భీమవరం టౌన్ : భీమవరం పట్టణంలో మునిసిపల్ రిజర్వు స్థలాలకు రక్షణ కరువైందనే అంశంపై ఈ నెల 8న ‘ఖాళీ జాగా.. ఆదమరిస్తే పాగా’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో రిజర్వు స్థలాల రక్షణకు కంచెలు ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు మంగళవారం అధికారులతో చర్చించారు. పట్టణం మధ్యన అంబేడ్కర్ సెంటర్లో భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డు ప్రారంభంలో ఉన్న 50 సెంట్ల స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మునిసిపాలిటికి కోట్లాది రూపాయాల ఆదాయం సమకూరుతుంది