ఊరూరా పండుగే
జిల్లావ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో పెద్ద పండుగ సంక్రాంతి సందడి నెలకొంది. విద్యార్థులే రైతులుగా, సంక్రాంతి లక్ష్ములుగా, కొత్త అల్లుళ్లుగా, ఇంటి ఆడపడుచులుగా, హరిదాసులు, కొమ్మదాసులుగా, డూడూ బసవన్నలుగా, కోడి పందెగాళ్లుగా అలరించారు. విద్యాసంస్థలకు బుధవారం నుంచి సంక్రాంతి సెలవులు. దీంతో వివిధ విద్యాసంస్థల ఆవరణల్లో మంగళవారం భోగి మంటలు వేసి, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి, పొంగలి వండి, కోడి పందేలు నిర్వహించి సంక్రాంతి సందడి చేశారు. రంగు రంగుల దుస్తుల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు.