బెంగళూరు: ఏనుగులను కాపాడేందుకు వేసిన కంచె.. ఓ గజరాజు పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని నగర్‌హోళె జాతీయ పార్కులో ఈ విషాదం జరిగింది. ఓ ఊరిలోకొచ్చిన ఏనుగును స్థానికులు తరమడంతో కంచెను దాటబోయి ఇరుక్కుపోయింది. దీంతో తన బరువుకు ఊపిరాడక మృతి చెందింది. రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోకుండా ఉండే ందుకు రక్షణగా గతంలో రైలుపట్టాలకు ఇరువైపులా రూ.212 కోట్లతో ఈ కంచెను రైల్వేశాఖ నిర్మించింది. ఏనుగును జాతీయ పార్కులోని వీరహోసహళ్లి రేంజ్‌లోకి తరిమేందుకు జనం ప్రయత్నించారని అటవీ అధికారులు తెలిపారు. కంచెపై చిక్కుకోవడంతో తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతోనే ఊపిరితిత్తుల్లో గాయమై ఏనుగు మరణించి ఉంటుందని అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment