class rooms
-
బడిలో ఏడు పాములు.. ఒకేసారి విద్యార్థిపైకి..
సంగారెడ్డి: మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుపాములు బయట పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు పామును చూసి అరిచారు. అక్షయ పాత్ర సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని పామును చంపివేశారు. అయితే మరోవైపు నుంచి ఒక్కో పాము రావడంతో వారు విస్తుపోయారు. మొత్తం ఆరు పాములను చంపివేశారు. తరగతి గది అపరిశుభ్రంగా ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
విద్యార్థినులకు మాయమాటలు.. మార్కులు ఎక్కువగా వేయిస్తానని చెప్పి..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): విద్యార్థులను తండ్రి మాదిరిగా చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ కీచకుని అవతారమెత్తి కటకటాల పాలయ్యాడు. వర్కులు ఎక్కువ వేస్తానని నమ్మించి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ హయ్యాళప్పను అరెస్ట్ చేశారు. నిందితుడు యాదగిరి తాలక ముండరిగి కిత్తరు రాణి చెన్నమ్మ గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. పదవ తరగతి పరీక్షలలో అధిక మార్కులు వేసి ఉత్తీర్ణులు చేస్తానని మభ్యపెట్టి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ రాగప్రియ హాస్టల్‌ను పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో విద్యార్థినులు ఆమె ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆమె ఆదేశాలతో ఎస్పీ వేదమూర్తి వెంటనే ప్రిన్సిపాల్ హయ్యాళప్పపై కేసు నవెదు చేయించి అరెస్ట్ చేశారు. -
అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!
కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సేల్స్‌గర్ల్స్‌ను అన్నేసి గంటలు నిలబడి డ్యూటీ చేయించడాన్ని నిరోధించాయి. కేరళలో ‘రైట్ టు సిట్’ ఉద్యమం మొదలయ్యాక వచ్చిన మార్పు ఇది. దేశంలో కోట్లాది మంది స్త్రీలు సేల్స్ గర్ల్స్‌గా 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేస్తున్నారు. వారికి కూచునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది. మాలతి (20) హైదరాబాద్ అమీర్‌పేటలో సేల్స్ గర్ల్. ఉదయం 9 గంటలకు క్లాత్ షోరూమ్‌లో డ్యూటీ ఎక్కుతుంది. తిరిగి రాత్రి 9కి డ్యూటీ దిగుతుంది. మధ్యలో అరగంట లంచ్ విరామం. మిగిలిన సమయం? అంతా నిలబడి ఉండటమే. కస్టమర్లు ఉన్నా లేకున్నా ఆమె నిలబడే ఉంటుంది. కూచోవడానికి వీల్లేదు. ఎందుకంటే కూచోవడానికి అక్కడ కుర్చీలు గానీ స్టూల్స్‌గాని ఉండవు. బద్దకానికి అలవాటు పడతారని లేదా కూచుని సుఖపడతారని షాప్ వాళ్లు వారిని కూచోకుండా స్టూల్స్ తీసేస్తారు. మాలతి నిలబడే ఉంటుంది. నిలబడి... నిలబడి... నిలబడి... ఆమెకు కూచునే హక్కు లేదా? జయవాణి (35) నెల్లూరులో ప్రయివేట్ టీచర్. క్లాస్‌రూమ్‌లో నిలబడే పాఠం చెప్పాలి. బ్లాక్‌బోర్డ్ దగ్గర కుర్చీ కానీ టేబుల్ కానీ ఉండవు. టీచర్లు తాము ఇచ్చే జీతానికి ప్రతి నిమిషం రెక్కలు ముక్కలు చేసుకోవాలనుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా క్లాస్ రూముల్లో కుర్చీలు తీసేశాయి. పాఠం ఎగ్గొట్టి టీచర్లు విశ్రాంతి తీసుకుంటారనో కునుకు తీస్తారనో వారి అనుమానం కావొచ్చు. అయితే క్లాసుకు క్లాసుకు మధ్య గ్యాప్ ఇస్తారా? స్టాఫ్‌రూమ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోనిస్తారా? రోజులో దాదాపు 4 నుంచి 6 క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి క్లాసు నిలబడి చెప్పి చెప్పి జయవాణికి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కాని ఏమిటి చేయడం. ఆమె నిలబడి చెప్పాల్సిందే. కూచుని పాఠం చెప్పే హక్కు ఆమెకు లేదా? నిలబడటం పనిలో ఒక భాగం కావచ్చు. కాని నిలబడి ఉండటమే పని కాబోదు. కారాదు. మనిషి కేవలం నిలబడి మాత్రమే పని చేయడు. మధ్యలో విశ్రాంతి కావాలి. కూచోవాలి. కాని కూచుని పని చేయడాన్ని దేశంలో అనధికారికంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తొలగించి చాలాకాలం అయ్యింది. బట్టల దుకాణాలు, నగల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో, ప్రయివేటు పాఠశాలలు... ఒకటేమిటి ప్రయివేటు రంగంలో ఎక్కడ వీలైతే అక్కడ నిలబడి పని చేయించడం ఆనవాయితీ అయ్యింది. ఇంకా దారుణం ఏమంటే కూచుని కనిపిస్తే, తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్తూ కనిపిస్తే కొన్ని షాపుల్లో ‘ఫైన్’ వేస్తారు. షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ చేత, సేల్స్ బాయ్స్ చేత ఎంత ఊడిగం చేస్తారో వారిని ఎలా నిలబెట్టి పని చేయిస్తారో తమిళంలో ‘షాపింగ్ మాల్’ అనే సినిమా చూపించింది. కేరళలో కదలిక దేశంలో బట్టల షోరూమ్‌లలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది సేల్స్‌గర్ల్స్‌గా/సేల్స్‌మెన్‌గా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా. వీరిలో దాదాపు 70 శాతం యువతులు, స్త్రీలు ఉంటారు. వీరందరూ రోజుకు 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేయాలని షోరూమ్‌ల యజమానులు అన్యాపదేశంగా సూచిస్తారు. కస్టమర్లు ఒకరి వెంట ఒకరుగా రావడం వల్లగాని లేదా స్టూల్స్ లేకపోవడం వల్లగాని వీరు కూర్చునే వీలు లేదు. నీరసం ఉన్నా, పిరియడ్స్‌లో ఉన్నా, నిలబడే శక్తి లేకున్నా వీరు నిలబడి ఉండాల్సిందే. దీని వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అరికాళ్లు, మోకాళ్లు బాధిస్తున్నాయి. దాంతో 2018లో ‘రైట్ టు సిట్’ అని కూచునే హక్కు కోసం అక్కడ కొంతమంది సేల్స్ గర్ల్స్ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్‌లో సబబును గ్రహించింది. 2019 జనవరిలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో పని చోట ఉద్యోగులందరూ తప్పనిసరిగా కూచునే ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ‘కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ను సవరించింది. దేశంలో ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ పలికిన తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. ఇప్పుడు తమిళనాడులో మొన్నటి సెప్టెంబర్ 13న తమిళనాడు అసెంబ్లీలో కూడా ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ – 1947’ను సవరించింది. ఏ షాప్ అయినా షోరూమ్ అయినా ప్రయివేటు ఉపాధి స్థలం అయినా ఉద్యోగులు కూచునే ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని యజమానులను ఈ సవరణ ఆదేశిస్తుంది. కూచుంటే ఎక్కడ యజమాని తిడతాడో అని భయపడాల్సిన అవసరం ఇక మీదట లేదు. రెండు రాష్ట్రాలే... మిగిలిన దేశంలో? అయితే ఇది మొదలు మాత్రమే. దేశంలో ఇంకా ఎంతో కదలిక రావాల్సి ఉంది. ఆయా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించాల్సి ఉంది. ఉద్యోగిని నిలబెట్టి ఉంచడం ఆ ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం. అవమానించడం. బాధించడం. అనవసర శ్రమకు, ఒత్తిడికి గురి చేయడం. గౌరవంతో కూడిన పని చేసే హక్కు, గౌరవాన్ని పొందుతూ పని చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని అంటాం. కాని వందలాది దుకాణాల్లో వేలాది సేల్స్ ఉమెన్, రిసెప్షనిస్ట్స్, టీచర్లు, ఇతర ప్రయివేటు ఉద్యోగులు ఎందుకు నిలుచుంటున్నారో... అంత నిలబడాల్సిన అవసరం ఏమిటో ఆలోచించాల్సి ఉంది. అవును. ‘కూచుని పని చేసే హక్కు’ ప్రతి ఒక్కరికీ ఉంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
పై తరగతులకే : ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో మూతపడ్డ బడులు... 2020–21 విద్యా సంవత్సరం ప్రారంభమైన 8 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలి. ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకూ అప్పటినుంచే ప్రత్యక్ష విద్యా బోధన మొదలుపెట్టాలి. ఈలోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. విద్యా సంస్థలు పనిచేయక చాలా రోజులు అవుతోంది కాబట్టి అందులోని సామగ్రినంతటినీ శుభ్రపర చాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర వంట సరుకులు పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరిచూసుకోవాలి. మొత్తంగా ఈనెల 25లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వెంటనే పదోన్నతులు... ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. అప్పుడు జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను కోరారు. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. దేశానికే ఆదర్శ పల్లెలు ‘పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఈ ప్రగతి రాష్ట్రానికి గర్వకారణం’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్రం ఏర్పడిన నాడు 84 గ్రామ పంచాయతీలకే సొంత ట్రాక్టర్లు ఉండేవి. నేడు 12,765 గ్రామ పంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు ఉన్నాయి. 19,470 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు గాను... ఇప్పటికే 19,027 చోట్ల స్థలాలను గుర్తించాం. 15,646 చోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. 2,601 రైతు వేదికలకు గాను... ఇప్పటికే 2,580 నిర్మాణం పూర్తయింది. 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం 91 శాతం పూర్తయింది. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. మొదటివిడతగా 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది. ప్రతినెలా రూ.308 కోట్లు ‘ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని మనం గమనించవచ్చు’అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి అమలు తీరు పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణాన్ని నూటికి నూరుశాతం పూర్తి చేసిన సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావును కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అన్ని గ్రామాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కమిటీలను నియమించాలని చెప్పారు. అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పచ్చదనం–పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు. ‘ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించే ఏర్పాటు జరుగుతున్నది. పట్టణాల్లో 2,802 సానిటేషన్ వెహికిల్స్ ఉన్నాయి. మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్‌ను సమకూరుస్తున్నాం. అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామాలు నిర్మించాలి. అవసరమైతే మున్సిపాలిటీల నిధులతో స్థలాలను కొనుగోలు చేయాలి. 116 పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనాభా ఎక్కువ కలిగిన పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలి. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వలస పక్షులతోనే ఈ వ్యాధి వ్యాపిస్తున్నదన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. మొదటి విడతలో మిగిలిపోయిన 28 వేల మంది లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని కోరారు. 3.67 శాతం పెరిగిన పచ్చదనం హరితహారంతో తెలంగాణలో మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని సీఎం తెలిపారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలని, స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతున్నదని, ఇంకా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని కోరారు. 127 శాతం మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆ జిల్లా కలెక్టర్ శరత్‌ను ప్రశంసించారు. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా భద్రాద్రి– కొత్తగూడెం నిలిచిందని, ఆ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డిని అభినందించారు. చదవండి: జీతాలివ్వండి మహాప్రభో.. ‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..! -
చెట్ల కింద చదువులు
సాక్షి, ఒంగోలు టౌన్: చెట్ల కింద చదువులు..ఈ మాట వినేందుకే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ ఆ మాట వినాల్సి వచ్చినా అదేదో మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలై ఉంటుందిలే అని లైట్‌గా తీసుకుంటారు. ఆ చెట్ల కింద చదువులు జిల్లా కేంద్రంలోని పాఠశాల అయితే? ఆ పాఠశాల కూడా కలెక్టరేట్‌కు కొద్ది దూరంలో ఉండేది అయితే? ఊహించుకునేందుకు కష్టమైనప్పటికీ ఇది నిజమే. ఒంగోలు అగ్రహారం రోడ్డులోని బాలాజీనగర్ మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు నెలల నుంచి అక్కడి విద్యార్థులు చెట్ల సాక్షిగా వాటి కిందనే చదువుకుంటున్నారు. మరికొన్ని తరగతులను కారిడార్ కింద నిర్వహించుకోవాల్సి వస్తోంది. ఆ పాఠశాలకు విశాలమైన స్థలం ఉన్నా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదనపు తరగతి గదులు నిర్మించక పోవడంతో ప్రస్తుతం అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది. మిగిలిన మునిసిపల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులంతా చక్కగా తరగతి గదుల్లో బల్లలపై కూర్చొని చదువుకుంటుంటే, ఇక్కడి విద్యార్థులు మాత్రం తమ తలరాత ఇంతేనా అన్నట్లుగా చెట్ల కింద చదువుకుంటూ ఎండ పడుతుంటే అటూ ఇటూ జరుగుతూ అవస్థలతో పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ..జరిగింది బాలాజీనగర్ మునిసిపల్ ప్రాథమిక పాఠశాలను 1981లో ప్రారంభించారు. మొదట్లో చిన్న రేకుల షెడ్లు వేసి ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. 1985వ సంవత్సరంలో బిల్డింగ్ నిర్మించారు. అందులో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత మరికొన్ని గదులు నిర్మించారు. 1985లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకున్న ప్రతిసారీ ప్యాచ్ వర్కులతో సరిపుచ్చుతూ వస్తున్నారు. శ్లాబ్ పెచ్చులు ఊడటం, వర్షాకాలంలో విద్యార్థులు భయం భయంగా తరగతి గదుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో శ్లాబ్‌కు ప్యాచ్ వర్కులు చేసే సమయంలో రెండు లేయర్లు బయటకు వచ్చాయంటే ఆ భవన స్థితిగతులను అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో తరగతి గదులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శిథిలస్థితికి చేరిన భవనంలోనే ఒకటి, రెండు, మూడు, ఐదు తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో అప్పుడు కురిసిన వర్షాలకు భవనానికి సంబంధించి పోర్టు పోలియో పెద్ద శబ్ధం చేస్తూ పడిపోయింది. పోర్టు పోలియో పడిపోయిన ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు తన మోటర్ బైక్ పెట్టడంతో అంతకు ముందు రోజు వరకు అదే ప్రాంతంలో స్టడీ అవర్స్‌కు విద్యార్థులు అక్కడే కూర్చొని చదువుకునేవారు. అక్కడ మోటర్ బైక్ ఉండటంతో అదృష్టవశాత్తు విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ పాఠశాల దెబ్బకు ప్రైవేట్ పాఠశాలలు పరార్ బాలాజీనగర్ మునిసిపల్ ప్రాథమిక పాఠశాలకు ఆ చుట్టుపక్కల మంచి పేరు ఉంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుల కమిట్మెంట్ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడి విద్యాబోధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మర్ క్లాస్‌లు, స్పోకెన్ ఇంగ్లిష్ దెబ్బకు ప్రైవేట్ పాఠశాలలను పెట్టినవారు చివరకు వాటిని మూసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులపై తీసుకునే శ్రద్ధతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడి ఉపాధ్యాయులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తమ పాఠశాలను ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేయించుకోవడం జరిగింది. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు అక్కడ 299 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతికి సంబంధించి రెండు సెక్షన్లు, ఐదో తరగతికి సంబంధించి రెండు సెక్షన్లు అక్కడ నిర్వహిస్తున్నారు. పాఠశాలలోని చెట్ల కింద చదువుకుంటున్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు చలించిపోతున్నారు. వెంటనే తరగతి గదులు నిర్మించాలని కోరుతున్నారు. తరగతి గదులు నిర్మించకుండా చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తే వచ్చే విద్యా సంవత్సరం తమ పిల్లలను పంపమని విద్యార్థుల తల్లిదండ్రులు కరాఖండిగా చెబుతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అదనపు తరగతి గదులు నిర్మించాలి తల్లిదండ్రుల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న బాలాజీనగర్ ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించుకునేందుకు విశాలమైన స్థలం ఉంది. ఒకవేళ నిధుల కొరత ఉంటే ప్రస్తుతం ఉన్న ఆఫీసు రూమ్‌పైన, డిజిటల్ లైబ్రరీపైన రెండు చొప్పున అదనపు తరగతి గదులు నిర్మించుకునే వెసులుబాటు ఉంది. ఒకదానిపై మరొకటి నిర్మించడంతో నిర్మాణ ఖర్చు కూడా కొంతమేర తగ్గుతోంది. నగర పాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి బాలాజీనగర్ మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నాడు–నేడులో భాగంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఈ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేరంట్స్ కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు. -
ఇదేం పద్ధతి..మందుబాబులూ?
► తరగతి గదుల ముందే పగులకొట్టిన మద్యం సీసాలు ► సంతనూతలపాడు జెడ్పీ హైస్కూలో ఘటన ► ఆకతాయిలకు చెక్పెట్టాలంటున్న స్థానికులు సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): వందల మంది విద్యార్థులు చదువుకునే విద్యాలయం అది. లేతపాదాలతో చిన్నారులు తరగతి గదుల ముందు వరండాల్లో తిరుగుతుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మందుబాబులు మద్యం సేవించిన తర్వాత మద్యం సీసాలను తరగతి గదుల ముందే పగలకొట్టి ఇష్టానుసారంగా వెళ్లిపోయారు. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూలు తరగతి గదులు, క్రీడా ప్రాంగణాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్థానికులు హైస్కూల్లో మందుబాబులు చేస్తున్న ఆగడాలకు సంబంధించిన ఆనవాళ్లను ఆదివారం సాక్షి దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో సంతనూతలపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 600 మంది విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తుంటారు. లేదపాదాలతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారనే విషయాన్ని కూడా మరిచిపోయిన మద్యం సేవించిన పెద్ద మనుషులు మందు సేవించిన అనంతరం ఖాళీ సీసాలను పాఠశాల ఆవరణలోనే పడేశారు. కొన్ని సీసాలను విసిరి కొట్టడమో లేక పగలకొట్టడం వలన సీసా పెంకులు తరగతి గదుల ముందున్న వరండాల్లో వెదజల్లినట్లు పడి ఉన్నాయి. సెలవు రోజుల్లో ఇలాంటి ఆగడాలు మరింత ఎక్కువుగా ఉంటున్నాయి. పాఠశాల తెరిచిన తర్వాత వచ్చిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో జాగ్రత్తగా ఉండక పోతే పగిలిన సీసా పెంకులతో లేని పోని ప్రమాదాలకు గురవుతారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హైస్కూల్లో రాత్రిళ్లు వాచ్మెన్లను నియమించడంతో పాటూ పోలీసులు ఒక రౌండ్ హైస్కూల్ వైపు వచ్చి వెళితే ఇలాంటి ఆకతాయిల ఆగడాలకు చెక్‌పెట్టవచ్చని స్థానికులు విన్నవించుకుంటున్నారు. -
పాఠశాలల ప్రహరీలకు రూ. 1.50 కోట్లు
ఎమ్మిగనూరురూరల్: జిల్లాలో రూ. 1.50 కోట్లతో 18 పాఠశాలల్లో ప్రహరీలు నిర్మిస్త్నుట్లు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ అఫీసర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల రిసోర్స్ పర్సన్ కార్యాలయాన్ని సందర్శించారు. సీఆర్పీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015–16 సంవత్సరానికి 653 పాఠశాలల అదనపు గదులు మంజూరు కాగా 97 శాతం నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 77 పాఠశాలల్లో మరమ్మతులు చేయించనున్నట్లు చెప్పారు. మరుగుదొడ్లను శుభ్రం చేయటానికి ఎంపీపీ స్కూల్స్‌కు రూ. 2 వేలు, ఎంపీయూపీ స్కూల్స్‌కు రూ.2500లు, హైస్కూల్స్‌కు రూ. 4 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. స్కావెంజర్లను డీఆర్డీఏ నియమిస్తుందని, హెచ్ఎం సర్టిఫికెట్ ఇస్తేనే వీరికి డబ్బులు మంజూరు చేస్తామన్నారు. విద్యార్థులకు పెండింగ్ ఉన్న స్కూల్ యూనిఫారంను వారం రోజులు సరఫరా చేస్తామన్నారు. సీఆర్పీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని నాలుగు మదరసాలను సందర్శించారు. ఈయనతో పాటు ఏఎంవో ఉసేన్‌సాబ్, ఎంఈవో నాగభూషణం, సీఆర్పీలు దుర్గన్న, వేణుగోపాల్‌రెడ్డి, జయన్న, నరసప్ప, రంగన్న, రాఘన్న, జమీలాబీ, ఖాసీం, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు. -
రూ.14 కోట్లతో 238 అదనపు తరగతి గదులు
