in schools
-
పాఠశాలల్లోనే కుల ధృవీకరణ పత్రాలు
అనంతపురం అర్బన్ : ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలు పాఠశాలల్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహిస్తూనే, తహశీల్దారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జిల్లాలో దాదాపు 700 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. పదవ తరగతి పూర్తి చేసి వెళ్లే విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు కుల ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. కళాశాలల్లో చేరే సమయంలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాఠశాలలకే మొబైల్ మీ - సేవ పంపిస్తాము. వాటి ద్వారా ధృవీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోండి.’ అని ఆదేశించారు. జిల్లాలో తొలిసారిగా పాఠశాలల వద్దకే మొబైల్ మీ - సేవ పంపిస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయులు కుల ధృవీకరణ పత్రం కావాల్సిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకుని మీ-సేవ సిబ్బందికి అందజేయాలన్నారు. వారు వాటిని ఆన్లైన్లో ఉంచి, తహశీల్దారు ద్వారా ధృవపత్రాలు సిద్ధం చేయించి ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారన్నారు. అనంతరం పశుగ్రాసం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై మాట్లాడారు. చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు - చెట్టు ద్వారా చెరువుల్లో కంపచెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్)జిల్లాగా ప్రకటించాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ కింద ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం కింద డ్వామా, డీఆర్డీఏ శాఖలు అన్ని పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను వంద శాతం నిర్మించాలన్నారు. నిధుల కొరత లేదన్నారు. జిల్లాలో 1,003 పంచాయతీలు ఉంటే ఇప్పటికే 275 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చామన్నారు. మిగిలిన పంచాయతీలను ఏడు నెలల వ్యవధిలో మార్చాల్సి ఉందన్నారు. -
ఊరూరా పండుగే
జిల్లావ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో పెద్ద పండుగ సంక్రాంతి సందడి నెలకొంది. విద్యార్థులే రైతులుగా, సంక్రాంతి లక్ష్ములుగా, కొత్త అల్లుళ్లుగా, ఇంటి ఆడపడుచులుగా, హరిదాసులు, కొమ్మదాసులుగా, డూడూ బసవన్నలుగా, కోడి పందెగాళ్లుగా అలరించారు. విద్యాసంస్థలకు బుధవారం నుంచి సంక్రాంతి సెలవులు. దీంతో వివిధ విద్యాసంస్థల ఆవరణల్లో మంగళవారం భోగి మంటలు వేసి, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి, పొంగలి వండి, కోడి పందేలు నిర్వహించి సంక్రాంతి సందడి చేశారు. రంగు రంగుల దుస్తుల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. -
బడిలోనూ బయోమెట్రిక్
- తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు - తప్పదంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు కదిరి : సర్కారు బడి అనగానే ఉపాధ్యాయులు ఎప్పుడైనా వస్తారు.. ఎప్పుడైనా వెళ్తారనే అపవాదు జనంలో నాటుకుపోయింది. బడికి ఆలస్యంగా వెళ్లేవారు కొందరైతే, రాజకీయ పలుకుబడితో అసలే వెళ్లని వారూ కొందరున్నారని, వారంలో మూడు రోజులు ఒకరు వెళ్తే, మిగతా మూడురోజులు మరొకరు వెళ్తున్నారని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. మరికొందరు ఉపాధ్యాయులు తమకు బదులుగా వారి స్థానంలో ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి సదరు ఎంఈఓలకు సైతం అంతోఇంతో ముట్టజెబుతున్నారన్న సమాచారాన్ని కూడా విద్యాశాఖ పసిగట్టింది. ఈ క్రమంలో అయ్యవార్లను బడికి పరిగెత్తించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులకు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విషయం అర్థమయ్యేలా చెప్పారు. తొలుత ప్రాథమిక పాఠశాలలను మినహాయించి, మిగిలిన ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 2017 జనవరి 2 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా తయారైంది. దీంతో సంక్రాంతిలోపు ఈ తంతు ముగించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. ఆ రోజుకు ఆధార్ వంద శాతం పూర్తయిన ప్రా«థమిక పాఠశాలలను అప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని వాటిలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుపై బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం జిల్లాలో 3,164 ప్రాథమిక పాఠశాలలు, 1,633 ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి మండలంలోనూ ఒక కస్తూరిబా బాలికా విద్యాలయం ఉంది. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ప్రార్థనా సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారు? ఆలస్యంగా ఎందరొచ్చారు? అసలు బడికే రానివారు ఎందరు? సెలవులో ఉన్నదెవరు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ విధానం ద్వారా మండల, జిల్లాస్థాయి విద్యాశాఖాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. బడికి హాజరు కాకపోయినా హాజరు పట్టికలో సంతకం పెట్టడం లాంటివి ఇక కుదరవని కొందరు ఉపాధ్యాయులే అంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించిందని, అమలు చేయక తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
రూ.14 కోట్లతో 238 అదనపు తరగతి గదులు
మామిడికుదురు : జిల్లాలో 238 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని సర్వశిక్షా అభియా¯ŒS ప్రాజెక్టు అధికారి ఎం.శేషగిరి తెలిపారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. మార్చి నెలాఖరుకు నూతన భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.80 కోట్ల విలువైన మెటీరియల్, విరాళాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండు విడతలుగా 513 గ్రామాల్లోని ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి 40 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు నాలుగు అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందినవారు ఆయా గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, బాలింతలు, గర్భిణులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఇ¯ŒSచార్జ్ ఏఎస్ఓ పవ¯ŒSకుమార్, ఎంఈఓ పీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి మంగళం
సిబ్బందిని నిలిపివేయాలంటూ హెచ్ఎంకు సెల్ మెసేజ్‌లు జిల్లాలో ఇంటిముఖం పట్టనున్న 2,526 శానిటేషన్ వర్కర్లు వారికి చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.2.78 కోట్లు రాయవరం : సంపూర్ణ పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఒకవైపు...దోమలపై దండయాత్రంటూ ఆర్భాట నినాదాలతో ప్రదర్శనలు మరోవైపు... కానీ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే శానిటేషన్ వర్కర్లను నిలిపి వేయాలంటూ ఇంకోవైపు ఆదేశాలు జారీ. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలంటూ విస్తుపోతున్నారు విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసే శానిటేషన్ వర్కర్లను నిలిపివేయాలని, అక్టోబరు నుంచి వారికి వేతనాలు ఇవ్వరంటూ వచ్చిన ఆదేశాలతో సిబ్బంది బిత్తరపోయారు. సర్కారు బడుల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించే బాధ్యతను గతేడాది డీఆర్డీఏకు అప్పగించారు. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణా బాధ్యతలను అప్పగించారు. అయితే వీరికి ఐదు నెలలుగా వేతనాలు అందకపోగా, ఇప్పుడు అకస్మాత్తుగా ఇంటికి పంపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను సర్వశిక్ష అభియాన్ (ఎస్.ఎస్.ఏ)2014 నవంబరు నుంచి చేపడుతోంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్.ఎస్.ఎ. నేరుగా నిధులను పాఠశాల ఎస్.ఎం.సీ. అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్యం నిర్వహణా బాధ్యతలను డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ చేపడుతున్న వారికి గౌరవ వేతనాన్ని వారి ఖాతాల్లోనే జమ చేశారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.4వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. వేతనాలు అందకపోగా..ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకు ఐదు నెలలకు రావాల్సిన వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.2.78 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మార్చి నుంచి గౌరవ వేతనం ఎప్పుడు విడుదలవుతుందా? అని నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తుండగా... ఏకంగా తొలగించడానికి జీఓ ఇవ్వడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల వేతనం మాటేమిటి.. పాఠశాల హెచ్.ఎం.లకు వచ్చిన మెసేజ్‌లో వీరికి సెప్టెంబరు నెలాఖరు వరకు మాత్రమే వేతనాలు ఇస్తామని తెలిపారు. అయితే వీరు అక్టోబరులో 22వ తేదీ వరకు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వీరిని తొలగిస్తే పాఠశాలల్లో మరుగుదొడ్లను విద్యార్థులతోనే శుభ్రం చేయిస్తారా? లేకుంటే ఉపాధ్యాయులే శుభ్రం చేస్తారా? అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. ఒక పక్క స్వచ్ఛ భారత్ అంటూ ఊదరగొడుతున్న సర్కార్ మరో పక్క ఆయాలను తొలగించడంతో పాలకుల వైఖరి బట్టబయలైంది. ముందే హెచ్చరించిన ’సాక్షి’.. పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు వేతన బకాయిలు చెల్లించక పోవడాన్ని గత నెల 28న ’సాక్షి’ పారిశుద్ధా్యనికి మంగళం’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ‘సాక్షి’ ప్రచురించిన కథనం నిజమే అన్నట్లుగా వేతనాలు ఇవ్వక పోగా ఇప్పుడు సిబ్బందిని తొలగిస్తూ హెచ్ఎంలకు మెసేజ్‌లు వచ్చాయి. విధుల్లోకి రావద్దంటున్నారు.. ఇకపై విధుల్లోకి రావద్దంటూ హెచ్.ఎం. తెలిపారు. మార్చి నెల నుంచి వేతనాలు చెల్లించలేదు. ఇప్పుడు అకారణంగా విధుల్లోకి రావద్దంటున్నారు. – దండంగి సీతయ్యమ్మ, శానిటేషన్ వర్కర్, ఎంపీపీపీ స్కూల్, వెదురుపాక, రాయవరం మండలం. తాత్కాలికంగా తొలగిస్తున్నాం.. పాఠశాలల్లో శానిటేషన్ వర్కర్ల వేతనాలకు బడ్జెట్ రాలేదు. ఇప్పటికే ఆరు నెలల వేతనాలు చెల్లించాలి. అందుకే తాత్కాలికంగా తొలగించాలంటూ ఆదేశాలిచ్చాం. – మహబూబ్ వలీ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, డీఆర్డీఏ, కాకినాడ. -
వంట షెడ్ల నిర్మాణ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
ఏలూరు సిటీ : జిల్లాలో కిచెన్ షెడ్ల నిర్మాణం ఏడాది పడుతుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ భాస్కర్ విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో గురువారం విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలో వారం వారం విద్యాశాఖ ప్రగతి తీరుపై సమీక్ష నిర్వహిస్తున్నా పనితీరులో మార్పులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కట్టే కిచెన్ షెడ్లు నెలల తరబడి నిర్మించకపోవడం ఏమిటని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. 1043 కిచెన్ షెడ్లకు 856 పూర్తయ్యాయని, 107 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వాటిలో 80 ఇంకా ప్రారంభించలేదని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి తప్పు మీదంటే.. మీదని కలెక్టర్ ఎదుటే వాదోపవాదాలకు దిగారు. దీంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరిలోనూ సమన్వయం లోపించిందని, చిన్న పిల్లల్లా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, పంచాయితీ పెట్టుకోవడం చాలా శోచనీయమని కలెక్టర్ భాస్కర్ అన్నారు. మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి చేయాలి ఏలూరు (ఆర్ఆర్ పేట) : అన్ని మునిసిపాలిటీలను అక్టోబరు 2న బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటిస్తానని, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లతో వ్యక్తిగత మరుగుదొడ్లు, బయోమెట్రిక్ అటెండెన్స్, ఈ–ఆఫీస్, శానిటేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15వ తేదీలోగా అన్ని మునిసిపాలిటీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు టాయిలెట్ల నిర్మాణాలు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.