్బందిగా మారింది. 1993 నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతచేసినా పులుల సంఖ్య పెరగలేదు. 2006 నాటికి దేశంలో పులులు సంఖ్య 1411కి పడిపోయింది. ఇలాగే వదిలేస్తే పులులు అంతరించే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం పులుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడంతోపాటు సంరక్షణ విధానాన్ని కూడా మార్చింది. వాటి ఆవాసాలను సంరక్షించడంతోపాటు వేటను చాలావరకు నియంత్రించింది. ఫలితంగా అంతరిస్తున్న పులుల సంఖ్య నెమ్మదిగా పెరిగి కొన్నేళ్లుగా స్థిరంగా ఉంటోంది. 1973లో టైగర్ ప్రాజెక్టు బడ్జెట్ రూ.4 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.500 కోట్లు. ఇంతచేసినా రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ.. మిగిలిన రిజర్వు ఫారెస్ట్‌లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2,967కి చేరింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ నెల 9న ప్రధాని మోదీ మైసూరులో 2022 పులుల గణన వివరాలను విడుదల చేయనున్నారు. ఈ గణనలో పులుల సంఖ్య పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి. (చదవండి: జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల) -
వేటగాడే వేటకు బలి.. అరుదైన దృశ్యం నెట్టింట వైరల్..
బలహీనుడిపై బలవంతుడుపై చేయి సాధించడం తెలిసిందే.. అయితే ఇద్దరు బలవంతుల మధ్య పోటీ జరిగితే విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చిరుతపులిని తింటున్న పులి చిత్రాన్ని నెట్టింట షేర్ చేశారు. రణతంబోర్ నేషనల్ పార్క్‌లో అనూహ్యంగా ఒక పులి చిరుతను వేటాడింది. వాటి మధ్య జరిగిన బీకర పోరులో చిరుత పులి చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చిరుతను చంపిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంతో తింటోంది. అందులో సఫారీకి వచ్చిన పర్యాటకులు కొందరు ఈ ఘటనను ఫోటో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పులి, చిరుతపులి మధ్య పోరాటం చాలా అరుదని కామెంట్లు పెడుతున్నారు. Wild wild world. The tiger name is T 101 of Ranthambore. @HJunglebook recently captured it and want everyone to witness it. pic.twitter.com/dAT7WNvxtv — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 1, 2023 -
అడవిలోకి రెండు చీతాలు విడుదల
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాల్లో రెండింటిని అటవీ ప్రాంతంలోకి వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 2022 సెప్టెంబర్‌లో ఇక్కడికి చేరుకున్న 8 చీతాలను మొదటగా ప్రత్యేకమైన ఎన్క్లోజర్లలోకి, అనంతరం హంటింగ్ ఎన్క్లోజర్లలోకి తరలించారు. శనివారం మొదట మగ చీతా ఒబన్ను, కొన్ని గంటల తర్వాత ఆషా అనే ఆడ చీతాను అడవిలోకి వదిలామని ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ చెప్పారు. మిగిలిన వాటిని కూడా నిర్ణీత సమయాల్లో అడవిలోకి విడిచిపెడతామన్నారు. మొన్న ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
రాజస్థాన్‌లో బన్నీ టూర్.. వైరలవుతున్న వీడియో
ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా విరామం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజస్థాన్‌లో ఫ్యామిలీతో కలిసి పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ వ్యాకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అలాగే ఓ నేషనల్ పార్క్‌లో అల్లు అర్జున్ పులిని ఫోటో తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా.. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు బన్నీ. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. రణథంబోర్ నేషనల్ పార్కులో దూరంగా ఉన్న పులిని తన పిల్లలకు చూపిస్తూ కనిపించాడు బన్నీ. అయితే పుష్ప-2 షూటింగ్లో మళ్లీ త్వరలోనే మళ్లీ బన్నీ జాయిన్ అవ్వాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning 🔥😍😍@alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y — KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ 🪓 (@KarthikAADHF__) February 28, 2023 View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
వన్యప్రాణుల వైవిధ్యానికి ఊతం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల రాకతో మన దేశంలో వన్యప్రాణుల వైవిధ్యానికి మరింత ఊతం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చీతాల రాకపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్‌ను మోదీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ప్రాజెక్టు చీతా’ మరో మైలురాయికి చేరుకుందని భూపేంద్ర యాదవ్ తన ట్వీట్లో వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో రప్పించిన 12 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. లద్ధాఖ్‌లో జీవనం మరింత సులభతరం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో ప్రజల జీవనాన్ని మరింత సులభతరంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 4.1 కిలోమీటర్ల పొడవైన షిన్‌కున్ లా సొరంగం నిర్మాణానికి రూ.1,681.51 కోట్లు కేటాయించడానికి కేంద్రం అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ లద్ధాఖ్ ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ చేసిన ట్వీట్‌ను మోదీ ట్యాగ్ చేశారు. ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజలకు అందించిన సుపరిపాలన మనకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులరి్పంచారు. -
దక్షిణాఫ్రికా నుంచి యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు..
భోపాల్: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యావద్ ఈ చీతాలను కునో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్క్లోజర్లలో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. #WelcomeHome An #IAF C-17 aircraft carrying the second batch of 12 #Cheetahs landed at AF Station Gwalior today, after a 10 hour flight from Johannesburg, South Africa. These Cheetahs will now be airlifted in IAF helicopters and released in the #KunoNationalPark. pic.twitter.com/Pk0YXcDtAV — Indian Air Force (@IAF_MCC) February 18, 2023 భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. చదవండి: బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు ఏకంగా రూ.800 వరకు ఖర్చు! -
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు
జోహన్నెస్‌బర్/న్యూఢిల్లీ: భారత్‌కు మరో డజను చీతాలు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చే చీతాలను మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో ఉంచుతారు. దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్లీ పెంచేందుకు కొద్ది నెలల క్రితం నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు వాటికి తోడుగా ఫిబ్రవరిలో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వస్తాయని అటవీ, మత్స్య సంపద సంరక్షణ, పర్యావరణ (డీఎఫ్ఎఫ్ఈ) శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 12 చీతాలు వస్తే, ఆ తర్వాత ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఏడాదికి 12 చీతాలు చొప్పున వస్తాయి. ప్రపంచంలోనున్న 7 వేల చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో ఉన్నాయి. -
గుడ్‌న్యూస్.. భారత్‌కు మరో 12 చీతాలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఆయన వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు దక్షిణాఫ్రికాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. జనవరిలో మరో 12 రానున్నాయి. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
ఉల్లాసంగా చీతాలు: మోదీ
న్యూఢిల్లీ: నమీబియా నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని, కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాయని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా గొప్పవార్త. నిర్బంధ క్వారంటైన్ తర్వాత కునో పార్కు వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా రెండు చీతాలను మాత్రం మరింత పెద్దదైన ఎన్‌క్లోజర్‌లోకి వదులుతామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత మిగతా వాటిని విడతలుగా వదులుతారు’అని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. రెండు చీతాలను శనివారం పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. పెద్ద ఎన్‌క్లోజర్ విస్తీర్ణం ఐదు చదరపు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెప్పారు. 30–66 నెలల వయస్సున్న 8 చీతాలను సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్లో ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్క్‌తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్‌ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్ -
చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ
ముంబై: దేశంలోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ డిసీజ్‌కు, గత నెలలో కేంద్రం విదేశం నుంచి తీసుకొచ్చిన చీతాలతో ముడిపెడ్డారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. నైజీరియా నుంచి వచ్చిన చీతాల కరాణంగానే లంపీ డిసీజ్ దేశంలో వ్యాపించి వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆరోపించారు. దేశంలోని రైతులకు నష్టం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ చీతాలను తీసుకొచ్చిందని అన్నారు. 'వేరే దేశం నుంచి చీతాలను తీసుకొస్తే దేశంలోని రైతులు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలు పరిష్కారం కావు. ఇవి చాలవన్నట్లు చీతాలు దేశంలోకి వచ్చాక లంపీ డిసీజ్ ప్రబలింది. గతేడాది నష్టానికి పరిహారంగా రైతులకు కేంద్రం రూ.700 చెల్లించాలి. ఈ ఏడాది బోనస్‌గా మరో రూ.1000 ఇవ్వాలి అని పటోలే డిమాండ్ చేశారు. బీజేపీ గట్టి కౌంటర్.. అయితే పటోలే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయనకు కనీసం నైజీరియాకు నమీబియాకు తేడా తెలియదని ఎద్దేవా చేసింది. నానా పటోలే మహారాష్ట్ర రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు వార్తలు, అబద్దాల ప్రచారం కాంగ్రెస్‌కు అలవాటే అని ఏకిపారేసింది. ఈమేరకు బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. Nana Patole who is Rahul Gandhi of Maharashtra says Lumpy Virus originated in Nigeria & it came because Modi ji brought Cheetahs! Cheetahs came from Namibia Does he know Nigeria & Namibia are different nations? Congress has always spread such lies & rumours 1/n — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 3, 2022 కరోనా సమయంలోనూ వ్యాక్సిన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందనని షహ్జాద్ విమర్శించారు. ఫేక్ వార్తలను సృష్టిస్తున్న పటోలేపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. అయితే పటోలే నైజీరియా నుంచి చీతాలను తీసుకొచ్చారని చెప్పడంతో బీజేపీకి మంచి అవకాశం దక్కినట్లయింది. దీన్నే అదనుగా తీసుకుని విమర్శలు గుప్పించింది. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్!
ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చీతాలను చూస్తున్న జనం దాదాపు అలాగే కనిపించే చిరుత పులులుగా భ్రమపడటం, మన దగ్గర ఉన్నాయిగా అనుకోవడం కూడా కనిపిస్తోంది. నిజానికి పిల్లి నుంచి పెద్దపులి దాకా అన్నీ ఒకే ప్రధాన జాతికి చెందిన జీవులు. ఇందులోనే చీతాలు, చిరుత పులులు, జాగ్వార్లు, పుమాలు వంటివి ఉప జాతులుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో ఉంటాయి. వాటి ఆకారం, పరిమాణం కూడా వేర్వేరుగా ఉంటాయి. జాగ్వార్లు పెద్దగా బరువు ఎక్కువగా ఉంటాయి. చీతాలు సన్నగా ఉండి, అత్యంత వేగంగా కదులుతాయి. చిరుతలు అయితే చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు. జూలలో ఉన్నవి పరిగణనలోకి తీసుకోరు. భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. ఇలా జూలలో ఉన్న జంతువులను అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు. అడవులు, సహజ సిద్ధ ఆవాసాల్లో ఉండే వాటినే లెక్కల్లోకి తీసుకుంటారు. 1952 తర్వాత మన దేశంలోని అడవుల్లో ఎక్కడా చీతాలు కనిపించకపోవడంతో అంతరించిపోయినట్టు ప్రకటించారు. చీతాలు.. చిన్నవైనా వేగంగా.. ►ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు చీతాలు. కేవలం మూడు సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగలవు. ►ఇవి 70 కేజీల వరకు బరువు.. 112 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ►శరీరం, కాళ్లు పొడవుగా ఉంటాయి. లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి. ►రాత్రిపూట కళ్లుగా సరిగా కనబడవు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే వేటాడుతాయి. ►3, 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి. ►చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అరుదుగా రెండుమూడు కలిసి వేటాడుతాయి. ►ఒకప్పుడు మన దేశంలో విస్తృతంగా ఉండేవి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డి భూములను ఆవాసాలుగా చేసుకుంటాయి. మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు. చిరుతలు.. మధ్యస్థం, ప్రమాదకరం.. ►ఈ జాతి జీవుల్లో మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ. ►నాజూకుగా కనిపించే శరీరం, పొట్టి కాళ్లు, మందమైన తోక ఉంటాయి. వీటి కంటిచూపు అత్యంత చురుకైనది. చెట్లు కూడా ఎక్కగలవు. ►ఏడాది పొడవునా, ప్రధానంగా వానాకాలంలో పిల్లలను కంటాయి. అందుకే వీటి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ►ఇవి భారత ఉప ఖండం, ఆగ్నేయాసియా, సబ్ సహరన్ ఆఫ్రికా, పశ్చిమ, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ. ►తమ ఆవాసాలు, ప్రాంతాలను బట్టి వీటి రంగులో కొంత తేడా ఉంటుంది. గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. ►ఇవి క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. మన దేశంలోని చాలాచోట్ల చిరుతలు మనుషులపై దాడిచేసిన ఘటనలు ఉన్నాయి. జాగ్వార్లు.. భారీ పరిమాణంలో.. ►ఇవి బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి. ఈ జాతిలో సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. 65 కేజీల నుంచి 140 కేజీల దాకా బరువుంటాయి. ►చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. ►ముదురు ఎరుపు, గోధుమ వర్ణంతోపాటు పసుపు (టానీ ఎల్లో కలర్) రంగులోనూ ఉంటాయి. వీటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి. ఇవి రాత్రీపగలు వేటాడగలవు. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. జాగ్వార్లు నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు. -
ఆ అతిథులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఏనుగులు!
భోపాల్: సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఈ చిరుతలను.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ కునో నేషనల్ పార్క్‌లో ఈనెల 17వ తేదీన విడిచిపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాట చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే స్వేచ్ఛగా జాతీయ పార్క్‌లో విడిచిపెడతారు. మరోవైపు.. ఈ చీతాల భద్రతకు అన్ని ఏర్పాటు చేప్టటారు కునో పార్క్ నిర్వహణ అధికారులు. చీతాల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. నర్మదాపురంలోని సత్పురా టైగర్ రిజర్వ్‌కు చెందిన రెండు గజరాజులను కునో పార్క్‌కు తీసుకొచ్చారు. వాటికి ఉన్న అనుభవం ఆధారంగా గజరాజులు లక్ష్మి, సిద్ధనాథ్లను గత నెలలోనే పార్క్‌కు తీసుకొచ్చారు అధికారులు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన 5 చిరుతలను బయటకి తరిమేసే ఆపరేషన్‌లో ఈ రెండు ఏనుగులు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు గజరాజులు నేషనల్ పార్క్ సెక్యూరిటీ బృందాలతో కలిసి రేయింబవళ్లు గస్తీ కాస్తున్నాయి. ఏనుగులతో తిరుగుతూ చీతాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఏనుగులు ఉండటం ద్వారా ఏ వన్యప్రాణులు చీతాలు ఉన్న ఎన్‌క్లోజర్ వైపు రావని చెబుతున్నారు. ‘పులుల రెష్యూ ఆపరేషన్‌లో 30 ఏళ్ల సిద్ధనాథ్ మంచి గుర్తింపు పొందాడు. అయితే, సిద్ధనాథ్‌కు టెంపర్ సమస్య ఉంది. 2010లో ఈ ఏనుగు కోపానికి ఇద్దరు బలయ్యారు. అలాగే..2021, జనవరిలో ఓ టైగర్‌ను నియంత్రించటంలో సిద్ధనాథ్ కీలక పాత్ర పోషించింది. 25 ఏళ్ల లక్ష్మి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, తన పనిలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని తెలిపారు కునో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ వర్మ. ఇదీ చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. వాటిలో ఒకదానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ -
70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో చీతాలు మనుగడ మొదలుపెట్టాయి. 1952లో దేశంలో అంతరించిపోయాయని ప్రకటించిన చీతాలు తాజాగా భారత్ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నాడు నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువచ్చారు. వీటిలో రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి వీటిని తీసుకురావడానికి బీ 747 జంబో జెట్‌కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. Photo Courtesy : Cheetah Conservation Fund ప్రధాని స్వయంగా మధ్యప్రదేశ్‌లోని కునో–పాల్పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి శనివారం ఉదయం 11 గంటలకు చీతాలను విడుదల చేశారు. నమీబియా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలను నెల రోజుల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్ చేశారు. అనంతరం భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెడతారు. చదవండి: చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు Photo Courtesy : Cheetah Conservation Fund చీతాకు పేరు పెట్టిన మోదీ కునో నేషనల్ పార్క్‌లో మొదటి రోజు చీతాలు గడ్డిపై ఆడుతూ, పరుగెత్తుకుంటూ, పరిసరాలను గమనిస్తూ గడిపాయి. అయిదు ఆడ చీతాల్లో ఒకదానికి ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టారు. దాదాపు నాలుగేళ్ల వయసున్న ఈ చీతాను నమీబియాలోని సీసీఎఫ్‌కు (చిరుత సంరక్షణ నిధి) తీసుకొచ్చిన తర్వాత పేరు పెట్టలేదు. తరువాత ప్రధాని తన పుట్టిన రోజు కానుకగా దీనికి ‘ఆశా’ అనే పేరును సూచించారు. ఆడ చీతాల పేర్లు ఆడ చిరుతలల్లో ఒకదాని పేరు సియాయా. దీని వయసు రెండేళ్లు. ఇది సెప్టెంబర్ 2020 నుంచి సీసీఎఫ్లో ఉంది. మరో చీతా ‘టిబిలిసి’ కాగా దీని వయసు రెండున్నర సంవత్సరాలు. ఇది 2020 ఏప్రిల్ నెలలో నమీబియాలోని ఆగ్నేయ నగరం ఒమరూరులోని ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో జన్మించింది. ఆడ చీతల్లో పెద్దదైనది ‘సాషా’. మరో ఆడ చీతా సవన్నా.. వీటిని వాయువ్య నమీబియా నుంచి తీసుకొచ్చారు. Photo Courtesy : Cheetah Conservation Fund మగ చీతాల పేర్లు ఇవే మగ చీతాలు మూడు ఉండగా అందులో మొదటిది ఐదేళ్ల ‘ఫ్రెడ్డీ’. దాని సోదరుడు ఎల్టన్. దీని వయసు అయిదున్నర సంవత్సరాలు. ఇవి 2021 జూలై నుంచి సీసీఎఫ్ ప్రైవేట్ రిజర్వ్‌లో ఉంటున్నాయి. ఇక మూడో మగ చీతా నాలుగున్నర ఏళ్ల వయసున్న ‘ఓబాన్’. ఇది మార్చి 2018లో ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో జన్మించింది. కాగా చిరుతలు ఎన్‌క్లోజర్‌లో విడుదలైన క్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవి మన అతిథులని, కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయని హర్షం వెలిబుచ్చారు. చదవండి: కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో Photo Courtesy : Cheetah Conservation Fund -
చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
మధ్యప్రదేశ్: నరేంద్రమోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని చీతా(చిరుత పులుల్లో ఒక రకం) ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నేషనల్ పార్క్ సమీపంలో గ్రామాల్లోని ప్రజలు ఈ చిరుతల రాకతో భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది ఈ చిరుత కారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుందని, అందువల్ల ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ చాలామంది గ్రామస్తులు తమ భూములను లాక్కుంటారేమోనని భయపడుతున్నారు. ఈ చిరుతుల రాక మధ్యప్రదేశ్‌లోని షియాపూర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తుల్లో లేని భయాలను రేకెత్తించింది. వారిలో ఈ భయాందోళనలకు కారణం...గతంలో సుమారు నాలుగు నుంచి ఐదు గ్రామాలను పార్కు కోసం మార్చడం, అలాగే సుమారు 25 గ్రామాల ప్రజలను తరలించడం వంటివి జరిగాయి. దీంతో వారు తమ భూములను, నివాసాలను కోల్పోయి..ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు ఆ గ్రామానికి సమీపంలోని ఆనకట్ట ప్రాజెక్టు కారణంగా కూడా ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని రామ్‌కుమార్ గుర్జార్ అనే మరో రైతు చెబుతున్నాడు. మీ గ్రామానికి సమీపంలోని పార్కుల్లో చిరుతల రాక గురించి గ్రామస్తుల అభిప్రాయం గురించి ప్రశ్నించగా... జాతీయ ఉద్యానవనం కోసం గ్రామాలను లాక్కున్నారు. ఇప్పుడూ సమీపంలోని కునో నదిపై ఆనకట్ట ప్రాజెక్లు నిర్మించనున్నారు...ఇది మరో 50 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేషనల్ పార్క్‌ల వల్ల పర్యాటకులు పెరిగినప్పటికీ....ధనవంతులే వ్యాపారాలు నిర్వహించుకుంటారని, తమకు ఉపాధి దొరకదని అంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల కోసం తమ భూములను లాక్కుంటారని గ్రామస్తులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: కునో పార్కులో చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..) -
ఎన్నాళ్లో వేచిన ఉదయం...
షోపూర్: కునో నేషనల్ పార్కు. శనివారం ఉదయం 11.30 గంటలు. బోను తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఓ చీతా హుందాగా, నెమ్మదిగా బయటికొచ్చింది. తనకు బొత్తిగా అలవాటు లేని కొత్త వాతావరణం పలకరించడంతో తొలుత కాస్త అయోమయానికి లోనైంది. మెల్లిగా పరిసరాలను 360 డిగ్రీలూ స్కాన్ చేసింది. తర్వాత ఎదురుగా పరుచుకున్న తనకెంతో ఇష్టమైన గడ్డి మైదానంలోకి ఒక్కో అడుగే వేసింది. చూస్తుండగానే మెరుపు వేగంతో పరుగందుకుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ చెట్టు దగ్గర ఆగింది. తలను చుట్టూ తిప్పుతూ పరిసరాలను మరోసారి నింపాదిగా పరికించి చూసింది. తర్వాత స్వేచ్ఛా సంచారం మొదలు పెట్టింది. అలా... 70 ఏళ్ల కింద భారత్‌లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది. ఈ అపురూప క్షణాలను మీడియాతో పాటు బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే వాటిని కునో పార్కులోకి వదిలిపెట్టారు. ‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి శనివారం ఉదయం గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి. ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో చీతాల ఉనికిని పునరుద్ధరించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ‘‘ఇన్ని దశాబ్దాల తర్వాత మిత్రదేశమైన నమీబియా మద్దతుతో వాటిని రప్పించగలిగాం. ఇకనుంచి కునో పార్కు గడ్డి మైదానాల్లో చీతాలు పరుగులు తీస్తూ కనువిందు చేస్తాయి’’ అన్నారు. ‘‘కేంద్రం నిరంతర కృషి ఫలితంగా పులులు, ఏనుగులు, సింహాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కూడా ప్రగతి సాధ్యమేనని ప్రపంచానికి మనం సందేశమిస్తున్నాం’’ అని చెప్పారు. ఇలా తరలించారు... నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్‌లో వాటి కథ ముగిసిపోయింది. ఇవేం తమాషాలు: కాంగ్రెస్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సమస్యల నుంచి, భారత్ జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు చీతాల విడుదల పేరిట తమాషాకు తెర తీశారంటూ దుయ్యబట్టింది. చౌకబారు ట్రిక్స్‌లో బీజేపీ నేతలకు భారతరత్న ఇవ్వొచ్చంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. చీతాలను రప్పించే ప్రాజెక్టుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009లో తెర తీసిందంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో ప్రత్యేకంగా జోడో యాత్ర చేస్తామన్నారు. నన్ను కూడా రానివ్వొద్దు! తర్వాత ‘చీతా మిత్ర’ సిబ్బందితో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ‘‘చీతాలను జాగ్రత్తగా చూసుకోండి. మనుషులకు, వాటికి అనవసర సంఘర్షణ తలెత్తకుండా చూడండి. కొత్త వాతావరణానికి అవి అలవాటు పడేదాకా ఎవరినీ వాటి దగ్గరికి పోనివ్వకండి. నాయకులు, బ్రేకింగ్ న్యూస్ కోసం వచ్చే మీడియా, అధికారులు, నా బంధువులు ఎవరినీ కునో నేషనల్ పార్కులోకి అనుమతించొద్దు. స్వయంగా నేనే వచ్చినా సరే, అడ్డుకోండి’’ అని సూచించారు! చీతాల పరిరక్షణకు, వాటిని గురించి పరిసర గ్రామాల వారికి అవగాహన కల్పించేందుకు 400 మంది యువకులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. గుజరాత్ సీఎంగా ఉండగా సింహాల సంఖ్య పెంచే చర్యల్లో భాగంగా ఇలాగే 300 మంది వన్యప్రాణి మిత్రులను నియమించినట్టు మోదీ గుర్తు తెచ్చుకున్నారు. -
మోదీకి ఇంతకు మించి గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు!
న్యూఢిల్లీ: మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఎనిమిది చిరుతలు నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ... మోదీకి తాము ఇంతకు మించి గొప్ప బహుమతి ఇవ్వలేమని అన్నారు. అతిపెద్ద వన్యప్రాణులను జంబో జెట్ ద్వారా తరలించడం అనేది చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. దీని వల్ల కునో పాల్పూర్ ప్రాంతం పర్యాటకంగా వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. భారత్ గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్ చీతా అనే ఖండాంతర ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్‌కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్ ఖండాంతర భారీ వైల్డ్ మాంసాహార ట్రాన్స్ లోకేషన్ ప్రాజెక్ట్ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ చిరుతలు భారత్‌లోని ఓపెన్ ఫారెస్ట్ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్ సీక్వెస్ట్రేషన్, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వస్తున్న 8 చిరుతలు మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడ నుంచి కునో నేషనల్ పార్క్‌కి హెలికాప్టర్లో తరలిస్తారు.ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి. (చదవండి: మోదీ పుట్టిన రోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?) డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్‌లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే.. -
70 ఏళ్ల తర్వాత.. స్పెషల్ జర్నీతో భారత్‌లో అడుగు
దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చీతాల మెరుపు కదలికల్ని దేశంలో చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువస్తున్నారు. ప్రధాని మోదీ తన పుట్టిన రోజునాడు మధ్యప్రదేశ్‌లోని కునో–పాల్పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి చీతాలను విడుదల చేస్తారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. నమీబియా రాజధాని విండ్‌హెక్ నుంచి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానం బయల్దేరి రాజస్తాన్‌లోని జైపూర్‌కి శనివారం ఉదయం చేరుకుంటుంది. అక్కడ్నుంచి హెలికాప్టర్లో మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌కి తరలిస్తారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. చీతాల క్షేమమే లక్ష్యంగా ప్రయాణంలో చీతాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు జంతువులకి కడుపులో తిప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాటికి ఆహారం ఇవ్వకుండా ఖాళీ కడుపుతో తీసుకువస్తారు. విమానంలో చీతాలను ఉంచడానికి 114సెం.మీ గీ8సెం.మీ గీ84సెం.మీ బోనుల్ని ఏర్పాటు చేశారు. ప్రయాణంలో చీతాల బాగోగుల్ని చూడడానికి ముగ్గురు సంరక్షకులు వెంట ఉంటారు. ప్రత్యేక శ్రద్ధ వన్యప్రాణుల్ని ఖండాంతరాలకు తరలించాల్సి వస్తే ప్రయాణానికి ముందు తర్వాత నెల రోజులు క్వారంటైన్లో ఉంచాలి. ఆ నిబంధనలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. కునో జాతీయ పార్కులో చీతాలను ఉంచడానికి భారీ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. చీతాల నుంచి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా ఇప్పటికే వాటికి వ్యాక్సిన్లు ఇచ్చారు. క్వారంటైన్ సమయం పూర్తయ్యాక కొత్త వాతావరణానికి చీతాలు అలవాటు పడడం కోసం కొన్నాళ్లు అవి స్వేచ్ఛగా విహరించడానికి వీలుగా వదిలేస్తారు. అందుకే కునో నేషనల్ పార్కు చుట్టుపక్కల ఉన్న 24 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించారు. నమీబియాలో వాతావరణానికి దగ్గరగా కునో పార్క్ ఉంటుంది. అందుకే అక్కడే వాటిని ఉంచాలని నిర్ణయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిరుతల కోసం 'పులి విమానం'.. ఫోటోలు వైరల్..
న్యూఢిల్లీ: భారత్‌కు 8 చీతాలను(చిరుతలు) తీసుకొచ్చేందుకు ప్రత్యేక జంబో జెట్ నమీబియా రాజధాని విండ్‌హోక్‌కు వెళ్లింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ కస్టమైజ్డ్ విమానం ముందు భాగాన్ని పులి ఫోటోతో తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ విమానం ఫోటోలను నమీబియాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. చిరుతలను భారత్‌కు తీసుకొచ్చేందు 'టైగర్ విమానం' విండ్హోక్లో ల్యాండ్ అయిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO — India In Namibia (@IndiainNamibia) September 14, 2022 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ 8 చిరుతలు సెప్టెంబర్ 17న భారత్‌కు రానున్నాయి. మొదట రాజస్థాన్‌లో ల్యాండ్ అయి, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వీటిని విడుదల చేస్తారు. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 8 చిరుతల్లో ఐదు మగవి కాగా.. మూడు ఆడవి. అంతరించిపోయిన జాతి.. ఈ అరుదైన చిరుతలు దేశంలో అంతరించిపోయినట్లు 1952లోనే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వీటిని పునరుత్పత్తి చేసేందుకు ఇతర దేశాల నుంచి చిరుతలను భారత్‌కు తీసుకురావడానికి 1970 నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ప్రభుత్వం. ఇంటర్కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టులో భాగంగా 8 చిరుతలను నమీబియా నుంచి తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే పులి విమానాన్ని తయారు చేశారు. ఇందులో చిరుతల కోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. అంతేకాదు 16 గంటల పాటు ఈ విమానం నిర్విరామంగా ప్రయాణించి భారత్‌కు చేరుకోనుంది. మధ్యలో ఎక్కడా ఇంధనం కోసం కూడా ఆగాల్సిన అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. ఈ 16 గంటలు చిరుతలకు ఎలాంటి ఆహారం అందించరు. గాల్లోనే ప్రయాణిస్తున్నందున వాటికి న్యూయేసియా వంటి సమస్యలు రాకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
Viral Video: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో వేటాడేస్తా
-
సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..
మన సరదాగా వన్యమృగాలతో చూడాలనో లేక సరదాగడుపదామనో మనం నేషలనల్ జూలాజికల్ పార్క్‌లు వంటి రకరకాల పార్కులకి వెళ్తాం. అయితే పార్క్‌లో ఉండే సంరక్షణాధికారులు సూచించినట్లుగా అక్కడ ఉన్న జంతువులతో జాగ్రత్తగా మసులుకోకపోతే చేదు అనుభవాలను ఎదర్కొక తప్పదు. (చదవండి: ఇదేం ట్రెండ్....చెత్త వేసే సంచిని ధరించడం ఏమిటి ?) అంతేకాదు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్న వాళ్ల గురించి ఇటీవల కాలంలో చాలానే విని ఉన్నాం. అయినప్పటికి పర్యాటకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి ఎందుకు తెచ్చకుంటారో అర్ధంకాదు. అట్లాంటి చేదు అనుభవమే టాంజానియా పార్క్‌కి వెళ్లిన ఒక పర్యాటక బృందానికి ఎదురైంది. అసలు ఎక్కడ జరిగింది ఏమైంది చూద్దాం రండి. వివరాల్లోకెళ్లితే....టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఒక పర్యాటక బృందం కారులో కూర్చోని సింహాన్ని చూస్తుంటారు. అయితే ఆ సింహం వాళ్ల కారు పక్కనే ఉన్నప్పటికీ అది ఆ కారుని గమనించ కుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. దీంతో ఒక పర్యాటక బృందంలోని ఒక వ్యక్తి కారు కిటకి డోరు తీసి సింహాన్ని తాకడానికి ప్రయత్నించడమే కాక ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంతే ఒక్కసారిగా సింహం పెద్దగా గాండ్రిస్తూ కిటికిలోకి తల దూర్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సదరు పర్యాటకుడు షాక్‌కి గురై సీటు వెనక్కి వెళ్లి పోతాడు. ఇంతలో కారులో ఉన్న మిగతావాళ్లంతా కిటికి మూసేయ్ అంటూ కేకలు వేయడంతో కిటికిని మూసేయడానికి చాలా కష్టపడతాడు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర జంతువులతో తస్మాత్ జాగ్రత్త. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్‌గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’
సఫారీలో జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. తేడా కొడితే మాత్రం ఇలా గుండెకాయ నోట్లోకి జారినట్లు కూడా ఉంటుంది. అలాంటి ఘటనే శ్రీలంకలోని యాలా నేషనల్ పార్కులో చోటుచేసుకుంది. పార్క్‌లో జనంతో నిండిన జీప్‌పై అడవి ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది. ‘ఇది నా ఏరియా.. మీరేందుకు వచ్చారు’ అనేలా వారిపై విరుచుకుపడింది. చదవండి: కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి! అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించిన ఫోటోగ్రాఫర్ సెర్గీ తెలిపారు. సియనా ఇంటర్నేషనల్ ఫోటో పురస్కారాల్లో జర్నీస్ అండ్ అడ్వంచర్స్ కేటగిరీలో ఈ చిత్రం మెదట బహుమతిని గెలుచుకుంది. -
సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా..
నైరోబి: అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చీతా. విషయమేమిటంటే.. ఈ సింహానికి కొంతదూరంలో చీతా, దాని పిల్లలు కనిపించాయి. ఈ మధ్యాహ్నం భోజనం దొరికినట్లేననుకున్న సింహం... పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించింది. తనకంటే మూడు రెట్లు పెద్దదైన సింహాన్ని చూసి భయపడి మొదట పారిపోయే ప్రయత్నం చేసిందీ చీతా. ఎప్పుడైతే సింహం... తన పిల్లలను తినడానికి ప్రయత్నించిందో.. ఆ అమ్మ ఆదిశక్తిగా మారింది.. తిరగబడింది.. ఊహించని పరిణామంతో సింహం వెనక్కి తగ్గింది. కాళ్లకు పనిచెప్పింది. కెన్యాలోని మాసై మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టులోని ఈ దృశ్యాలను తన కెమెరాతో బంధించాడో ఫొటోగ్రాఫర్. చదవండి: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి
అడవంటే పూర్తిగా అడవీ కాదు, నది పాయ అందామంటే అవి మాత్రమే కాదు. సముద్రతీరం అనుకుందామంటే కచ్చితంగా అలా కూడా చెప్పలేం. గంగ, మేఘన, బ్రహ్మపుత్ర వేటికవి తమ దారిన తాము పయనిస్తూ అటవీప్రాంతానికి పచ్చదనాన్ని అద్దుతూ ఉంటాయి. నదులు పాయలు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. నీటి పాయల తీరాన ఎల్తైన మడ అడువులు తెచ్చిన ప్రాకృతిక సౌందర్యం మాటల్లో వర్ణించలేనిది. ఆ చెట్ల వల్లనే ఈ అడవికి సుందర్వన్ అనే పేరు వచ్చింది. బెంగాలీ, ఒడిషా భాషల్లో ‘వ’ అనే అక్షరం ఉండదు. ‘వ’ కు బదులుగా ‘బ’ ఉపయోగిస్తారు. అందుకే ఈ సుందరవనం సుందర్బన్ అయింది. నీటిలో పులి నేల మీద మొసలి అడవి అంటే... పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే... సుందర్బన్లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు... మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్ రాయల్ టైగర్‌లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. అడవిలో ఊళ్లు మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు. సరిహద్దు దీవి మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు. సాహిత్యవనం సుందర్బన్ అటవీప్రదేశం కోల్‌కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ నేచర్’ కేటగిరీలో లిస్ట్ అయింది. బెంగాలీ రచయితలు సుందర్బన్ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు. సుందరబన్‌కు ప్రత్యేక హోదాలు ► 1973 టైగర్ రిజర్వ్ ► 1987 వరల్డ్ హెరిటేజ్ సైట్ ► 1989 నేషనల్ పార్క్ -
ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్
కొచ్చీ: మనుషుల్లోని క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన కేరళలో జరిగింది. టపాకాయల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందింది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులోని వెల్లియార్ నది వద్ద మే 27వ తేదీన జరిగిన ఈ దారుణం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్ ఏనుగు గొంతులో పేలిపోయింది. అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకొచ్చారు. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. -
పులిని పులి ఫొటో తీసింది..!
ఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. పలు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తూ కుటుంబంతో బిజీగా గడుపుతున్నాడు. ఈ మధ్యనే మాల్దీవులకు వెళ్లిన ధోని.. అక్కడ అందాలను ఆస్వాదించాడు ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్పి సింగ్, పీయూష్ చావ్లాలను కలిసిన ధోని వారితో సరదాగా గడిపాడు. ఓ పానీపూరి స్టాల్ దగ్గర నిలబడిన ధోని.. అక్కడున్న పదార్థాలను తీసుకుని పానీపూరిని తయారు చేసి ఆర్పీ సింగ్, చావ్లాలకు అందించాడు. ఇదిలా ఉంచితే, తాజాగా ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత జోష్‌ను తీసుకొచ్చింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కన్హా పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ధోని.. తనలోని ఫొటోగ్రాఫ్ కళను బయటకు తీశాడు. కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన ధోని.. అక్కడ పులులను ఫొటోలు తీస్తూ ఆహ్లాదంగా గడిపాడు. ఆ నేషనల్ పార్క్‌లో ఉన్న పులిని ఒక ఫొటోలో బంధించి అభిమానులకు షేర్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. దానికి అభిమానుల నుంచి విశేషణ స్పందన లభిస్తోంది. దీనిలో భాగంగా ధోని ఫోటోకు ఒక అభిమాని ఇచ్చిన రిప్లే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక పులిని మరొ పులి ఫోటో తీసిందంటూ కామెంట్ చేశాడు. ధోనిని పులితో పోల్చడంతో అది ఇంకా వైరల్‌గా మారింది. గత జనవరిలో కన్హా పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించగా అక్కడ తీసిన ఫొటోనే తాజాగా షేర్ చేశాడు. 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ధోని పునరాగమనంపై ఇప్పటికే పలు రకాలు రూమర్లు చక్కర్లు కొట్టినా, టీ20 వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉంటాడని మరో వాదన వినిపిస్తోంది. అయితే ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ధోని పేరును తొలగించారు. ధోనికి ఏ కేటగిరీలోనూ బీసీసీఐ చోటు కల్పించలేదు. ఫలితంగా ధోని శకం ముగిసిందంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో అంటే ధోనిని కాంట్రాక్ట్ నుంచి తొలగించిన రోజు ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలో జార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేశాడు. -
అదొక భయానక దృశ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ‘ఎల్లోస్టోన్ నేషనల్ స్టోన్ పార్క్’లో సోమవారం చోటుచేసుకున్న భయానక దశ్యం ఇదీ. ఫ్లోరిడాలోని ఒడిస్సా ప్రాంతానికి చెందిన యాభై మంది సందర్శకులు ఆ రోజు నేషనల్ పార్క్‌లో సంచరిస్తూ అమెరికా అడవి దున్నగా పిలిచే (బైసన్) సమీపంలోకి వెళ్లారు. వారు దాదాపు 20 నిమిషాల సేపు అక్కడే గడిపారు. అనూహ్యంగా ఓ అడవిదున్న మిగతా వారికి కొంచెం ఎడంగా ఉన్న ముగ్గురు పిల్లల మీదకు దూసుకెళ్లింది. దాని దాడి నుంచి ఇద్దరు పిల్లలు తప్పించుకోగా, ఓ తొమ్మిదేళ్ల బాలకను అది కొమ్ములతోనే ఆకాశంలోకి గిరాటేసింది. ఆ దశ్యాన్ని చూసిన సందర్శకులు భయభ్రాంతులతో తలోదిక్కుకు పరుగులు తీశారు. తీవ్రంగా దెబ్బతగిలిన ఆ బాలికను ‘ఓల్డ్ ఫేత్‌ఫుల్ క్లినిక్’కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. అయితే ఆ కుటుంబ సభ్యులు నేషనల్ పార్క్ సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పార్క్ అధికారులు సంఘటనకు సంబంధించి సందర్శకులు తీసిన ఓ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. 2018లో ఓ అమ్మాయిని కూడా ఓ అడవిదున్న ఇలాగే కుమ్మేసింది. ఆ తర్వాత అలాంటి సంఘటన జరగడం ఇదేనని పార్క్ సిబ్బంది తెలిపారు. ఈపార్క్‌లో అమెరికా జాతికి చెందిన అడవి దున్నలు 4,527 ఉన్నాయి. వాటిలో మగ దున్నలు దాదాపు 920 కిలోల బరువుంటే, అడ దున్నలు దాదాపు 500 కిలోల బరువు ఉంటాయని సిబ్బంది తెలిపారు. -
పర్వతాల దెయ్యాన్ని ఈ పార్కు దగ్గర చూడొచ్చు..!
డెహ్రడూన్: అరుదైన మంచు చిరుత ఒకటి ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నేషనల్ పార్కు సమీపంలోని నెలాంగ్ వ్యాలీలో ఇటీవల దర్శనమిచ్చింది. పార్కు పక్కన ఉన్న రోడ్డు మీద నుంచి నడుస్తూ ఓ పర్వతం వైపు వెళ్లింది. చిరుత రోడ్డుపై సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రపంచంలోనే ప్రత్యేకమైన జాతికి చెందిన ఈ చిరుత వీడియోను పర్వీన్ కస్వాన్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశారు. ‘పర్వతాల దెయ్యం.. ప్రపంచంలోనే అరుదైన జాతి చిరుత.. గంగోత్రి నేషనల్ పార్క్ దగ్గర రోడ్డు మీద చూడొచ్చు’ అనే కాప్షన్‌తో అతను వీడియో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు కామెంట్ చేశారు.ఈ చిరుతను చూసిన వారు చాలా అదృష్టవంతులని ఒకరు.. ఆ మంచు చిరుత చాలా అందంగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఎతైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం.. ప్రపంచంలోని అత్యంత ఎతైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో గంగోత్రి నేషనల్ పార్క్ ఒకటి. సముద్రమట్టం నుంచి సుమారు 11 వేల అడులు ఎత్తులో ఈ పార్కు ఉంది. ఇక నెలాంగ్ వ్యాలీ చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఐటీబీపీ యూనిట్లు ఉంటాయి. ఇక ఈ అరుదైన మంచు చిరుతల ఉనికి ఉత్తరఖండ్తో పాటు హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉంది. నెలాంగ్ వ్యాలీలో మంచు చిరుతలతో పాటు హిమాలయ నీలం గొర్రెలు, అంతరించిపోతున్న కస్తూరి జింక జాతులు కూడా ఉన్నాయి. -
వైరల్ ఫోటో : బాబోయ్.. ఇదేం ఉడత
ఉడత.. చూడటానికి చాలా చిన్నగా, బుజ్జిగా భలే ముద్దుస్తోంటుంది. రామయణంలో కూడా దీనికో ప్రత్యేక స్థానం ఉంది. రాముని మీద భక్తితో తనకు తోచిన సాయం చేసి.. ఉడతా భక్తిగా ప్రసిద్ధి పొందింది. అలాంటి ఆ చిన్న ప్రాణిని చూస్తే ఎవరికైనా ముద్దుస్తోంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు. సాధరణంగా పాము, ముంగిసల మధ్య వైరం సాధరణం. ఒక వేళ పాము, ఉడతల మధ్య ఘర్షణ జరిగితే.. ఏది గెలుస్తుంది. పాము అనుకుంటాం. కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఉడత కాస్తా పామును చంపి తింది. నమ్మశక్యంగా లేకపోయిన ఇది వాస్తవం. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. అమెరికా నేషనల్ పార్క్ అధికారులు షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ ఉడత.. పామును తల దగ్గర గట్టిగా పట్టుకుని.. తినడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోటో గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఉడతలనగానే.. పళ్లు, గింజలు లాంటివి తిని జీవిస్తాయి అనుకుంటాం. కానీ రాక్ ఉడతలు ఆకులు, అలమలతో పాటు బల్లులు, పాములు, గుడ్లను కూడా తింటాయి. ఈ ఫోటోలో ఉన్న రాక్ ఉడత కూడా పామును తినేస్తుంది. ఇది వాటి స్వభావం’ అని తెలిపారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ ఫోటో ఇప్పటికే వేల షేర్స్, కామెంట్స్ అందుకుంది. ‘ఇక మీదట ఉడతల్ని చూసి కూడా భయపడాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని.. 2009లో తీశారని... దాన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో మరో సారి షేర్ చేశారని తెలిపారు అధికారులు. -
నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా?
-
నీరు నిప్పులు కక్కిన వేళ..
నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా? కక్కదుగా.. ఓసారి కాలిఫోర్నియా వెళ్లి చూడండి.. అక్కడ నీళ్లు ఇదిగో ఇలా నిప్పులు కక్కుతుంది. యెసెమెటీ నేషనల్ పార్క్‌లోని హార్స్ టెయిల్ జలపాతం ఫిబ్రవరి నెలలో మాత్రం అగ్నిపర్వతం నుంచి జాలువారే లావాను తలపిస్తుంది. దీన్ని వీక్షించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివస్తారు. ఇంతకీ అదెలా అంటే.. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కాంతి జలపాతంపై పడి.. నారింజ రంగులో నీళ్లు మెరుస్తాయి. దాని వల్ల లావాలాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఏటా ఫిబ్రవరిలో కొన్ని రోజులు మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఈ చిత్రం ఆ సందర్భంగా తీసినదే. -
‘ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారు’
కాలిఫోర్నియా : మద్యం సేవించిన కారణంగానే లోయలో పడి భారత టెకీ దంపతులు దుర్మరణం పాలై ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. మృతుల అటాప్సీ రిపోర్టులో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. గతేడాది అక్టోబరులో కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్ పార్కులోని లోయలో పడి కేరళకు చెందిన విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి(30) మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో వారిరువురు ఆల్కహాల్ సేవించారని మారిపోసా కంట్రీ అధికారి ఆండ్రియా స్టెవర్ట్ తెలిపారు. (ఇండియన్ టెకీ దంపతుల దుర్మరణం) ఇథైల్ ఆల్కహాల్ సేవించారు ‘ఆ సమయంలో విష్ణు విశ్వనాథ్, మీనాక్షి ఇథైల్ ఆల్కహాల్ సేవించారు. అయితే డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఏమీలేవు. వారు లోయలో పడి పోవడానికి ఇది కూడా కారణం అయి ఉంటుందని’ ఆండ్రియా వ్యాఖ్యానించింది. కాగా కేరళకు చెందిన ఈ జంట 2014లో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే విష్ణు, మీనాక్షిలకు సాహస యాత్రలు చేయడమంటే సరదా. ఈ క్రమంలో వారికి సంబంధించిన ప్రతీ అప్డేట్ని.. ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ స్నేహితులతో ఙ్ఞాపకాలు పంచుకునేవారు. -
కంచె.. బలితీసుకుంది!
బెంగళూరు: ఏనుగులను కాపాడేందుకు వేసిన కంచె.. ఓ గజరాజు పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని నగర్‌హోళె జాతీయ పార్కులో ఈ విషాదం జరిగింది. ఓ ఊరిలోకొచ్చిన ఏనుగును స్థానికులు తరమడంతో కంచెను దాటబోయి ఇరుక్కుపోయింది. దీంతో తన బరువుకు ఊపిరాడక మృతి చెందింది. రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోకుండా ఉండే ందుకు రక్షణగా గతంలో రైలుపట్టాలకు ఇరువైపులా రూ.212 కోట్లతో ఈ కంచెను రైల్వేశాఖ నిర్మించింది. ఏనుగును జాతీయ పార్కులోని వీరహోసహళ్లి రేంజ్‌లోకి తరిమేందుకు జనం ప్రయత్నించారని అటవీ అధికారులు తెలిపారు. కంచెపై చిక్కుకోవడంతో తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతోనే ఊపిరితిత్తుల్లో గాయమై ఏనుగు మరణించి ఉంటుందని అధికారులు వివరించారు. -
ఫెన్సింగ్ దాటబోయి.. ఏనుగు మృతి
సాక్షి, బెంగళూరు : ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్‌ను దాటబోయి 42 ఏళ్ల వయసున్న ఓ ఏనుగు మృతిచెందింది. ఈ సంఘటన కర్నాటకలోని నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగు పంటపొలాల్లో సంచరించి తిరిగి వీరాహోసహల్లీ రేంజ్‌లోకి వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఫెన్స్ దాటే సమయంలో ఏనుగు మధ్యలోనే ఇరుక్కుని చాలా సమయం కొట్టుమిట్టాడినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా నాగర్హోల్ జాతీయ పార్క్‌లో గత నవంబర్‌లో కూడా ఓ ఏనుగు మృతిచెందింది. ఎన్నో ఏళ్లుగా ఏనుగులు సంచరించే ప్రాంతాలనే మానవులు ఆక్రమిస్తూ వాటి మార్గాల్లో ఫేన్సింగ్లు నిర్మించడమేంటని జంతుప్రేమికులు మండిపడుతున్నారు. 2015లో కర్ణాటక ప్రభుత్వం ఈ ఫెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. భారీ రైల్వే పోల్ల సహాయంతో ఈ నిర్మాణాలను చేపట్టారు. మొదటి దశలో భాగంగా నాగర్హోల్ జాతీయ పార్క్ చుట్టుపక్కల మానవ ఆవాసాలున్న చోట మొత్తం 33 కిలోమీటర్ల మేర ఈ ఫేన్సింగ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. -
అమెరికాలో భారతీయ జంట మృతి
న్యూయార్క్: అమెరికాలోని ఓ జాతీయ పార్కులో 800 అడుగుల ఎత్తు ఉన్న ఒక కొండ అంచు నుంచి కిందకు పడి ఓ భారతీయ జంట దుర్మరణంపాలైంది. మృతులను విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి (30)గా గుర్తించారు. 2014లో పెళ్లిచేసుకున్న వీరు కేరళలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోసెమిటీ వ్యాలీ జాతీయపార్కులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ పార్కులో నిట్టనిలువుగా 800 అడుగుల ఎత్తు ఉండే టఫ్ట్ పాయింట్ అనే కొండ అంచు ప్రాంతం నుంచి విశ్వనాథ్, మీనాక్షిలు కింద పడ్డారు.గత బుధవారం ఉద్యానవన సందర్శకులు మృతదేహాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా గురువారం తీవ్రంగా శ్రమించి ప్రమాద స్థలి నుంచి శవాలను వెలికితీశారు. న్యూయార్క్‌లో నివసించే ఈ జంట ఇటీవలే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌జోసే నగరానికి మారారనీ, అక్కడి సిస్కో కంపెనీలో విశ్వనాథ్ ఉద్యోగం చేసేవారని అధికారులు గుర్తించారు. ప్రపంచమంతా తిరుగుతూ తమ అనుభవాలను ‘హాలిడేస్ అండ్ హ్యాప్పీలీ ఎవర్ ఆఫ్టర్స్’ అనే బ్లాగ్‌లో రాసేవారు. పార్కు అధికార ప్రతినిధి జేమీ రిచర్డ్స్ మాట్లాడుతూ ‘వారు కింద పడటానికి కారణమేంటో మాకు ఇంకా తెలియదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదొక తీవ్ర విషాద ఘటన’ అని అన్నారు. ఇదే పార్కులో ఈ మేలో ఆశిష్ పెనుగొండ (29) అనే భారతీయుడు హాప్ డోమ్ అనే ప్రాంతానికి ఎక్కుతుండగా కిందపడి మరణించాడు. ఈ ఏడాదిలోనే పది మంది మృతి యోసెమిటీ వ్యాలీ అడవి, కొండలతో నిండిన, అందమైన జాతీయపార్కు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ దారులు ప్రమాదకరంగా ఉంటాయి. ‘అడుగులు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఇక్కడ కచ్చితంగా జారిపడతారు’ అని రిచర్డ్స్ తెలిపారు. ఈ ఏడాదిలోనే యోసెమిటీ వ్యాలీ పార్కులో ప్రమాదవశాత్తూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన పదిమందిలో ఆరుగురు ఇక్కడి కొండలు ఎక్కుతున్నప్పుడే ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయారు. విశ్వనాథ్, మీనాక్షిలు పడిపోయిన ‘టఫ్ట్ పాయింట్’ అనే కొండ అంచు నుంచి చూస్తే యోసెమిటీ పార్కు మొత్తం, యోసెమిటీ జలపాతం, ఎల్ క్యాపిటన్ కొండ బాగా కనిపిస్తాయి. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ఈ కొండ అంచుకు వస్తారు. -
ఇండియన్ టెకీ దంపతుల దుర్మరణం
కాలిఫోర్నియా : అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన టెకీ దంపతులు కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్ పార్కులోని లోయలో పడి మృతిచెందారు. వివరాలు..దక్షిణ భారత్‌కు చెందిన విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి(30) దంపతులు న్యూయార్క్‌లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ ట్రిప్పులకు వెళ్లడమంటే సరదా ఉన్న ఈ జంట గురువారం కాలిఫోర్నియాలోని జాతీయ పార్కుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 800 అడుగుల లోయలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పార్క్ అధికారులు వీరి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం.. వీరి మృతదేహాలను కనుగొన్నారు. వీరిని సిస్కో కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్ టెకీలుగా గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కాగా వీరి మృతిపట్ల కేరళకు చెందిన చెంగునూర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థులైన విష్ణు, మీనాక్షి మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. వీరిద్దరు 2006-10 బ్యాచ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారికి సంబంధించిన ప్రతీ అప్డేట్ని.. ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమతో ఙ్ఞాపకాలు పంచుకునే వారని సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
ఒక్కడి ఆలోచన.. మృగరాజులకు వణుకు
నైరోబీ: అది ఆఫ్రికన్ దేశం కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్. ఆధునికతకు.. అటవీక జీవనానికి మధ్యగా నలిగిపోయే కిటెన్‌గెలా అనే ఓ చిన్ని గ్రామం. ఆ మధ్యలో ఓ చిన్న నదీపాయ. దీంతో పక్కనే ఉన్న సఫారీ నుంచి జంతువులు తరచూ ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న పచ్చిక బయళ్లకు వస్తుంటాయి. వాటిల్లో ఆవుల మందను వేటాడే సింహాలు కూడా ఉంటాయి. కానీ, అక్కడి ప్రజల విన్నూత ఆలోచనకు మృగరాజులు తోకి ముడిచి వెనక్కి చిత్తగిస్తుంటాయి. ఆ ఆలోచన వెనుక ఉన్న బుర్ర మాత్రం రిచర్డ్ టురెరె(18) కుర్ర కాపరిది. సూటిగా కథలోకి వెళ్తే... మాసయి తెగకు చెందిన రిచర్డ్ 9 ఏళ్ల వయసులో చదువుకు పుల్‌స్టాప్ పెట్టి తండ్రికి తోడుగా పశువులను మేపటం ప్రారంభించాడు. తన కళ్ల ముందే ఆవులను సింహాలు కబళిస్తున్న ఉదంతాలు అతనిలో భయాన్ని పొగొట్టేవి. ఇదిలా ఉంటే రిచర్డ్ 11 ఏట.. తమ మందలోని 9 ఆవులను వారం రోజుల్లో సింహాల మంద పొట్టనబెట్టుకున్నాయి. ఆర్థికంగా తీరని నష్టం కలగటంతో తల్లి కుంగిపోగా.. తన బుర్రకు పదును పెట్టడం రిచర్డ్ ఆరంభించాడు. సింహాలను తరిమేందుకు భయంకరంగా ఉన్న కాకి బొమ్మను తన వెంట తీసుకెళ్లేవాడు. కానీ, ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఓ రోజు రాత్రి టార్చ్ లైట్‌తో వెళ్తున్న సమయంలో సింహాలు ఎలాంటి దాడులకు పాల్పడపోగా.. ఆ వెలుతురికి భయంతో పరుగులు తీశాయి. అంతే వెంటనే అతని మెదడులో ఓ ఆలోచన మెరిసింది. తన తల్లి అపురూపంగా చూసుకునే రేడియోను బద్ధలు కొట్టి.. ఓ ఎల్ఈడీ బల్బు సాయంతో లైటింగ్ వ్యవస్థను రూపొందించాడు. సింహాలు దాడులకు వచ్చిన సమయంలో వాటిని వెలిగిలించటం.. అవి భయంతో పరుగులు తీయటం... మొత్తానికి ఈ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత అతని పరిశోధనకు పెటెంట్ హక్కులు దక్కాయి. కెన్యాలో యంగెస్ట్ పెటెంట్‌గా రిచర్డ్‌గా గుర్తింపు దక్కింది. అంతేకాదు 2013లో కాలిఫోర్నియాలో జరిగిన టెడ్ సదస్సులో ‘అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా’ లాంటి దిగ్గజాల మధ్య ప్రసంగించే అవకాశం రిచర్డ్‌కు లభించింది. దీంతోపాటే బ్రూక్ హౌస్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. అయితే లయన్ లైట్స్ పెటెంట్ ఉన్నప్పటికీ.. ఆ ఆలోచన చుట్టుపక్కల పాకటంతో మరికొందరు ఇదే పద్ధతిని అవలంభించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిచర్డ్‌ను పట్టించుకోవటం మానేశాయి. దీంతో అతని జీవితం మళ్లీ వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. పశువులను మేపుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగని ప్రయోగాలకు అతను దూరం కాలేదు. ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడంట. ‘లయన్ లైట్స్ 2.0’ వ్యవస్థను ఇన్స్టాల్ చేయటానికి ఖరీదు రెండు వందల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం ఓ ఎన్డీవో సంస్థ అందిస్తుండగా.. ఇంకా సగం కాపరులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 750 లయన్ లైట్ సిస్టమ్‌లు ఆ ఊరు చుట్టు పక్కల ఉన్నాయి. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో వాటి అవసరం ఉందని రిచర్డ్ అంటున్నాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సాయం చేయాలని చాలా కాలం నుంచే అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. తన కొడుకు కంటే మేధావులు ఈ దేశంలో ఎందో ఉన్నారని, ప్రభుత్వాలు సరైన తోడ్పాటు-ప్రోత్సాహం అందిస్తే వారంతా అద్భుతాలు సృష్టిస్తారని రిచర్డ్ తల్లి వెరోనికచ్ చెబుతున్నారు. -
ఏనుగు పొగ తాగడం చూశారా...?
న్యూ ఢిల్లీ : ధూమపానం ఆరోగ్యానికి హానికరం...పొగ తాగరాదు ఇలాంటి వాక్యలు చాలా సందర్భాల్లో వింటూనే వుంటాం. అయితే మనుషులే కాదు ఈ మధ్య జంతువులు కూడా ధూమపానం చేస్తున్నాయి. కోతులు పొగ తాగడం కూడా చూశాం. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి ఏనుగులు వచ్చి చేరాయి. ఇందుకు సంబంధించి వైల్డ్ లైఫ్ కనజర్వేషన్ ఆఫ్ ఇండియా.. ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తుంది. ఒక ఏనుగు పక్కనే మండుతున్న అడవి నుంచి దేన్నో తీసుకుని తన నోట్లో పెట్టుకుంది. తర్వాత పొగను బయటకు వదులుతుంది. చూసేవారికి ఆ దృశ్యం ఏనుగు పొగ తాగుతున్నట్లు ఉంది. అసలు సంగతేంటంటే ఆ ఏనుగు తింటున్నది బొగ్గును. మండుతున్న అడవి నుంచి బొగ్గును తీసుకుని నోట్లో పెట్టుకుంది. తర్వాత ఆ బొగ్గుకు అంటుకుని ఉన్న బూడిదను తన తొండం నుంచి బయటకు వదిలింది. అది కాస్తా చూసేవారికి పొగలా కన్పిస్తుంది. డబ్ల్యూసీఎస్ ఇండియా శాస్త్రవేత్త, ఏనుగుల జీవశాస్త్ర నిపుణుడు డాక్టర్ వరుణ్ గోస్వామి ఈ సంఘటన గురించి వివరిస్తూ బొగ్గులో ఎటువంటి పోషక విలువలు ఉండవు. కానీ అడవి తగలబడినప్పుడు అనేక వృక్షాలు కాలిపోతాయి. అప్పుడు వచ్చే ఆ వాసన జంతువులను ఆకర్షిస్తుంది. అంతేకాక ఇది భేదిమందు(విరోచనకారి మందు)లాగా కూడా పని చేస్తుంది. అందువల్లే జంతువులు బొగ్గు తింటాయి అని డబ్ల్యూసీఎస్ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదని అందుకే తాను ఈ వీడియో తీశానని వినయ్ కుమార్ తెలిపారు. 2016లో తీసిన ఈ వీడియోను ఇప్పుడు పోస్టు చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని నాగర్హోల్ జాతీయ పార్కులో జరిగింది. -
ఏనుగు పొగ తాగడం చూశారా...వైరల్!
-
బెబ్బులి వర్సెస్ ఎలుగుబంటి.. భీకర ఫైటింగ్
సాక్షి, న్యూఢిల్లీ : బెబ్బులి పేరు వింటనే వణికిపోతాం. సాధారణంగా పెద్ద పులి సింహానికి మాత్రమే భయపడుతుందని, సరిగ్గా ఎదురు తిరిగితే ఒక్కోసారి దాన్ని కూడా పడగొడుతుందని కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. అయితే, మృగరాజును సైతం హడలెత్తించే పెద్ద పులి కాస్త ఎలుగుబంటితో పోరాడలేక పారిపోయింది. పోరులో ఓడి తోకముడిచి వెనుకడుగు వేసింది. దాంతో రెచ్చిపోయిన ఆ ఎలుగుబంటి కాస్త తరిమితరిమి కొట్టింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.. వాటి మధ్య జరిగిన భీకరపోరును మీరు కూడా ఓసారి చూడండి. -
భీకర ఫైటింగ్..బెబ్బులి వర్సెస్ ఎలుగుబంటి..
-
ఇదో జాతీయ వనం!
మనకు తెలిసిన జాతీయ పార్కు అంటే ఏ యాభై, అరవై చదరపు కిలోమీటర్ల మేర పరుచుకుని ఉంటుంది. అందులో బోలెడు చెట్లు.. జంతువులు, పక్షులతో ఆహ్లాదంగా.. సందడిగా ఉంటుంది. అయితే ఈ ఫొటోలో ఉన్న చెట్టును చూశారా.. ఇది అమెరికా అలస్కాలోని అల్యూటియన్ దీవుల్లో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఓ జాతీయ వనం. అమెరికాలోని అతి చిన్న వనం ఇది. ఒకే చెట్టులా ఉన్న ఈ వనానికి ఓ చరిత్ర కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా సైనికులు 33 పైన్ చెట్లను నాటారు. అక్కడి భయంకరమైన చలి వాతావరణానికి ఆ చెట్లు తట్టుకోలేక ఒకదానికి ఒకటి పెనవేసుకుని మరుగుజ్జు చెట్టు మాదిరిగా మిగిలిపోయాయి. 1960లలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ చెట్టు ముందు ‘అడక్ జాతీయ వనం’ అనే బోర్డు పెట్టారు. అప్పటినుంచి దాన్ని జాతీయ వనంగా అక్కడి జనం పిలుచుకుంటున్నారు. -
సింహమంటే అడవంతటికీ భయం.. మరి సింహానికో..?
టాంజానియాలోని సెరెంగిటి నేషనల్ పార్కులో తీసినదీ చిత్రం.. దీన్ని కెనడాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ జార్జ్ హార్ట్ తీశారు. ‘ఇలాంటి అరుదైన చిత్రాన్ని క్లిక్‌మనిపించడం నా అదృష్టమే. ఈ జంటను నేను ముందు నుంచీ గమనిస్తూ ఉన్నాను. ఏదో విషయంపై సింహం సివంగిపై గర్జించింది. అంతే.. వెంటనే సివంగి ఇదిగో ఇలా రివర్స్ అటాక్ ఇచ్చింది. దీంతో ఆ తీవ్రతను తట్టుకోలేక చివరికి సింహం తన ముఖాన్ని చేతుల్లో దాచుకోవాల్సి వచ్చింది. సింహం అడవికి రాజు అయిండొచ్చు. కానీ ఇంట్లో బాస్ ఎవరన్నది ఈ ఫొటో తెలుపుతోంది. ఈ చిత్రాన్ని చూసినవారి ముఖాలపై నవ్వులే నవ్వులు’అని జార్జ్ చెప్పారు. -
ఫుట్బాల్లా పిల్ల ఏనుగుతో ఆడుకుంది!
-
అడవి మార్కు పార్కు!
భూటాన్ ఆనందమంటే కొత్త ఫ్యాషన్లోనో, లేటెస్ట్ ఐఫోన్లోనో ఉండదని భూటాన్ ప్రజల్ని చూశాకే తెలుస్తుంది. ఉన్నదాంతో తృప్తిపడటం... టీవీ, రేడియో, ఇంటర్నెట్ కాలుష్యాల్ని పట్టించుకోకపోవటం... దేశంలో 50 శాతం భూ భాగాన్ని జాతీయ పార్కుగా రక్షించటం... దేశాభివృద్ధిని గ్రాస్ నేషనల్ హ్యాపినెస్‌లో కొలవటం... ఇవన్నీ భూటాన్‌లో మాత్రమే సాధ్యం. భూటాన్‌లో చాలా భాగంలో జనావాసాలుండవు. పర్యాటకులు అక్కడికి వెళితే... జనారణ్యంలో లేని ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తుంది. మరో చిత్రం... అక్కడ పేద-గొప్ప తారతమ్యాలు తక్కువ. పండగల్లో రాజ కుటుంబీకులూ సామాన్యులతో ఆడిపాడతారు. ఒకోసారి యాత్రికులనూ కలుస్తారు. భూటానీల్లో మూడింట రెండొంతుల మంది రోజుకు కనీసం 8 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. వాహనాలూ తక్కువ. కాలుష్యాన్ని వదిలే కంపెనీలూ తక్కువే. అందుకే ఆరోగ్యం వారి సొంతం. ప్రపంచంలో అత్యంత మారుమూల ఆలయమేదంటే... భూటాన్‌లోని పారో తక్సంగ్ లేదా టైగర్స్ నెస్ట్‌ను చెప్పుకోవాలి. కష్టపడి అక్కడికి చేరితే... ఆ కష్టాన్నంతా మరిచిపోవచ్చంటారు సందర్శకులు. ఇక్కడికి వెళితే భూటాన్ ప్రజల ఆనందానికి కారణం కూడా తెలుస్తుందంటారు. మనకైతే వీసా అక్కర్లేదు. మరి వెళ్దామా? ఎలా వెళ్లాలి? * భూటాన్‌కు విమాన సర్వీసులు పెద్దగా లేవు. ‘పారో’ విమానాశ్రయం ఒక్కటే కొన్ని దేశాలను కలుపు తోంది. దేశంలో ఢిల్లీ, కోల్‌కతాల నుంచి మాత్రమే విమానాలున్నాయి. ముందుగా బుక్ చేసుకుంటే ఢిల్లీ నుంచో, కోల్‌కతా నుంచో తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.15వేల లోపే ఉంటాయి. * రైలు మార్గంలో వెళ్లేవారైతే మొదట కోల్‌కతా, కాన్పూర్, రాంచీ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు చేరుకోవాలి. అక్కడి నుంచి న్యూజల్పాయ్గురికి రైలు సర్వీసులు ఎక్కువే ఉన్నాయి. న్యూజల్పాయ్గురి జిల్లాలోని హషిమొర రైల్వే స్టేషన్లో దిగితే... అక్కడి నుంచి భూటాన్ 17 కిలోమీటర్ల దూరం. * హషిమొర నుంచి క్యాబ్‌లు, జీప్‌లు, బస్సులు ఎక్కువే. అక్కడి నుంచి సరిహద్దుల్లో ఉన్న జైగామ్ను చేరుకోవాలి. అక్కడే చెక్‌పోస్టు. భూటాన్‌లోకి ప్రవేశించడానికి పర్మిట్ ఇచ్చేదిక్కడే. ఈ పర్మిట్ థింపు, పారో ప్రాంతాలకే వర్తిస్తుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా చెప్పాలి. * ఇండియాకు చెందిన కారులో భూటాన్ వెళ్లొచ్చు గానీ... దానిక్కూడా పర్మిట్ ఉండాలి. లేదంటే స్థానిక టూర్ ఆపరేటర్ సాయం తీసుకోవచ్చు. * వీసా అక్కర్లేదు కానీ... ఐడెంటిఫికేషన్ కోసం పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలి. ఏ సీజన్లో వెళ్లొచ్చు? * మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో అటు తీవ్రమైన చలి, ఇటు తీవ్రమైన ఎండలు ఉండవు. ఇదే మంచి సమయం. - రద్దీని తప్పించుకోవటానికైతే కాస్త చలి ఎక్కువైనా డిసెంబరు, జనవరి ఫిబ్రవరి నెలలు ఉత్తమం. * అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను బట్టి చూస్తే... అన్నినెలల్లోనూ ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. -
కొండపై నుంచి ‘ఫైర్ఫాల్’
కాలిఫోర్నియా: ఇది అరుదైన, అద్భుతమైన చిత్రం. గత 11 ఏళ్లలో ఈ దృశ్యం కనిపించడం ఇది మూడోసారి మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్న ఈ ఫొటో కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో వాలైంటైన్స్ డే రోజున తీసిన చిత్రం. ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి మంటల్లే కిందకు పారుతున్న ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా అగ్నిపర్వతం నుంచి కిందకు లావా ప్రవహిస్తోందని పొరపాటు పడతారు. కానీ ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ ఆకృతి. వాస్తవానికి కొండపై నుంచి జాలువారేది సన్నటి వాటర్ ఫాల్. పడమటి సంధ్యలో అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి ప్రతిఫలించడం వల్ల ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అరుదుగా ఫిబ్రవరి నెలలో కనిపించే ఈ దృశ్యానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. నిర్దిష్టమైన సూర్యుడి వేడికి కొండపైనున్న మంచుకరగి కిందకు జాలువారుతుంది. అప్పడు ఆకాశంలో ఎలాంటి మబ్బులు లేకుండా స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి. అప్పుడే ఈ దృశ్యం కనిపిస్తుంది. హార్స్టేల్గా పిలిచే ఫాటర్ ఫాల్, జాలువారుతున్న లావాలా కనిపిస్తుండడంతో దాన్ని ‘ఫైర్ఫాల్’ అని పిలుస్తున్నారు. పది నిమిషాలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని చూస్తూ జగతిని మైమరిచి తన్మయత్వంలో మునిగిపోయామని దీన్ని ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్, న్యూరో సైకాలజిస్ట్ సంగీతా డే తెలిపారు. ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఎంతో మంది ఫొటోగ్రాఫర్లు ప్రతి ఏడాది ఫిబ్రవరిలో పార్క్‌ను సందర్శిస్తారట, అయితే గత 11 ఏళ్లలో ఈ దృశ్యం కనిపించడం మూడోసారి మాత్రమే అని ఆమె చెప్పారు. తనకు మాత్రం ఈ అవకాశం అనుకోకుండా రావడం అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. మొట్టమొదటిసారిగా 1973లో గ్యాలెన్ రోవెల్ అనే ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని ఫొటో తీశారు. -
వన్యప్రాణుల నిలయం..కాబిని
పర్యాటక ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కొన్ని చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం హాయిని కొల్పితే, మరికొన్ని చోట్ల అందమైన పక్షులు, అబ్బుర పరిచే జంతువులు ఆసక్తికి కలిగిస్తాయి. ఇంకొన్ని చోట్ల ఎత్తై కొండల నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతి సోయగాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఒకేచోట, అదీ మనకు అందుబాటు దూరంలో కొలువుదీరితే అంతకు మించిన పర్యాటక ప్రదేశం ఏముంటుంది చెప్పండి. అలాంటిదే కర్ణాటకలోని కాబిని అటవీ ప్రాంతం. రోజు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం..! వర్షపాతం.. కాబిని డ్యామ్ కోసం ఇక్కడ ఒక పెద్ద సరస్సును ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్న ఒక గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా ఆ గ్రామం పేరుతో ఆ సరస్సుకు 'మస్తగుడి సరస్సు' అని నామకరణం చేశారు. నాగర్ హూల్ అటవీ ప్రాంతాన్ని, బండిపుర అటవీ ప్రాంతాన్ని ఈ డ్యామ్ వేరుచేస్తోంది. ఇక్కడ పడే వర్షపాతంలో వైవిధ్యాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు చిన్నవిగాను, మరికొన్ని ప్రాంతాల్లో వృక్షాలు పెద్దవిగాను ఉంటాయి. ఏటా ఇక్కడ 1000 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది. ఆహ్లాదకర వాతావరణం.. అడవుల్లో నడక, ట్రెక్కింగ్, బోట్ విహారం, సైకిలింగ్, పక్షుల గమనం, రాత్రుల్లో చలిమంటలు, స్థానిక గ్రామాల సందర్శనలతో ఎంతో ఆనందం పొందొచ్చు. కాబిని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతోంది. కర్నాటకలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. జంతు వీక్షణం.. అడవిలో సఫారీపై వెళితే అనేక జంతువులను దగ్గర నుంచి చూడొచ్చు. కాబినిలో 300 రకాలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏనుగుల సఫారి. సరస్సుల్లో బోట్ షికారు చేస్తూ అక్కడి మొసళ్లు, నీరు తాగే జింకలను చూసి ఆనందించొచ్చు. లెక్కకు మించిన జలపాతాలు.. ఈ ప్రాంతంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకు పడుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి దగ్గరలోని నదిలో కలుస్తుంది. ఈ వాటర్‌ఫాల్స్ నీరు అంత ఎత్తు నుంచి కిందపడే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తున లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటాయి. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్టు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం, ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం గొప్ప అనుభూతిని మిగిల్చే సాహసం. ఎక్కడ ఉంది..? కర్నాటకలోని కాబిని ప్రాంతం వన్య జీవులకు ప్రసిద్ధి చెందింది. ఇది నాగర్ హూలే అటవీ ప్రాంతంలోని భాగం. బెంగళూరుకు సుమారు 160 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్యాటక స్థలాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇది నాగర్హూల్ అటవీ ప్రాంతానికి ఆగ్నేయంగా ఉంది. సుమారు 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం దట్టమైన అడవులు, సరస్సులు, ప్రవాహాలతో నిండి ఉంది. -
గైడ్‌పై దాడి చేసిన చిరుత
-
అవిలాల చెరువుకు మహర్దశ
నేషనల్ పార్కుగా అభివృద్ధి చేయనున్న తుడా రూ.300 కోట్లతో ప్రతిపాదనలు తిరుపతి తుడా: అవిలాల చెరువు రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో ఇక్కడ నేషనల్ పార్కును ఏర్పాటు చేసేందుకు తుడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు రూ.300 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో 180 ఎకరాల విస్తీర్ణంలో అవిలాల చెరువు ఉంది. గతంలో ఇక్కడ కొందరు అక్రమ కట్టడాలు ప్రారంభించారు. దీనికి తోడు లే-అవుట్లు వేసి ప్లాట్లు విక్రయించాలని తుడా నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది మేధావులు చెరువు పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెరువులో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆక్రమణలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం ఈ చెరువు నిరుపయోగంగా ఉండటంతో తుడా వీసీ వెంటకేశ్వరరెడ్డి దృష్టి సారించారు. ఈ చెరువును రక్షించడం, ప్రజలకు సౌకర్యంగా మార్చడంపై సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వివరాలను తుడా చైర్మన్ ఎం. వెంకటరమణకు వివరించి ఆయన ద్వారా పురపాలిక శాఖ మంత్రి నారాయణకు ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అవసరమైతే వ్యయం ఎక్కువైనా పక్కాప్రణాళికతో అభివృద్ధి పరిచేందుకు కసరత్తుచేయాలని ఆయన సూచించారు. దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చెరువును కాపాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. నిష్ణాతులతో అవిలాల చెరువుపై అధునాతన సౌకర్యాలతో నేషనల్ పార్క్, ట్యాంక్ బండ్ స్కెచ్ గీయించారు. అందులో యోగ, స్మిమ్మింగ్‌పూల్, పార్క్, వాటర్ స్టోరేజ్, హట్స్, పిల్లల క్రీడా సముదాయం వంటి సౌకర్యాలతో ప్రణాలికను సిద్ధం చేశారు. ఇందుకు రూ.300 కోట్ల ఖర్చు అవుతందని ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తిరుపతికి తలమానికంగా నిలుస్తుంది అవిలాల చెరువులో అత్యాధునిక సౌకర్యాలతో పార్క్ ఏర్పాటయి తే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి ఇది తలమానికంగా మారుతుంది. రూ.1000 కోట్ల ఆస్తిని కాపాడటమే కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుంది. తుడా చైర్మన్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే చరిత్రలో మిగిలిపోతుంది. ఇందుకు మేధావులూ సానుకూలంగా ఉన్నారు. -ఐ.వెంకటేశ్వరరెడ్డి, వీసీ, తుడా -
పచ్‌మఢి పరవశింపజేసే ప్రకృతి ఒడి
పాఠక పర్యటన మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని ఏకైక హిల్‌స్టేషన్ పచ్‌మఢి. అత్యంత మహిమాన్వితమైన గుప్త్‌మహాదేవ్, జటాశంకర్ వంటి శివాలయాలు, సాత్పూర జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఇన్ని ఆకర్షణలుగల ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించాం. మా కుటుంబ సభ్యులు, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ అదనపు డెరైక్టర్ పెనుమూడి బీవీ శర్మ కుటుంబసభ్యులు కలసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాత్రి 10.45 నిమిషాలకు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 లకు మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ జంక్షన్‌కు చేరుకున్నాం. బస్సులో పచ్‌మఢి చేరుకునేందుకు తగిన వెసులుబాటు లేకపోవడంతో కారు అద్దెకు మాట్లాడుకుని వెళ్లి, ఆ రాత్రి ఉడ్‌లాండ్ రిసార్ట్స్‌లో విశ్రమించాం. పాండవ గుహలు మరుసటి రోజు ఇరు కుటుంబాలవారం పాండవ గుహల సందర్శనకు వెళ్లాం. చారిత్రక కథనం ప్రకారం... పాండవు లు అజ్ఞాతవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. అయితే, ఇది ఒక బౌద్ధ ఆరామమని భారతీయ పురావస్తు శాఖ పేర్కొంటోంది. ఈ కొండపై శిథిలావస్థ కు చేరుకున్న అత్యంత ప్రాచీన ఇటుకరాయి నిర్మాణం, కొండపై భాగం నుంచి కిందకు చూస్తే అక్కడ ఉన్న ఉద్యానవనం ఎంతో సుందరంగా గోచరిస్తాయి. జలపాతాల జడివాన ఆ తర్వాత వెండి జలపాతం వద్దకు వెళ్లాం. దీన్ని దూరం నుంచే చూడాలి. అక్కడి నుంచి బయలుదేరి అప్సర విహార్ అనే మరో జలపాతాన్ని సందర్శించాం. ఇది పచ్‌మఢి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈత కొట్టేందుకు, డైవింగ్ చేసేందుకు ఎంతో అనువుగా ఉంది. దీనిని గతంలో ‘ఫెయిరీ పూల్’ అని పిలిచేవారు. ఇక్కడకు సమీపంలోనే పాంచాలి, బీ ఫాల్స్ జలపాతాలున్నాయి. 150 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారే బీ ఫాల్స్ జలపాతం పాల ధారలా కనువిందు చేస్తుంది. ఈ జలపాతం నుంచే పచ్‌మఢి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతుంది. గుహలో శివలింగం రెండో రోజు ఉదయం పిపరియా పట్టణానికి వెళ్లే మార్గంలో జటా శంకర్ ఆలయాన్ని సందర్శించాం. ఈ ఆలయానికి వెళ్లే దారిలో ఒక కొండ మీద నంది, మరో కొండమీద మర్కటం, ఏనుగు తొండం, సింహం ముఖం ఆకృతులు.. కనిపించాయి. ఇవన్నీ సహజసిద్ధంగా ఏర్పడినవే. కొంతదూరం వెళ్లిన తర్వాత మెట్ల దారిలో ఒక గుహ ఉంది. లోపల సహజసిద్ధంగా ఆవిర్భవించిన శివలింగం మాకు దర్శనమిచ్చింది. అనంతరం నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్యాండిఖో ప్రాంతానికి చేరుకున్నాం. ఇది దాదాపు 350 అడుగుల లోతు కలిగిన లోయ. ఈ పర్వత శ్రేణులనే సాత్పూర అని పిలుస్తారు. మేనును తాకే మేఘాలు ఆ తర్వాత రోజు మహాదేవ్ ఆల య సందర్శనకు వెళ్లాం. ఇక్కడి కొండరాళ్లు వర్షాకాలంలో నీటిని పీల్చుకుని ఎండాకాలం విడిచిపెడతాయట. అనంతరం కాలినడకన గుప్త్‌మహాదేవ్ ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడ ఉన్న సన్నని గుహ ద్వారా ఒకరి తరువాత ఒకరం వెళ్లాం. ఆ తరువాత సైట్ సీయింగ్‌లో భాగంగా రాజేంద్రగిరి పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నాం. ఆ సమయంలో అటుగా వచ్చిన నీలి మేఘాలు మమ్మల్ని తాకుతూ ముందుకు సాగాయి. మేఘాలు మేనును తాకడం తొలిసారి కావడంతో మా ఆనందానికి హద్దుల్లేవు. ఇక చివరి రోజు పర్యటనలో భాగంగా రీచ్గఢ్ చేరుకున్నాం. ఇక్కడి గుహలకు మూడువైపుల నుంచి ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఆ తరువాత ఆసన్ దశ్య ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడి ప్రకృతి అందాలు పరవశింప చేశాయి. ఇక్కడి నుంచి చూస్తే ఎత్తయిన పర్వత శిఖరాలు, అత్యంత లోతైన లోయలు దర్శనమిస్తాయి. దీనికి సమీపంలో గల అంబామాయి ఆలయంలో మాతను సర్వశక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఇది అత్యంత ప్రాచీన దేవాలయం. దీని పక్కనే ముస్లింలు నిర్మించిన బేగం ప్యాలెస్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దూరం నుంచి చూడాల్సిందే తప్ప దగ్గరికి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ ప్యాలెస్ దర్శనంతో మా పర్యటన ముగిసింది. చివరిరోజు రాత్రి ఇటార్సీకి చేరుకుని యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో మరుసటిరోజు సికింద్రాబాద్ చేరుకున్నాం. ఈ యాత్ర మొత్తానికి మా ఇరు కుటుంబాలకు కలిపి దాదాపు 30 వేల రూపాయల ఖర్చు అయ్యింది. - కొల్లూరి సత్యనారాయణ, ఇంకొల్లు, ప్రకాశం జిల్లా -
కేబీఆర్ పార్కు వాకర్స్‌కు హైకోర్టు ఊరట
హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్కు వాకర్స్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. పార్కు ప్రవేశ ఫీజును వృద్ధులకు రూ. 500 నుంచి రూ. 1000కి, ఇతరులకు రూ. 800 నుంచి రూ. 1500కి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 26 అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ ప్రధాన సంరక్షణాధికారి, డీఎఫ్ఓలకు నోటీసు లు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు జారీ చేశారు. ఫీజు పెంపు జీవోను సవాలు చేస్తూ నేచర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాహుల్ సింఘాల్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ రామచంద్రరావు విచారించారు. -
వైల్డ్ ఫోటోగ్రఫీ
ఫొటో అనగానే స్మైల్ ప్లీజ్ అనడం కామన్. కానీ ఈ ఫొటో షూట్లో.. ఇటు చూడు.. నవ్వు.. కాస్త ఫేస్ టర్నింగిచ్చుకో ఇవన్నీ ఉండవు. సెలైంట్‌గా పని కానిచ్చేయాలి. చీమ చిటుక్కుమన్నా.. ఫొటో ఫట్. ఇంతకీ ఇదేం ఫొటో షూట్ అనుకుంటున్నారా..? అదే ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ’. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై మెట్రోవాసుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రాజసం ఉట్టిపడే సింహాన్ని ఫొటో తీయాలంటే గట్స్ ఉండాలి. అంతకు మించి ఆ మృగరాజు.. అలాంటి ఫోజు పెట్టాలంటే గంటలు కాదు, ఒక్కోసారి రోజులకు రోజులు వేచి చూసే ఓపిక ఉండాలి. లిప్తపాటులో మారిపోయే హావభావాల్లో మన్నికైనది ఎన్నుకొని క్లిక్ మనిపించాలి. అప్పుడే ఆ ఫొటో కలకాలం నిలిచిపోతుంది. అలాంటి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ప్రత్యేకత చాటుకుంటున్నారు నగరానికి చెందిన వెంకట రాంనర్సయ్య. వృత్తిరీత్యా వైద్యుడైనా.. ప్రవృత్తిగా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీతో అద్భుతాలను కెమెరాలో బంధిస్తున్నారు. దేశంలోని అన్ని జాతీయ పార్కులను ఆయన సందర్శించారు. ఆయన తీసిన దాదాపు 400కు పైగా వైల్డ్‌లైఫ్ ఛాయాచిత్రాలను ‘ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో ప్రదర్శించారు. ఇటీవలే మధ్యప్రదేశ్ కన్హా నేషనల్ పార్క్ పర్యటించారు. ఈ సందర్భంగా ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ’ అనుభవాలను ఆయన ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ప్రకృతితో మాట్లాడొచ్చు... వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఓ జంతువు హావభావాలే కాదు.. అక్కడి పరిసరాలను, ప్రకృతిని కూడా కెమెరాలో బంధించాలి. ప్రకృతితో మాట్లాడే అవకాశం ఈ ఫొటోగ్రఫీలోనే ఉంది. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. ప్రాణాలను రిస్క్ చేసి క్రూర మృగాలు, వాటి హావభావాలను ఫొటో తీయాలంటే ముందుగా కెమెరా, లెన్స్ మీద అవగాహన ఉండాలి. ఐఎస్ఓ ఫిలిప్ స్పీడ్ ఉన్న హై రిజల్యూషన్ కెమెరాలనే వినియోగించాలి. వీటి ధర రూ.10-20 లక్షలుంటుంది. ఫ్లాష్ వేశామో గోవిందా... ఈ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. పొరపాటున ఫ్లాష్ వేశామో.. వాటి హావభావాలు మారడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. జంతువుల్లో వినికిడి శక్తి ఎక్కువ. కొన్ని శ్వాసను కూడా పసిగడతాయి. పక్షులైతే ఇలా వెళ్తే అలా తుర్రుమంటాయి. జంతువులపై రీసెర్చ్ ఈ ఫీల్డ్‌లో ఉన్నవారికి జంతువుల కదలిక, ఆహారపు అలవాట్ల గురించి పూర్తిగా తెలిసుండాలి. కాలాలు, సమయాన్నిబట్టి వాటి హావభావాల్లో మార్పులుం టాయి. పులులు, సింహాలు వంటి క్రూర మృగాల ఫొటోలు తీయడానికి వేసవి అనుకూలం. అందులోనూ మధ్యాహ్నం వేళలో ఆకలిగా ఉంటాయి. ఆ టైమ్‌లో వాటి ముఖాల్లో ఆకలి, కోపం వంటి షేడ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. వేసవిలో నీళ్ల కోసం ఇతర జంతువులు బయటకు వస్తుంటాయి. వీటిని వేటాడటం కోసం క్రూర మృ గాలు పొదల చాటున మాటేసి ఉంటాయి. ఇట్లాంటి ఫొటోలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. వర్షా కాలంలో పక్షులు, జలచరాల ఫొటోలు తీయవచ్చు. ఈ కాలంలో పచ్చటి ప్రకృతితో పాటు పక్షుల అందాలను కెమెరాలో బంధించవచ్చు. - శ్రీనాథ్ ఆడెపు -
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో హిమాచల్ పార్క్!
జాతీయ వనం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో గ్రేట్ హిమాలయన్ జాతీయ ఉద్యానవనం చోటుచేసుకుంది. ‘హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో గల ఈ జాతీయ వనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అత్యద్భుతం’గా ఖతార్‌లోని దోహా ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మన దేశంలోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇప్పటికే జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా 1972లో కేంద్రప్రభుత్వం, 1999 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించాయి. ఈ ప్రాంతంలో 832 జాతుల సుగంధద్రవ్యపు మొక్కలు ఉండగా వీటిలో 26 శాతం పుష్ప జాతికి చెందినవే! ఇది హిమాలయాలలోనే అత్యధిక సంఖ్య. అయితే ఇక్కడ అధిక సంఖ్యలో ఔషధ, సుగంధ ద్రవ్యపు మొక్కలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. హిమాలయాల్లోని నల్ల ఎలుగుబంట్లు, చిరుతపులి, కస్తూరి జింక... మొదలైన జంతుజాలాన్ని రక్షించేందుకు, వీటి సంఖ్యను అభివృద్ధి పరిచేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే మంచు చిరుత, ఎర్ర తల రాబందు అంతరించే ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతీయ వనాన్ని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సందర్శించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విమానంలో కుల్లు జిల్లాకు చేరు కోవచ్చు. సమీప మండీలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి బస్సులు, క్యాబ్స్ ద్వారా ఈ జాతీయవనానికి చేరుకోవచ్చు. -
హడలెత్తిస్తున్న వ న్య మృగాలు
= గజగజ వణికిపోతున్న అటవీ సమీప గ్రామాలు = ఎనిమిది నెలల్లో 30 మంది బలి = ఆహారం కోసం గ్రామాలపై పడుతున్న వైనం సాక్షి, బెంగళూరు : ప్రకృతిలో అన్ని సహజసిద్ధంగా ఉన్నప్పుడే పర్యావరణ సమత్యులత సాధ్యం. సహజత్వానికి భిన్నంగా ఉన్నప్పుడు ప్రకృతికి ప్రమాద ఘంటికలు మోగినట్లే. ఇటీవల రాష్ర్టంలో ఎనిమిది నెలల కాలంలో 30 మంది అడవి జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మైసూరు అటవీ రీజియన్ పరిధిలో ఇటీవల ఆహారం కోసం వచ్చిన ఓ పులి నలుగురి చంపేసిన విషయం తెల్సిందే. క్రూరమృగాల దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 300 పశువులు కూడా మృత్యువాత పడ్డాయని అటవీశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 అటవీ రీజియన్లు ఉండగా 11 రీజియన్లలో నిత్యం వ్యన్యప్రాణులు-మానవ సంఘర్షణ జరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు అటవీ రీజియన్ పరిధిలోకి వచ్చే రామనగర, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, బన్నేరుగట్ట నేషనల్ పార్క్, కోలార్, చిక్కబళాపుర అటవీ డివిజన్లలో వన్యప్రాణుల వల్ల ఎక్కువ ప్రాణనష్టం సంభవిస్తోంది. రాష్ట్రం మొత్తంపై 30 మరణాలు సంభవిస్తే ఒక్క బెంగళూరు రీజియన్‌లోనే వాటి సంఖ్య 10కి చేరింది. ఆ తర్వాతి స్థానంలో మడికెరి, చామరాజన గర, మైసూరు అటవీ రీజియన్లు ఉన్నాయి. ఇక మైసూరు రీజియన్‌లో వన్యమృగాల వల్ల పశునష్టం ఎక్కువగా జరుగుతోంది. ఈ రీజియన్‌లో భాగమైన బండీపుర టైగర్ ప్రాజెక్ట్ డివిజన్, హన్సూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చూరీ సరిహద్దు గ్రామాలపై వన్యప్రాణులు ఎక్కువగా దాడులు చేస్తూ పశు నష్టం కలిగిస్తున్నాయి. గత ఎనిమిదిని నెలలల్లో ఈ ఒక్క రీజియన్‌లోనే 119 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఎక్కువగా ఏనుగుల దాడుల్లోనే... ఏనుగుల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడేళ్లలో వన్యప్రాణుల దాడుల్లో మొత్తం 102 మంది చనిపోగా ఇందులో ఏనుగుల దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 75గా ఉంది. ఈ విషయమై ప్రముఖ పర్యావరణ వేత్త కృపాకర్ మాట్లాడుతూ... ‘ఆఫ్రికతో పోలిస్తే భారత్‌లో అటవీ ప్రాంతం చాలా తక్కువ. ఉదాహరణకు టాంజానియా అటవీ ప్రాంతంలోని ఏనుగుల సంఖ్య నీలగిరి అటవీ ప్రాంతంలోని ఏనుగుల సంఖ్య సమానంగా ఉంది. అయితే టాంజానియాలో ఎలిఫెంట్ టెరిటరీ 40 వేల చదరపు కిలోమీటర్లు ఉండగా నీలగిరిలో ప్రాంతం 5,553 చదరపు కిలోమీటర్లు మాత్రమే. దీంతో ఇక్కడి ఏనుగులు తరుచుగా గ్రామాలపై దాడులు చేస్తూ ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు. తాజాగా అడవి దున్నలు, కృష్ణ జింకలు... ఇప్పటివరకూ ఏనుగులు, పులులు, చిరుతలు ఎలుగుబంట్లు గ్రామాలపై దాడులు చేసి ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగిస్తుండగా ఇప్పుడు వాటి సరసన అడవిదున్నలు, కృష్ణ జింకలు వచ్చి చేరాయి. నాగరహోళి, బండీపుర, భద్రా, అణశి, దాండేలి, కాడంచిన సమీప గ్రామాల ప్రజలు అడవి దున్నల బారిన పడి పదుల సంఖ్యలో తీవ్ర గాయాపాలైన సంఘటనలు ఉన్నాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణ జింకల వల్ల ప్రాణ నష్టం లేకపోయిన తీవ్ర పంట నష్టం చోటుచేసుకుంటోంది. కొప్పల, హావేరి, తుమకూరు, గదగ, ఉత్తర కన్నడ జిల్లాల్లో గత ఎనిమిదినెలల్లో దాదాపు రూ. కోటి మేర విలువైన పంటలను నాశనం చేసినట్లు అటవీశాఖ ప్రాథమిక నివేదికలో తెలిపింది. రామనగర, బళ్లారి, తుమకూరు, చిక్కమగళూరు, బెల్గాం జిల్లాల్లో పులి, చిరుత, ఎలుగుబంట్ల వల్ల ప్రాణహాని సంభవిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
సెరెంగేటి... కనులారా గాంచే ఓ మహాద్భుతం!!
జంతు ఆవాసాలైన నేషనల్ పార్కుల్లో సఫారీలు సాధారణమే. కానీ, అన్ని లక్షల జంతువులు వలస పోవడాన్ని ఒక వాహనంలో పోతూ చూడటం వల్ల పొందాల్సినంత అనుభూతిని పొందలేకపోవచ్చు. అందుకే కేవలం సెరెంగేటిలో ఒక వినూత్న అవకాశం ఉంది. అవే బెలూన్ సఫారీలు. ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉండే ఈ బెలూన్ సఫారీలు వల్ల ఈ భారీ వలసలను విహంగ వీక్షణంలో చూడొచ్చు. దీనివల్ల ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతి సొంతం అవుతుంది. 1989 నుంచే సెరెంగేటిలో బెలూన్ సఫారీలు ఉన్నాయి. వీటిని ఏర్పాటుచేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. వాహన సఫారీల్లో వెళితే ఏనుగులు వంటి భారీ జంతువులతో ప్రమాదం రావచ్చు. ఈ బెలూన్ సఫారీల్లో ఆ ఇబ్బందేమీ ఉండదు. మనం ఎత్తున కొన్ని మీటర్ల పైన విహరిస్తూ ఎటువంటి బెరుకు జంకు లేకుండా ‘ది గ్రేట్ మైగ్రేషన్’ను ఆస్వాదించవచ్చు. ఈ బెలూన్ సఫారీ ధర ఐదువందల డాలర్లు ఉండటం ఆర్థిక భారంగా పర్యాటకులు భావిస్తున్నా... సఫారీ అయ్యాక మాత్రం ఆ ఖర్చు గురించి మర్చిపోతారు. ఎందుకంటే ఆ అనుభూతి ఎంత వర్ణించినా ఊహకందనిది. ఎలా వెళ్లాలి? సెరెంగేటి ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ కిలిమంజారో(రోబో పాట గుర్తుంది కదా). ఇది ఆరుషా నగరానికి దగ్గర్లో ఉంటుంది. ఆరుషాకు ఆమ్స్టర్డామ్ నుంచి మాత్రమే డెరైక్ట్ ఫ్లైట్ ఉంది. కెన్యా రాజధాని నైరోబికి ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి విమానాలున్నాయి. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ఆరుషాకు చేరుకోవచ్చు. ఆరుషా నుంచి సెరెంగేటికి దాదాపు 350 కిలోమీటర్లు. ఇక్కడికి ఫ్లైటే కాదు.. కారులోనూ చేరుకోవచ్చు. పర్వతాలు, సరస్సుల్ని దాటుకుంటూ సాగే కారు ప్రయాణం చక్కటి అనుభూతినిస్తుంది. సెరెంగేటిలో సాధారణ స్థాయి నుంచి లగ్జరీ హోటళ్లు వరకు అన్ని రకాలవి ఉన్నాయి. పది రోజుల నుంచి నెల రోజుల వరకు రకరకాల టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. గైడ్‌ను వెంటబెట్టుకుని కారులో పార్కు అంతటా షికారు చేయవచ్చు. పది రోజులు తిరిగినా మొత్తం పార్కును చూడటం కష్టమే. రాత్రి పూట పార్కు లోపలే టెంట్లు వేసుకుని బస చేసే వీలుంది. కొన్ని హోటళ్లు స్వయంగా లగ్జరీ టెంట్ క్యాంపులు నిర్వహిస్తాయి. ఐతే విహారయాత్రలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదం. గైడ్ లేకుండా వెళ్లడం మంచిది కాదు. సెరెంగేటి జాతీయ పార్కుతో పాటు లగార్జా, మసాక్ సరస్సులు, మోరు కోప్జెస్, లోబో ప్రాంతాలు విహారానికి చక్కటి వేదికలు. సెరెంగేటి ప్రాంతంలో రుచి చూడాల్సిన ఆహార పదార్థాలు కూడా చాలానే ఉన్నాయి. ముకేశ్ అంబానీ.. భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన విహార యాత్రకు వెళ్లాలంటే ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలున్నాయి. కానీ ఏటా ఆయన కుటుంబంతో కలిసి వెళ్లేది ఆఫ్రికా అడవులకు! అంతటి విశేషమేముంది ఆ అడవుల్లో అంటారా..? చెప్పుకోవడానికి, చూడటానికి చాలా విశేషాలే ఉన్నాయక్కడ! కొన్ని లక్షల వన్య ప్రాణులు ఒక్కసారిగా కలిసికట్టుగా వలస వెళ్లే దృశ్యం ప్రపంచంలో ఎక్కడైనా చూడగలమా? టీవీల్లో మాత్రమే కనిపించే.. మృగాల వేటను లైవ్‌లో ఇంకెక్కడైనా కాంచగలమా? వందల సంఖ్యలో సింహాల్ని, అన్ని రకాల జంతువులను ఒకేసారి చూడటం ఇంకెక్కడైనా సాధ్యమా? అందుకే ఆఫ్రికా అడవులకు అంతటి ప్రత్యేకత! ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికాలోని సెరెంగేటి ప్రాంతానికి వెళ్లామంటే జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతుల్ని మన వెంట తీసుకురావచ్చు. ముకేశ్ అంబానీ వెళ్తున్నాడు కాబట్టి.. ఆఫ్రికా అడవులకు వెళ్లడానికి మనకూ కోట్లుండక్కర్లేదు. అంతర్జాతీయ పర్యటనకు వెళ్లేంత ఆర్థిక స్థోమత ఉంటే చాలు. అయితే ఆఫ్రికా అడవుల ప్రత్యేకత గురించి ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకునేదేంటి అనిపించొచ్చు! కానీ ఉత్తర ఆఫ్రికా రాష్ట్రంలోని టాంజానియా దేశంలో.. సెరెంగేటి ప్రాంతంలో మాత్రం ప్రపంచానికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. మసాయ్ తెగకు చెందినవారు నివసించే ఈ ప్రాంతంలో మనుషుల కంటే జంతువుల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. దట్టమైన ఇక్కడి అడవుల్లోనే కాదు.. విశాలమైన మైదానాల్లోనూ లక్షలకొద్దీ వన్యప్రాణులు జీవిస్తుంటాయి. వలస దృశ్యం మహాద్భుతం ఇక్కడి సెరెంగేటి జాతీయ పార్కు లోకి అడుగు పెట్టామంటే మళ్లీ బయటికి రావాలంటే మనసొప్పదు. ప్రపంచంలో ఎక్కడా చూడని ఓ వింత ఇక్కడ దర్శనమిస్తుంది. అదే వన్యప్రాణుల వలస. వలసంటే పదో ఇరవయ్యో జంతువులు రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తాయనుకునేరు. దాదాపు 12 లక్షలకు పైగా జంతువులు గుంపులు కట్టి ఒక్కసారిగా ప్రయాణం మొదలుపెడతాయి. ఇందులో అడవి దున్నలను పోలి ఉండే జంతువులే దాదాపు పది లక్షలుంటాయి. ఇంకా జీబ్రాలు, జింకలు, పులులు, సింహాలు, ఏనుగులు... అబ్బబ్బబ్బ... ఒకటేమి అన్ని రకాల జంతువులు ఏదో బహిరంగ సభకు వెళ్తున్న జనాల్లాగా అలా కదిలిపోతుంటాయి. దాదాపు 800 కిలోమీటర్ల దూరం సాగుతుంది వీటి ప్రయాణం. ఒక అద్భుతం ఏంటంటే... ఈ ప్రయాణం మధ్యలోనే దాదాపు 3 లక్షల చిన్న జంతువులు పుడతాయి. దారి మధ్యలో దాహం వల్ల, ఆహారం దొరక్క, మృగాల వేటకు బలై ప్రాణాలు విడిచే జంతువుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. ఐతే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వీటి ప్రయాణం ఆగదు. ఇంతకీ ఇవి ఇలా వలస ఎందుకు వెళ్తాయన్న సందేహం వస్తోంది కదా! టాంజానియా ఉత్తర పర్వతాల్లో అక్టోబరు, నవంబరు నెలల్లో కరవు వస్తుంది. జంతువులకు ఆహారం దొరకదు. దీంతో అవి దక్షిణ ప్రాంతానికి వలస వెళ్తాయి. ఏప్రిల్, జూన్ నెలల్లో మళ్లీ ఇక్కడ భారీ వర్షాలు కురిసి పచ్చదనం అలుముకుంటుంది. ఆ సమయానికి మళ్లీ దక్షిణ ప్రాంతం నుంచి తిరిగి ప్రయాణం సాగిస్తాయి. ఇది కొన్ని శతాబ్దాలుగా సాగుతోన్న ఎడతెగని ఓ మహాఘట్టం. జీవితంలో చూసి తీరాల్సిన పర్యాటక కనువిందు. వీక్షణం ఎలా? జంతువులు ఉత్తర దిశ నుంచి సెరెంగేటి జాతీయ పార్కు మీదుగానే ప్రయాణం సాగిస్తాయి. అక్టోబరు, నవంబరు నెల్లో ఆ పార్కుకు వచ్చామంటే ఒక్కసారిగా లక్షలాది జంతువుల ప్రయాణాన్ని చూసి అద్భుతమైన అనుభూతుల్ని మూటగట్టుకోవచ్చు. అంతే కాదు.. ఈ జంతువుల్ని అందులోనే భాగమైన క్రూర మృగాలు వేటాడటం కూడా లైవ్‌లో చూడక తప్పదు. ఇక సెరెంగేటి పార్కులో చూడాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా క్రూర మృగాలున్నది ఈ ప్రాంతంలోనే. ఇక్కడ దాదాపు 2500 దాకా సింహాలున్నాయి. మరెన్నో క్రూర, సాధు జంతువుల్ని చూడొచ్చు. పక్షులు కూడా... సెరెంగేటిలోని మరో విశేషం పక్షుల విహారం. సూర్యోదయం, అస్తమయం సమయాల్లో ఇక్కడ 500కు పైగా రకాల పక్షుల కిలకిలారావాల్ని ఆస్వాదించవచ్చు. ఐరోపా, ఆసియా ప్రాంతాల నుంచి ఇక్కడికి పక్షులు వస్తాయి. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ వలస పక్షుల సందడి ఉంటుంది. వాతావరణం... సెరెంగేటి ప్రాంతంలో సాధారణంగా 27-28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. జంతువుల వలస సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలేమీ ఉండవు. ఆ సమయంలో చిరు జల్లులు కురుస్తుంటాయి. ఈ సమయమే విహారానికి సరైంది. మార్చి-మే నెలల మధ్య భారీ వర్షాలు కురుస్తాయి. గొరాంగోరా ప్రాంతంలో రాత్రి పూట విడిది చేస్తే బావుంటుంది. ఎత్తుగా ఉండే ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది. -
మృగవని’కి మహర్దశ
మొయినాబాద్, న్యూస్‌లైన్: ‘మృగవని’ జాతీయ పార్కు దశ మారబోతోంది. త్వరలో కొత్త అందాలను సంతరించుకోనుంది. ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయనున్నారు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న చిలుకూరు ‘మృగవని’ జాతీయ పార్కు ఇకపై లక్ష్మీ జ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యం లో మరిన్ని వసతులతో కొత్త హంగులు దిద్దనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని జీఓ సైతం జారీ చేసింది. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 700 ఎకరా ల్లో ‘మృగవని’ జాతీయ పార్కు ఏర్పాటైంది. నగరానికి చేరువలో ఉండటంతోపాటు గండిపేట, హిమాయత్‌సాగర్ జం ట జలాశయాలకు మధ్యలో ఉండటంతో పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు లక్ష్మీజ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యాటక కేంద్రంగా... మృగవని పార్కు నగరానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే నగరం, ఇతర ప్రాంతాల నుంచీ ప్రజలు సం దర్శించే అవకాశం ఉంటుంది. మండలంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందింది. రిసార్ట్, హోటల్ నిర్మాణం... ‘మృగవని’ అభివృద్ధిలో భాగంగా పార్కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో రిసార్ట్, హోటల్ నిర్మాణం చేపట్టారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగెకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు మరో మూడు నెలల్లో పూర్తికానున్నాయి. ఇందులో పర్యాటకులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పెరగనున్న చార్జీలు.. పార్కు ప్రవేశ రుసుము రూ.5 నుంచి రూ.10కి పెరగనుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.5 వసూలు చేస్తారు. సఫారీ చార్జీ ఒక్కొక్కరికి రూ.5 వసూలు చేసేవారు. ఇది రూ.10 కానుం ది. నేచర్‌క్యాంప్‌నకు వచ్చే వారు రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. పార్కులోని కాటేజీల ధర సైతం పెరగనుంది. ఈ చార్జీలన్నీ వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. -
‘మృగవని’కి మహర్దశ
మొయినాబాద్, న్యూస్‌లైన్: ‘మృగవని’ జాతీయ పార్కు దశ మారబోతోంది. త్వరలో కొత్త అందాలను సంతరించుకోనుంది. ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న చిలుకూరు ‘మృగవని’ జాతీయ పార్కు ఇకపై లక్ష్మీ జ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరిన్ని వసతులతో కొత్త హంగులు దిద్దనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని జీఓ సైతం జారీ చేసింది. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 700 ఎకరాల్లో ‘మృగవని’ జాతీయ పార్కు ఏర్పాటైంది. నగరానికి చేరువలో ఉండటంతోపాటు గండిపేట, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలకు మధ్యలో ఉండటంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు లక్ష్మీజ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యాటక కేంద్రంగా... ఇప్పటికే వికారాబాద్‌లో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. నగరానికి అనంతగిరి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృగవని పార్కు కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ ప్రజలు సందర్శించే అవకాశం ఉంటుంది. మండలంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందింది. మృగవని పార్కు సైతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే అటు భక్తులు, ఇటు పర్యాటకుల సందడి మరింత పెరగనుంది. రిసార్ట్, హోటల్ నిర్మాణం... ‘మృగవని’ అభివృద్ధిలో భాగంగా పార్కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా రిసార్ట్, హోటల్ నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగెకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు మరో మూడు నెలల్లో పూర్తికానున్నాయి. ఇందులో పర్యాటకులకు అద్దెకు గదులు, స్విమ్మింగ్‌పూల్, వివిధ రకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. పార్కును సందర్శించిన పర్యాటకులకు కావాల్సిన అన్ని వసతులతో రిసార్ట్ ఏర్పాటు చేయనున్నారు. పెరగనున్న చార్జీలు.. కొత్త హంగులను సంతరించుకోనున్న పార్కులో ఇక ముందు ప్రవేశరుసుము, సఫారీ చార్జీలు పెరుగనున్నాయి. ఇప్పటి వరకు ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.5 చొప్పున వసూలు చేసేవారు. ఇకపై అది రూ.10కి పెరగనుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.5 వసూలు చేస్తారు. పార్కులోని అందాలు, జంతువులు, పక్షులు చూసేందుకు సఫారీ(మినీబస్సు)లో వెళ్లాల్సి ఉంటుంది. అందులో వెళ్లేందుకు ఇప్పటి దాకా ఒక్కొక్కరికి రూ.5 వసూలు చేసేవారు. దాన్ని ఇకముందు రూ.10కి పెంచనున్నారు. నేచర్‌క్యాంప్‌నకు వచ్చే వారు రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. పార్కులోని కాటేజీల ధర సైతం పెరగనుంది. ఈ చార్జీలన్నీ వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి.