fencing
-
Olympics 2024: ఏడు నెలల గర్భంతో బరిలోకి.. ఫెన్సర్ పోస్ట్ వైరల్
‘‘పోడియం వద్ద ఇద్దరు ప్లేయర్లు మాత్రమే మీకు కనిపిస్తున్నారు. నిజానికి అక్కడ ముగ్గురం ఉన్నాము. నేను.. నా ప్రత్యర్థి.. ఇంకా ఈ ప్రపంచంలోకి రాని నా చిన్నారి బేబి కూడా! ఇక్కడి దాకా సాగిన మా ప్రయాణంలో నేను, నా కడుపులోని బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్నాం.సాధారణంగానే... గర్భవతి అయిన వాళ్లు భావోద్వేగాల డోలికల్లో తేలియాడుతూ ఉంటారు. ఒక్కోసారి క్లిష్టపరిస్థితులు ఎదురవుతాయి. అయితే, ఇలాంటి సమయంలోనూ ఏమాత్రం తొణకకుండా.. ఇష్టమైన క్రీడలో ముందుకు సాగడం అంత తేలికేమీ కాదు. అయినా.. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినందుకు సంతోషంగానే ఉంది.రౌండ్ ఆఫ్ 16లో చోటు సంపాదించినందుకు గర్వపడుతూ నేను పోస్టు పెడుతున్నా. నేను ఇక్కడిదాకా వచ్చేందుకు నాకు మద్దతుగా నిలిచి.. నాపై నమ్మకం ఉంచిన వ్యక్తిని భర్తగా కలిగి ఉన్న అదృష్టవంతురాలిని. నా కుటుంబం కూడా నాకు ఎల్లవేళలా అండగా నిలిచింది.ఈ ఒలింపిక్స్ నా కెరీర్లో ప్రత్యేకమైనవి. మూడుసార్లు ఒలింపియన్‌ను.. ఈసారి లిటిల్ ఒలింపియన్‌ను కడుపులో మోస్తూ ఇక్కడి దాకా వచ్చాను’’ అంటూ ఈజిప్టు ఫెన్సర్ నదా హఫీజ్ ఉద్వేగానికి లోనైంది. ఏడు నెలల గర్భంతో ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పోటీపడినట్లు తెలిపింది.కాబోయే తల్లిగా విశ్వ క్రీడల్లో పాల్గొనడం తనకు సరికొత్త అనుభూతిని ఇచ్చిందని నదా పేర్కొంది. రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించే క్రమంలో తన మనసులో చెలరేగిన ఉద్వేగాలను మాటల్లో వర్ణించలేనని.. ప్యారిస్ నుంచి ఇక సంతోషంగానే నిష్క్రమిస్తానని నదా తెలిపింది.కాగా నదా హఫీజ్ 2016 రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్‌లో ఈజిప్టు తరఫున ఫెన్సింగ్‌లో పోటీపడింది. అయితే, ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయింది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో తన తొలి మ్యాచ్‌లో వరల్డ్‌నంబర్ 10 ఎలిజబెత్ టార్టకోవ్స్కీతో తో తలపడ్డ నదా హఫీజ్.. 15- 13తో జయకేతనం ఎగురవేసింది. అయితే, రౌండ్ ఆఫ్ 16లో మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హాయంగ్ చేతిలో 15-7తో ఓడిపోయింది. తద్వారా మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ విభాగంలో నదా హఫీజ్ ప్రయాణానికి అంతటితో తెరపడింది.ఫెన్సింగ్ అంటే ఏమిటి?సంప్రదాయ క్రీడ కత్తిసాము ఆధునిక రూపం ఇది. ఇద్దరు అథ్లెట్లు పరస్పరం తలపడుతూ తమను తాము రక్షించుకుంటూ.. ఎదుటివారిని టార్గెట్ చేస్తూ పాయింట్లు స్కోరు చేస్తారు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఫాయిల్, ఇపీ, సాబెర్. ఏథెన్స్ 1896 ఒలింపిక్స్ నుంచి ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి భవానీదేవీ పోటీపడింది. View this post on Instagram A post shared by Nada Hafez (@nada_hafez) -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్‌లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
Asian Games 2023, Fencing: క్వార్టర్ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్ విభాగం క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది. క్వార్టర్స్ మొదటి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్‌లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి యాకీ షావో అద్బుతమైన కమ్‌బ్యాక్ బ్యాక్ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్‌లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్‌లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది. రెండో పీరియడ్‌లో చైనీస్ ఫెన్సర్ 6 టచ్‌లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్‌లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా భవానీ దేవి చరిత్ర సృష్టించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ -
తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టీటీడీ!
సాక్షి, తిరుపతి: తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇనుక కంచె ఏర్పాటు అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇనుపకంచె ఏర్పాటుకు కేంద్రం అనుమతులను టీటీడీ కోరింది. ఈ నెల 12 ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నడకమార్గంలో పర్యటించి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నాయి. నివేదిక ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. స్పెషల్ టైప్ క్వార్టర్స్, శ్రీవారి మెట్టు నడకదారి, నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే. తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
పాపం.. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాయి
సాక్షి, తిరుపతి: సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్లమిట్ట జనావాసంలోకి పలు జింకలు తప్పిపోయి వచ్చాయి. ఈ క్రమంలో షార్ క్వార్టర్స్ డీఓఎస్ కాలనీ ఫెన్సింగ్‌లో ఇరుక్కుని ఓ జింక మృత్యువాత పడింది. జింకలను చూసి కుక్కలు తరమడంతో మరో జింక బావిలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానిక యువకుడు వినోద్.. చాకచక్యంగా బావిలో నుంచి జింకను కాపాడాడు. అనంతరం దానికి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
గీతం యూనివర్సిటీలో మొత్తం 40 ఎకరాలు ఆక్రమణ: ఆర్డీవో
-
Bio Fence: అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! అదనపు ఆదాయం..
కోతుల నుంచి, అడవి పందుల నుంచి లేదా సాధారణ పశువుల నుంచి పంటలను రక్షించుకోవటం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రైతులకు కత్తి మీద సాములా మారింది. ఈ సమస్యకు ఇనుప కంచెలు, సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకొని రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, వాటి కన్నా బంజరు భూముల్లో పెరిగే బ్రహ్మజెముడు జాతికి చెందిన ముళ్ల మొక్కలను పొలం చుట్టూతా కంచెగా నాటుకుంటే మేలని మహారాష్ట్రకు చెందిన జగన్ ప్రహ్లాద్ భగడే అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆయనది అకోలా జిల్లాలోని ఖపర్వాది బద్రుక్ గ్రామం. ఆయనకు 30 ఎకరాల సాగు భూమి ఉంది. ‘ఏ పంట వేసినా నీల్గాయ్, దుప్పులు, అడవి పందులు, కోతులు, పశువులు పాడు చేస్తూ ఉండేవి. ఎకరం పొలం చుట్టూ ఇనుప కంచె వేశాను. ఏడేళ్ల క్రితమే రూ. 40 వేలు ఖర్చయ్యింది. ఇక మొత్తం పొలం చుట్టూ కంచె వెయ్యాలంటే ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేదు. బంజరు భూముల్లో కనిపించే కాక్టస్/బ్రహ్మజెముడు జాతి (యుఫోర్బియా లాక్టియా)కి చెందిన మొక్కల్ని పొలం చుట్టూ నాటాను. ఎకరానికి మహా అయితే రూ. 1,500 ఖర్చయ్యింది. అది కూడా కూలీలకు మాత్రమే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మా పొలం చుట్టూ దట్టంగా అల్లుకున్న ఆకుపచ్చని ముళ్ల కంచె దుర్భేద్యమైన కోటలాగా నిలబడి ఉంది. కోతులు, అడవి జంతువుల బెడద అన్న మాటే లేదిప్పుడు. ఏ పంటైనా చేతికొస్తుందో లేదన్న బెంగ లేదు. అందరూ ఆశ్చర్యపడేంత స్థాయిలో పంటల దిగుబడి వస్తోంది. అంతేకాదు, బలమైన గాలుల నుంచి, చీడపీడల నుంచి పంటలను, మట్టిని రక్షించుకోగలుగుతున్నాను’అంటున్నారు బగడే సగర్వంగా. చుట్టుపక్కల బంజరు భూముల్లో నుంచి కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాలను కోసి ట్రాక్టర్ ట్రక్కులో వేసుకొని తెచ్చి.. 2 అడుగుల పొడవు ముక్కలను కత్తిరించి.. అడుగుకు ఒకటి చొప్పున పొలం చుట్టూతా నాటారు. మొదట్లో అందరూ అతన్ని పిచ్చోడు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు నిశ్చింతగా పంట చేతికివస్తుంటే ఎంత తెలివైన పని చేశాడని పొగుడుతున్నారు. కట్టెలతో, బార్బ్‌డ్ వైర్‌తో లేదా రాళ్లతో కంచెను ఏర్పాటు చేసుకోవటం కన్నా దట్టంగా అల్లుకుపోయి 12 అడుగుల ఎత్తు వరకు ఎదిగిన ఈ జీవ కంచే (బయో ఫెన్స్) ఎంతో బాగుందని అందరూ అంటున్నారు. కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాల 2 అడుగుల ముక్కలను నాటి.. తొలి దశలో శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడూ ఎరువు వేస్తూ ఉంటే చాలు. ఒకటి రెండు ఏళ్లలో దాదాపుగా 5 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఆ తర్వాత ఇక వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం గాని, నీరు పెట్టాల్సిన అవసరం గానీ ఉండదు. ‘పొలంలో, పరిసర ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణ పనులు గ్రామస్తులం కలసి చేసుకున్నాం. భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. ఇప్పుడు నీటికి కరువు లేదు. దానితో పాటు జీవ కంచె కూడా విజయవంతం కావటంతో రైతులకు మా పొలం దర్శనా స్థలంగా మారిపోయింది..’ అంటున్నారు బగడే ఆనందంగా. తలవని తలంపుగా మరో ఉపయోగం కూడా చేకూరింది. జీవ కంచె పైకి కాకర, చిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి కూరగాయ మొక్కల్ని పాకించి అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా అందివచ్చింది! నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కామన్వెల్త్లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం
లండన్: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15–10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన ఆమె ఈ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది భవానీ దేవి పాల్గొన్న పదో అంతర్జాతీయ ఈవెంట్ ఈ కామన్వెల్త్ చాంపియన్‌షిప్ కాగా ఇందులో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. హోరాహోరీ పోరులో స్వర్ణం గెలుపొందడం ఆనందంగా ఉంది. ఇదే జోరును ఇకపై కొనసాగిస్తాను’ అని భవాని తెలిపింది. -
Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు
మాస్కో/కీవ్: భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుంది. అక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం. మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టాం. ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ తమకు యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.‘గ్రేజోన్’ పేరిట ఉక్రెయిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా రష్యా దండయాత్రకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. ఫిన్లాండ్ నుంచి మరిన్ని ఆయుధాలు! ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ఫిన్లాండ్ ముందుకొచ్చింది. ఫిన్లాండ్ గతంలోనే రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. ► యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయేన్ తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. యుద్ధానికి ముగింపు, ఆహార సంక్షోభంపై చర్చించారు. యుద్ధం వల్ల నష్టపోయిన వారికి తాము అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ► ఉక్రెయిన్‌లో ముగ్గురు విదేశీయులకు రష్యా అనుకూల వేర్పాటువాదుల కోర్టు మరణ శిక్ష విధించడంపై ఐరాస మానవ హక్కుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యుద్ధనేరమని వ్యాఖ్యానించింది. ► తూర్పు ఉక్రెయిన్‌లో తమ బలగాలు ప్రత్యర్థి రష్యా సైనికులపై పైచేయి సాధిస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవిరోడోంటెస్క్‌లో కీలక పారిశ్రామిక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను ఉక్రెయిన్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయన్నారు. రష్యా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాళ్ ఫ్రెండ్ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి ► తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులకు తూర్పు ఉక్రెయిన్‌లో మరణ శిక్ష విధించడం దారుణమని, ఇందుకు రష్యానే బాధ్యత వహించాలని బ్రిటిష్ మంత్రి రాబన్ వాకర్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ పౌరులైన ఐడెన్ అస్లిన్(28), షౌన్ పిన్నర్(48)కు రష్యా అనుకూల కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో మొరాకో పౌరుడు సాదౌన్కు కూడా మరణశిక్ష విధించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ► రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యంలో నిత్యం 200 మంది దాకా జవాన్లు బలవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆధునిక ఆయుధాలు వస్తేనే తమ సైనికుల ప్రాణత్యాగాలకు తెరపడుతుందన్నారు. ► ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు. ఆయన తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. తమ సేనలు ఖర్కీవ్నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాయని జెలెన్స్కీ చెప్పారు. ► డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్టాఖనోవ్పై ఉక్రెయిన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు. -
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారుల పరికరాలు, దుస్తులు కూడా వేలానికి ఉంచారు. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ తొట్టతొలి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్‌లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఈ-వేలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆమె కత్తిని రూ. 60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం పతక విజేత షట్లర్ కృష్ణ నాగర్, మరో షట్లర్ సుహాస్ యతిరాజ్(రజత పతక విజేత)లు ఉపయోగించిన రాకెట్ల ధర కూడా రూ.10 కోట్లకు చేరింది. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ. కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ. 80లక్షల బేస్‌ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం రూ. 90లక్షలు దాటింది. బాక్సింగ్ సంచలనం లవ్లీనా చేతి గ్లౌజులను రూ. 80 లక్షల బేస్‌ప్రైజ్ వద్ద వేలం ప్రారంభించగా.. ప్రస్తుతం రూ.1.80 కోట్ల వద్ద కొనసాగుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్సైట్లో (pmmementos.gov.in) ఈ వేలం ఇవాల్టి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే -
టోక్యో నాకు పాఠాలు నేర్పింది: ఫెన్సర్ భవానీ దేవి
విశ్వక్రీడల్లో పోటీపడిన తొలి భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి తనకు టోక్యో ఒలింపిక్స్ చక్కని పాఠాలు నేర్పిందని తెలిపింది. ‘రియో ఒలింపిక్స్ అనంతరం కష్టపడితేనే టోక్యో అవకాశం దక్కింది. ఇకపై మరింతగా చెమటోడ్చితేనే భవిష్యత్తులో రాణించవచ్చు. çముఖ్యంగా నేను నా టెక్నిక్‌ను మెరుగు పర్చుకోవాలి. నా ఆటతీరును సమీక్షించుకున్నాక అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకుంటాను’ అని 27 ఏళ్ల భవానీ వివరించింది. -
మహిళల హాకీలో భారత్‌కు రెండో ఓటమి.. జర్మనీ చేతిలో 0-2తో పరాజయం
కొనసాగుతున్న భారత పరాజయాల పరంపర.. మహిళల హాకీలోనూ ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత పరాజయాల పరంపర కొనసాగింది. ఇవాళ జర్మనీతో జరిగిన రెండో పూల్ మ్యాచ్‌లో భారత్ 0-2తేడాతో ఓటమిపాలైంది. జర్మనీ క్రీడాకారిణలు అన్నె ష్క్రోడర్, జెట్ ఫ్లెష్చుడ్చ్ చెరో గోల్ సాధించి ఆ జట్టును గెలిపించారు. దీంతో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఇదిలా ఉంటే భారత ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పతకం మాత్రమే ఉంది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకాన్ని సాధించింది. హీట్స్‌లోనే స్విమ్మర్ సజన్ ప్రకాశ్ ఔట్ టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనకమైన ప్రదర్శన కొనసాగుతూ ఉంది. తాజాగా స్విమ్మర్ సజన్ ప్రకాశ్ కూడా హీట్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 2లో పోటీ పడిన సజన్.. నిమిషం 57.22 సెకన్లలో రేస్ పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 5 హీట్స్ నుంచి 16 మంది సెమీఫైనల్‌కు క్వాలిఫై కాగా.. సజన్ మాత్రం 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ ఆశిష్ కుమార్ ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో మరో భారత బాక్సర్ ఇంటిదారి పట్టాడు. పురుషుల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో ఆశిష్ కుమార్ రౌండ్ ఆఫ్ 32 కూడా దాటలేకపోయాడు. చైనా బాక్సర్ ఎర్బీకె తౌహెటా చేతిలో 0-5తో ఓడిపోయాడు. తొలి రెండు రౌండ్లలో ఐదుగురు జడ్జ్‌లు చైనా బాక్సర్ వైపే మొగ్గు చూపారు. మూడో రౌండ్లో ఆశిష్ కాస్త కోలుకొని పైచేయి సాధించినా విజయం మాత్రం తౌహెటానే వరించింది. ఆశిష్ తన ప్రత్యర్థిపై పంచ్‌లు బాగానే విసిరానా.. చైనా బాక్సర్ టెక్నికల్ గేమ్‌తో ఆశిష్‌ను బోల్తా కొట్టించాడు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మనిక బత్రా ఓటమిపాలైంది. మూడో రౌండ్లో మనిక బత్రా ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవా చేతిలో 4-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. మొదటి సెట్ నుంచి ఆధిక్యం ప్రదర్శంచిన సోఫియా జోరు ముందు మనిక బత్రా నిలవలేకపోయింది. మానికా 8-11, 2-11, 5-11, 7-11 తేడాతో ఓటమి చెందింది. పోరాడి ఓడిన సుమిత్ నగల్ టోక్యో ఒలింపిక్స్‌లో సుమిత్ నగల్ పోరాటం ముగిసింది. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగల్ ఓటిమి చెందాడు. రెండో రౌండ్లో వరల్డ్ నెం.1 డానిల్ మెడెదేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 1-6 తేడాతో ఓడిపోయాడు. బ్యాడ్మింటన్ లో సాత్విక్ - చిరాగ్ శెట్టి ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్లో భారత్ తరపున బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి ఓటమి చెందింది. భారత్ పై ఇండోనేషియా జోడీ 21-13, 21-12తేడాతో విజయం సాధించింది. రెండో రౌండ్లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు. క్వార్టర్స్‌లో ఆర్చరీ భారత పురుషుల జట్టు ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీమ్ కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్ లో భారత ఆర్చరీ పురుషుల జట్టు కొరియా చేతిలో 6-0 తేడాతో ఓటమి చెందింది. వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారితో పాటు అథాను దాస్, అభిషేక్ వర్మ, ప్రవీణ్ జాదవ్ అందరూ ఫెయిల్ అయ్యారు. టేబుల్ టెన్నిస్‌లో సుతీర్థ ముఖర్జీ ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో సుతీర్థ ముఖర్జీ పోరాటం ముగిసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పోర్చుగల్ ప్లేయర్ చేతిలో సుతీర్థ ముఖర్జీ 4-0 తేడాతో ఓటమిపాలైంది. ఫెన్సింగ్‌లో భవానీ దేవి పరాజయం ఒలింపిక్స్ అరంగేట్రంలోనే మెదటి మ్యాచ్‌లో శుభారంభం చేసిన భవానీ దేవి రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచులో 15-7 తేడాతో ఓడిపోయి ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ విజయం టోక్యో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో అచంత్ శరత్ కమల్ రెండో రౌండ్లో 4-2తో పోర్చుగల్‌కు చెందిన టియాగోను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శరత్ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో భారత మరో కేటగిరీపై ఆశలు పెంచుతోంది. నాలుగో రోజైన సోమవారం ఫెన్సింగ్(కత్తిసాము’, ఆర్చరీలో జయకేతనం ఎగరేసింది. చెన్నైకి చెందిన భవానీ(2) ఫెన్సింగ్‌లో శుభారంభం చేయగా, మరోవైపు మెన్స్ ఆర్చరీ టీం విభాగంలో భారత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ రెండో రౌండ్లో అచంత్ శరత్ కమల్ విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. చరిత్ర సృష్టించిన భవానీ ఇండియన్ ఫెన్సర్ భవానీ చరిత్ర సృష్టించింది. సోమవారం ట్యూనిషియా క్రీడాకారిణి నదియా బెన్ అజిజ్తో జరిగిన పోరులో 15-3తో విజయం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ డెబ్యూలో కేవలం ఆరు నిమిషాల 14 సెకండ్లలోనే మ్యాచ్ ముగించడం విశేషం. దీంతో తర్వాతి రౌండ్‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే ఇండియా నుంచి ఫెన్సింగ్ విభాగానికి అర్హత సాధించిన మొదటి క్రీడాకారిణి భవానీనే కావడం విశేషం. తర్వాతి రౌండ్లో వరల్డ్ 3 ర్యాంకర్, ఫ్రెంచ్ ఫెన్సర్ బ్రునెట్‌తో తలపడనుంది. It's a great start for #TeamIndia today as @IamBhavaniDevi wins her first match 15-3 and advances to the Table of 32. She will face French M. Brunet in the next match at 7:40 am (IST) Let's send in our best wishes with #Cheer4India#Tokyo2020 pic.twitter.com/hC1fU9VCSu — SAIMedia (@Media_SAI) July 26, 2021 క్వార్టర్స్‌కు ఆర్చరీ టీం పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత బృందం తొలి రౌండ్లో కజకిస్తాన్‌పై విజయం సాధించింది. 6-2 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా తలపడనుంది. ముఖ్యంగా అతాను దాస్ మంచి ఫర్ఫార్మెన్స్ కనబరిచాడు. Indian men’s recurve archery team of Atanu Das, Pravin Jadhav, and Tarundeep Rai advance to quarterfinals after 6-2 win over Kazakhstan. They will play South Korea at 10:15 AM#Cheer4India #Tokyo2020 pic.twitter.com/RjwsM6smaK — SAIMedia (@Media_SAI) July 26, 2021 ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఉ.5:30కి మహిళల ఫెన్సింగ్ ఈవెంట్ క్వాలిఫికేషన్(భవానీ దేవి) ఉ.6:00కి పురుషుల ఆర్చరీ ఎలిమినేషన్(అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్) ఉ.6:30కి షూటింగ్ పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (బజ్వా, మీరజ్) ఉ.6:30కి టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్(శరత్ కమల్ ) ఉ.8:30కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్(సుతీర్థ ముఖర్జీ) ఉ.9:30కి టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్(సుమిత్ నగాల్) మ.12:20కి షూటింగ్ పురుషుల స్కీట్ ఫైనల్ మ.1:00కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ (మనికా బాత్రా) మ.3:06 కి బాక్సింగ్ పురుషుల ఫ్లైవెయిట్(ఆశీష్ కూమార్ రౌండ్ఆఫ్ 32) మ.3:50కి స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్-2(సాజన్ ప్రకాష్) సా.5:45కి భారత్ Vs జెర్మనీ మహిళల హాకీ మ్యాచ్ -
కత్తి దూసేనా...
ఒలింపిక్స్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి పోరాటం నేడు మొదలుకానుంది. మహిళల వ్యక్తిగత సేబర్ ఈవెంట్ తొలి రౌండ్లో ఆమె పోటీపడనుంది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ ఈవెంట్లో భవానీ దేవి పతకం రేసులో నిలవాలంటే కనీసం సెమీఫైనల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మహిళల సేబర్ తొలి రౌండ్: భవానీ దేవి vs నదియా (ట్యునీషియా); ఉదయం గం. 5:30 నుంచి ఆ ఇద్దరిపైనే ఆశలు... పోటీల తొలి రెండు రోజులు భారత షూటర్లు నిరాశ పరిచారు. ఒక్కరు కూడా పతకం నెగ్గలేకపోయారు. మూడో రోజు పురుషుల స్కీట్ విభాగంలో అంగద్ వీర్ బాజ్వా, మేరాజ్ అహ్మద్ ఖాన్ పతకాల కోసం బరిలో ఉన్నారు. సోమవారం క్వాలిఫయింగ్–2లో వీరిద్దరు కనబరిచిన స్కోరు ఆధారంగా ఫైనల్ చేరుకుంటారో లేదో ఆధారపడి ఉంది. 30 మంది క్వాలిఫయింగ్‌లో పోటీపడుతుండగా టాప్–6 షూటర్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అంగద్ వీర్ బాజ్వా, మేరాజ్ అహ్మద్ ఖాన్ (పురుషుల స్కీట్ క్వాలిఫయింగ్–2; ఉదయం గం. 6:30 నుంచి)... ఫైనల్ (మధ్యాహ్నం గం. 12:20 నుంచి) -
నాన్న పూజారి.. అమ్మ నగలు అమ్మితే 6 వేలు.. ఇప్పుడిలా!
