రూ.14 కోట్లతో 238 అదనపు తరగతి గదులు
Published Sat, Dec 24 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
మామిడికుదురు :
జిల్లాలో 238 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని సర్వశిక్షా అభియా¯ŒS ప్రాజెక్టు అధికారి ఎం.శేషగిరి తెలిపారు. స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. మార్చి నెలాఖరుకు నూతన భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.80 కోట్ల విలువైన మెటీరియల్, విరాళాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండు విడతలుగా 513 గ్రామాల్లోని ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి 40 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు నాలుగు అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందినవారు ఆయా గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, బాలింతలు, గర్భిణులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఇ¯ŒSచార్జ్ ఏఎస్‌ఓ పవ¯ŒSకుమార్, ఎంఈఓ పీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement