పాఠశాలల ప్రహరీలకు రూ. 1.50 కోట్లు
పాఠశాలల ప్రహరీలకు రూ. 1.50 కోట్లు
Published Fri, Feb 10 2017 10:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
ఎమ్మిగనూరురూరల్: జిల్లాలో రూ. 1.50 కోట్లతో 18 పాఠశాలల్లో ప్రహరీలు నిర్మిస్త్నుట్లు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ అఫీసర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల రిసోర్స్ పర్సన్ కార్యాలయాన్ని సందర్శించారు. సీఆర్‌పీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015–16 సంవత్సరానికి 653 పాఠశాలల అదనపు గదులు మంజూరు కాగా 97 శాతం నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 77 పాఠశాలల్లో మరమ్మతులు చేయించనున్నట్లు చెప్పారు. మరుగుదొడ్లను శుభ్రం చేయటానికి ఎంపీపీ స్కూల్స్‌కు రూ. 2 వేలు, ఎంపీయూపీ స్కూల్స్‌కు రూ.2500లు, హైస్కూల్స్‌కు రూ. 4 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.
స్కావెంజర్లను డీఆర్‌డీఏ నియమిస్తుందని, హెచ్‌ఎం సర్టిఫికెట్ ఇస్తేనే వీరికి డబ్బులు మంజూరు చేస్తామన్నారు. విద్యార్థులకు పెండింగ్ ఉన్న స్కూల్ యూనిఫారంను వారం రోజులు సరఫరా చేస్తామన్నారు. సీఆర్‌పీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని నాలుగు మదరసాలను సందర్శించారు. ఈయనతో పాటు ఏఎంవో ఉసేన్‌సాబ్, ఎంఈవో నాగభూషణం, సీఆర్‌పీలు దుర్గన్న, వేణుగోపాల్‌రెడ్డి, జయన్న, నరసప్ప, రంగన్న, రాఘన్న, జమీలాబీ, ఖాసీం, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు.
Advertisement