సాక్షి, వెబ్‌డెస్క్: వెయిట్ లిఫ్టింగ్... హాకీ.. రెజ్లింగ్.. జిమ్నాస్టిక్స్.. షూటింగ్.. బ్యాడ్మింటన్.. ఇలా ప్రతి విభాగంలోనూ భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు భారతీయ మహిళా మణులు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్-2020లో రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించిన ‘వెండి కొండ’గా నీరజనాలు అందుకుంటోంది వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. ఇక బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (58 కేజీల విభాగం)లో సాక్షి మాలిక్ గతంలో పతకాలు సాధించారు. అయితే, ఈ క్రీడలన్నింటికీ భిన్నంగా వినూత్న మార్గాన్ని ఎంచుకుంది సీఏ భవానీ దేవి. ఎవరికీ అంతగా పరిచయం లేని ‘ఫెన్సింగ్’ క్రీడాంశాన్ని ఎంపిక చేసుకోవడమే గాకుండా.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి నుంచి ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనే స్థాయికి చేరిన భవానీ దేవి గురించిన ఆసక్తికర అంశాలు మీకోసం. 11 ఏళ్ల వయస్సులోనే.. సీఏ భవానీ దేవి పూర్తి పేరు.. చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీ దేవి. స్వస్థలం చెన్నై. ఆమె తండ్రి ఆలయ పూజారి. తల్లి గృహిణి. మరుగు ధనుష్కోడి గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యనభ్యసించిన భవానీ దేవి.. పదకొండేళ్ల వయస్సు నుంచే ఫెన్సింగ్ వైపు ఆకర్షితురాలైంది. ఎపీ, ఫాయిల్, సబ్రే.. ఈ మూడు విభాగాల్లో సబ్రేను తన క్రీడాంశంగా ఎంచుకుంది. తొలిసారే చేదు అనుభవం.. పద్నాలుగేళ్ల వయస్సులో టర్కీలో జరిగిన పోటీల్లో తొలి సారిగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రీడల్లో భవానీ దేవి పాల్గొంది. అయితే, దురదృష్టవశాత్తూ.. మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మలేషియాలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్-2009లో పాల్గొన్న భవానీ దేవి.. తొలిసారిగా పతకం సాధించింది. ఆ తర్వాత 2010లో ఇంటర్నేషనల్ ఓపెన్, కాడెట్ ఏసియన్ చాంపియన్‌షిప్-2010, కామన్వెల్త్ చాంపియన్‌షిప్-2021, 2015 అండర్-15 ఏసియన్ చాంపియన్‌షిప్, ఫ్లెమిష్ ఓపెన్‌లో కాంస్య పతకాలు, అండర్-23 ఏసియన్ చాంపియన్‌షిప్-2014లో రజతం గెలుచుకుంది. కెరీర్లో మొత్తంగా తొమ్మిది నేషనల్ టైటిళ్లు సాధించిన భవానీ దేవి ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన ఆమె ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. భవానీ దేవి ఎదుర్కొన్న ఆటంకాలు, అవరోధాల గురించి ఆమె మాటల్లోనే... Olympics 2020 is just 2 days away and this will be the first time India will be participating in Fencing. I am thankful to the government of India, @IndiaSports, @Media_SAI for all their support. pic.twitter.com/mDirL8QeiG — C A Bhavani Devi (@IamBhavaniDevi) July 21, 2021 అమ్మ నాకోసం తన నగలు అమ్మింది.. ‘‘పదకొండేళ్లు ఉన్నపుడు తొలిసారి స్కూళ్లో ఫెన్సింగ్‌ను ఎంచుకున్నాను. ఎందుకో నాకు ఆ పేరే కొత్తగా, ప్రత్యేకంగా అనిపించేది. రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోయింది. అయితే నాతో పాటు ఈ క్రీడను ఎంచుకున్న అమ్మాయిలు మధ్యలోనే డ్రాప్ అయ్యేవారు. కానీ నేను సీరియస్‌గా తీసుకున్నా. ముఖ్యంగా మా అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది. ‘‘నీకు ఏదైతే నచ్చుతుందో అదే బాటలో నడువు’’ అని ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. కేవలం మాటలకే పరిమితం కాలేదు వాళ్లు. మా నాన్న పూజారి. అమ్మ గృహిణి. నా తొలి ఫెన్సింగ్ కిట్ కొనడానికి అమ్మ తన నగలు అమ్మింది. 6 వేల రూపాయలు వచ్చాయి. అంతటితో వారి ప్రయత్నం ఆగిపోలేదు. స్పాన్సర్లను వెతకడానికి గంటల తరబడి వివిధ ఆఫీసుల్లో వేచి చూసేవారు. నిరాశతో ఇంటికి వచ్చినా.. చిరునవ్వు చెరగనీయక మంచి రోజులు వస్తాయంటూ వెన్నుతట్టేవారు. వారి ఆశలు, ఆశయం నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే ఎంత కష్టపడినా ఫలితం ఉండేది కాదు. మెంటార్ ఉంటే బాగుంటుందని భావించాను. అప్పుడే ఓ వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చారు. ఆయన వల్లే అండర్-19 నేషనల్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాను. అయితే, విదేశీ పర్యటనల ఖర్చులు భరించే స్థోమత లేక 2013లో ఫెన్సింగ్‌ను వదిలేద్దామనుకున్నా. అప్పటికే నా కోసం రూ. 10 లక్షల లోన్ తీసుకున్నారు. ‘‘అమ్మ.. ఇంతకంటే నాకోసం మీరు కష్టపడవద్దు. మన కుటుంబం ఈ దీన పరిస్థితిలో ఉండటం చూడలేను’’ అని అమ్మతో చెప్పాను. కానీ తను మత్రం.. ‘‘శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది’’ అని నన్ను ఓదార్చింది. నాలో విశ్వాసం నింపింది. గట్టిగా ఏడ్చేశాను... అమ్మ భయపడిపోయింది 2014 నుంచి కఠోర సాధన చేశాను. ఏసియన్ చాంపియన్‌షిప్‌లో ఫెన్సింగ్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాను. అయినా, కష్టాలు వీడలేదు. ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారింది. విదేశాల్లో జరిగే టోర్నీలకు వెళ్లలేని దుస్థితి. అందుకే అప్పటి సీఎం జయలలిత మేడంకి లేఖ రాశాను. ఆమె నన్ను తన నివాసానికి పిలిపించి, ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి అదృష్టం వరించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ఈ వార్త వినగానే గట్టిగా ఏడ్చేశాను. అమ్మ భయపడిపోయింది. మర్లే పర్లేదు బేటా.. వచ్చేసారి నీకు అవకాశం వస్తుందిలే అని నన్ను బుజ్జగించింది. అసలు విషయం చెప్పిన తర్వాత తన ఆనందానికి అవధుల్లేవు. ఇటీవలి చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత 10 లక్షల లోన్ తిరిగి కట్టగలిగాను. మా అమ్మ వాళ్ల కోసం ఒక ఇల్లు కొనడం నా ముందున్న ఆశయం. నన్ను ఇంతదాకా తీసుకువచ్చిన నా కుటుంబం, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బంగారు పతకం సాధించి అమ్మను సగర్వంగా తలెత్తుకునేలా చేస్తాను’’ అని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భవానీ దేవి తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. ఆమె కోరుకున్నట్లు స్వర్ణం సాధించి, విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!! -
అన్న ప్రాణాలు తీసిన కంచె పంచాయితీ!
లక్నో: వ్యవసాయ పొలంలో కంచె తొలగించిన కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదాన్‌లో శనివారం సాయంత్రం జరిగింది. రిషిపాల్ (68) తన పొలంలో బోరుబావి తవ్వించుకున్నాడు. దానికి మోటారు బిగించేందుకు ఓ సిమెంట్ నిర్మాణం అవసరమైంది. ఆ నిర్మాణం కోసమని తన తమ్ముని పొలం గుండా ఓ ట్రాక్టర్లో సామాగ్రి తీసుకొచ్చాడు. ట్రాక్టర్ రావడంతో అతని పొలానికి చెందిన ఫెన్సింగ్ (కంచె) కొద్దిగా ధ్వంసమైంది. ఈ విషయమై రిషిపాల్‌తో అతని తమ్ముడు, తమ్ముని కొడుకు గొడవకు దిగారు. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రిషిపాల్‌పై వారిద్దరూ కర్రలతో దాడిచేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రిషిపాల్ ప్రాణాలు విడిచాడని జిల్లా ఎస్పీ సిద్ధార్థ వర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
వాల్గొండ అటవీప్రాంతంలో కలకలం
మల్లాపూర్(కోరుట్ల): వాల్గొండ అటవీ ప్రాంతంతో మంగళవారం రాత్రి వన్యప్రాణులకోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌తీగలతో ట్రాక్టర్ దగ్ధమవగా, చుక్కల జింక మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వాల్గొండ అటవీప్రాంతంలో ఆదే గ్రామానికి చెందిన ఇస్లావత్ శరినాయక్ కౌలుకు తీసుకున్న పొలంలో మొరం మట్టి పోసేందుకు ట్రాక్టర్ డ్రైవర్ చెట్పల్లి రాజు వెళ్లాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురైన ట్రాక్టర్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘటనస్థలికి వెళ్లగా వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌తీగలు గుర్తించారు. సంఘటన జరిగిన కొంతదూరంలో చుక్కల జింక కరెంట్‌షాక్‌కు గురై మృతిచెంది కనిపించింది. ప్రజాప్రతినిధులు వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి చుక్కల జింక మృతదేహాన్ని, దుండగులు వదిలి వెళ్లిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఫుడ్ డెలివరీ బాయ్‌గా ఒలింపిక్ మెడలిస్ట్
టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కరోనా దెబ్బతో ఇప్పటికే ఆర్థిక మాంద్యం మొదలైంది. దాంతో సాధారణ ప్రజలు దగ్గర్నుంచీ సెలబ్రెటీలు కూడా ఆర్థిక వెసులుబాటు కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ కోవలోకి వస్తాడు జపాన్‌కు చెందిన ఫెన్సర్ రియో మియాక్. గతంలో ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన రియో మియాక్.. ఇప్పుడు కరోనా వల్ల ఫుడ్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆర్థికంగా నిలబడటంతో పాటు రాబోయే పోటీల్లో పాల్గొనడానికి రోజు వారి ఖర్చుల కోసం పని చేస్తున్నాడు. ఇందుకు ఉబర్ ఈట్స్‌ను ఎంచుకున్నాడు. ఉబర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా చేరి రోజూ రెండువేలు యెన్లు సంపాదిస్తున్నాడు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో రజత పతకం గెలిచిన రియో మియాక్.. ఈఏడాది తమ దేశంలో జరిగే ఒలింపిక్స్ సిద్ధమయ్యాడు. (భారీ నష్టం తప్పదు : సౌరవ్ గంగూలీ) అయితే అది కాస్తా వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో రియో మియాక్ ఇక చేసేది లేక డెలివరీ బాయ్‌గా చేరిపోయాడు. ఒకవైఫు ఫిట్నెస్ను కాపాడుకున్నట్లు ఉంటుంది.. మరొకవైపు ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందని ఆలోచించిన మైకేల్ ఇలా ఉబర్ ఈట్స్‌లో ఫుడ్‌డెలివరీ చేస్తున్నాడు. ‘ నాకు విరామం దొరకడంతో డబ్బులు కోసం మార్గం ఆలోచించా. అంతే తడువుగా ఉబర్ ఈట్స్‌లో జాయిన్ అయ్యా. నా శారీరక ధృడత్వాన్ని కాపాడుకుంటానికి కూడా ఇదొక ఎక్సర్‌సైజ్‌లా ఉంది. ఎక్కడైతే కరోనా వైరస్ రిస్క్ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తున్నా. ఇక్కడ ఆర్డర్ చేసిన వారి గుమ్మం ముందే ఫుడ్‌ను ఉంచి భౌతిక దూరాన్ని పాటిస్తున్నా. నేను ఎప్పుడైతే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నానో ఆ తర్వాత రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తీసుకెళుతున్నా’ అని మియాక్ తెలిపాడు. ఫెన్సింగ్ అనేది ఒక క్రీడ అని, దానికి చాలా ఫిట్‌గా ఉండాలని పేర్కొన్నాడు. తగిన ప్రాక్టీస్ లేకుండా ఇంట్లో కూర్చొంటే ఆ క్రీడలో రాణించడం కష్టమన్నాడు. (క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేశాడు..) -
సరిహద్దులో ‘కొత్త ప్రణాళిక’
న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు కేంద్రం కొత్త ప్రణాళిక రచించింది. చొరబాట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉక్కు కంచెలను ఏర్పాటు చేయనున్నామని అధికారులు శుక్రవారం తెలిపారు. దీని కోసం అస్సాంలోని సిల్చార్ వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏడు కిలోమీటర్ల పొడవున కత్తెరించినా తెగని ఉక్కు కంచె నిర్మించి పరిశీలిస్తున్నారు. ఈ కంచెకు కిలోమీటరుకు రూ. 2 కోట్లు ఖర్చవుతోందని చెప్పారు. పంజాబ్‌లోని అమృత్సర్ వద్ద కూడా 60 కిలోమీటర్ల సరిహద్దు వద్ద కూడా సింగిల్–రో ఉక్కు కంచెను నిర్మించబోతున్నారు. సీడీఎస్‌కు సాయంగా పలువురు అధికారుల నియామకం న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో కొత్తగా రూపొందించిన సైనిక వ్యవహారాల విభాగంలో ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, 13 మంది డిప్యూటీ సెక్రటరీలు, 25 మంది కార్యదర్శి స్థాయి కింది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్రివిధ దళాల సమాహారమైన సీడీఎస్‌ను కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నియామకాలు దోహదపడుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 1న దేశ తొలి త్రిదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రక్షణ శాఖ అధికారులతో రావత్ వరుసగా భేటీ అవుతున్నారు. భవిష్యత్ రక్షణ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా కేంద్రం సీడీఎస్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో త్రివిధ దళాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో సీడీఎస్ ప్రముఖ పాత్ర పోషించనుంది. సీడీఎస్ బాధ్యతలతోపాటు త్రివిధ దళాలకు సంబంధించిన విషయాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగానూ రావత్ వ్యవహరించున్నారు. (చదవండి: రాజకీయాలకు మేము దూరం) -
ఇంటికి జియో ఫెన్సింగ్
సాక్షి, హైదరాబాద్: స్వగ్రామంలో మీ ఇల్లు ఎక్కడుందో చూసుకోవాలంటే ఏం చేస్తారు. ఠక్కున గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి ఇంటిని వెతుకుతారు. ఊరు నమూనా తెలుసు కాబట్టి.. మీ ఇల్లు ఎక్కడుందో పసిగడతారు. అదే ప్రభుత్వం మీ ఇంటి చిరునామా తెలుసుకోవాలంటే.. చాలా కష్ట పడాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రతి ఇంటిని ‘జియో ఫెన్సింగ్’చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ‘నజరీ నక్షా’ఆధారంగా ప్రతి ఇంటిని ఓ నిర్దిష్ట ఆకారంగా గుర్తిస్తోంది. దీనికోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలను వాడుతోంది. వీటిని సాధారణ మ్యాప్‌లతో అనుసంధానించడం ద్వారా ఏ శాశ్వత నిర్మాణం ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. జియో రిఫరెన్సింగ్ అని పిలిచే ఈ పద్ధతితో పోలింగ్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓటర్లందరి వివరాలను అదే స్టేషన్లో నిక్షిప్తం చేసేందు కు ఈసీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ సమస్యను మాన్యువల్‌గా అధిగమించేందుకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఈసీ చేస్తున్న కసరత్తు నజరీ నక్షా ద్వారా పూర్తి కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు 31,76,699 ఇళ్ల ఆకారాలను గుర్తించగా.. 2,01,255 ఇంటి నంబర్లను అనుసంధానించింది. 2,56,441 ఓటర్ల వివరాలను కూడా సేకరించింది. ఏం చేస్తారంటే.. మొదట నియోజకవర్గ సరిహద్దులను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా నిర్దారిస్తారు. ఆపై పోలింగ్ కేంద్రాల పరిధిని గుర్తిస్తారు. ఆయా కేంద్రాల పరిధిలోకి వచ్చే ఓటర్ల వివరాలను బూత్‌స్థాయి అధికారి సహకారంతో క్రోడీకరిస్తారు. ఓటరు గుర్తింపు కార్డుల్లోని వివరాల ఆధారంగా ఇళ్లు ఉన్న ప్రాంతాలను, అందులోని సభ్యులను గుర్తిస్తారు. ఈసీ ఈ ఇక్కడి వరకే పరిమితం అవుతుండగా, రెవెన్యూ శాఖ దీనికి అదనంగా ఇళ్లకు జియో రిఫరెన్స్ ఇచ్చే ప్రక్రియకు పూనుకుంటోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశా రు. ఓటర్ల వివరాలకే పరిమి తం కాకుండా.. ప్రజావసరాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని ఆ లేఖలో సూచించారు. ఉపయోగమేంటి.. రేషన్ పంపిణీ నుంచి మౌలి క సదుపాయాల కల్పన వరకు ఈ టెక్నాల జీ ఉపయోగపడనుంది. గ్రామాల్లో వార్డుల విభజన, క్లస్టర్లను తయారీ సులువు కానుంది. పౌరసేవల పరిధిని కూడా నిర్దేశించే వీలుంది. పట్టణాల్లో కష్టమే.. ఈ ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో అనుకున్నంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. పట్టణాల్లో నివసించే వారి చిరునామాలు తరచుగా మారే అవకా శం ఉందని, ఈ మేరకు నివాసం మారినప్పుడల్లా ఈ వ్యవస్థను అప్డేట్ చేసుకోవాలని భావిస్తున్నా రు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలోనూ మార్పులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నా రు. ఏదేమైనా రాష్ట్రంలోని శాశ్వత నిర్మాణాలకు జియోఫెన్సింగ్ ఇవ్వడం ద్వారా ప్రజావసరాలను త్వరితగతిన సమకూర్చడంతోపాటు పలు సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా అమలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విద్యుత్ షాక్‌తో.. కాటేస్తున్న కంచె!
పంట పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి ఒకరు, పశువులను కాసేందుకు వెళ్లి మరొకరు, పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి ఇంకొకరు.. ఇలా ఎంతో మంది అమాయకులు పొలాల వద్ద విద్యుత్ షాక్‌తో మృతిచెందుతున్నారు. కొంతమంది రైతులు అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేను చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలియని పక్కరైతులు కంచెకు తగిలి ప్రాణాలు విడుస్తున్నారు. పొలాల వద్ద కరెంట్ షాక్ ఏర్పాటు చేయడం వలన కలిగే నష్టంపై సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. సాక్షి, వికారాబాద్: అడవి పందుల నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ తీగలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కంటికి కనిపించనంత సన్నని వైర్లను పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసి వీటికి కరెంట్ షాక్ పెడుతున్నారు. ఈ తీగలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఓవైపు విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో పొలాలకు ఇష్టానుసారంగా విద్యుత్ షాక్‌లు పెడుతున్నారు. దీంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా 42 మంది విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. వీరిలో 30 మంది రైతులే ఉండటం గమనార్హం. విద్యుత్ స్తంభాలు పాతడంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా కొంతమంది రైతులు మరణిస్తే.. పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ షాక్ బారిన పడి ఎక్కువ శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. పంట పొలాల రక్షణకు విద్యుత్ తీగలు వేయడమే పరిష్కారమా..? అనే విషయాన్ని రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదనే విషయాన్ని సంబంధిత అధికారులు హెచ్చరించకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఇలాగే కొనసాగే ప్రమాదముంది. ఇటీవల జరిగిన సంఘటనలు.. ఐదు నెలల క్రితం ధారూరు మండల పరిధిలోని కొండాపూర్కుర్దు గ్రామానికి చెందిన అల్లాడి సుధాకర్‌రెడ్డి అతని భార్య ఇందు పంట పొలానికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందారు. పాత విద్యుత్ వైర్లను తొలగించి కొత్త వైర్లు బిగించిన విద్యుత్ సిబ్బంది పాతవైరును తొలగించకుండా వదిలేశారు. ఎర్త్ కోసం ఏర్పాటు చేసిన మరోవైరు వేలాడుతూ ఈ వైర్లకు తాకడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూలీకోసం వెళ్లిన ఓ మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం గుండేపల్లిలో గత శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజిలమ్మ ఇదే ఊరికి చెందిన మరో రైతు పొలానికి కూలీ పనికి వెళ్లింది. రైతు తన జొన్న పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను తగిలిన ఆమె ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. బొంరాస్‌పేట మండల కేంద్రంలో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ గురై చనిపోయిన సంఘటన ఈ నెల 23న చోటు చేసుకుంది. వ్యవసాయ పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను గమనించకుండా వెళ్లిన శివకుమార్, నర్సింలు షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. యాలాల మండలం దౌల్తాపూర్ అనుబంధ గ్రామమైన గిరిజాపూర్‌లో శ్రీశైలం అనే రైతు తన పంట పొలానికి విద్యుత్ సరఫరా సరిచేసుకునే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై చనిపోయాడు. ఆరు నెలల క్రితం తాండూరు మండలానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ తీగలు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి పిల్లలు పట్టుకుంటే ప్రమాదమని ఆ తీగలను పక్కకు వేసే ప్రయత్నం చేశాడు. తీగలకు సరఫరా ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో రెండు చేతులు, రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. గత వారం రోజుల క్రితం మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లిలో మాన్య అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. ఇదే గ్రామనికి చెందిన ఓ రైతు పంట పొలానికి వేసి విద్యుత్ వైర్లు తగలడంతో మృత్యువాత పడ్డాడు. -
ప్రాణం తీసిన సరిహద్దు
సాక్షి, మంచిర్యాల : ఇంటి సరిహద్దు విషయంలో జరిగిన గొడవలో కర్రతో దాడి చేసి ఒకరిని హత్య చేసిన సంఘటన మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక సీఐ నారాయణ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవాడకు చెందిన తోకల మల్లయ్య(45)ను అదే గ్రామానికి చెందిన వరుసకు తమ్ముడైన తోకల గంగయ్య కర్రతో దాడి చేసి హతమార్చాడు. కొద్ది రోజులుగా ఇంటి సమీపంలోని సరిహద్దు విషయంలో ఇరువురి మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని సరిహద్దు మధ్య గల కొయ్య ను తొలగించమని గంగ య్య అడుగగా మల్లయ్య తొలగించనని చెప్పాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గంగయ్య కర్రతో మల్లయ్య తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
కంచె.. బలితీసుకుంది!
బెంగళూరు: ఏనుగులను కాపాడేందుకు వేసిన కంచె.. ఓ గజరాజు పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని నగర్‌హోళె జాతీయ పార్కులో ఈ విషాదం జరిగింది. ఓ ఊరిలోకొచ్చిన ఏనుగును స్థానికులు తరమడంతో కంచెను దాటబోయి ఇరుక్కుపోయింది. దీంతో తన బరువుకు ఊపిరాడక మృతి చెందింది. రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోకుండా ఉండే ందుకు రక్షణగా గతంలో రైలుపట్టాలకు ఇరువైపులా రూ.212 కోట్లతో ఈ కంచెను రైల్వేశాఖ నిర్మించింది. ఏనుగును జాతీయ పార్కులోని వీరహోసహళ్లి రేంజ్‌లోకి తరిమేందుకు జనం ప్రయత్నించారని అటవీ అధికారులు తెలిపారు. కంచెపై చిక్కుకోవడంతో తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతోనే ఊపిరితిత్తుల్లో గాయమై ఏనుగు మరణించి ఉంటుందని అధికారులు వివరించారు. -
క్రీడాకారిణులపై కత్తి వేటు
ఒంగోలు టౌన్: ఆ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలు కత్తి యుద్ధం (ఫెన్సింగ్) పోటీల్లో ప్రావీణ్యం సాధించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన ఆ పాఠశాల పీఈటీ ఏకంగా కత్తి యుద్ధం పోటీలకు వెళ్లద్దంటూ ఆదేశించింది. తన భర్త నేర్పిస్తున్న కబడ్డీ క్రీడకు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేసింది. తమకు కబడ్డీ రాదని, ఫెన్సింగ్ పోటీలకు వెళతామని ఆ బాలికలు చెప్పిన నాటి నుంచి వెదురు బొంగుతో కొట్టడం మొదలుపెట్టింది. కత్తి యుద్ధం వీడి కబడ్డీకి వెళతామని చెప్పేవరకు వారిని ప్రతిరోజూ కొట్టడం ప్రారంభించింది. ఈ బాధలు తట్టుకోలేని బాలికలు తాము పాఠశాల మానివేస్తామంటూ తమ తల్లిదండ్రుల వద్ద వాపోయారు. ఎందుకు ఇలా చెబుతున్నారంటూ వారిని దగ్గరకు తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో శుక్రవారం ఆ బాలికలు వారి తల్లిదండ్రులను తీసుకొని నేరుగా ఆ పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీస్తే నీళ్లు నమిలింది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు బాలికలు ఫెన్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించి ఇద్దరు జాతీయ పోటీలకు కూడా ఎంపికయ్యారు. అలాంటి బాలికలను అభినందించాల్సిన ఆ స్కూల్ పీఈటీ జ్యోత్నానదేవి వారిపై కత్తి కట్టింది. పీఈటీ కోర్సు చేíసి కబడ్డీ శిక్షణ ఇస్తున్న తన భర్త వద్దకు ఫెన్సింగ్ మానుకొని కబడ్డీ ప్రాక్టీసుకు వెళ్లాలంటూ హుకుం జారీచేసింది. తాము వెళ్లమని ఆ బాలికలు చెప్పడంతో వెదురుబొంగుకు పని చెప్పింది. గత కొన్ని రోజుల నుండి వెదురుబొంగుతో విచక్షణారహితంగా వారిని కొడుతుండటంతో ఆ బాధలు తట్టుకోలేని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు మీడియా, చైల్డ్‌లైన్ సమక్షంలో నేరుగా పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీయడంతో ఆ పీఈటీ తనకే పాపం తెలిదన్నట్లుగా వ్యవహరించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. షాడో పీఈటీ.. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా జ్యోత్సా్నదేవి పనిచేస్తున్నప్పటికీ, ఆమె భర్త షాడో పీఈటీగా వ్యవహరిస్తున్నాడు. పాఠశాల జరుగుతున్న సమయంలోనే షాడో పీఈటీగా వ్యవహరిస్తూ బాలికలపై పెత్తనం చేస్తున్నట్లు పలువురు బాలికలు మీడియా వద్ద వాపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ గేమ్స్‌లో భాగంగా జిల్లాకు చెందిన ఫెన్సింగ్ బాలికల జట్టు నెల్లూరులో సెప్టెంబర్ 29వ తేదీ జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరింది. అందులో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు బాలికలు కూడా ఉన్నారు. ఆ బాలికలతోపాటు పీఈటీ జ్యోత్న్సాదేవి వెళ్లాల్సి ఉంది. కానీ, ఆమె వెళ్లకుండా తన భర్తను పంపించింది. బాలికలను రైలులో ఎక్కించి షాడో పీఈటీగా వ్యవహరిస్తున్న ఆమె భర్త మోటార్ బైక్‌పై నెల్లూరు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కూడా అదేమాదిరిగా వచ్చాడు. ఆ రోజు పీఈటీ జ్యోత్సా ్నదేవి రిజిస్టర్లో ఆన్ డ్యూటీ(ఓడీ)గా సంతకం చేశారు. అంటే ఆమె విధుల్లో ఉండి బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకువెళ్లకుండా, ఆమె భర్తను పంపించడం వివాదాస్పదమైంది. బాలల సంక్షేమ కమిటీ దృష్టికి.. పీవీఆర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ జ్యోత్న్సాదేవిపై బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధులు దేవకుమారి, కోటేశ్వరరావు విలేకరులకు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ దృష్టికి తీసుకుళ్లున్నట్లు వివరించారు. -
15 ఏళ్లుగా బతుకులు బందీ!
సాక్షి, మంగళగిరి: వారు చేయని నేరానికి గత 15 ఏళ్లుగా ఇనుప కంచె మధ్య బందీలయ్యారు. అందరి మధ్య ఉంటూనే ప్రభుత్వాధికారుల మధ్య సమన్వయలోపంతో నిర్బంధ జీవితం గడుపుతున్నారు. ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా నానా అగచాట్లు పడాల్సిందే. ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్లాలంటే అదో ప్రహసనమే. ఎవరైనా చనిపోతే వారి పాట్లు చెప్పనలవి కాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇనుపకంచె ఒంటిపై చేసే గాయాలతో విలవిల్లాడాల్సిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎల్బీ నగర్లో ఏపీఎస్పీ క్యాంపు రోడ్డును ఆనుకుని 1972లో సుమారు 50 కుటుంబాల వారు స్థిర నివాసాలు ఏర్పర్చుకుని ఉంటున్నారు. మున్సిపల్ అధికారులు క్యాంపు రోడ్డును సరిహద్దుగా పరిగణనలోకి తీసుకుని వీరికి ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. అందరూ పక్కా భవనాలు నిర్మించుకున్నారు. ఇంతలో 2003లో ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు తీసుకున్న నిర్ణయం వారిని నిశ్చేష్టుల్ని చేసింది. క్యాంపు ఆవరణ చుట్టూ కంచె వేసిన అధికారులు క్యాంపు రోడ్‌ను ఆనుకుని వున్న ఇళ్లకు రోడ్డు మార్గం లేదంటూ వారి నివాసాల గేట్ల ముందు నుంచి కూడా కంచె వేసేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు కనీసం గేటు తెరిచే ఖాళీ లేకుండా కంచె వేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. సొంత నివాసాలు కావడంతో ఖాళీచేసి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఇంట్లో మనిషి చనిపోతే శవాన్ని తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సిందే. తమకు దారి కల్పించమని కోరుతూ పదిహేనేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే కంచెను మార్పించి తమకు దారి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఒకసారి అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు, ఆర్డీవో నాగబాబు స్వయంగా సందర్శించి వారి కష్టాలు చూసి సర్వే నిర్వహించి వారికి దారి ఇవ్వాల్సిందేనని కలెక్టర్‌కు నివేదించినా ఉపయోగం లేకుండాపోయింది. చివరికి ఏడాది క్రితం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయగా, సర్వేయర్‌ను పంపి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అయినా, ఇప్పటివరకు సర్వే నిర్వహించిన దాఖలాల్లేవు. మున్సిపల్, రెవెన్యూ, ఏపీఎస్పీ అధికారులు తక్షణం జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. కంచె వేయడం దుర్మార్గం 2003లో ఏపీఎస్పీ అధికారులు రోడ్డు వదలకుండా కంచె వేయడం దుర్మార్గం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా, రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇనుప కంచె గీసుకుని గాయాలపాలవుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును మినహాయించి కంచె వేయాలి. – టి సుదర్శనరావు, రిటైర్డు ఏఎస్ఐ దారి కల్పించి కష్టాల నుంచి కాపాడాలి క్యాంపు రోడ్డు ఉందనే ఇళ్లు కట్టుకున్నాం. బిందెడు నీళ్లు ఇంట్లోకి తెచ్చుకునేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. గోడకు కంచెకు మధ్యలో అడ్డం తిరిగి నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇళ్లల్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా పాట్లే. అధికారులు వెంటనే కల్పించుకుని ఈ కష్టాల నుంచి కాపాడాలి. – సీహెచ్ సువర్ణ, స్థానికురాలు -
గండ శిలలకు గట్టి రక్షణ
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ముడుమాల్‌లో ఉన్న గండ శిలలకు రక్షణ కవచం ఏర్పాటవుతోంది. రాతియుగంలో నిర్మించినట్లు భావిస్తున్న ఈ పురాతన ఖగోళ పరిశోధన ప్రాం తాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గండ శిలలున్న ప్రాంతంలోని పట్టా భూములను ఇప్పటికే సేకరించిన సర్కారు.. ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఐదున్నర ఎకరాల్లో.. కృష్ణానది తీరంలోని ఈ గండ శిలలను క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటే క్రమపద్ధతిలో అమర్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శిలల్లో 14 అడుగుల కంటే ఎత్తున్న రాళ్లు 80 వరకు ఉండగా.. చిన్న రాళ్లు మూడు వేల వరకు ఉన్నాయి. మొత్తం శిలల ప్రాంతం 80 ఎకరాల్లో విస్తరించి ఉంది. పొడవాటి రాళ్లు మాత్రం ఐదున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ పట్టా భూములు కావడం, రైతులు వ్యవసాయం చేస్తుండటం, వాటి ప్రాముఖ్యం తెలియకపోవడంతో చాలా రాళ్లు కనుమరుగైనట్లు నిపుణులు గుర్తించారు. దీంతో మిగిలిన రాళ్లున్న ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయించిన హెరిటేజ్ తెలంగాణ.. ఈ విషయమై ప్రభుత్వానికి వివరించింది. దీంతో ముడుమాల్ నిలువు రాళ్లున్న ప్రాంతంలో ఐదున్నర ఎకరాల భూమిని రైతుల నుంచి ఇటీవల సర్కారు సేకరించింది. మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్తో హెరిటేజ్ తెలంగాణ సంచాలకురాలు విశాలాచ్చి చర్చించి భూ సేకరణ వేగంగా జరిగేలా చూశారు. ఇటీవలే దాదాపు రూ.25 లక్షల పరిహారాన్ని రైతులకు అందించారు. ప్రస్తుతం ఆ ఐదున్నర ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కందకాలు తీశారు. మరో వారం, పదిరోజుల్లో ఫెన్సింగ్ పని పూర్తి కానుంది. సందర్శకులు పరిశీలించేంలా ఫెన్సింగ్ వెంట నడకదారి కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు రాతియుగం నాటి మనుషులు సమాధులకు గుర్తుగా నిలువు రాళ్లు పాతడం ఆనవాయితీ. ఈ శిలలు కూడా అలాంటి సాధారణ నిలువు రాళ్లేనని మూడేళ్ల క్రితం వరకు భావించారు. అయితే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చారిత్రక విభాగం ప్రొఫెసర్ పుల్లారావు, వర్సిటీ విద్యార్థుల బృందం మూడేళ్ల క్రితం ఆ ప్రాంతంపై కొన్ని నెలలు పరిశోధనలు చేసి అవి సాధారణ రాళ్లు కావని గుర్తించారు. వాటికి చేరువలో ఓ వెడల్పాటి రాతిపై ఉన్న గుర్తులను నక్షత్ర çసమూహంలోని సప్తర్షి నక్షత్ర మండలం (ఉర్సామెజర్)గా గుర్తించారు. నిలువు రాళ్ల నీడల గమనం ఆధారంగా వాతావరణంలో మార్పులను నాటి మనుషులు గుణించేవారని బృందం నిర్ధారించింది. ప్రపంచంలో రెండు, మూడు ప్రాంతాల్లోనే ఇలాంటి ఏర్పాట్లు ఉన్నట్లు తేల్చింది. ఈ గండ శిలల విషయాన్ని ప్రొఫెసర్ పుల్లారావు అంతర్జాతీయ వేదికలపై పంచుకోగా విదేశీ శాస్త్రవేత్తలు ముడుమాల్‌కు వచ్చి ఆ శిలల అధ్యయనం ప్రారంభించారు. ప్రస్తుతం వాటి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసి మరింత ప్రాచుర్యం తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనానికి అవకాశం కలుగుతుందని విశాలాచ్చి అభిప్రాయపడుతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దబొంకూరులోని చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతంలో 1970లో భూ సేకరణ జరిపారు. ఆ తర్వాత ఇంతకాలానికి భూ సేకరణ జరిపింది ముడుమాల్‌లోనే కావడం విశేషం. -
ఫెన్సర్ భవానికి రజతం
చెన్నై: భారత ఫెన్సర్ భవాని దేవి రెక్జావిక్ వరల్డ్ కప్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. ఐస్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో ఆమె సాబ్రే ఈవెంట్లో రెండో స్థానాన్ని సంపాదించింది. తమిళనాడుకు చెందిన భవాని దేవి ఫైనల్లో 10–15తో అలెక్సిస్ బ్రౌన్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. గతేడాది జరిగిన ఈ టోర్నీలో భవాని స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా రికార్డు సృష్టించింది -
ప్రాణాలు తుంచే కంచె..
పొలాల మాటున విద్యుత్ కంచెలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలకాలంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు తమ పొలాల్లోకి ప్రవేశించే పందులు, ఎలుగులు(ఎలుగుబంట్లు) మట్టు పెట్టేందుకు పొలం చుట్టూ జీఏ వైరుతో పెన్సింగ్ ఏర్పాటు చేసి కరెంట్ పెడుతున్నారు. పందుల మాట ఎలా ఉన్నా ఈ విధానం వల్ల ఏకంగా మనుషుల ప్రాణాలే గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా రైతులు గుట్టుచప్పుడు కాకుండా పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార యంత్రాంగం నిఘా పెట్టి నియంత్రణ చేయకుంటే మున్ముందు ఈ విధానం ప్రాణాలకే ముప్పు. పశ్చిమగోదావరి: జిల్లాలో ఇటీవలకాలంలో పందులు తమ పొలాల్లో చొరబడకుండా రైతులు తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. కంటికి కనిపించని రీతిలో ఈ తీగలు ఉండటంతో పొలాల వెంబడి నడిచి వెళ్లేవారు గుర్తించలేక మృత్యువాత పడుతున్నారు. ఈ విధానం తొలుత డెల్టా ప్రాంతం నుంచి ప్రారంభమై నేడు ఏజెన్సీ, మెట్ట ప్రాంతానికి సైతం పాకింది. సరఫరా ఆపకుంటే ప్రాణాలు గాల్లోకే.. పందులు, ఎలుగుల నివారణ కోసం రైతులు జీఏ వైరును అమర్చి విద్యుత్ మోటారు స్విచ్ బోర్డు నుంచి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయమే సరఫరా నిలుపుదల చేస్తూ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని అనేక మంది సాటి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం మరచినా విద్యుత్ తీగలే యమపాశాలుగా మారే అవకాశం ఉంది. సరదాగా పొలాలకు వెళ్లే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ తీగలను గమనించకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన కర్నూర్ జిల్లా సంజామల మండలం మిక్కినేని పల్లెలో అడవి పందుల నివారణ కోసం పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి షేక్ సుకుర్ బాషా, ప్రవల్లిక అనే ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విద్యుత్ కంచెల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం రైతులు పొలాల్లో తీగలతో కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా రైతులు ఈ విధానానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –సత్యనారాయణ రెడ్డి, ఎస్ఈ, విద్యుత్ శాఖ -
విద్యుత్ కంచెతో రెండు చిరుతలు మృతి
-
విద్యుత్ కంచెతో రెండు చిరుతలు మృతి
సాక్షి, కాశినాయన : పంటలను కాపాడుకోవడానికి పొలానికి పెట్టిన విద్యుత్ వన్యప్రాణులను బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం వరికుంట్ల గ్రామ సమీపంలో జరిగింది. నారాయణ అనే రైతు తన పంటను అడవిజంతువుల బారినుంచి కాపాడుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగలతో కంచె ఏర్పాటు చేశాడు. శుక్రవారం రాత్రి రెండు చిరుతపులులు ఆ విద్యుత్ కంచెకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి. శనివారం ఉదయం పొలానికి చెందిన రైతు నారాయణ వాటి మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు. అయినా విషయం బయటకు పొక్కింది. దీంతో అటవీ అధికారులు చిరుత పులుల మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిర్వహించి రైతుపై కేసు నమోదు చేశారు. -
దొంగాట
⇔ ప్రతిభకు పాతరేస్తూ సర్టిఫికెట్ల ప్రదానం ⇔ ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ ⇔ అసోసియేషన్ల పాత్రపై అనుమానం ⇔ ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో మెడిసిన్‌కు 15 మంది విద్యార్థులు ⇔ నేతల జోక్యంతో గుట్టుగా వ్యవహారం ⇔ ఉన్నత స్థాయి విచారణతో కలకలం మెడిసిన్ కోటా లక్ష్యంగా క్రీడలు ⇔ జూడో ఓపెన్ కేటగిరీ కింద జిల్లాకు చెందిన రెడ్డప్పరెడ్డి 100 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధిస్తే.. దీన్ని చిత్తూరు జిల్లాకు చెందిన రుత్విక్ అనే విద్యార్థికి కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఎస్వీ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతుండటం గమనార్హం. ⇔ క్రీడా వ్యాపారం అనంతను కుదిపేస్తోంది. దొడ్డిదారిలో మెడిసిన్ సీటు దక్కించుకునేందుకు ఆడిన ‘ఆట’.. ప్రతిభ కలిగిన విద్యార్థుల కంట తడి పెట్టిస్తోంది. గెలుపొందిన క్రీడాకారులకు.. సర్టిఫికెట్‌లోని పేర్లకు పొంతన లేకుండా సాగించిన దొంగాట క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు.. ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనిదే ఈ తంతు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రతిభకు స్పోర్ట్స్ కోటా పాతరేసింది. మెడిసిన్ సీటు సాధించడమే లక్ష్యంగా కొందరు తల్లిదండ్రులు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు నేతలు రంగ ప్రవేశం చేయడంతో సర్టిఫికెట్ల వ్యాపారం మొదలైంది. అనంతపురంలోనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. క్రీడాకారుడు ఒకరయితే.. సర్టిఫికెట్‌ను మరో విద్యార్థి పేరిట ఇవ్వడం ద్వారా దొంగాటకు తెర తీశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన క్రీడా మైదానం కేంద్రంగా ఈ తంతు సాగింది. చిత్తూరుకు చెందిన రుత్విక్ విషయంలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, యూత్ అఫైర్స్‌కు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలయింది. ఇంటర్ పూర్తి చేసిన ఈ విద్యార్థి సీనియర్ నేషనల్ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనర్హుడు. అయితే ధనార్జనే ధ్యేయంగా ఇతనికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం గమనార్హం. గతేడాది తెలంగాణలో నిర్వహించిన స్పోర్ట్స్ కోటా సీట్ల విషయంలో ఆ ప్రాంత రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్కిషన్ను దోషిగా తేల్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన క్రీడాంశాలైన ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శుల పాత్ర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ వెనుక వీరి హస్తం ఉందనే అనుమానం పలువురు క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. నలుగురు బోగస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో మెడిసిన్‌కు 0.05 స్పోర్ట్స్ కోటాలో 16 మెడిసిన్, 4 డెంటల్ సీట్లు కేటాయిస్తుం ది. ఇందులో మిగతా క్రీడాంశాలతో పోలిస్తే ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకే అధిక లబ్ధి చేకూర్చడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై గత ఏడాది పలువురు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో విచారణకు ఈ ఏడాది ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. ఆ మేరకు నలుగురు క్రీడాకారులు బోగస్ అని వెల్లడయింది. ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో 15 మంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు సంబం ధించి స్పోర్ట్స్ అథారిటీకి, ఒలంపిక్స్ అసోసియేషన్‌కు పూర్తి నివేదికలను, రెఫరీల వివరాలను అం దించాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఇండియా ఫెడరేషన్, యూత్ అఫైర్స్ నుంచి ఎలాంటి అప్రూవల్ ఉండదు. అ యినప్పటికీ అంతర్జాతీయ క్రీడలకు ఆయా జిల్లా ల నుంచి క్రీడాకారులను పంపుతుండటం గమనార్హం. గత ఏడాది వరకు ఎంసెట్‌కు ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థ వద్ద లేకుండానే క్రీడాకారులకు హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు ఎంసెట్‌కు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో ఎంత మంది అర్హులనే విషయం విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. నేతకు సలాం క్రీడల్లో రాజకీయ జోక్యం మీతిమిరితే ప్రతి భ పక్కకు తప్పుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రి పరిటాల సునీ త కుమారుడు శ్రీరాంను జిల్లా ఒలంపిక్స్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షునిగా గత జూలైలో ఎన్నుకోవడంలో ఫెన్సింగ్, జూ డో, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో క్రీడా ప్రతినిధులు దూకుడు ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రభుత్వ శాఖల అధికారుల పిల్లలకు నకిలీ సర్టిఫికెట్లను కట్టబెట్టిన నేపథ్యంలో ఈ దొంగాట గుట్టుగా సాగినట్లు సమాచారం. -
కృష్ణానది ఫెన్సింగ్‌పై గంగ పుత్రుల ఆగ్రహం
-
పాఠశాలల ప్రహరీలకు రూ. 1.50 కోట్లు
ఎమ్మిగనూరురూరల్: జిల్లాలో రూ. 1.50 కోట్లతో 18 పాఠశాలల్లో ప్రహరీలు నిర్మిస్త్నుట్లు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ అఫీసర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల రిసోర్స్ పర్సన్ కార్యాలయాన్ని సందర్శించారు. సీఆర్పీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015–16 సంవత్సరానికి 653 పాఠశాలల అదనపు గదులు మంజూరు కాగా 97 శాతం నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 77 పాఠశాలల్లో మరమ్మతులు చేయించనున్నట్లు చెప్పారు. మరుగుదొడ్లను శుభ్రం చేయటానికి ఎంపీపీ స్కూల్స్‌కు రూ. 2 వేలు, ఎంపీయూపీ స్కూల్స్‌కు రూ.2500లు, హైస్కూల్స్‌కు రూ. 4 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. స్కావెంజర్లను డీఆర్డీఏ నియమిస్తుందని, హెచ్ఎం సర్టిఫికెట్ ఇస్తేనే వీరికి డబ్బులు మంజూరు చేస్తామన్నారు. విద్యార్థులకు పెండింగ్ ఉన్న స్కూల్ యూనిఫారంను వారం రోజులు సరఫరా చేస్తామన్నారు. సీఆర్పీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని నాలుగు మదరసాలను సందర్శించారు. ఈయనతో పాటు ఏఎంవో ఉసేన్‌సాబ్, ఎంఈవో నాగభూషణం, సీఆర్పీలు దుర్గన్న, వేణుగోపాల్‌రెడ్డి, జయన్న, నరసప్ప, రంగన్న, రాఘన్న, జమీలాబీ, ఖాసీం, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు. -
‘సౌమ్య’ విజయం అభినందనీయం
నంద్యాల: ఇంటర్ విద్యార్థిని కలుబురిగి సౌమ్య ఫెన్సింగ్‌లో సాధించిన విజయాలు నంద్యాలకే గర్వకారణమని రోటరీ గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి ప్రశంసించారు. రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ టోర్నీలో రెండు బంగారు పతకాలను సాధించిన సౌమ్యను ఆమె తల్లిదండ్రులు మహేశ్వరరావు, మాధురిలను ఆదివారం రోటరీ క్లబ్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. సౌమ్య..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి నంద్యాల ప్రతిష్టను పెంచాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, అధ్యక్షుడు రమేష్, సీనియర్ రొటేరియన్ నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, సభ్యులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంపై విద్యార్థినుల ఆగ్రహం
- ప్రహరీ నిర్మించాలంటూ భారీ ధర్నా - స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిక కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పిడికిలి బిగించారు. ప్రహరీ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ కళాశాల ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. కళాశాలలో మైదాన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఇలాగైతే న్యాక్గుర్తింపు లభించదని..వేల మంది విద్యార్థినులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సుమారు రెండు గంటలపాటు విద్యార్థినులు.. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేయడంతో తాగుబోతులు, తిరుగుబోతులు కళాశాలలోకి ప్రవేశిస్తున్నారన్నారు. కళాశాలలో మొత్తం రెండు వేల మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారని..మునిసిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సీవీ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ వీరాచారి, అధ్యాపకురాలు ఇందిరాశాంతి కోరారు. నిబంధనలు మేరకు రోడ్డుకు ఇరువైపులా ఆరు మీటర్ల వరకు రోడ్డును విస్తరించుకోవచ్చనని విద్యార్థులు తెలిపారు. దీన్ని మరచిన అధికారులు కళాశాల స్థలాన్ని 28 మీటర్ల వరకు ఓ ప్రజాప్రతినిధి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే పనులను నిలిపివేసినట్లు ఆరోపించారు. జూన్‌లో కూల్చిన ప్రహరీని నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు నిబంధనలు మేరకు పనులను చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు. -
ఫెన్సింగ్‌లో కర్నూలుకు ఓవరాల్ చాంపియన్‌షిప్
నంద్యాల: నెల్లూరులో నిర్వహించిన 62వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కర్నూలు జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుందని ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంసుందర్‌లాల్ తెలిపారు. స్థానిక పద్మావతినగర్ స్టేడియంలో మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో అనిల్‌కుమార్, (ఈపీ) లేకజ్ (ఫయిల్), అంకరాజు, మురళీకృష్ణ (సాబ్రా) బాలిక విభాగంలో సౌమ్య(ఈపీ), వైష్ణవి(ఫయిల్), ప్రసన్న(సాబ్రా) వ్యక్తిగత బంగారు పతకాలు సాధించారన్నారు. బృందాలుగా జరిగిన విభాగంలో సౌమ్య, సుచరిత, లలిత, బేబిప్రియ(ఈపీ), వైష్ణవి, సమన్విత, ప్రసన్న (ఫయిల్), లావణ్యరాయల్, శ్వేత, లక్ష్మి, మేరి(సాబ్రా)లకు, బాలుర విభాగంలో అనిల్‌కుమార్, నాగయ్య, వంశీకృష్ణ, సాయిశైలేంద్ర (ఈపీ), లేఖచ్, సమీర్, విజయ్‌కుమార్, సన్ని, సునీల్(ఫయిల్), అంకరాజు, మురళీకృష్ణ, బషీర్‌బాబు, హుసేన్‌వలి(సాబ్రా) విభాగాల్లో పసిడి పతకాలను సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చలపతిరావు, కోచ్‌లు లక్ష్మణ్, రవీంద్రనాథ్, పూర్ణచంద్రప్రసాద్, రాఘవకార్తీక్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఆల్ రౌండ్ ఛాంపియన్ అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఆల్‌రౌండ్ ఛాంపియన్ గా అనంత జట్టు నిలిచిందని రాష్ట్ర కార్యదర్శి మురళీ తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో సోమవారం క్రీడా పోటీలు ముగిశాయి. ఇందులో జిల్లా జట్టు జయకేతనం ఎగరేసింది. -
కంచెల నిర్మాణానికి చర్యలు
భీమవరం టౌన్ : భీమవరం పట్టణంలో మునిసిపల్ రిజర్వు స్థలాలకు రక్షణ కరువైందనే అంశంపై ఈ నెల 8న ‘ఖాళీ జాగా.. ఆదమరిస్తే పాగా’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో రిజర్వు స్థలాల రక్షణకు కంచెలు ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు మంగళవారం అధికారులతో చర్చించారు. పట్టణం మధ్యన అంబేడ్కర్ సెంటర్లో భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డు ప్రారంభంలో ఉన్న 50 సెంట్ల స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మునిసిపాలిటికి కోట్లాది రూపాయాల ఆదాయం సమకూరుతుంది -
కుటుంబంపై కరెంటు కాటు
విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి కుక్కను కాపాడబోయి తండ్రి, తండ్రి కోసం కొడుకు, కొడుకును కాపాడబోయి తల్లి అప్రమత్తతతో కోడలికి తప్పిన ప్రమాదం కోస్గి మండలం హన్మండ్లలో విషాద సంఘటన అడవి పందులను నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె.. ఆ రైతు కుటుంబం పాలిట శాపంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ కుటుంబంలో ఒకరిపై ఒకరికి ఉన్న మమకారం వెనకాముందు ఆలోచించకుండా ఆత్రుతతో ఒకరిని కాపాడబోయి మరొకరు వరుసగా... తల్లి, తండ్రి, కుమారుడు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. అప్రమత్తంగా వ్యవహరించిన కోడలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కోస్గి మండలంలోని తోగాపూర్ అనుబంధ గ్రామం హన్మండ్లలో చోటు చేసుకుంది. – కోస్గి హన్మండ్లకు చెందిన తుడుం కిష్టప్ప (40) పొలం దగ్గర ఇంటిని నిర్మించుకుని, వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు అమృతమ్మ, వెంకటయ్య, భార్య యాదమ్మతో పాటు తన నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ ఏడాది తన పొలంలో జొన్న, పత్తి, కంది, మిరప పంటలను సాగు చేశాడు. జొన్న పంటను అడవి పందులు నాశనం చేస్తుండటంతో పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు రాత్రి ఏర్పాటు చేసి తెల్లవారే సరికి విద్యుత్ కంచెను తొలగించేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కంచెను తొలగించడం మరిచిపోయిన కిష్టప్ప.. భార్య, తల్లితో కలిపి పత్తి చేనుకు మందు వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కిష్టప్ప కుటుంబం పెంపుడు కుక్క అటుగా వెళ్లి విద్యుత్ కంచె తగిలి మృతి చెందింది. పొలం వైపు వెళ్తున్న వెంకటయ్య(60)గమనించి, కుక్కను తీగ నుంచి బయటకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయి, మృత్యువాతపడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు చెప్పడంతో ఇంటివద్ద ఉన్న పిల్లలు ఏడుస్తూ పొలం వైపు పరుగులు తీశారు. విషయం గమనించిన కొడుకు కిష్టప్ప తండ్రిని కాపాడే ఆత్రుతతో పొలం గట్టుపై నుంచి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు కాలికి విద్యుత్ కంచె తగిలి కిందపడి కొట్టుకుంటున్నాడు. అతని వెనుకనే వస్తున్న భార్య యాదమ్మ అప్రమత్తమై ‘నీ కొడుకును కరెంటు పట్టుకుంది.. దగ్గరకు వెళ్లకు, నేను వైరు తీసి వస్తాను’ అని అత్త అమృతమ్మ (58)ను హెచ్చరిస్తూ, ఇంటివైపు పరుగెత్తింది. కళ్లముందు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న కొడుకుని చూసి ఆ మాతృ హృదయం తట్టుకోలేకపోయింది. కొడుకు చేయిపట్టి లాగేందుకు ప్రయత్నించగా.. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. యాదమ్మ కరెంట్ తీసి వచ్చి చూడగా అప్పటికే భర్త, అత్తలు మృతి చెందడంతో బోరున విలపించింది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. దిక్కుతోచని స్థితిలో.. కుటుంబంలో ఉన్న పెద్దలందరూ ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతోంది. మృతుడు కిష్టప్పకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అవ్వ, తాతలతో పాటు తండ్రి మృతి చెందడంతో నిరాశ్రయులైన ఆ చిన్నారుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అప్పటికే అనారోగ్యంతో ఉన్న రెండో కూతురు శిరీషా ఈ సంఘటనను చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్లో కొడంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా గ్రామమంతా బోరున విలపించింది. కొడంగల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు మల్లారెడ్డి, చంద్రశేఖర్, ఆర్ఐ అశోక్, వీఆర్ఓలు వెంకటయ్య, బుగ్యాసాబ్, ఈశ్వరమ్మ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఘటన జరిగిన తీరును నమోదు చేసుకున్నారు. మృతుడు కిష్టప్ప భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. -
కుక్కను కాపాడబోయి ముగ్గురు మృతి
-
మహబూబ్‌నగర్‌లో మహా విషాదం
కోస్గి: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుధ్ఘాతానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అడవిపందుల కోసం వేసిన విద్యత్ కంచెలో చిక్కుకున్న తండ్రిని కాపాడటానికి వెళ్లిన కొడుకుతో పాటు తల్లికి కూడా కరెంట్ షాక్ కొట్టడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని కోస్గి మండలం తొగాపూర్ పంచాయతి పరిధిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(60) కుటుంబ సభ్యులు పత్తితోటలో పనికి వెళ్లారు. ఈ క్రమంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకడంతో షాక్ తో వెంకటయ్య కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన కొడుకు కిష్టప్ప(34) తండ్రిని రక్షించేందుకు వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన కిష్టప్ప భార్య విద్యుత్ కనెక్షన్ కట్ చేయడానికి పరిగెత్తగా.. కొడుకు తల్లడిల్లడం చూడలేని తల్లి అమృతమ్మ(56) అతన్ని పట్టుకొని లాగడానికి యత్నించి అక్కడే ప్రాణాలొదిలింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల ఔటర్ కారిడార్‌లో భద్రత లోపం
-
ఏదీ ‘సెక్యూరిటీ’?
జూలో నిరంతర గస్తీని గాలికొదిలేసిన సిబ్బంది కొరవడినఅధికారుల పర్యవేక్షణ ఎన్క్లోజర్ల నుంచి బయటకొస్తున్న జంతువులు బహదూర్‌పురా: జూ పార్కులో భద్రత డొల్లతనం బయటపడుతోంది. 24 గంటలపాటు పర్యవేక్షణ జరపాల్సిన సెక్యూరిటీ సిబ్బంది గస్తీని గాలికొదిలేస్తున్నారు. ఇక భద్రతపై అధికారుల పర్యవేక్షణా కొరవడుతోంది. సోమవారం రాత్రి ఎన్‌క్లోజర్ నుంచి ఎలుగుబంటి బయటికి వచ్చిన సంఘటనకు పూర్తిగా జూ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా చెప్పొచ్చు. చైన్ లింకును తెంపుకొని ఎలుగుబంటి చుట్టు ఉన్న ప్రహరీ గోడపైకి చేరుకోవడం కలకలం రేపింది. జూ ప్రహరీ చుట్టు హైటెన్షన్ వైర్లను ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొన్న జూ అధికారులు...ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో జూలో సాకీ (పులి)ని హత్య చేసేందుకు బౌండరీ వాల్‌ను ఆసరాగా చేసుకొని నిందితుడు లోనికి ప్రవేశించాడు. దీంతో పాటు గతేడాది కొందరు యువకులు ఇంటికి అనుకొని ఉన్న జూ గోడను దూకి..లోనికి ప్రవేశించి మొక్కలు, పండ్లను తెంచుకెళ్లిన సంఘటనలున్నాయి. ఇంత జరుగుతున్నా జూ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జూ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప ఫెన్సింగ్ గొలుసు పూర్తిగా తుప్పుపట్టి పోయింది. జూ బౌండరీ చుట్టుగోడను ఇతర భవనాల కంటే ఎత్తుగా నిర్మించాల్సి ఉన్నా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు 24 గంటలు సెక్యూరిటీ సిబ్బంది జూ బౌండరీ చుట్టూ తిరుగుతూ గస్తీ నిర్వహించాలి. కానీ జూలో సెక్యూరిటీ మాత్రం ఆడపా దడపా పెట్రోలింగ్ నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జూలో 60 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు ఉండాల్సి ఉండగా... 45 మంది మాత్రమే ఉన్నారు. కానీ ప్రతి నెల మాత్రం 60 మంది సెక్యూరిటీల వేతనాలను జూ అధికారుల నుంచి కాంట్రాక్టర్ అందుకుంటున్నాడు. దీనిపై జూ అధికారులకు సమాచారం ఉన్నా... ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్‌పై ప్రేమను కనబరుస్తూ గత కొన్నేళ్లుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్‌ను అప్పగిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇకనైనా పీసీసీఎఫ్ అధికారులు స్పందించి జూలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపైన, జూలో భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
'త్వరలోనే మొత్తం కంచె వేసేస్తాం'
అశోక్ నగర్(పశ్చిమ బెంగాల్): త్వరలోనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచెను పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బంగ్లా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబాట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ పని వేగవంతచేసేందుకు ప్రణాళికను పూర్తిచేస్తున్నామని చెప్పారు. గురువారం బెంగాల్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నకిలీ ఇండియా కరెన్సీని, మత్తుపదార్థాల రవాణాను, అక్రమ చొరబాట్లను తగ్గించడంలో భారత్‌కు సహకరించాలని తాము బంగ్లాదేశ్‌ను కోరినట్లు చెప్పారు. భారత్-బంగ్లా సరిహద్దులో కేవలం ఫెన్సింగ్ మాత్రమే కాకుండా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. తాము బంగ్లాదేశ్ తో ఎంతమంచి సంబంధాలు నెరుపుతామో మున్ముందు మరింత చూస్తారని, ఇప్పటికే సరిహద్దు వెంట జరుగుతున్న అక్రమాలను నిలువరించేందుకు బంగ్లాదేశ్ భారత్ కు ఎంతో సహాయం చేస్తుందని, ఈ ఒక్క విషయం భారత దౌత్య విధానానికి నిదర్శనం అని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వలస వచ్చిన మైనారిటీలకు ఇప్పటి వరకు సామాజిక భద్రత లేదని, త్వరలోనే వారికి భారత పౌరసత్వం ఇచ్చే పనిప్రారంభిస్తామని చెప్పారు. -
భద్రత పూజ్యం... ఇష్టారాజ్యం...
సాక్షి, గుంటూరు: సెల్ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో సెల్ కంపెనీలు టవర్ నిర్మాణాలను కూడా అదే స్థాయిలో పెంచేశాయి. అయితే నిబంధనల ప్రకారం సెల్‌టవర్లను ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సెల్ టవర్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పెద్ద కంపెనీలకు చెందిన సెల్ టవర్ల వద్ద సైతం భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఆకతాయిలు చీటికీమాటికీ సెల్ టవర్లు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ హల్చల్ చేస్తున్నారు. తమకున్న సమస్యలతో ఏదో ఒక రాష్ట్ర సమస్యకు ముడిపెట్టి అటు కుటుంబ సభ్యులను, ఇటు అధికార యంత్రాగాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నారు. పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టు వారు ఆందోళన విరమించి కిందకు దిగే వరకూ పోలీసులు నిద్రాహారాలు మాని సెల్ టవర్ కింద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురిస్తోది. ఇలాంటి సందర్భాల్లో సెల్ టవర్ ఎక్కిన వారిని రక్షించేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గానీ, అగ్నిమాపక శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో ఒత్తిడి మొత్తం పోలీస్‌శాఖపై పడుతోంది. ఇక భద్రత లేకుండా సెల్ టవర్ నిర్మించిన కంపెనీ అధికారులు తమకేమీ పట్టనట్లు కనీసం అటువైపు తిరిగి చూడకపోవడం దారుణమైన విషయం. సెల్ టవర్ల రేడియేషన్‌పై ఆందోళన సెల్‌టవర్లను వివిధ కంపెనీల వారు నివాస ప్రాంతాల్లో నిర్మించడం వలన రేడియేషన్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. సెల్ టవర్ నిర్వాహకులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించకుండా తమకు హైకోర్టు అనుమతి ఉందంటూ పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి బందోబస్తుతో నిర్మాణాలు చేస్తున్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెల్ టవర్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టండి సెల్ టవర్ల వద్ద నిబంధనలకు అనుగుణంగా ఫెన్సింగ్, భద్రతా సిబ్బందిని నియమించి సెల్ టవర్ ఎక్కేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ నిర్వాహకులకు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అలా చెయ్యని సెల్ టవర్ల వద్ద ఎటువంటి ఆందోళనలు జరిగినా సెల్‌టవర్ నిర్వాహకులపై సుమోటోగా కేసులు నమోదు చేసేందుకు సైతం వెనకాడమని హెచ్చరించారు. -అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి -
అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా
హిందూపురం : అధికార పార్టీ అండ ఉంటే చాలు.. కోర్టు పరిధిలో ఉన్న భూమైనా కేవలం 24గంటల్లో కబ్జా చేసేయవచ్చు. కోట్లు విలువజే సే భూమైతే చాటు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయచ్చు. హిందూపురం పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో ఉన్న ఓ భూమిని సోమవారం రాత్రికి రాత్రే ఓ రియల్టర్ కబ్జా చేయడమే ఇందుకు ఉదాహరణ. బాధితుడు లక్ష్మినరసారెడ్డి తెలిపిన మేరకు పూర్తీ వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో వై.తిమ్మారెడ్డి, లక్ష్మినరసారెడ్డి, రమేష్‌రెడ్డి అన్నదమ్ముల పేరిట (సర్వే నంబరు 66/1ఎ1) 18.40 ఎకరాల పొలం ఉంది. ఇందులో మూడోవంతు భాగం 6.40 ఎకరాల స్థలాన్ని బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్‌కు విక్రయించారు. వీరు ఆ స్థలాన్ని 2012లో వేరొకరికి విక్రయించారు. అయితే విక్రయ సమయంలో సర్వే నంబరు తప్పుగా రావడంతో బాధిత అన్నదమ్ములు కోర్టును ఆశ్రయించారు. నాటి నుంచి ఆ స్థలం కోర్టు పరిధిలో ఉంది. అయితే కాలక్రమేనా కోర్టు పరిధిలో ఉన్న 6.40ఎకరాల స్థలానికి అమాంతం ధర పెరిగిపోయింది. సుమారు రూ.10 కోట్లు విలువజేసే ఆ స్థలంపై బెంగుళూరుకు చెందిన రియల్టర్ టీ.నాగబాబు కన్ను పడింది. అంతే తడవుగా బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్ పేరిట బినామీ అగ్రిమెంట్ సృష్టించుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత లక్ష్మినరసారెడ్డి పదిరోజుల క్రితం మరోమారు కోర్టును ఆశ్రయించాడు. ఈ లోగా నాగబాబు గతంలో పనిచేసిన తహశీల్దార్ విశ్వనాథ్, ఓ కానిస్టేబుల్ సాయంతో నకిలీ పాసుపుస్తకాలు సృష్టించాడు. తన అనుచరగణంతో సోమవారం రాత్రి 6.40ఎకరాల భూమిని కబ్జా చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. రియల్టర్ ప్రస్తుత మంత్రికి బంధువని, అందుకే కోర్టు పరిధిలో ఉన్నా ఆ భూమిని కబ్జా చేశాడని బాధితుడు లక్ష్మినరసారెడ్డి సాక్షికి తనగోడు వెళ్లబోసుకున్నాడు. స్థల విషయమై కోర్టు స్పందించి ప్రస్తుత తహశీల్దార్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపాడు. -
ఇంత నిర్లక్ష్యమా..?
ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజ లకు, జంతువులకు ప్రాణ సంకటంగా మా రింది. నిత్యం ప్రజలు సంచరించే ప్రదేశాల్లో విద్యుత్ తీగలు వేలాడుతుండడం, ట్రాన్స్పార్మర్లకు ఫెన్సింగ్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటన లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, భారీగా పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. జనసంచార ప్రదేశాల్లో ప్రమాదకరంగా.. నిత్యం ప్రజలు సంచరించే ప్రదేశాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు, దేవాలయాలు, కూరగాయల మార్కెట్లు, ఇతర జనావాస ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం డివిజన్ పరిధిలో 9,616, సత్తుపల్లిలో 9,805, భద్రాచలం 3,540, కొత్తగూడెం 4, 424 .. ఇలా జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో 27,384 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇందులో సుమారు 14 వేలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించినవి కాగా, 13 వేలకు పైగా గృహ, వ్యాపార, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేవి. అయితే ఇందులో సుమారు 2 వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్ల రక్షణకు ఫెన్సింగ్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వివిధ పథకాల ద్వారా విద్యుత్ లైన్లు మరమ్మతుతో పాటు లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి ప్రాంతాల్లో కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు వేశారు. అయితే వీటి నిర్మాణం కోసం వేసిన టెండర్లలో ఫెన్సింగ్‌కు అదనపు డబ్బులు ఇవ్వలేదనే నెపంతో కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్లు నిర్మించి ఇష్టానుసారంగా వదిలేశారు. దీంతో వైర్లు కిందకు వేలాడపడుతుండడం, బోర్డులు పగిలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు చెట్ల మధ్యలో ఉండి దగ్గరకు వెళ్లేంతవరకు కన్పించడం లేదు. లైన్లు వేయడానికి, ఎల్సీ తీసుకోవడానికి నిత్యం ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లే విద్యుత్ అధికారులు, సిబ్బంది.. అవి ప్రమాదకరంగా ఉన్నాయనే విషయం గమనిస్తున్నారే తప్ప, వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, వైర్లను గుర్తించాలని, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పలువురు కోరుతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోంది రోడ్డు పక్కన, పాఠశాలల దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ప్రమాద కరంగా ఉన్నాయి. పిల్లలు ఆడకుంటూ వెళ్లి ఏ వైరు ముట్టుకుంటారోనని భయమేస్తోంది. అందుకోసం వారిని బయటకు పంపడం లేదు. అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. మా వీధితోపాటు ఖమ్మం ఇందిరానగర్ మసీద్ ప్రాంతంలో వైర్లు వేలాడుతూ ప్రమాదంగా మారాయి. - రామకృష్ణ, ఖమ్మం మామిళ్లగూడెం ఎన్ని సార్లు చెప్పినా కంచె వేయడంలేదు. మా ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కంచె లేకుండా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరుచూ విద్యుత్ షాక్ వస్తోంది. దీంతో ఈ ప్రాంతం వారంతా భయపడుతున్నారు. గతంలో ప్రమాదాలు జరిగాయి. చిన్నపిల్లలు నడిచి వెళ్లే ప్రాంతం కావడంతో ఈ ట్రాన్స్ఫార్మర్ దాటేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు. - అంజలి, గృహిణి, బాలాజీనగర్-ఖమ్మం రక్షణ చర్యలు చేపడతాం జిల్లాలో పలు ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ కంచెలేని విషయం వాస్తవమే. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు అందాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్లకు కంచె వేయడం ఇబ్బందే. పాఠశాలలు, మార్కెట్, ఇతర జన సంచార ప్రదేశాల్లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటికి కంచె వేసి రక్షణ కల్పిస్తాం. ఇందుకోసం జిల్లాలోని అన్ని డివిజన్ల అధికారులకు ఆదేశాలు జారీచేశాను. తర్వలో రక్షణ చర్యలు చేపడుతాం. - తిరుమలరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