మామిడికుదురు : జిల్లాలో 238 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని సర్వశిక్షా అభియా¯ŒS ప్రాజెక్టు అధికారి ఎం.శేషగిరి తెలిపారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. మార్చి నెలాఖరుకు నూతన భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.80 కోట్ల విలువైన మెటీరియల్, విరాళాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండు విడతలుగా 513 గ్రామాల్లోని ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి 40 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు నాలుగు అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందినవారు ఆయా గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, బాలింతలు, గర్భిణులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఇ¯ŒSచార్జ్ ఏఎస్ఓ పవ¯ŒSకుమార్, ఎంఈఓ పీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
వానొస్తే.. పాఠాలు లేనట్లే!
శిథిలావస్థకు చేరిన పలు ప్రభుత్వ బడులు భయందోళన మధ్య విద్యార్థుల చదువులు ముఖ్యంగా వర్షాకాలంలో తీవ్ర అవస్థలు 27 స్కూళ్లు అద్దె భవనాల్లోనే.. 1672అదనపు గదులు అవసరం మహబూబ్‌నగర్ విద్యావిభాగం: శిథిలమైన పాఠశాలల భవనాలు.. చిటుకు పొటుకుమంటూ వర్షానికి నీళ్లు కారుతున్న తరగతి గదుల్లో చదువులు సాగిస్తున్న పేద విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నికావు. ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడుతుందో తెలియక భయాందోళనకు లోనవుతున్నారు. చినుకుపడితే చాలు చెరువులా మారుతున్న వరండాలోనే పాఠాలు వింటున్నారు. ఇవి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా వర్షాకాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు..జిల్లా లోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లోని పాతభవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తేచాలు తరగతి గదులు కురుస్తున్నాయి. దీనికితోడు తరగతి గదుల ఉండడంతో కిక్కిరిసి కూర్చుని చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ బృందం పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి. జిల్లాలో 2,527 ప్రాథమిక, 555ప్రాథమికోన్నత, 577ఉన్నతపాఠశాలలు కలిపి మొత్తం 3,659 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 4.19లక్షల మంది విద్యార్థులు కొనసాగిస్తున్నారు. 3,659పాఠశాలల్లో 3,632 పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయి. 27 పాఠశాలలు భవనాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అదేవిధంగా 16,488 అదనపు తరగతి గదులు అవసరం ఉండగా, 14,816 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 1672అదనపు తరగతి గదులు ఇంకా నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా 861 స్కూళ్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. అరకొర వసతులు ఉన్నప్పటికీ చదువుకునేందుకు ఆసక్తితో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు వర్షం కురిసినప్పడు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలావస్థకు చేరిన భవనాలు కురుస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో అందరిని ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి భవనాలు ఎప్పుడు కూలుతాయోనని భయం భయంగా పాఠాలు వింటున్నారు. గదులు సరిపోకపోవడంతో ఆరుబయట, చెట్లకిందే కూర్చుని చదువుకునే విద్యార్థులకు వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సర్కారు బడిలో ‘స్మార్ట్’ బోధన..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్కూళ్లకు ‘డిజిటల్’ హంగులు రానున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల రూపు రేఖలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చిన్న ప్రైవేటు స్కూలు నుంచి కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థ వరకు అన్నీ ‘స్మార్ట్’గా మారిపోయాయి. ప్రైవేటుకు దీటుగా.. సర్కారు బడులను సైతం బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని సర్కారు ఉన్నత పాఠశాలల్లో ‘స్మార్ట్ క్లాస్’ రూంలు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ 2 నుంచి అన్ని బడుల్లోని విద్యార్థులు డిజిటల్ పాఠం వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రైవేటు స్కూళ్లలో బ్లాక్ బోర్డ్, చాక్‌పీస్‌లు, చార్ట్‌లు అవసరం లేకుండా పూర్తిగా ప్రొజెక్టర్‌ని వినియోగిస్తున్నారు. నర్సిరీ నుంచే స్మార్ట్ విధానంలో అక్షర జ్ఞానాన్ని ఒంటబట్టిస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు బడులకూ డిజిటల్ విధానాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చర్యలు ప్రారంభించారు. 182 బడుల్లో అమలు.. జిల్లాలో ఉన్న 182 ఉన్నత పాఠశాలల్లో దాదాపు 60 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వచ్చే నెల 2వ తేదీ నుంచి డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు బోధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి స్కూల్‌కు కంప్యూటర్, ప్రొజెక్టర్, గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్‌లు అందించనున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ. లక్ష వరకు ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించి డీఈఓ సోమిరెడ్డి చేసిన ప్రతిపాదనలపై కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో గడువులోగా ప్రతి పాఠశాలలో డిజిటల్ విధానంలో బోధించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే డిజిటల్ విధానంపై రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న రిసోర్స్ పర్సన్లు జిల్లాలోని ఉపాధ్యాయులకు కూడా తర్ఫీదు ఇవ్వనున్నారు. డిజిటల్ విధానం ఎందుకు..! సంప్రదాయ బోధనా పద్ధతుల ద్వారా ఆశించిన స్థాయిలో విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించలేక పోతున్నారు. మూస పద్ధతిలో చదవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చదివిన అంశాలను సైతం గుర్తుపెట్టుకోలేక పోతున్నారు. చార్ట్‌లు, బొమ్మలు, స్పెసిమన్స్ వంటి ఉపకరణాలను ఉపయోగించినా సత్ఫలితాలు అంతగా లేవు. ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లోకి వచ్చాక విద్యార్థులు మరింత సృజనాత్మకంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి అంశాన్ని విద్యార్థే స్వతహాగా ఆలోచించి అక్షరీకరించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో డిజిటల్ పాఠం ఆవశ్యకత రెట్టింపైందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కళ్లకు కట్టినట్టుగా విద్యార్థులకు చూపిస్తే.. అంత సులువుగా మరచిపోలేరు. దీన్ని గుర్తించిన అధికారులు.. తరగతి బోధనపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సబ్జెక్టుల పాఠ్యాంశాలకు డిజిటల్ రూపమిచ్చి విద్యార్థుల ముంగిటకు తేనున్నారు. -
‘తరగతి గదుల్లో సీసీ కెమెరాలు వద్దు’
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవద్దని, కళాశాల ఆవరణ, వరండాలు, ప్రవేశ ద్వారాల్లోనే ఏర్పాటు చేయాలని సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ప్రిన్సిపాళ్లతో వచ్చే నెల 21న పాలీసెట్-2016 నిర్వహణ, 2016-17 అకడమిక్ ప్రణాళికపై సమీక్షించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాలుగా ఉండే కాలేజీల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
'సినిమాలు క్లాస్ రూంలా ఉండాలి'
ముంబై: సినిమాలు కూడా తరగతి గదుల్లా విజ్ఞానాన్ని అందించేవిగా ఉండాలంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనెగల్. ఆయన మంగళవారం ఆరో నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సినిమాల్లో వినోదంతోపాటు సమాచారం, విజ్ఞానం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. దర్శకులు సినిమా తీసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయి వరకూ సమాచారం చేరవేయడంలో సినిమా ఎంతగానో దోహదపడుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా దేశంలో 67 శాతం మంది అజ్ఞానులుగా, చదువు లేనివారిగా ఉండటం సిగ్గుచేటన్నారు.